రైతు అంటే ఎవరు?
రైతులకు ఎం.ఎల్.సీ లు కేటాయించాలన్న బోనగిరి గారి టపా నేపధ్యంలో జై గారు అసలు ఎవరు రైతు అనేది తేలితే దీనిని చర్చించవచ్చన్న కామెంట్ కీలకమైనది.
రైతు బంధు పథకంలో కోటీశ్వరులకు వాటా దక్కుతుండడం, కౌలు రైతులకు ఎటివంటి సౌకర్యాలు లభించకపోవడం చర్చలలో ఉండడం తెలిసిందే. ఈ విషయమై ముఖ్యమంత్రి, కె.టి.ఆర్ కూడా కౌలు రైతులకు రైతుబంధు ఇవ్వడం సాధ్యం కాదు అనిప్రకటించారు కూడా.
రైతులకు ఎం.ఎల్.సీ లు ఇవ్వాల్సి వస్తే (ఒకవేళ ఇస్తే) వారిని ఎన్నుకోవాల్సిన రైతులు ఎవరు? పోటీకి అర్హత ఎవరికి ఇవ్వాలి? అసలు రైతు అంటే ఎవరు? మీ అభిప్రాయం తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి.
మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
janavijayam@gmail.com
దున్నేవాడే రైతు...
ReplyDeleteసరిపోదండీ.
ReplyDeleteరైతు కానివాడు రైతు గురించి మాట్లాడుతున్నారు అని ఒక తల మాసినోడు అన్నాడు. మీరు రైతు అంటే ఎవరు అని అడుగుతున్నారు.
ReplyDeleteమానవ పరిణామ క్రమం వివరించాలి. ఒక కూలీ "రోజు కూలీ" కెళ్ళి సంపాదించి పోగు చేసి కొడుకుని చదివించుకుంటూ జన్మంతా కూడబెట్టి రెండెకరాలు కూడబెట్టి చస్తూ కొడుకుకి ఇచ్చి పోతాడు.
ఆ కొడుకు ఉద్యోగం చేస్తూ తండ్రి ఇచ్చిన పొలాన్ని కౌలుకి ఇచ్చి తను చస్తూ తన కొడుకుకి ఆ పొలం ఇస్తాడు.
ఇలా తరతరాలు కష్టబడితే ఆస్థి ఏర్పడుతుంది.
ఇపుడు రైతెవరు? రాజెవరు ?
అంబానీ వచ్చి అన్ని రిలయన్స్ కొట్లలో కూర్చోగలడా ?
< ఇలా తరతరాలు కష్టబడితే ఆస్థి ఏర్పడుతుంది. >
ReplyDeleteకే.సీ.ఆర్ లాంటి వాళ్లు ఒక ఏడాది అధికారంలో ఉంటేనే ఆస్థి పెరిగిపోతుంది కదా? మీరు చెప్పిన తరతరాల కష్టం కాకుండా తరతరాలపాటు ఎవడూ కష్టపడకుండానే వారసులకు ఆస్థి వచ్చేస్తుంది. వాడు కే.సీ.ఆరా ఇంకొకడా అన్నది పక్కనబెట్టి ఆలోచిద్దాం. మరి ఇలాంటి వారికి పొలం ఆస్థిగా ఉంటే వారు రైతులే కావాల్నా? వారికి వోటు ఉండాల్నా? వారికి పోటీ చేసే అవకాశం ఉండాల్నా? అలాంటప్పుడు రైతులకు ప్రయోజనం ఏముంటుంది?
>>>కే.సీ.ఆర్ లాంటి వాళ్లు ఒక ఏడాది అధికారంలో ఉంటేనే ఆస్థి పెరిగిపోతుంది కదా?>>>
ReplyDeleteజుకర్ బర్గ్ ఆస్థి మనం బ్లాగింగ్ మొదలెట్టినపుడే పెరిగింది. అయితే ఏంటి ? ఆయన కొడుకుకి ఆస్థి ఇవ్వకూడదా ?
పొలం ఆస్థిగా ఉంటే రైతు కాడు అంటే ఫేస్ బుక్ ఆస్థిగా ఇస్తే బిజినెస్ మాన్ అవ్వకూడదా ?
పొలం ఆస్థిగా కలిగి ఉండడం తీవ్రవాదం తో సమానమా? ఓటు హక్కు, రాజ్యాధికారం ఉండకూడదా ? ఇదెక్కడి వితండవాదం ?
ఇదే సరైన వాదం. ఈ మార్గంలో ఆలోచిస్తేనే ఎవరికి ఓటు హక్కు ఇవ్వాలి? ఎవరిని పోటీకి అవకాశం ఇవ్వాలి? అన్నది తేలుతుంది.
Deleteఆస్థి ఉన్నవాడు కొడుక్కి ఆస్థి ఇస్తాడు. వాడు ఏ పనీ చేయకుండానే సోమరిలా బ్రతకవచ్చు. వడ్డీ వస్తుంది కనుక వాడి ఆస్థి తరగదు. తరతరాలైనా తరగదు. అపుడు ఏ శ్రమా చేయకుండా తినే హక్కు ఆస్థి ఉన్నందున ఇవ్వవచ్చంటారా? ఉత్పత్తిలో కీలకమైన శ్రమకు మీరు ఏ విలువ ఇవ్వదలచుకున్నారు నీహారిక గారు?
రైతుబంధు ఇస్తున్నారు కాబట్టి మీలాంటి వాళ్ళు రైతు ఎవరు అని ప్రశ్నిస్తున్నారు. రిజర్వేషన్ ఉంది కాబట్టి దళితులు ఎవరు అని నేను ప్రశ్నిస్తున్నాను.
Deleteరైతు అంటే ఎవరు అనేది కీలకమైన ప్రశ్నే కానీ కౌలు రైతు గురించి వేరే చర్చ. కౌలు రైతు అంటే భూమిని లీజుకి తీసుకుని వ్యాపారం చేసే రైతు కూలీ మాత్రమే. కౌలు రైతు "రైతు" అవుతాడు.
రిజర్వేషన్ అనుభవిస్తున్నవారు విలువల గురించి మాట్లాడగలరా ?
@నీహారికDecember 10, 2020 at 7:47 PM
Deleteరిజర్వేషన్ తీసుకునే వాళ్లంతా దళితులు కాదండీ. దళితులెవరో మీకు తెలుసు.
దళితుడు అంటే ఫలానా కులంలో పుట్టినవాడు అని చెప్పగలం. రైతు అంటే పొలం ఉన్నవాడా? సాగు చేయగలిగినవాడా? ఇది ఖచ్చితంగా తేలాల్సిన అంశమే.
కడియం శ్రీహరి, రామనాధ్ కోవింద్ కూడా దళితులే. భూస్వామి అయినా కౌలు రైతు అయినా రైతులే. కంప్యూటర్ తో ఉద్యోగం చేసే వాళ్ళందరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే. మీకు ఇంకా సమాధానం దొరకడం లేదు.
Deleteపొలం ఉన్నవాడు రైతు, సాగుచేసేవాడు రైతు కూలీ.
Deleteశ్రమ చెయగలిగి ఉండీ పొలం కౌలు ద్వారా ఆదాయం పొందేవాడు రైతేనా?
Deleteఅనెక వ్యాపారాలద్వారా ప్రధాన ఆదాయం పొందుతూ పొలం కూడా కలిగి ఉంటే వారు కూడా రైతులేనా?
నీహారిక గారి నిర్వచనం బాగుంది. అది ఒప్పుకుంటూ ఎంఎల్సీ సీట్లు రైతు కూలీలకు ("రైతు"లకు కాదు) అని ప్రతిపాదిస్తే సరిపోద్ది.
Delete.... ఈవిషయమై ముఖ్యమంత్రి కే.టి.ఆర్ కూడా ....
ReplyDeleteభలే. అప్పుఠడే మీరు కేసీఆర్ గారిని దించి కేటీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసేసారే!
కామా ఉంది సర్.
Deleteకౌలు రైతు, రైతు బంధు, రైతు చట్టం వేటికవే ప్రత్యేకమైనవి ఒకదానితో ఒకటి కలపకండి.
ReplyDeleteమీ ప్రశ్న రైతు ఎవరు అని కదా ?
వారసత్వంగా వచ్చినా, కొనుగోలు చేసినా, ప్రభుత్వం ఉచితంగా ఇచ్చినా భూమి ఉన్న ప్రతి వ్యక్తీ రైతే !
కెసిఆర్ ఎప్పుడు పోతడా అని శానా మంది ఆంధ్రోళ్లు (ముఖ్యంగా టీవీ జనం) ఎప్పటినుంచో కాచుకుకూచున్నారు. ఇగో రేపు ఫలానా రోగంతో చస్తడని, అగో ఎల్లుండి బకెట్ తంతడని; అటెన్కనే పార్టీ బందైపోతదని; ఇంకా కావలనంటే మమ్మల్ని ఆంధ్రలో కలుపుకోండని ఉద్యమాలు వస్తయనీ మాస్తు కథలు పుట్టించిన్రు.
ReplyDeleteబక్కోడు గట్టోడు, పగోళ్ల తిట్లే దీవెనలు లేదా పాపీ చిరాయువు అన్నట్టు సదరు కథలు పుట్టించిన పార్టీల దుకాణాలు ఖతమైనా ఇతడేమో పోతనే లేడు. ఏందో కథ! ఇగ లాభం లే, కొత్త కథ రాయాలె.
అతను దిగిపోవాలని కోరుకునే రాజకీయ పార్టీలు నేతలు తెలంగాణలోనే బొచ్చెడున్నారు. అయినా ఆంధ్రోళ్ళమీదే ఇంకా ఏడుపు ఎందుకో! "కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు" అని స్టేట్మెంట్ ఇచ్చినా చీమకుట్టినట్లు కూడా ఉండదు. కానీ "ఆయనెవరో తెలుగు జాతికి సేవ చేసాడు" అంటే మాత్రం పనికట్టుకు బురద జల్లడం మాత్రం తెలుసు. దురభిమానం నోటి దుర్వాసన లాంటిది. కంపు తెలిసేది పక్కోడికే!
Delete@Jai garu,
Deleteఈ టపా కి మీ కామెంట్ కి సంబంధం ఉందా ?
కం. అవునవునండి టపాతో
Deleteలవలేశపు లింకు లేదు లాగి విషయమున్
కువకువలాడుదు రిటులే
అవకాశం దొరికినప్పు డావు కథేగా
@ Jai GottimukkalaDecember 10, 2020 at 9:18 PM
Deleteమీరే చెప్తున్నారుగా...... పాపీ చిరాయువూ అని..... ఇప్పటిదాకా ఆ సామెత, ఇగనుండి వినాశకాలే విపరీతబుద్ధీ అని.... ఉంటుంది.
కే.సీ.ఆర్ ని తిట్టుకునే ఆంధ్రోళ్లా? జీ.హెచ్.ఎం.సీలో గెలిపించిందీ వాళ్లే...... ఆ ప్రజలు, వారి సి.ఎం కే.సీ.ఆర్ కలకాలం బాగుండాలని కోరుకుంటున్నారు. కే.సీ.ఆర్ లాంటి మోసగాడు వద్దని తెలంగాణా ఉద్యమకారులు కోరుకుంటున్నారు. వీడికెలాగైనా బుద్ధి చెప్పాలని మరో ఉద్యమం చేయాలనుకుంటున్నారు.
నిజమేనండి లింకు లేదు, కామా కూడా లేదు!
Deleteఈ టపా రైతు అంటే నిర్వచనం గురించి కనుక..... దానికి సంబంధించిన చర్చలు చేస్తే ఉపయోగం ఉంటుంది. ఇక్కడ రైతులకు ఎం.ఎల్.సీ ఇవ్వాలన్న పాయింట్ నాకు నచ్చింది. ఆ సందర్భంగానే ఎవరు రైతు అన్నది తేల్చాల్సి ఉన్నది. ఇది కే.సీ.ఆర్ దో, ఆంధ్రోళ్లు , తెలంగాణోల్ల సమస్య కాదు. ప్రపంచవ్యాప్తంగా రైతు అంటే ఎవరు అనేదానికి ఖచ్చితంగా నిర్వచనం తేల్చాల్సిందే. భూస్వామి, రైతు, రైతు కూలి, కౌలు రైతు, కార్పొరేట్ రైతు ..... ఇలా చాలా తేడాలున్నాయి గనుక చర్చ విస్తృతంగా ఆ దిశగా ఉంటే బాగుంటుందని విజ్ఞప్తి.
ReplyDeleteఒకడికి ఒక షాపు ఉంది. అతను దాన్ని ఇంకొకడికి వ్యాపారం చేసుకోవడానికి అద్దెకు ఇచ్చాడు.
ReplyDeleteఇప్పుడు వ్యాపారి ఎవరు? అద్దెకు తీసుకుని వ్యాపారం చేసేవాడే కదా.
అలాగే వ్యవసాయం లో పెట్టుబడి పెట్టి పని చేసే వాడే రైతు. కష్టం, నష్టం అతనిదే. రైతుబంధు సహాయం అతనికే ఇవ్వాలి.
కౌలుకి ఇచ్చిన వాడు భూమి యజమాని మాత్రమే.
>>>ఒకడికి ఒక షాపు ఉంది. అతను దాన్ని ఇంకొకడికి వ్యాపారం చేసుకోవడానికి అద్దెకు ఇచ్చాడు.
Deleteఇప్పుడు వ్యాపారి ఎవరు? అద్దెకు తీసుకుని వ్యాపారం చేసేవాడే కదా.>>>
అవును షాపు ఓనర్ అంటే యజమాని. పొలం ఓనర్ అంటే రైతు.
షాపు అద్దెకు ఇచ్చినట్లే భూమి అద్దెకు/లీజుకి ఇచ్చాడు. కౌలు రైతు కూడా వ్యాపారి అని పైన చెప్పాను. రిలయన్స్ షాపు ఉదాహరణ కూడా ఇచ్చాను.
కొండలరావు గారు రైతు బంధు పధకం ఎవరికి చెందాలి అని అడగలేదు. రైతు ఎవరు అని అడిగారు. ప్రభుత్వం కూడా భూమి ఉన్న వ్యక్తినే రైతుగా పరిగణనలోకి తీసుకున్నది.
రైతు బంధు పధకం గురించి మరోటపా లో చర్చిస్తే బాగుంటుంది.
ఒక వేళ రైతు కౌలు ఇవ్వలేకపోయినా, భూమి యజమానికి పెద్దగా నష్టం ఏమీ ఉండదు. భూమి మీద ఆదాయం తగ్గిపోయినా భూమి విలువ ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది కాబట్టి.
ReplyDeleteకాని వ్యవసాయం చేసే రైతుకి పంట దక్కకపోతే మొత్తం నష్టమే. అందుకే ఏ సాయం అయినా అతనికే దక్కాలి.
ఆసక్తికరమయిన అంశం లేవనెత్తారు, కొండలరావు గారు.
ReplyDeleteఎవరు రైతు అనడానికి RBI వారు ఇచ్చిన small and marginal farmers నిర్వచనం తీసుకుంటే సరిపోతుంది అని నా అభిప్రాయం. బడా భూస్వాములు ఆ పరిధిలోకి రారు, దాంతో ప్రభుత్వాలు ఇచ్చే లబ్ధి సన్నకారు రైతులకే (small and marginal farmers) గాని పెద్దలకు వెళ్ళకుండా జాగ్రత్త పడినట్లు అవుతుంది.
వీళ్ళే అసలైన రైతులు అని నా అభిప్రాయం సుమండీ. ఇక్కడ ఉన్న వ్యవసాయరంగ అనుభవజ్ఞులు ఏమంటారో తెలియదు మరి.
https://www.rbi.org.in/scripts/BS_CircularIndexDisplay.aspx? Id=4190#:~:text='Marginal%20Farmer'%20means%20a%20farmer,1%20hectare%20(2.5%20acres).&text='Small%20Farmer'%20means%20a%20farmer,2%20hectares%20(5%20acres).
(ఈ లింకులోని RBI circular 2008 లో ఇచ్చినా అంతకు ముందు నుండే ఈ small and marginal farmers నిర్వచనం అమలులో ఉంది. 2008 లొ మరో సందర్భంలో RBI వారు మరోసారి చెప్పడం జరిగింది.)
contd...
Deleteఆ పైన RBI circular లో చెప్పిన నిర్వచనం
===========================================
"3.5. ‘Marginal Farmer’ means a farmer cultivating (as owner or tenant or share cropper) agricultural land up to 1 hectare (2.5 acres).
3.6. ‘Small Farmer’ means a farmer cultivating (as owner or tenant or share cropper) agricultural land of more than 1 hectare and up to 2 hectares (5 acres).
3.7. ‘Other Farmer’ means a farmer cultivating (as owner or tenant or share cropper) agricultural land of more than 2 hectares (more than 5 acres)."
============================================
రైతు బంధుతో సహా ఉచిత పధకాలన్నిటికీ నేను వ్యతిరేకం. తెలంగాణా లో నాకు భూమి లేదు. తెల్లకార్డుదారులందరూ పేదవాళ్ళేనా ?
Deleteభూమి ఉన్న రైతులందరికీ కిసాన్ క్రెడిట్ కార్డ్ రాదు. ఇందు మూలంగా తెలియజేసేది ఏమిటంటే నేను టాక్స్ పే చేస్తున్నాను కాబట్టి నాకు కిసాన్ క్రెడిట్ కార్డ్ ఇవ్వరు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రైతు బంధు పధకం రాదు.
Delete>>>వ్యవసాయం చేసే రైతుకి పంట దక్కకపోతే మొత్తం నష్టమే. అందుకే ఏ సాయం అయినా అతనికే దక్కాలి.>>>
ReplyDeleteపంట నష్టం జరిగినపుడు ప్రభుత్వం ఇచ్చే సాయం సరిపోదు. ప్రభుత్వం ఇచ్చే సాయం కౌలు రైతు తీసుకుంటాడు. అది ఒప్పందంలోని అంశమే !
This comment has been removed by the author.
ReplyDeleteఇక కొండలరావు గారు లేవనెత్తిన అంశం అయిన రైతు MLC పదవి బడా భూస్వాముల చేతుల్లోకి వెళ్ళకుండా ఉండాలంటే రైతు MLC గా నిలబడడం, ఎన్నుకోవడం కూడా ఈ సన్నకారు రైతు వర్గం నుండే జరగాలి. అప్పుడే వీళ్ళ సాధకబాధకాలను చట్టసభలలో వివరించడానికి మరింత సులువవుతుంది.
ReplyDeleteyes sir.
Deleteమనం పంట కోసే సమయానికి వర్షం వచ్చి పంట తడిచిపోయి నష్టం వచ్చిందనుకోండి.ప్రభుత్వం పంట నష్టం ఇవ్వదు.బ్యాంక్ లూ ఇన్సూరెన్స్ ఇవ్వవు.ఊరందరికీ నష్టం వస్తేనే ఫీల్డ్ ఆఫీసర్ ధ్రువీకరిస్తేనే పంట నష్టం ఇస్తారు.
ReplyDeletehttps://www.rediff.com/news/interview/farmers-wont-let-india-become-slaves/20201212.htm
ReplyDeletehttps://tganimalstelugu.blogspot.com/2020/12/Crocodile-Facts-Life.html
ReplyDelete11 మంది పేర్లతో 110 ఎకరాలు బేనామీ భూములు కొన్న ఐ.పి.ఎస్. ఆఫీసర్ ఆ 11 మంది పేర్లతోనూ రైతు బంధు పథకం కింద డబ్బులు తీసుకున్నాడు. ఈ సబ్సిడీల వల్ల రైతులకి ఏమి లాభం?
ReplyDelete