చర్చకు ఉంచిన పదం : అవునా!
పదం పంపినవారు : శివరామప్రసాదు కప్పగంతు.
example:
example:
అవునా! అనే పదం సమంజసమైనదేనా?
Name: | శివరామప్రసాదు కప్పగంతు |
E-Mail: | deleted |
Subject: | \\"అవునా\\" అన్న పద వాడకం సమంజసమైనదైనా |
Message: | 1970 దశకంలో \"అవునా\" అనే మాట పెద్దగా వాడకంలో లేదు. నేనెప్పుడూ ఎవరన్నా \"అవునా\" అని ఆశ్చర్యపోవటం వినలేదు. ఈ మధ్య కాలంలో \"అవునా\" అన్న పదం \"అలాగా\" అనే ఆశ్చర్యపోయ్యే సందర్భంలో వాడెయ్యటం ఎక్కువగా వినపడుతున్నది. అవును అనే మాట ఒప్పుకోలు. అక్కడ నుంచి అవునా అని దీర్ఘం ఇచ్చి సాగతీసి మాట్లాడితే కొత్త పదం అయ్యి అలాగా కు సమానార్ధంగా ప్రస్తుతం వాడబడుతున్నది. ఇలా 'అవును' ను అవునా! అని వాడటం ఎంతవరకూ సబబు? భాషా శాస్త్రకారులు ఒప్పుకుంటారా? లేదా? అని కాదు నా ప్రశ్న. ప్రస్తుతం ఉన్న పదం లోంచి పుట్టిన ఈ పదం ఎంతవరకూ సబబైనది అని! ఇదే పధ్ధతి లో ఆంగ్లంలో అవును అనటానికి Yes వ్రాతలోనూ yea, yeah అని వాడుకలో ఉన్నది. తెలుగులో అవును ను అవునా చేసినట్టు ఆంగ్లంలో Yes ను Yessaa అని వాడబడటం వినలేదు. ఇక హింది లో ఐతే అవును కు \"హా\" . దీన్ని హాహా వాడగలగటం దాదాపు అసాధ్యం. తెలుగులో మాత్రమె ఇలా అవును, అవునాగా మారి వేరే అర్ధం వచ్చింది, వాడుకలోకి వచ్చేసింది కాబట్టి గత 30-40 సవత్సరాల్లో ప్రజల నోళ్ళల్లో పడి తయారైన ఒక కొత్త మాట. |
*Re-published
చూడండి: http://www.andhrabharati.com/dictionary/ ఈ అవును అనేది బ్రౌన్ నిఘంటువులోనే ఉంది. ఇది సరైన పదమే. అవును లాగే అవునా అన్నది కూడా సరైన పదమే. ఇబ్బంది ఏమీ లేదు.
ReplyDeleteఅవునా! అనే పదం ఏ సందర్భంలో వాడడం సరయినది. అలాగా? అన్నదానికి అవునా!? అన్నదానికీ తేడా ఉంటుందనిపిస్తున్నది. ఇవి రెండూ ఒకటేనా?
Deleteఅవునా / ఔనా అనే పదం ముందు నుంచీ ఉన్నదే. ప్రాచీన సాహిత్యంలో చాల చోట్ల అవునా పదం కనిపిస్తుంది. అంతెందుకు 1951 లో విడుదలయిన మల్లీశ్వరి చిత్రంలో ఔనా నిజమేనా అనే ప్రసిద్దమైన పాటలో దేవులపల్లి కృష్ణ శాస్త్రిగారు ఈ పదాన్ని వాడటం అందరికీ తెలిసిందే కదా!
ReplyDeleteఉంది - ఉందా?
ReplyDeleteలేదు - లేదా?
కాదు - కాదా?
వీటిలాగే ...
అవును - అవునా?
ఇది ప్రాచీన కాలం నుండి ఉన్న ప్రయోగమే!
ఈ పదం గూర్చి పస లేని చర్చను ముందుంచడం ఆశ్చర్యంగా ఉంది