కరోనా - ప్రపంచానికి నేర్పిన పాఠాలేమిటి?

కరోనా - ప్రపంచానికి చాలా పాఠాలు నేర్పింది. పాలకులనుండి పనివాడి వరకూ అందరికీ ఏదో ఒక కొత్త విషయాన్ని కరోనా అనుభవంలోకి తెచ్చింది. పాజిటివ్ గా ఆలోచిస్తే ఈ వైరస్ వల్ల ప్రస్తుత మనుషుల ప్రవర్తన ఎలా ఉన్నదో, పాలకుల పనితీరు, వారికున్న నాలెజ్ .... ఇలా చాలా చాలా మనకు కళ్ళకు కట్టినట్లు చూపింది. ప్రకృతికి మనిషి చేస్తున్న ద్రోహం ఏమిటో తెలిపింది. మనుషులు అనవసర హంగామా, అవసరానికి మించిన వేగవంతమైన జీవితం ఆపితే ఎంత ప్రశాంతత వస్తుందో అనుభవమయింది. సైన్స్ పేరుతో జరిగే భయంకర వ్యాపారం బట్టబయలయ్యింది. ఇంకా దీనిని అర్ధం చేసుకోవలసిన వారూ ఉన్నారు. ...... ఇలా మీకూ కరోనా నేపధ్యంలో అనిపించిన ఎన్నో అంశాలు ఉంటాయి. వాటిలో అవసరమైనవి, ముఖ్యమైనవి అనిపించినవి ఇక్కడ కామెంట్ చేయండి. ఇవి కొత్త జీవితానికి, మార్పుకు దోహదం చేస్తాయి చాలామందికి.

ప్రశ్నిస్తున్నవారు : Palla Kondala Rao

------------------------------------

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

janavijayam@gmail.com


 

Post a Comment

  1. 'కరోనా'వల్ల నిజంగానే గొప్ప మార్పులొచ్చాయండీ. అందులో మానవ మనుగడకెంతో ఉపయుక్తమైనవి ఉన్నాయి. వాటిల్లో నేను గమనించినదీ, ఎంతో సంతోషదాయకమైనదీ--పెళ్లిళ్ల నిర్వహణ. ఉన్నవాళ్ళతో పోటీపడి సామాన్యులు కూడా అప్పులు చేసి మరీ ఖర్చు పెట్టి చేసేపెళ్లిళ్లు ఇప్పుడు చూడండి,ఎలా జరిగిపోతున్నాయో ! గొప్ప గొప్ప సెలబ్రిటీలు, కోటీశ్వరులు సైతం అతి నిరాడంబరంగా చేసుకుంటూ--అయిందనిపిస్తున్నారు. కరోనా కు ముందు --
    అనవసరమైన ఆర్భాటాలు
    వాడిపారేసే గ్లాసులు, ప్లేట్లు
    లెక్కకు మించిన వంటకాలు
    డెకరేషన్ ఖర్చులు
    బంధుమిత్రుల పెట్టుబోతల ఖర్చులు
    మగపెళ్లి వాళ్ళ'డిమాండ్'లు
    --ఇలా రాస్తూ పోతే పెద్ద లిస్టే అవుతుంది.
    అవన్నీ ఇప్పుడు బంద్. ఇది ఎంత గొప్ప మార్పు !
    మనుషులకే గాక పర్యావరణానికీ మేలు చేసే మార్పు.
    ఇది ఇలాగే కొనసాగితే బాగుంటుంది కదా, కరోనా పుణ్యమాని !కానీ సంభవమా? కరోనాతో పాటు వచ్చిన మంచి మార్పులు కూడా మాయమైపోతే కథ మొదటికొస్తుంది. నమస్తే.

    ReplyDelete
    Replies
    1. ఇటీవల ఒక స్నేహితురాలి కూతురి వివాహం జరిగింది. 50 మందితో చేసినా 10 లక్షలు ఖర్చు అయింది. అతిధులు రాలేదు కానీ మిగతావన్నీ సేం టూ సేం. లైవ్ స్త్రీమింగ్ అదనం.

      Delete
    2. నీహారిక గారు,
      చూ”షా”రా మరి, పరిస్ధితులు చక్కబడిన తరువాత జనం తిరిగి పూర్వం లాగానే ప్రవర్తిస్తారని నా అనుమానమని అందుకే నేను అన్నది. ఇప్పుడు కనిపిస్తున్నది విరామం మాత్రమేనని నాకనిపిస్తోంది.

      Delete
    3. ధరిత్రీదదేవిగారూ మీరన్నది కొంత నిజమే అయింది.

      పెండ్లి ఖర్చు అనేది శృతి మించి'పోతోంది'. కరోనా పుణ్యమా అని కొంత అనివార్యంగా తగ్గింంచాల్సి వచ్చినా..... దానికి కూడా చాలా బాధపడ్డారు తప్ప, వాస్తవానికి ఇది అనవసరమైన, ఆడంబరమైన ఆధిపత్య పైత్యం లోంచి వచ్చిందని గుర్తించకపోవడం విచారకరం.

      నీహారిక గారన్నట్లు లైవ్ స్ట్రీమింగ్ లు అదనపు ఖర్చు చేసి బడాయి పెంచుకున్నవారు ఉన్నారు.

      నాకు తెలిసి కరోనా వల్ల :

      డాక్టర్లు, పూజారులు, ఫాస్టర్ల గుట్టు చాలావరకూ రట్టయింది.
      హడావిడి గా పనులు చేయకపోయినా జీవితం సాఫీగానే గడిచింది.
      కోల్పోతున్న మానవ సంబంబంధాలు కొంతలో కొంత మెరుగయ్యాయి. ఈ విషయంలో మనమేమి కోల్పోతున్నామో కొందరైనా గుర్తించారు.
      ముఖ్యంగా ప్రకృతికి మనిషి చేస్తున్న హాని తెలిసింది. నదులు, కొండలు, అరణ్యాలు పరిశుభ్రంగా తయారయ్యాయి.
      నాయకులకు ఏమీ తెలియదని అర్ధమయింది.
      సైన్సు పేరుతో జరిగే దోపిడీ కొంతమేరకు అర్ధమయింది.
      ప్రయివేటు హాస్పిటళ్ళ సత్తా ఏమిటో అర్ధమయింది.
      అందం కంటే రోగనిరోధకశక్తిని కాపాడుకోవలసిన అవసరం ఏమిటో బోధపడింది.
      సినిమాలు,షికార్లు లేకున్నా,,, కార్లు తిప్పకున్నా హాయిగానే బతికేయొచ్చని తేలింది.
      దరిద్రపు టీవీ సీరియల్స్ లేకుంటే ఠీవిగా అందరూ ఒకచోట కూర్చుని కబుర్లు చెప్పుకుంటే మానసిక ఆరోగ్యం పెరుగుతుంది అని తేలింది.
      పట్టణాలకంటే పల్లెలు అన్నింటా చాలా మెరుగైనవని తెలిసింది.
      రోడ్లవెంబడి, ఫైవ్ స్టార్ లలో తినే దరిద్రపు తిండి వల్ల ఏమి నష్టమో తేలింది.

      ప్రజలు మందు మానేయగలరు కానీ, ప్రభుత్వాలు అమ్మకాలు మానేయలేవనీ తేలింది.

      ..... ఇలా చాలా చాలా తెలిసాయి.

      అయితే విన్నకోట సర్ చెప్పినట్లు కుక్కతోక వంకర మాదిరిగా మళ్ళీ మొదటికే వస్తుందా? కొందరిలోనైనా మంచి అలవాట్లు పెరుగుతాయా? చూడాలి.

      Delete
    4. >>>నీహారిక గారన్నట్లు లైవ్ స్ట్రీమింగ్ లు అదనపు ఖర్చు చేసి బడాయి పెంచుకున్నవారు ఉన్నారు.>>>

      లైవ్ స్ట్రీమింగ్ అనేది బడాయి కాదండీ.ఇప్పటి పరిస్థితికి అది అత్యంత అవసరం. అందరూ వెళ్ళలేని పరిస్థితిలో లైవ్ స్ట్రీమింగ్ వల్ల ఇంటిలో కూర్చుని ప్రత్యక్షంగా చూడగలిగే అవకాశం. జూం ద్వారా పాఠాలు చెప్పడం లాగానే ఇది కూడా ఒక అనివార్య పరిస్థితి.

      పట్టుచీరలు,నగలు,పెళ్ళి ఖర్చు అనేవి ఆడపిల్లలకు ఇచ్చే ఆఖరు బహుమతులు. ఎవరి స్థాయిని బట్టి వారు ఇచ్చుకోవాలి. స్థాయి ని బట్టి కాకుండా బడాయిలకు పోయే తల్లితండ్రుల వల్ల ఇబ్బందులు.

      Delete
    5. నీహారిక గారూ, లైవు స్ట్రీమింగ్ చూడమని "ఆహ్వానితులకు" పంపించే మెసేజీలోనే చదివింపులు సమర్పించేందుకు లింకు (e.g. Paypal or Amazon gift card) ఇవ్వొచ్చానండీ? ఈ సౌకర్యం ఉంటే "అయ్యో కరోనా వల్ల పెండ్లికి రాలేదు కాబట్టి గిఫ్టులు ఇవ్వలేకపోయాం" అనే సాకుకు అవకాశం రాదు.

      Delete

    6. 2016 లో 500, 1000 రూపాయలు నోట్ల రద్దు తరువాత పెళ్ళిచదివింపుల పై వచ్చిన ఒక జోకు👇.

      ఇప్పుటి కరోనా కాలం ఆన్-లైన్ చదివింపుల కాలం.

      డిజిటల్ పెళ్ళిచదివింపులు (2016) 😀

      Delete
    7. @ jai garu,

      లైవ్ స్ట్రీమింగ్ లింక్స్ అందరికీ ఇవ్వరండీ. దిల్ రాజు, నితిన్ లు వాళ్ళ సినిమాలు చూడమని జనాల మీదకి వదులుతారు కానీ వాళ్ళ పెళ్ళి చూసి ఆశీర్వదించమని జనాలకి లింక్స్ ఇచ్చారా ?

      వాళ్ళ సినిమాలు డబ్బులు పెట్టి చూసారు కదా అని గిఫ్ట్ లు కూడా ఇవ్వండి అని అడిగితే ఎందుకు ఇవ్వరూ ? ఇపుడంటే గుట్టుగా గిఫ్ట్ కవర్ లో పెట్టి ఇస్తున్నారు కానీ ఇదివరకు మైక్ పెట్టి చదివింపుల కార్యక్రమం నిర్వహించేవారు.

      Delete
  2. ధరిత్రీ దేవి టీచర్ కరక్ట్ గానే చెప్పారు. అయితే కరోనా తగ్గిన తరువాత మనుష్యుల ప్రవర్తన మళ్ళీ మొదటికొస్తుందని నా అనుమానం. ఎందుకంటే చరిత్ర నుండి పాఠం నేర్చుకునే అలవాటు మానవజాతికి చాలా తక్కువ కదా?

    ReplyDelete
  3. కరోనా అంతర్జాతీయ విపత్తు. ఆత్మీయులను కోల్పోవలసి వచ్చింది. ఒకవైపు డాక్టర్స్ కోసం చప్పట్లు కొట్టిన చేతులతోనే లక్షలు పోసినా దక్కని ప్రాణాలు.ఒకప్పుడు ఇంజనీరింగ్ ఖరీదు.ఇపుడు వైద్యవిద్య ఖరీదు. ఇపుడు మళ్ళీ ఇంజనీరింగ్ లాగానే వైద్యం కూడా చవక అయితే బాగుంటుంది.

    ReplyDelete
  4. ఎప్పటికైనా భూమి ప్రకృతి సొంతం మనం అలా వచ్చి పోతం కరోనా వలన గాలి నాణ్యత పెరిగింది ఓజోన్ పొర మళ్లీ కోలుకుంటోంది ఢిల్లీ లాంటి పట్టణంలో తీవ్ర స్థాయికి వెళ్ళిన పొల్యూషన్ మళ్లీ కరోనా కారణంగా చాలా మెరుగు పడుతుంది

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top