బస్సుల్లో లేడీస్ సీట్లలో కూర్చునే మగవాళ్ళని లేపడానికి కొంత మంది స్త్రీలనీ, నపుంసకులనీ కించపరిచే భాష వాడుతున్నారు. "నువ్వు మగవాడివేనా? లేడీస్ పక్కన కూర్చోవడానికి సిగ్గు లేదా?" అని అడుగుతున్నారు. అలా మాట్లాడుతున్నది చదువురాని స్త్రీలు కాదు, వైట్ కాలర్ ఉద్యోగాలు చేసే స్త్రీలే. హైదరాబాద్ ఎం.ఎం.టి.ఎస్. ట్రెయిన్‌లలో లేడీస్ పెట్టెల్లోకి మగవాళ్ళు ఎక్కకుండా చూసేందుకు మగ పోలీసుల్ని కాపలా పెడుతున్నారు. అది చూసినవాళ్ళకి "ఆడ పోలీసులు గస్తీ తిరగలేరు" అనే అభిప్రాయం కలుగుతుంది. ఈ లేడీస్ రిజర్వ్డ్ సీట్ల వల్ల లింగ వివక్ష తగ్గదు, పైగా పెరుగుతుంది కూడా. ఒకడు లేడీస్ సీట్ వదిలి వెళ్ళాడంటే దాని అర్థం అతనికి ఆడవాళ్ళపై గౌరవం ఉన్నట్టు కాదు. ఆడవాళ్ళతో గొడవపడితే చుట్టూ ఉన్నవాళ్ళు తన గురించి చీప్‌గా అనుకుంటారనే సంకోచం వల్ల అతను ఆ సీట్ నుంచి లెగిచిపోవచ్చు. ఏ మగవాడూ ఆడవాళ్ళని ఉద్ధరించడానికి పుట్టడు. మగవాళ్ళు ఆడవాళ్ళ మీద గౌరవంతో సీట్లలో రిజర్వేషన్‌ని పాటిస్తారని మనం భ్రమపడక్కరలేదు. "లేడీస్‌తో గొడవపడితే సిగ్గుసిగ్గు" అని లెగిచిపోయే మగవాళ్ళే ఎక్కువ ఉంటారు.
బస్సుల్లో ఆడవాళ్ళకి ప్రత్యేక సీట్లు అవసరమా?
- Praveen
-----------------------------
*Re-published
మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
janavijayam@gmail.com
>>>>ఏ మగవాడూ ఆడవాళ్ళని ఉద్ధరించడానికి పుట్టడు>>>
ReplyDeleteబాగా చెప్పారు. ఆడవాళ్ళు ఎక్కువసేపు నిల్చోలేరు. మగవాళ్ళు నిల్చోగలరు. ఆ సంగతి ఒప్పుకోలేక పోట్లాడుతూ ఉంటారు.
లెనిన్ అన్నాడు "విమోచకుడు అనేవాడు ఉండడు. శ్రామికవర్గం తనని తాను విముక్తి చేసుకోవడానికి పోరాడాలి" అని. కానీ లెనిన్ పుట్టినది మధ్య తరగతి కుటుంబంలో తప్ప శ్రామిక వర్గ కుటుంబంలో కాదు. నాకు మార్క్సిజం తెలుసు కాబట్టి నేను జనానికి మార్క్సిజం బోధిస్తున్నాను కానీ నేను కూడా శ్రామికవర్గాన్ని విముక్తి చెయ్యడానికి పుట్టలేదు. అలాగే ఏ మగవాడూ స్త్రీలని విముక్తి చెయ్యడానికి పుట్టడు. అందుకే బ్రహ్మసమాజంవాళ్ళు విధవా వివాహాలు వదిలేసి కులం, కట్నం లాంటి సాంఘిక దురాచారాల వైపే మొగ్గు చూపారు. మార్క్సిజం తెలిసినవాడికి నిత్యం వైరుధ్యాలతో ఆడుకునే ధైర్యం ఉంటుంది. మాది రిజర్వేషన్ ఉన్న కులం. మా కులంవాళ్ళందరూ తమకి రిజర్వేషన్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగాలు కావాలంటున్నారు తప్ప శ్రామికవర్గ విప్లవం రావాలని కోరుకోవడం లేదు. ఈ వైరుధ్యానికి కూడా ఎదురీదుతూ నేను జనానికి మార్క్సిజం బోధిస్తున్నాను.
Deleteస్త్రీలను గౌరవించే సాంప్రదాయం కొనసాగడం మంచిది. వారికి ప్రత్యేక సీట్లను కేటాయించడంను నేను సమర్ధిస్తాను.
ReplyDeleteబస్సులోనే కాదు బ్లాగుల్లో కూడా ఆడవాళ్ళ వ్యాఖ్యలు ప్రచురించరు. బూతులు మాత్రం సిగ్గులేకుండా ప్రచురిస్తారు. వాళ్ళ స్థాయికి తగ్గట్లు నేను వ్రాయలేను అని ఊరుకుంటాను.
Deleteఆడవాళ్ళ వోట్ల కోసమే ఈ సీట్ల రిజర్వేషన్, అంతే. శ్రీకాకుళం మహిళా పోలీస్ స్టేషన్‌లో ముగ్గురు ఆఫీసర్‌లు ఉన్నారు. అందులో స్టేషన్ హౌస్ ఆఫీసర్‌తో సహా ఇద్దరు మగవాళ్ళే. విజయనగరం మహిళా పోలీస్ స్టేషన్‌లో ఎంత మంది ఆఫీసర్‌లు ఉన్నారో నాకు తెలియదు కానీ అక్కడ ఒక సారి నైట్ షిఫ్ట్ ఎస్.ఐ. వేశ్యలతో పడుకుంటూ దొరికిపోయాడు. మహిళా పోలీస్ స్టేషన్‌లలో మగ ఆఫీసర్‌లని పెట్టే ప్రభుత్వం బస్సు సీట్లలో రిజర్వేషన్ పెట్టి తాము స్త్రీలని సశక్తీకరిస్తున్నామని చెప్పుకుంటోంది. స్త్రీల సశక్తీకరణకీ, స్త్రీల ఉద్ధరణకీ తేడా ఏమీ లేదు. ఇక్కడ పేర్లు మారుతాయి, అంతే. నేను ఆద్వొకేట్ చేసేది స్త్రీ-పురుష సమానత్వాన్ని. సమానత్వం ఉంటే సశక్తీకరణ లాంటి స్పష్టత లేని పదాలు అవసరం ఉండవు.
Deleteస్త్రీలకు ప్రత్యేకంగా సీట్లను కేటాయించడం వారి సమానత్వానికి భంగమవుతోందా? వారి శక్తిని కించపరచడానికి అది ఉపయోగపడుతోందా?
Delete"లేడీస్ నిలబడి ఏమి ప్రయాణం చెయ్యగలరులే?" అనుకోవడం మహిళా సశక్తీకరణ ఎలా అవుతుంది?
Deleteఆఢవాళ్ళను అబలలు కాదని నిరూపించడానికి వారిని నిలబెట్టాలా? ....... మన సంప్రదాయం పిల్లలను,వృద్ధులను, మహిళల పట్ల వివిధ విషయాలలో ప్రత్యేక శ్రద్ధ కనబరస్తుంది. అందులో ఇలాంటివి అందరికీ ఆదర్శమే. శాస్త్రీయంగా కూడా సరయినదే.
Deleteఅంటే ఆడవారిని నిలబెడితే తప్పా?నేరమా?ఈలెక్కన మిగిలిన దేశాల్లో ఆడవాళ్ళ పట్ల అస్సలు గౌరవమే లేదా?
Deleteమనవాళ్ళకి స్త్రీల మీద అంత గౌరవం ఉంటే మన పోలీస్ డిపార్ట్మెంట్‌లో ఆడవాళ్ళ సంఖ్య నాలుగైదు శాతం ఎందుకు దాటలేదు? మగ ఆఫీసర్‌కి మహిళా తీవ్రవాది దొరికితే లేదా అతని ముందు ఆమె లొంగిపోతే, ఆమె చేత మిగితా తీవ్రవాదులు ఎక్కడ ఉన్నారో చెప్పించడానికి ఆ ఆఫీసర్ ఆమెని రేప్ చెయ్యడని గ్యారంటీ లేదు. ఆడ ఆఫీసర్‌కి తీవ్రవాది దొరికితే మాత్రం ఆమె కేవలం ఆ తీవ్రవాది ఎముకలు విరగొట్టించి పార్టీ రహస్యాలు రాబట్టాలనుకుంటుంది. ఆడ ఆఫీసర్‌లు ఉంటే పోలీసులు లాకప్ రేప్‌లు చెయ్యరు. అయినా మన ప్రభుత్వం మహిళా పోలీస్ స్టేషన్‌లలో కూడా మగ ఆఫీసర్‌లని పెడుతోంది. ఊబి నుంచి బయటకి రావాలనుకునేవాళ్ళని బయటకి తేగలము కానీ పందిలా బురదలో పొర్లాలనుకునేవాళ్ళని ఎవరూ మార్చలేరు. "నువ్వు గాజులు తొడుక్కున్నావు", "మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కినట్టు ఉంది" లాంటి పదాలు స్త్రీలే మాట్లాడితే గాడిద బుర్రకి గంధపు చెక్కల సువాసన తెలిసేలా ఎవరూ చెయ్యలేరనే అనిపిస్తుంది.
ReplyDeleteషేర్ ఆటోల్లో మాత్రం మగవాళ్ళ మధ్యలో ఇరుక్కుని కూచుంటారు.. ఏదైనా రద్దీ ఉన్నచోట మగాళ్ళ మీద పడి, తోసుకుని మరీ దూసుకుని పోతారు.. అవసరాన్ని బట్టి వివక్ష బయటకు వస్తుంది..
ReplyDeleteఆటోవాడికి నాలుగు డబ్బులు ముఖ్యం తప్ప రిజర్వేషన్ అతనికి అనవసరం అని అందరికీ తెలుసు. ప్రభుత్వాన్నే అందరూ ఇది కావాలి, అది కావాలి అని అడుగుతారు. విచిత్రం ఏమిటంటే కుల రిజర్వేషన్‌ని వ్యతిరేకించేవాళ్ళు ఇక్కడ మహిళా రిజర్వేషన్‌ని సమర్థించడం.
Deleteఆటో సంగతి సరే, ప్రైవేట్ బస్సులు & విమానాల్లో రిజర్వేషన్ పెట్టమని అడిగే ధైర్యం కూడా వీళ్ళకి ఉండదు. ప్రైవేట్‌వాళ్ళ వ్యాపారాలకి నష్టం రాకుండా ఉండడం కూడా ముఖ్యం అనుకుని ఆర్.టి.సి. బస్సుల్లో మాత్రమే రిజర్వేషన్‌ని సమర్థిస్తారు.
Deletehttp://chirudreams.blogspot.com/2019/03/blog-post_25.html
ReplyDeleteచదివాను. వెనుకబాటు నమ్మకాల నడుమ రిజర్వేషన్ ఎంత ఉన్నా దండగే.
ReplyDelete