మన దేశ రాజకీయాలలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బి.జె.పి లు మాత్రమే జాతీయ పార్టీలుగా ఉన్నాయి. కమ్యూనిస్టులు, జనతాదళ్, బి.ఎస్.పి ....వంటి కొన్ని జాతీయ పార్టీలుగా పిలువబడుతున్నాయి. ఎన్నికల ద్వారా అధికారం చేపట్టి సుస్థిర పాలన సాగించడానికి జాతీయ స్థాయిలో ప్రత్యామ్నయంగా ఫ్రంట్ లు వాటి స్టంట్ లూ మనకి అనుభవం ఉంది. కాంగ్రెస్ కూడా బాగా బలహీనంగా ఉంది. ఒక రకంగా ప్రాంతీయపార్టీల స్థాయికి దిగజారిందనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలో పొత్తులతో సంబంధం లేకుండా అధికారం చేపట్టగలిగే జాతీయపార్టీ అవతరించడానికి అవకాశం ఉందా?
మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
janavijayam@gmail.com
అవకాశం అంటే దానంతటది వచ్చేది కాదు,కొన్ని మనమూ మన చుట్టూ ఉన్నవారు ఒకరి కొకరు ఇంటరాక్ట్ అవుతున్నప్ప్పుడు మనం గానీ ఇతరులు గానీ అందులో ఎంత యాక్టివ్ పార్ట్ తీసుకోగలరు అనేదానికి పరిమితులు లేవు.ప్రతి లక్ష్యానికీ అవకాశాలు అనేకం.
ReplyDeleteఇక రాజకీయ పార్టీ ఎదుగుదలకు అవకాశం ఒకరు ఇచ్చేదీ ఒకరు పుచ్చుకునేదీ కాదు.ఆ పార్టీ నాయకత్వం యొక్క సమయజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది.కాబట్టి ప్రశ్నలో స్పష్టత లేదు.
ఎటువంటి స్వభావం గల రాజకీయ పార్టీ ఎదిగే అవకాశం ఉంది అని అడిగితే బాగుండేది!ఎందుకంటే,భాజపా హిందూత్వను గుత్తకి తీసుకున్నది.కాంగ్రెసు కూడా బ్రాహ్మణుల కోసం ఆందోళన చేసే స్థాయిలో భాజపా దేశంలో మతతత్వాన్ని రెచ్చగొట్ట గలిగింది.ఇప్పుడు అయోమయంలో ఉన్న దళిత, మైనారిటీ వర్గాలను ఆకర్షించడం కన్న వోటింగ్ విషయంలో క్లారిటీ ఉన్న హిందువుల్ని ఆకర్షించడం తేలిక అయిపోయింది.
కాబట్టి సెక్యులర్ మనస్తత్వం ఉన్న పార్టీ ఎదిగే అవకాశం ఎంత ఉంది అనేది ముఖ్యం.
సెక్యులర్ మనస్తత్వం అంటే? దీనికి సరైన నిర్వచనం చెప్పగలిగితే చాలా విషయాలలో గందరగోళం తొలగినట్లే. ఈ దేశంలో స్పష్టత దొరకాల్సిన అంశాలలో మొదటివరుసలోనిది ఈ అంశం.
Deleteలౌకిక తత్వం అంటే నిజమైన అర్థం వేరు. భారత దేశం లో అర్ధం ఇలా చెప్పారు.
Delete“India is the only major civilizational country where you are systematically taught to hate your heritage and glorify the invaders who came to destroy it. And this absurdity is called ‘secularism’."
-
Sankrant Sanu
నిజమే, సెక్యులర్ అనే పదం దేశంలో అవహేళనకు గురైంది.కానీ దాని పుట్టుకయే విచిత్రమైనది.యూదులకు స్వతంత్ర రాజ్యం కోసం పోరాడుతున్న యేసును యూదులే అప్పటి హీరోదు రాజుకు పట్టించి శిక్షింపజెయ్యడం ఎంత విచిత్రమో చూడండి!కాన్స్టాంటిన్ రూపం మార్చేవరకు దాక్కుని దాక్కుని బతికిన ఆర్తుల మతం రాజమతం కాగానే త్యాగాన్ని వదిలి మోసాన్ని పాటిస్తూ ఒక రోజు కాదు, ఒక దశాబ్దం కాదు, ఒక శతాబ్దం కాదు - వెయ్యేళ్ళ పాటు దేశాలకి దేశాల్ని అంధకారంలో ముంచితేల్చగలగడం ఎంత విచిత్రం?
Deleteఆ దశను దాటడానికి అప్పటి మేధావులకి దొరికిన రెండు పరిష్కారాలలో ఒకటి హేతువాదం రెండోది సెక్యులరిజం.సెక్యులరిజం గురుంచి స్పష్టత కావాలంటే రాజ్యాంగంలో పొందు పర్చిన నిర్వచనం కూడా సరిపోదు.ఒక్క వాక్యంలో చెప్పడం కష్టం.చర్చి పెత్తనం నుంచి బయటికి రావడానికి మతాన్నీ రాజ్యాన్నీ వేరు చేసి రాజ్యపాలన విషయంలో మత ప్రమేయం లేని అనేకమైన నియమ నిబంధనలూ కట్టుదిట్టాలూ కలిస్తేనే సెక్యులరిజం అవుతుంది.
నా పరిశీలన ప్రకారం భారత దేశంలో ఈ తరహా సెక్యులరిజానికి కాలం చెల్లినట్లే.ఏ చానలో గుర్తు లేదు గానీ కాంగ్రెసు పార్టీ వచ్చే ఎన్నికల్లో ఠాకూర్లో మరెవరో బ్రాహ్మణుల మీద దుర్మార్గాలు చేస్తుంటే పట్టించుకోకపోవడాన్ని హైలైట్ చెయ్యాలని అనుకుంటున్నట్టు చూశాను.పాత పార్టీలే మనుగడ కోసం హిందూత్వను ఆశ్రయిస్తున్న పరిస్థితిలో ఒక కొత్త పార్టీ సెక్యులరిజానికి కట్టుబడతానని ప్రకటిస్తే పొత్తులతో సంబంధం లేకుండా అధికారం చేపట్టగలిగే జాతీయపార్టీగా అవతరించడానికి అవకాశం ఎట్లా వస్తుంది?
కాబట్టి ఆ కొత్త పార్టీ శివసేన ఎప్పటినుంచే చేస్తున్న కేజ్రీవాల్ ఈ మధ్యన కొంత ప్రయత్నం చేసిన హిందూత్వ మీద భాజపా మోనాపలీని బద్దలు కొట్టే పనిని కొంచెం శాస్త్రీయమైన పద్ధతిలో చేస్తే మంచి ఫలితం దక్కుతుంది.
< మతాన్నీ రాజ్యాన్నీ వేరు చేసి రాజ్యపాలన విషయంలో మత ప్రమేయం లేని అనేకమైన నియమ నిబంధనలూ కట్టుదిట్టాలూ కలిస్తేనే సెక్యులరిజం అవుతుంది. >
Deleteyes.
I don't know about politics
ReplyDelete