Post a Comment

  1. రాజరికంలో రాజును ప్రశ్నించటం‌ అన్నది రాజద్రోహమా - ప్రజ హక్కా అన్నది రాజు ఎటువంటి వాడూ అన్నదానిపై ఆధారపడి ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఐతే పక్కాగా ప్రజలకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే‌ హక్కు ఉంది - వారి దయ వలన గద్దెనెక్కినదే‌ ఏప్రభుత్వం ఐనా కాబట్టి. కాని నిజానికి జరుగుతున్నది వేరు ఎప్పుడూ. గద్దె నెక్కగానే‌ ప్రతిప్రభుత్వమూ ప్రజలకన్నా ఉన్నతులం అన్నట్లే‌ ప్రవర్తిస్తున్నది. స్వాతంత్ర్యానంతరం అన్నిచోట్లా ఇంచుమించు అన్నిప్రభుత్వాలదీ‌ ఇదే‌ధోరణి. తెలుగుగడ్డను పగులకొట్టుకొని సంబరపడటం జరిగిన తరువాత ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ పరిస్థితులు క్రమంగా రాజరికం స్థాయికి వచ్చాయి. వ్యక్తులు తప్పులు చేస్తారు అని మాత్రమే లేదు, వ్యవస్థలు తప్పులు చేస్తాయి, సమాజం‌ కూడా తప్పులు చేస్తుంది. ఎవరు చేసిన తప్పులైనా కొన్నికొన్ని సరిదిద్దుకొనటానికి వీలుండనివే. పరిణామాలు అనుభవించక తప్పదు. అవి మంచివైనా చెడువైనా సరే.

    ReplyDelete
  2. అధికారం ఉన్నంతవరకూ వాళ్ళు ఆడుకుంటారు. ఆ అధికారం అటునుంచి ఇటువైపు మారి వేట మొదలైతే అప్పుడు వాళ్లే అనుభవిస్తారు. దేనికైనా టైం రావాలి.
    అసలు డబ్బుకు మందు బాటిళ్లకి కక్కుర్తిపడి ఓటేసేవాళ్ళకి కరోనా వచ్చి పోతే తప్ప వ్యవస్థ బాగుపడదు.

    ReplyDelete
    Replies
    1. ఆ అధికారం అటునుంచి ఇటువైపు వచ్చే అవకాశం లేదండీ!

      ఇప్పటి ఎన్నికల వ్యవస్థ నిర్మితిలోనే రెండు ముఖ్యమైన మాయలు ఉన్నాయి.

      ఒకటి swing factor:దాదాపు ప్రతి ఎన్నికకీ అబ్యర్ధులు దేన్ని గురించి చెప్తే ఓటర్లు కుపప్లు తెప్పలై తమకే వోటు వేస్తారని అది swing factor లేక winning factor అవుతుంది.

      దీన్ని పుట్టించడం చాలా కష్టం గానీ అది పుట్టి దాని ప్రభావం 4 శాతం ఉన్నప్పటికీ ఓడలు బళ్ళూ బళ్ళు ఓడలూ అవుతాయి.ప్రశాంత్ కిషోర్ లాంటివాళ్ళు ఎన్నికల్లో గెలుపుని కూడా అమ్మకపు సరుకు కింద మార్చెయ్యడంలో దీని పాత్ర చాలా వుంది.అతను డబ్బు తీసుకుని రంగంలో దిగిన ప్రతి ఎన్నికలోనూ అతనే తన అబ్యర్ధికి అనుకూలమైన swing factor ఏర్పాటు చేస్తున్నాడు.

      నేను స్టడీ చేసిన మేరకు ఏ ఎన్నికలోనూ ప్రజల నిజమైన ఆకాంక్షలు వ్యక్తం కావడం లేదు.అంటే, ప్రజాభిప్రాయం పేరున ప్రజాకంటకులు అధికారంలోకి రావడానికి ఎన్ని వెసులుబాట్లు అవసరమౌతాయో అన్ని వెసులుబాట్లు పుష్కలంగా ఉన్న మోసకారి వ్యవస్థ ఇది.

      "అసలు డబ్బుకు మందు బాటిళ్లకి కక్కుర్తిపడి ఓటేసేవాళ్ళకి కరోనా వచ్చి పోతే తప్ప వ్యవస్థ బాగుపడదు." అనడం చాలా తప్పు సార్!ఎప్పుడైనా ఎవరైనా లెక్కలు తీశారా , కనీసం ఒక్క నియోజక వర్గంలో అయినా అటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎన్ని వోట్లు అలా పడ్డాయి అని.

      గుర్రపు రేసుల్లోనూ క్రికెట్టు ఆటల్లోనూ బెట్టింగు రాజాలు
      చేసినట్టు ప్రతి రాష్ట్రంలోనూ ఈసారి ఎవర్ని అధికారంల్లో ఉంచాలి అనేది ముందు నిర్ణయించుకుని వాళ్ళని అధికారంలో ఉంచడం కరెక్తే అని నమ్మించడానికి ఈ ఎన్నికలు అనే ప్రక్రియని ఉపయోగించుకుంటున్నారు.తెర వెనక దొంగ వోట్లు వెయ్యడం, బూతు క్యాప్చరింగులు చెయ్యడం,ఈవీయం మ్యానిపులేషన్ వంటివి జరుగుతూనే ఉంటాయి,గెలుపోటముల్ని అవే నిర్ణయిస్తాయి - కానీ బైటికి మాత్రం ప్రజలు వేసిన వోట్లతో అద్భుతం జరిగినట్టు కనిపిస్తుంది.

      టైం కన్న మనీ చాలా పవర్ఫుల్!

      Delete
    2. >>>అసలు డబ్బుకు మందు బాటిళ్లకి కక్కుర్తిపడి ఓటేసేవాళ్ళకి కరోనా వచ్చి పోతే తప్ప వ్యవస్థ బాగుపడదు." అనడం చాలా తప్పు సార్!>>>

      ఏం తప్పులేదు ఒకసారి కరోనా వచ్చి-పోతే ఎంత ఖర్చు అవుతుందో తెలిసివస్తుంది. ఊరికే డబ్బులు వస్తున్నాయి అనుకుంటే ఊరికే జబ్బులు కూడా రావాలి.

      Delete
    3. తప్పు నీహారిక గారు. ప్రజలను చైతన్యపరచాలే తప్ప శపించకూడదు. ఎప్పుడైనా ప్రజలే చరిత్ర నిర్మాతలు కాకుంటే ప్రతీదానికి సమయం పడుతుంది. ఆ సమయంలో ఓపికగా ప్రజలను చైతన్యపరచడమే మీ వంటి వారు చేయాల్సింది.

      Delete
    4. ప్రజలను చైతన్య పరచనక్కర లేదు, వారి నుంచి మనం చైతన్యం పొందగలిగితే చాలు.

      Delete
    5. అత్యధిక శాతం ప్రజలు నిరక్షరాసులు కాబట్టే అట్లా తెలివితక్కువగా వోటు వేస్తున్నారనో ఉచిత హామీల ఆకర్షణకు లోనై తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారనో అనుకోవడమే అసలైన తెలివి తక్కువ తనం!నేను ఎన్నికల్ వ్యవస్థ నిర్మితిలో ఉన్న అనేకమైన లోపాల్లో swing factor అనే ఒక్కదాని గురించే చెప్పాను. అంతమాత్రాన అదొక్కటే లోపం అనుకోకూడదు.

      ప్రజలు వోట్లు వెయ్యకపోయినా అధికారం దకించుకోగలిగే ఏర్పాట్లు మనం చూస్తున్న ఎన్నికల వ్యవస్థ నిర్మితిలోనూ ప్రజాస్వామ్యం యొక్క నిర్మితిలోనూ చాలా ఉన్నాయి.

      ఈ మధ్యనే జగన్ పార్టీకి చెందిన ఒక మహిళా నాయకురాలు అలవాటులో పొరపాటు అన్నట్టు "మీరు వోట్లు వేస్తేనే అద్గికారంలోకి వచ్చానా?" అనేసి నాలిక్కరుచుకున్నారు.దాని అర్ధం ఏమిటో "ప్రజలను చైతన్య పరచనక్కర లేదు, వారి నుంచి మనం చైతన్యం పొందగలిగితే చాలు." అని సూక్తి ముక్తావళులు వదులుతున్న జైగారు చెప్పగలరా?

      ఇన్నేళ్ళ నుంచి ఈ రాజకీయ విశ్లేషకులుంగారు ప్రజల నుంచి పొందిన చైతన్యం ఏమిటో తెలుస్తుంది.

      Delete
    6. ప్రజలను చైతన్యపరచడం, ప్రజలనుండి చైతన్యం పొందడం అనేది నిరంతర ప్రక్రియగా ఉండాలి. ఉంటుంది కూడా!

      Delete
  3. ఓట్లు వేసే విధానం ఆధారంగా చెప్పాలంటే అక్షరాస్యులకంటే నిరక్షరాస్యులే చైతన్యవంతంగా ఉంటున్నారని చెప్పాలి.

    ReplyDelete
    Replies
    1. కడుపు నిండినోడికి కష్టం తెలువదు. బీదా బిక్కీ & బడుగు వర్గాలకు చైతన్యం అన్నది జీవితావసరం, లక్సరీ కాదు.

      Delete
    2. క్షీణోపాంత సిద్ధాంతమన్నమాట :)

      Delete
  4. ఈరోజు మధ్యాహ్నం నుంచీ రిజల్ట్స్ వస్తాయి.
    సాయంత్రం గాని రేపుగాని మా సిద్ధాంతి గారు ఆ రిజల్ట్స్ రావడానికి గలా గ్రహ స్థితులను వివరిస్తారు.

    ReplyDelete
  5. మొత్తానికి భారతీయ జనతా పార్టీ దక్షిణాదిలో పట్టు సాధించడానికి తెలంగాణనే ఎంచుకుని ఇక్కడ అధికారంలోకి వచ్చే ప్రయత్నానికి దుబ్బాక శుభారంభాన్ని ఇస్తే GHMC ఎన్నికలు అంతకు మించిన సుస్థిరతను ఇచ్చాయి - బెస్టాఫ్ లక్ బీజేపీ!

    వేసిందే గంతు అన్నట్టు ఒక్క ప్రయత్నంలోనే అద్భుతాలు సాధించటం అన్ని చోట్లా అన్నిసార్లూ సాధ్యపడేది కాదు గాబట్టి బీజేపీ ఇప్పుడు సాధించిన ఫలితం అద్భుతమైనదే - కేసీయారుకు ఇక కష్టకాలం మొదలయినట్టే!

    మొన్నటి వరదలు తెరాసా వాళ్ళ అసమర్ధతను, అంతకు మించి వాళ్ళ నిర్లక్ష్యాన్నీ అద్దం ముందు దీపం పెట్టినట్టు చూపించాయి.అసలు ప్రజలు గగ్గోలు పెట్టి "ఎక్కడున్నారు మంత్రులు"? అని అరిచి గద్దించేవరకు కేటీయారుతో సహా ఎవ్వరూ ఇళ్ళనుంచి కదల్లేదు!ప్రజలు అంత నిలదీసిన తర్వాత కూడా మీడియా ముందు సొల్లు కబుర్లు చెప్పటం తప్ప క్షేత్రస్థాయికి వచ్చి పనిచేసి ప్రజలకు కనిపించి ధైర్యం చెప్పలేదు!

    బీజేపీ ఇప్పుడు సాధించిన ఫలితాన్ని చూస్తే పూర్తిగా మతం కార్డు మీదనే ఆధారపడిందనేది తెలుస్తుంది.అదే,ఇటువంటి వాటిని కూడా హైలైట్ చేసి ఉంటే GHMC తనదే అయి వుండేది - అలా అనిపిస్తుంది నాకు.

    భవిష్యత్తులో చెయ్యబోయే తదుపరి ప్రయత్నాల్లో ఈ పొరపాటును సవరించుకుని ప్రజల నిజమైన అవసరాలను పట్టించుకుని బీజేపీ ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉన్న పార్టీ అనే నమ్మకాన్ని పెంచుకుంటే రాష్ట్ర స్థాయి అధికారం పెద్ద కష్టం కాదు.

    జై శ్రీ రామ్!

    ReplyDelete
    Replies
    1. ఇప్పటివరకూ విశ్లేషణలు చూస్తుంటే సెటిలర్స్ మాత్రమే టీ.ఆర్.ఎస్ ను కాపాడారనిపిస్తోంది.

      Delete
    2. ఎల్ బీ నగర్ లో సెటిలర్స్ ఎక్కువ, టి ఆర్ ఎస్ ఒక్కటి కూడా గెలవలేదు.

      Delete
    3. కొందరు విశ్లేషకుల ప్రకారం రోహింగియాలు తప్ప విడిచి ఇంకెవరూ తెరాసకు వోటేయలేదు. అందుకే సర్జికల్ స్ట్రైక్ తస్మాత్ జాగ్రత్త!

      Delete
    4. కేసీఆర్ కి ఓటు వేస్తే రోహింగ్యాలయితే బీజేపీ కి ఓటు వేస్తే హిందూ తీవ్రవాదులా ?
      https://youtu.be/qON8DM1xUzE

      Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top