జర్నలిస్టు భావం ప్రజల భావాలని ప్రతిబింబించేదిగా ఉండాలా? 

ప్రజల భావాలని చైతన్యపరచేదిగా ఉండాలా? 

మీ అభిప్రాయం ఏమిటి?

*Re-published

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

janavijayam@gmail.com

 

Post a Comment


  1. అవసరం లేదు.

    జనుల మనస్సులో సంచలనాన్ని గుబుల్నీ పెంపొందించేలా వుండాలి

    కించుకచో వాళ్లు హైరానా పడిపోయి బీపీ పెరిగి జుట్లు జట్లుగా పట్టుకునేటట్టు వుండాలె.



    జిలేబి

    ReplyDelete
  2. చైతన్యమా, మట్టిగడ్డలా? అంతటా వ్యాపార దృక్పథమే కాదా??
    ఈ విషయంలో పైన “జిలేబి” గారి అభిప్రాయమే నా అభిప్రాయం.

    ReplyDelete
  3. ఒకప్పుడు రామోజీ తాత ఒక్కడే నిజానిజాలను గాలికి ఒదిలేసి తమోళ్ళను నెత్తిని ఎక్కించుకునేవాడు. ఇవ్వాళ ప్రతి పత్రిక & ఛానెల్ అదే "మార్గదర్శ"కంలో పంజేస్తున్నారు.

    అంతా స్వకుల అనుకుల సంకుల వ్యాకుల కులకలం: ఇంతోటి దానికి తటస్థం అనే పేరు ఒకటి.

    ReplyDelete
  4. కుల బ్రహ్మ, కుల విష్ణు, కుల దేవో మహేశ్వరహః, కుల సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ కులయేన్నమః

    పొద్దున్నే లేచి పారాయణం చేసుకోండి. "కులం" మిమ్మల్ని కరుణిస్తుంది. యేరే ఆప్షన్ మాకుంది అని నీల్గారో .. తస్మాత్ జాగ్రత్త, నీతులు చెప్పే పంతులమ్మలూ/పంతులయ్యలూ బయలు దేరతారు.

    ReplyDelete
  5. ఈ చెత్త వదిలేస్తే, జర్నలిస్టులు ప్రజల భావాలతో పనిలేకుండా నిజాలు రాయాలి. కనీసం ఒక్కడు కూడా నిజం చెప్పేవాదు లేకపోతే.. కష్టం.

    ReplyDelete
  6. ప్రస్తుతం జర్నలిజం ఎలా ఉన్నదీ అనడానికి మీరు ముగ్గురూ చెప్పినవి కొన్ని ఉదాహరణలుగా చెప్పవచ్చు. వాస్తవానికి ఇంకా దయనీయంగా, దారుణంగా, దుర్మార్గంగా ఉన్నది పరిస్తితి.

    కానీ..... ఇక్కడ ప్రశ్న వేరు. ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేదెవరూ......

    జర్నలిజం ఎందుకు దిగజారిందీ ఇంకో ప్రశ్న ఉంచుతాను.

    ఈ ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పాలని విజ్ఞప్తి.

    ReplyDelete
  7. అప్పుడప్పుడూ ఒకటనిపిస్తుంది. అంతా కుల పిచ్చిగాల్లే ఉన్నప్పుడు నిజాలు ఎలా? అని. కాంపిటీషన్ ఒక్కటే మార్గం. ఒకడు చెప్పే అబద్దాలను పక్క కులమోడు యాసిడిటీతో కక్కాలి. అదే శ్రీరామ రక్ష. అలా ఒక్కోక్కరూ ఒక్కోలా బురదపోసేసుకుంటే.. కనీసం అన్ని కంపులూ బయటకి వస్తాయి. అందులో నిజం ఏమిటీ అనేది జనాలు నిదానంగానైనా అర్థం చేసుకుంటారు. సో, కొట్టుకోండి. బీభత్సంగా కొట్టుకోండి. ఈ సమాజములో అదొక్కటే కొద్దో గొప్పో సానిటీని కాపాడగలదు.

    ReplyDelete
    Replies
    1. వైరుధ్యాలనుండి ఆ ప్రయోజనం కొంతవరకూ ఉంటుంది శ్రీకాంత్ గారు.

      Delete
  8. @పల్లా కొండల రావు:

    సూటిగా సమాధానం అడిగారు కనుక:

    సమాజాన్ని చైతన్యపరచడం అభిప్రాయ నాయకుల పని. జర్నలిస్టులు ఒక్కరే ఈ బాధ్యతను మోయలేరు. వాస్తవాలను విస్మరించి అట్లా ఆశించడం దురాశ.

    ప్రజల అభీష్టాలను జర్నలిస్టులు ప్రతిబింబించాలనుకోవడం కాస్త వాస్తవిక గమ్యమే. కాకపొతే మమేకం కాకుండా ప్రాతినిధ్యం కుదరదు. ఇందుకు ఎన్నో అవాంతరాలు: వ్యక్తిగత సామాజిక నేపధ్యం, బడ్జెట్ లోకువలు, సంపాదకీయ ఉక్కుపాదం గట్రా.

    జర్నలిస్టు కూడా మనిషే, తన కళ్ళతోనే ప్రపంచాన్ని చూస్తాడు. కడుపు నిండినోడికి తిండికి లేక బక్కచచ్చిన నిరుపేద ఎదురైతే "వావ్ ఏమి డైటింగ్ చేసావ్ బ్రో" అంటాడే తప్ప అందుట్లో దుఃఖం అగుపిస్తుందా? జర్నలిజం నిజంగా మెరుగవ్వాలంటే జనం నుంచే జర్నలిస్టులు రావాలి. ప్రవేశ అడ్డంకులు ఇప్పట్లో తొలగేనా?

    ReplyDelete
    Replies
    1. సమాజాన్ని చైతన్యపరచడం బోధకుల పని.అందులో జర్నలిస్టుల పాత్ర కీలకం.

      నాయకులు ఈ బోధనలను అధ్యయనం చేయడం, ఆకలింపు చేసుకోవడం, అమలు పరచడం, అనుకూలంగా మలచుకోవడం ఎలా చేస్తున్నారు? ప్రజల చైతన్యం ఏమిటి? అన్నదానిపై సమాజంలో అబివృద్ధి మరియు విలువల ప్రగతి ఉంటుంది.

      ఎందుకంటే అంతిమంగా ప్రజలే చరిత్ర నిర్మాతలు కనుక. జర్నలిస్టుల పాత్ర ప్రజలను చైతన్య పరచేలా ఉండాలి.

      అయితే వార్తల సమాచారం అందించడంలో నిష్పక్షపాతం, విశ్లేషణలు వ్రాయడంలో ప్రజలపక్షం వహించాలనేది నా అభిప్రాయం. దీనికి ఆటంకాలు మీరు చెప్పినవాటితో ఏకీభవిస్తూనే.... బోనగిరి గారు చెప్పినట్లు వైరుధ్యాలను ఉపయోగించుకుంటూ జాగ్రత్తగా (కత్తిమీద సామే) ఈ పని చేయాల్సి ఉంటుంది.

      ఈ పని కొంతమేరకు ఫ్రీలాన్స్ జర్నలిజం లోనూ ... కొన్ని చిన్నపత్రికలలోనూ జరుగుతున్నది.

      సోషల్ మీడియాలో జరుగుతున్నది. కానీ అక్కడా గందరగోళం ఉంటున్నది.

      జర్నలిస్టు మనుషులతో మమేకం కావాలి తప్పు లేదు, కానీ వాళ్లతో కలిసిపోరాదు. ఒక్క అడుగు ముందుండి వారిని చైతన్యపరచాలి.

      జనానికి మరీ దూరంగానో.... జనంతోపాటో అన్నట్లు ఉండకూడదు.ఇబ్బందులను అధిగమించడానికి అవసరమైన మార్గాలను, ప్రజలలో చైతన్యాన్ని, ఐక్యతను తీసుకూవచ్చే బోధనలు వ్రాయగలగడం మాత్రమే జర్నలిజంకు ఉన్న పరిమితి.

      ప్రాణాలు పోగొట్టుకుని మరీ పాత్రికేయం ఒంటరి వీర పోరాటం వల్ల ఆరాటమే తప్ప పోరాటానికి ఆంతగా ఉపయోగం ఉండదు. అయినా ఆ రేంజ్ జర్నలిస్టులు ఇప్పుడు లేరు కూడా.

      Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top