ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఒకసారి తిరుమల కొండపై హెలీ ప్యాడ్ నిర్మించాలనుకుంది. దానికి అక్కడి హిందు సన్యాసులు అభ్యంతరం చెప్పారు. "తిరుమల కొండ మీద దేవతలు పుష్పక విమానాల్లో తిరుగుతుంటారట! అక్కడ హెలీకాప్టర్లు తిరిగితే అవి పుష్పక విమానాలకి అడ్డు తగులుతాయట!" అది తిరుపతి సన్యాసుల అభిప్రాయం.
తిరుమల ఘాట్ రోడ్ పై రద్దీ తగ్గించడానికి ప్రభుత్వం రోప్ వే (కేబుల్ కార్ వే) నిర్మించాలనుకుంది. దానికి కూడా తిరుపతి సన్యాసులు అభ్యంతరం చెప్పారు. తిరుమల కొండపై ఋషులు తపస్సు చేస్తారట! తపోస్థలం మీదుగా కేబుల్ కార్‌లో ప్రయాణిస్తే ఋషులని తన్నినట్టు అవుతుందట!
రాష్ట్ర ప్రభుత్వం తిరుమల దేవస్థానంలో గుండ్లు గియ్యించుకోవడానికి వచ్చే స్త్రీల కోసం మహిళా క్షురకులని నియమించాలనుకుంది. ఆడవాళ్ళ చేత క్షవర వృత్తి చెయ్యిస్తే ఆడవాళ్ళకే అవమానం అంటూ తిరుపతి సన్యాసులు గొడవ చేసారు. మగ క్షురకుడు ఆడదానికి గుండు గీసే నెపంతో ఆమె భుజాల మీదో, వీపు మీదో చేతులు వేస్తే ఈ సన్యాసులకి అభ్యంతరం లేదు కానీ ఆడది మంగలి కత్తి పడితే ఆడదానికే అవమానం అని మాత్రం వీళ్ళు బాధపడిపోయారు. పాకీవృత్తిలో మాత్రం ఆడవాళ్ళు లేరా? ఆడవాళ్ళు పాకీవృత్తి చెయ్యడంపై ఎవరికీ అభ్యంతరం లేదు కానీ వాళ్ళు మంగలి వృత్తి చెయ్యడం పైనే ఎందుకు అభ్యంతరం వచ్చింది?
ఈ సాధుసంతులు తాము బాగుపడరు, జనాన్ని బాగుపడనివ్వరు. దేవాలయాల కోసం ప్రభుత్వం నిధులు ఖర్చుబెట్టడం అనవసరం అనే నేను భావిస్తాను.
- Praveen
-----------------------------
*Re-published
మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
janavijayam@gmail.com
Post a Comment
* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.