వేదాల్లో గోభక్షణ వుందా? ఉంటే అది తప్పు ఎప్పుడయ్యింది?

- Y.CHIRANJEEVI 

-------------------------------

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

kondalarao.palla@gmail.com

Post a Comment

  1. Rig Veda (X.72.6) it appears that the cow was killed with a sword or axe

    Rig Veda (X. 86.14) Indra demands:- 'They cook for one 15 plus twenty oxen'.

    Rig Veda (X.91.14) says that for Agni were sacrificed horses, bulls, oxen, barren cows and rams.

    Rig Veda 10.85.13: అమ్మాయి పెళ్ళి జరిగినపుడు.. విధిగా ఆవులు, ఎద్దులను బలివ్వాలి.

    Rig Veda 6.17.1: ఆవులు,దున్నలు, గుఱ్ఱాల మాంసాన్ని ఇంద్రుడు ప్రీతిగా తింటాడు.

    పైవి ఎంతోకాలం నుంచి చర్చలోవుండగా, ఈ మధ్యనే(Please underline this point) "దానికి వేరే అర్ధముందీ.. చూడండీ" అంటూ.. కొత్తార్ధాలు తీస్తున్నారు. మరి ఇంతకాలం ఆ అర్ధాలు ఎందుకు చూపలేదో, ఈ మధ్యనే ఎందుకు దొరికాయో వాల్లే చెప్పాలి (ఇది ఎగతాళి కాదు).

    వేదాలే కాదు..వేదాలని బలంగా అంగీకరించే కొన్ని గ్రంధాలు లేదా వ్యక్తులు చెప్తున్నవి:

    Apastamb Grihsutram (1/3/10): కర్మలో సక్రమంగా నిమగ్నమైన వ్యక్తి మాంసం తిననప్పుడు, అతని మరణానంతరం ఇరవై ఒక్క పునర్జన్మల సమయంలో అతను బలి పశువు అవుతాడు.

    Vashistha Dharmasutra (11/34): ఒక బ్రాహ్మణుడు శ్రాద్ధం లేదా పూజ సందర్భంగా తనకు సమర్పించిన మాంసాన్ని తినడానికి నిరాకరిస్తే, అతను నరకానికి వెళ్తాడు.

    Manusmriti (Chapter 5 / Verse 30): తినదగిన జంతువుల మాంసాన్ని తినడం పాపం కాదు, ఎందుకంటే బ్రహ్మదేవుడు తినేవాటిని మరియు తినదగినవాటిని సృష్టించాడు.

    Manusmriti (5 / 35): కర్మలో సక్రమంగా నిమగ్నమైన వ్యక్తి మాంసం తిననప్పుడు, అతని మరణానంతరం ఇరవై ఒక్క పునర్జన్మల సమయంలో అతను బలి పశువు అవుతాడు.

    I eat beef because it is very soft & delicious: నేను గొడ్డు మాంసం తింటాను ఎందుకంటే ఇది చాలా మృదువైనది మరియు రుచికరమైనది- Maharishi Yagyavalkya

    Complete Works of Swami Vivekanand, vol.3, p. 536: పురాతన హిందూ ఆచారాలు మరియు ఆచారాల ప్రకారం, గొడ్డు మాంసం తినని వ్యక్తి మంచి హిందువు కాలేడని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు


    The History and Culture of the Indian People’, published by Bhartiya Vidya Bhawan Vol.2, page 578: మహాభారతంలో రాజు రంతిదేవుడు దానధర్మం కోసం రోజూ రెండు వేల ఆవులతో పాటు మరో రెండు వేల జంతువులను చంపేవాడని చెప్పబడింది.

    Adi Shankaracharya’ commentary on Brihdaranyakopanishad 6/4/18 says : ‘Odan’ (rice) mixed with meat is called ‘Mansodan’. On being asked whose meat it should be, he answers ‘Uksha’. ‘Uksha’ is used for an ox, which is capable to produce semen.

    ReplyDelete
    Replies
    1. "గో" అనే వైదిక భాషా పదానికి ఎన్ని పర్యాయ పదాలు ఉన్నాయో మీకు తెలుసా?ఆ పదానికి మీకు తెలిసిన పర్యాయపదాలను కొన్నింటిని ఇక్కడ చెప్పగలరా!
      పాణినీయం మన తెలుగు బహష యొక్క యాసల వంటి వైదిక భాష నుంచి పుట్టిన అయిదు స్థానిక భాషలను సంస్కరించి ఏర్పరచిన సంస్కృతానికి మాత్రమే వర్తిస్తుందనేది మీకు తెలుసా?
      వేదంలోని మంత్రాలకి నిరుక్తం ప్రకారం మాత్రమే అర్ధం చెప్పి అనువదించాలనేది మీకు తెలుసా?
      వేదంలోని ప్రతి మంత్రానికీ ఆమంత్రం ఏ సూక్తంలోనిదో ఆ సూక్తానికి ఉన్న పరిచయ గద్యలో పేర్కొన్న ఋషి, అధిదేవత వంటి వివరాల ప్రకారమే అర్ధ తాత్పర్య వ్యుత్పత్తులు చెప్పాలనేది మీకు తెలుసా?

      "Apastamb Grihsutram (1/3/10): కర్మలో సక్రమంగా నిమగ్నమైన వ్యక్తి మాంసం తిననప్పుడు" అనే మంత్రానికి గెఒ శబ్దానికి ఇంద్రియం అనే అర్ధాన్ని తీసుకుంటే "Apastamb Grihsutram (1/3/10): కర్మలో సక్రమంగా నిమగ్నమైన వ్యక్తి ఇంద్రియాలను జయించనప్పుడు/చంపనప్పుడు" అనే అర్ధం వచ్చే అవకాశం ఉందా లేదా?


      ఇక్కడ మీరు చూపిస్తున్న ఇంగ్లీషు అనువాదం స్వయాన మీరు చేసినదేనా?మీరు చేసిందే అయితే అనువాదం సరైనదో కాదో తెలుసుకునే అవకాశం ఇక్కడ ఎందుకు కల్పించలేదు?ఒకవేళ ఇతరులు చేసిన అనువాదాన్ని ఇక్కడ పేష్టు చేస్తే ఆనువాదకర్త ఎవరు?ఇది చర్చలకి సరైన పద్ధతే అనుకుంటున్నారా మీరు?ఇది సరైన పద్ధతి కాదు.చర్చలో ఒక వాదనని సమర్ధించడానికి గానీ విమర్శించడానికి గానీ సిద్ధపడిన వ్యక్తి స్టేట్మెంట్లు ఇచ్చెయ్యడం కాదు, ప్రతి సూత్రీకరణకీ సమర్ధనలూ సాక్ష్యాలూ ఇవ్వాలి.అప్పుడే అవతలి వక్తికి ఆ మొత్తం వాదనలో తను ప్రశ్నలు వెయ్యడానికి అవకాశం దొరుకుతుంది.చర్చలు ఎలా చెయ్యాలో తెలియకుండా చర్చలకి ఎందుకు పిలుస్తున్నారు?

      మీరిక్కడ చూపిస్తున్న ఇంగ్లీషు టెక్స్ట్ సరైన అనువాదమో కాదో తేల్చుకోవాల్సిన అసలు మంత్రాలను దేవనాగరి లిపిలో గానీ తెలుగు లిపిలో గానీ ఎందుకు చూపించలేదు?మీకు స్వయాన వేదం చదివే పాండిత్యం లేదు, వేరేవాళ్ళు చేసిన అనువాదం సరైనదో కాదో తేల్చుకోలేదు,తేల్చుకునే అవకాశం మాకు ఇవ్వలేదు. ఒక అసంబద్ధమైన అనువాదాన్ని సరైనదో కాదో అధికారికమైనదని అని మీరు నమ్ముతున్నారు మమ్మల్ని నమ్మమంటున్నారు - ఇది సత్యం పట్ల నిబద్ధత గల వ్యక్తులు చెయ్యాల్సిన పనేనా?

      Delete
    2. >>మీకు స్వయాన వేదం చదివే పాండిత్యం లేదు
      I agree

      దేవనాగరి లిపిలో చదివి మరీ చర్చించాలనుకుంటే.. నాకు తెలిసి మనలో ఎవ్వరూ దానికి సరిపోరు. అలాగని లోకంలో వున్నది ప్రతిదాన్నీ సొంతగా చదివి తెలుసుకోని మాత్రమే మాట్లాడాలంటే.. అది జరిగే పని కూడా కాదు. ఎలాగైతే.. నేను భారతదేశ ఉత్తరాన్ని చూడకుండా, అక్కడ హిమాలయాలు వున్నాయని నమ్ముతున్నానో.. కొందరు పండితులు తెలుసుకొన్నవాటిని, అందులోని విషయాలు బయటపెట్టినప్పుడు.. వారి వారి ప్రావీణ్యత, పరిజ్ఞానం అధారంగా మనం నమ్మక తప్పదు. చిన్నయసూరి మనుమడు, హైదరాబాద్ బోరబండలో నివశించేవాడు(ఇప్పుడు తను ఎక్కడున్నారో తెలియదు). ఒక విషయమై మేము కలవాల్సి వొచ్చినప్పుడు.. వారు మాకు చెప్పిన మాటలివి.

      Delete
    3. ఈ కాలంలోగానీ, ఏకాలంలోగానీ.. వేదం నిజ గ్రంధాలు చదినవారు వున్నారా? అస్సలు వేదాలు మొట్టమొదటగా ఎప్పుడు, ఏభాషలో, ఎవరిచే, ఎక్కడ రాయబడ్డాయి? రాయడానికి ఉపయోగించిన సాధనాలేమిటి? ఇవి తెలిస్తే.. మన చరిత్రని ఇంకా బాగా అర్ధంచేసుకోవడానికి ఉపయోగపడచ్చు.

      Delete
    4. ఔను. మన చరిత్రను లేదా వేదాలను సక్రమంగా అర్ధం చేసుకోవడానికీ, భారతీయతను ఎవరికిష్టమొచ్చినట్లు వారు వాడుకోవడానికి , కలగాపులగం చేసి మేము చెప్పేదే వేదం.... అనే అహంకారపు ధోరణికి చెక్ పెట్టడానికి ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. దాశరధి రంగాచార్య గారు వేదాల గురించి పాజిటివ్ గా తెలుగులో అర్ధమయ్యేలా వ్రాశారని విన్నాను. రంగనాయకమ్మ గారు తనదైన శైలిలో విమర్శనాత్మకంగా చిన్నపుస్తకం వేదాలపై వ్రాశారు. రంగనాయకమ్మ బుక్ లో నెగెటివ్ అంశాలు మాత్రమే ఉన్నాయి.

      Delete
    5. అప్పుడు ఆరెండిటీనీ చదివి సత్యాన్ని తెలుసుకోవడానికి చేసుకోడానికి ప్రయత్నించాలి.

      Delete
    6. "Chiru Dreams October 30, 2021 at 3:37:00 PM GMT+5:30
      >>మీకు స్వయాన వేదం చదివే పాండిత్యం లేదు
      I agree"
      అన్న తర్వాత "దేవనాగరి లిపిలో చదివి మరీ చర్చించాలనుకుంటే.... వారు మాకు చెప్పిన మాటలివి." అనేది ఎంత అర్ధం లేని మాట?

      hari.S.babu
      I pity you to say"నేను భారతదేశ ఉత్తరాన్ని చూడకుండా, అక్కడ హిమాలయాలు వున్నాయని నమ్ముతున్నానో.. కొందరు పండితులు తెలుసుకొన్నవాటిని, అందులోని విషయాలు బయటపెట్టినప్పుడు.. వారి వారి ప్రావీణ్యత, పరిజ్ఞానం అధారంగా మనం నమ్మక తప్పదు."

      "ఒకవేళ ఇతరులు చేసిన అనువాదాన్ని ఇక్కడ పేష్టు చేస్తే ఆనువాదకర్త ఎవరు?" అని నేను అడిగింది ఇలాంటి కప్పదాటు జవాబుల కోసం కాదు.మీరు పేరు చెప్తే ఆ వ్యక్తి యొక్క పాండిత్యం ఎంతటిది అని తెలుసుకోగలిగున సమర్ధత నాకుంది.

      మీరు భారతదేశ ఉత్తరాన్ని చూడకుండా అక్కడ హిమాల్యాలు వున్నాయని ఎలా నమ్ముతున్నారు?మీరు నమ్మేటట్లు చెప్తున్న ఆ "కొందరు పండితులు" అబద్ధం చెప్తున్నారని ఎందుకు అనుకోకూడదు?చెప్పండి!

      Delete
    7. @Chiru Dreams October 31, 2021 at 9:54:00 AM GMT+5:30
      ఈ కాలంలోగానీ, ఏకాలంలోగానీ.. వేదం నిజ గ్రంధాలు చదినవారు వున్నారా? అస్సలు వేదాలు మొట్టమొదటగా ఎప్పుడు, ఏభాషలో, ఎవరిచే, ఎక్కడ రాయబడ్డాయి? రాయడానికి ఉపయోగించిన సాధనాలేమిటి?

      hari.S.babu
      రెడ్డొచ్చె మొదలాడు అన్నట్టు ఇప్పుడు ప్రశ్నలు వేస్తున్నారు?ఇవేవీ మీకు తెలియవా?తెలియకుండానే అన్ని సూత్రీకరణలు ఎలా చేశారు?"దేవనాగరి లిపిలో చదివి మరీ చర్చించాలనుకుంటే.. నాకు తెలిసి మనలో ఎవ్వరూ దానికి సరిపోరు. అలాగని లోకంలో వున్నది ప్రతిదాన్నీ సొంతగా చదివి తెలుసుకోని మాత్రమే మాట్లాడాలంటే.. అది జరిగే పని కూడా కాదు." అంటున్న మీ అజ్ఞానాన్ని చూస్తుంటే జాలి వేస్తుంది మీమీద.ఇంతకన్న పిచ్చిమాట నేనెక్కడా వినలేదు.సొంతంగా చదివి తెలుసుకుని మాట్లాడటం మీకు చాతకాదు గనక ఇంకెవరికీ చాత కాదా!

      ఒక్క ఋగ్వేదం మీద కొన్ని వందల మంది పరిశోధనలు చేశారు.మన దేశస్థులే కాదు విదేశీయులు సైతం సంస్కృతం నేర్చుకుని నాలుగు వేదాలను చదివి ఇంగ్లీషులోకి అనువాదం చేశారు.ఒక యూరోపియన్ పెద్దాయన ఒక్క 'అగ్నిమీళే పురోహితం' మంత్రం గురించే ఎన్నో విషయాలను చెప్తూ ఓ పుస్తకం రాశాడు.అట్లాంటిది ఇక్క మీరు "ఈ కాలంలోగానీ, ఏకాలంలోగానీ.. వేదం నిజ గ్రంధాలు చదినవారు వున్నారా?" అని అమాయకపు ప్రశ్న వేస్తున్నారు.

      "Chiru DreamsOctober 27, 2021 at 1:52:00 PM GMT+5:30" టైం స్టాంప్ దగ్గిర చూపించినవి నిజాలు కావు.ఎందుకంటే ఋగ్వేదంలోని ప్రధమ మంత్రం మొదలు అధర్వ వేదంలోని అంతిమ మంత్రం వరకు ఏ రెండు మంత్రాలూ ఒకదానికి ఒకటి విరుద్ధమైన భావాలను చెప్పవు.ప్రాచ్య పాశ్చాత్య విద్వాంసులు బల్ల గుద్ది చెప్తున్న మాట అది.ప్రాచ్య పాశ్చాత్య విద్వాంసులు అనువదించిన ఏ అధికారికమైన అనువాదమూ వేదాలు గోభక్షణను సమర్ధిస్తున్నట్టు చూపించడం లేదు. ఆవునే కాదు, అసలు ఏ జంతువునీ వధించమని వేదం చెప్పడం లేదు.

      పుట్టుకతోనే ఎవ్వరూ జ్ఞానులు కారు.నా జ్ఞానమూ పరిమితమే!కానీ, నేను నిన్నటి రోజున తెలియనిది ఇవ్వాళ తెలుసుకుంటూ ఇవ్వాళ తెలియనిది రేపటి రోజున తెలుసుకోవాలనే జిజ్ఞాసతో ఎదుగుతున్నాను.మీకు జిజ్ఞాస ఉంటే తెలుస్తాయి!ఆర్య సమాజం వారి శాఖల వద్ద నాలుగు వేదాలకూ అర్ధ తాత్పర్య సహితమైన అనువాదాలు దొరుకుతాయి, ప్రయత్నించండి.లోకంలోని ప్రతిదాన్నీ అందరూ తెలుసుకోలేరు.కానీ, తెలియని దాన్ని గురించి తెలిసినట్టు మాట్లాడకూడదు.ఇతరులకు మనం చెయ్యగలిగిన గొప్ప సహాయం మనకు తెలిసిన నిజాన్ని చెప్పడమే.ఇతరులకి నచ్చుతుంది అనిపించినా సరే అబద్ధం చెప్పకూడదు.

      జై శ్రీ రాం!

      Delete
    8. >>మీ అజ్ఞానాన్ని చూస్తుంటే జాలి వేస్తుంది

      సరే! ఋగ్వేద మంత్రాలూ.. శ్లోకాలు అన్నీ తీకా తాత్పర్యాలతో చెప్పగలిగిన మీ విజ్ఞానంతో నేనడిగిన ప్రశ్నకి జవాబు చెప్పండి. ప్రశ్న మళ్ళీ ఇస్తున్నాను:

      ఈ కాలంలోగానీ, ఏకాలంలోగానీ.. వేదం నిజ గ్రంధాలు చదినవారు వున్నారా? అస్సలు వేదాలు మొట్టమొదటగా ఎప్పుడు, ఏభాషలో, ఎవరిచే, ఎక్కడ రాయబడ్డాయి? రాయడానికి ఉపయోగించిన సాధనాలేమిటి?

      కొండలరావు గారు చెప్పినట్లు "మేము చెప్పిందే వేదం" అనకుండా.. వేదాల చరిత్రను చెప్పండి. తర్వాత అవేం చెప్పావో ఆలోచిద్దాం.

      Delete
    9. @Chiru DreamsNovember 2, 2021 at 11:18:00 PM GMT+5:30
      >>మీ అజ్ఞానాన్ని చూస్తుంటే జాలి వేస్తుంది

      సరే! ఋగ్వేద మంత్రాలూ.. శ్లోకాలు అన్నీ తీకా తాత్పర్యాలతో చెప్పగలిగిన మీ విజ్ఞానంతో నేనడిగిన ప్రశ్నకి జవాబు చెప్పండి. ప్రశ్న మళ్ళీ ఇస్తున్నాను....?
      hari.S.babu
      రెడ్డొచ్చె మొదలాడు అన్నట్టు ఇప్పుడు ప్రశ్నలు వేస్తున్నారు?ఇవేవీ మీకు తెలియవా?తెలియకుండానే అన్ని సూత్రీకరణలు ఎలా చేశారు?

      Delete
    10. Dear blogger! Shall we end it here since we can't expect any reasonable answer for this post?

      Delete
    11. మీరు ఎంత అజ్ఞానంలో ఉన్నారో మీకు తెలియడం లేదు.

      "ఇది సత్యం పట్ల నిబద్ధత గల వ్యక్తులు చెయ్యాల్సిన పనేనా?" అని ప్రశ్నించేముందు మీరు చేశారని నేను లిస్టు చదివిన పనుల్లో ఏదీ సత్యం పట్ల నిబద్ధత గలవాడు చెయ్యాల్సినది ఒక్కటి కూడా లేదు.

      మీకు సత్యం పట్ల నిబద్ధత లేదు గనకనే ఆ పనులు చేశారు అని దాని అర్ధం.

      అది మీకు అర్ధం కాక ">>మీకు స్వయాన వేదం చదివే పాండిత్యం లేదు
      I agree" అని మీరు చెప్పిన జవాబుతో చర్చ కొనసాగించడం ఆనవ్సరం అని తేలిపోయింది.ఎందుకంటే, ఇద్దరి మధ్యన జరిగే చర్చలో ఏ ఒక్కరి ప్రతిపాదనని రెందవ వ్యక్తి ఒప్పుకుంటే అక్కడితో ఆ ప్రతిపాదన చేసిన వ్యక్తి విజేత అయి చర్చ ముగిసిపోతుంది, ముగిసి పోవాలి.తప్పదు!ప్రశ్న-జవాబు అనే జంటల కింద వేరుపడుతున్న చర్చలో ఒకరు వేసిన ప్రశ్నకి ఇంకొకరు ఇచ్చిన జవాబు సరిపోతే ప్రతిస్పర్ధికి వెయ్యాల్సిన ప్రశ్నకి అవకాశం ఉండదు కదా!

      నేను ఇక్కడికి వచ్చిన పని పూర్తయిపోయింది.అవెదాల్లో గోమాంసభక్షణని సమర్ధించే మంత్రాలు ఉన్నాయని మీరు చేస్తున్న వాదనని అబద్ధం అని రుజువు చేశాను.అయినప్పటికీ సభామర్యాద కొద్దీ మీరు అడిగిన ప్రశ్నలాలో ముఖ్యమైన వాటికి జవాబులు చెప్పాను.

      కానీ, మీరు నేను అడిగిన ప్రశ్నలకి జవాబులు చెప్పడం లేదు,సరిగ్గా మీరు అబద్ధం చెప్పినట్టు ఒప్పుకోవాల్సిన సమాయానికి దాన్ని వదిలేసి కొత్త ప్రశ్నలు వేస్తున్నారు.అసభ్యమైన భాషని కొండల రావు గారు ఉపయోగించనివ్వడం లేదు గనక మీకు అలవాటైన ట్రోలింగునే సభ్యాతాయుతమైన భాషలో చేస్తున్నారు.ఎంత గడుసుదనమో!

      "శ్రద్ధా వాన్ లభతే జ్ఞానం!" అనేది అక్షర సత్యం.నాకు తెలిసిన నిజాలు నాకున్న శ్రద్ధ వల్లనే తెలిశాయి."పుట్టుకతోనే ఎవ్వరూ జ్ఞానులు కారు.నా జ్ఞానమూ పరిమితమే!కానీ, నేను నిన్నటి రోజున తెలియనిది ఇవ్వాళ తెలుసుకుంటూ ఇవ్వాళ తెలియనిది రేపటి రోజున తెలుసుకోవాలనే జిజ్ఞాసతో ఎదుగుతున్నాను.మీకు జిజ్ఞాస ఉంటే తెలుస్తాయి!ఆర్య సమాజం వారి శాఖల వద్ద నాలుగు వేదాలకూ అర్ధ తాత్పర్య సహితమైన అనువాదాలు దొరుకుతాయి, ప్రయత్నించండి." అని అంత సూటి జవబు చెప్పాక కూడా "సరే! ఋగ్వేద మంత్రాలూ.. శ్లోకాలు అన్నీ తీకా తాత్పర్యాలతో చెప్పగలిగిన మీ విజ్ఞానంతో నేనడిగిన ప్రశ్నకి జవాబు చెప్పండి. ప్రశ్న మళ్ళీ ఇస్తున్నాను" అనటం ఏంటి?

      "లోకంలో వున్నది ప్రతిదాన్నీ సొంతగా చదివి తెలుసుకోని మాత్రమే మాట్లాడాలంటే.. అది జరిగే పని కూడా కాదు." అంటున్న మీరు "వేదాల చరిత్రను చెప్పండి. తర్వాత అవేం చెప్పావో ఆలోచిద్దాం." అంటుంటే నవ్వొస్తుందండి!

      ఇతరుల నుంచి మీ ప్రశ్నలకి జవాబులు ఆశించటం ఒక్కటే కాదు ఇతరులు అడిగిన ప్రశ్నలకి జవాబులు కూడా చెప్పాలి మీకు సత్యం పట్ల నిబద్ధత ఉంటే!

      అది మీకు లేదు గనకనే మీకు తెలిసి ఉంటే మీరు తెలుసుకుంటే ఇక్కడి చర్చలో గెలవటానికి పనికొచ్చే ప్రశ్నల్ని "సరే! ఋగ్వేద మంత్రాలూ.. శ్లోకాలు అన్నీ తీకా తాత్పర్యాలతో చెప్పగలిగిన మీ విజ్ఞానంతో నేనడిగిన ప్రశ్నకి జవాబు చెప్పండి. ప్రశ్న మళ్ళీ ఇస్తున్నాను" అంటూ నాకు వేస్తున్నారు.

      జై శ్రీరాం!
      P.S:ఇక్కడ నేను hari.S.babu November 2, 2021 at 8:36:00 PM GMT+5:30 టైం స్టాంప్ దగ్గిర వేసిన కామెంటుతోనే అసలు చర్చ ముగిసిపోయింది గనుక కొత్త కామెంట్లను ఆపివేస్తే బాగుంటుందని కొండల రావు గారికి సూచిస్తున్నాను.

      Delete
    12. తెలియనిదాన్ని "తెలియదు" అని ఒప్పుకోవడం విజ్ఞుల లక్షణం. స్వయంగా మాత్రుక నేనుచదవలేదు.. ఆ భాషలో దొరికినా చదివేంత పాండిత్యం ఆభాషలో నాకు లేదని నాకు బాగా తెలుసు. మీరు మాత్రుకమారమే చదివి.. అప్పటి భాషని ఆకలింపుచేసుకోని మాత్రుకల్లో ప్రజ్ఞా పాటవాలు కలిగున్నారేమొ అని నాకు అనిపించింది(మీ మొదటి సమాధానం ద్వారా). అందుకే విజ్ఞానవనంతులైన, అతి పురాతన భాషల్లో ప్రావీణ్యులైన మీకు... వేదాల పుట్టుపూర్వోత్తరాలు ఖ్చ్చితంగా తెలిసేవుండివుంటాయని అజ్ఞానులైన మానదరిపాఠకులతరుపునా.. "వాటి పుట్టుపూర్వొత్తరాలగురించి చెప్పండి" అంటూ అభ్యర్దించాను.

      "రెడ్డోచ్చే మొదలాడే.. చిటారుకొమ్మన మిఠాయిపొట్లం... చికుచికుపుల్లా.." అంటూ.. మీ అతిపురాతనవిజ్ఞానాన్ని.. అత్యంత అల్పులైన మాఠకులకి తెలియకుండా దాచిపెట్టుకున్నారు. "సరే! మరోసారి అడిగితే పొయేదేముందీ. మీరు దయదలిస్తే ప్రపంచంలోనే అత్యంత పురాతనవిద్యని మీరు దాచుకున్న విజ్ఞానం అందరికీ తెలిసిపోవొచ్చు" అనుకోని, మరొక్కసారి "పల్లెప్రపంచం" పాఠకులతరుపున మిమ్మల్ని అభ్యర్ధించాను. ఐనా మీ మనసు కరగలేదు.

      మొట్టమొదట రాతపూర్వకంగా ఈ ప్రపంచానికి ఇవ్వబడిన వేదాలని.. వాటి మాతృకలోనే చదవిన మీ భాగ్యాన్ని అభినందిస్తూ.. ఏదో... అనువాదాలూ.. వాటిని చదివినాకు వినిపించిన పండితులూ చెప్పినవాటిని విని, అదే విజ్ఞానమని భ్రమపడిన నేను.. నా ఓటమిని ఒప్పుకుంటున్నాను.

      P.S: "నాకు సరైన సమాధానం రావట్లేదు కాబట్టి ఇక ఈ పోష్టును ఆపేద్దాం కొండలరావుగారూ!" అంటూ మీకు ఒక అభ్యర్ధనపెట్టాను. ఇది డ్యూయల్ రోల్ సినిమాకాదుకాబట్టి.. ఒక్కరికిమాత్రమే హీరో చాన్సుఇవ్వలికాబట్టి, హరిబాబుగారి కామెంటుమాత్రమే ప్రచురింపబడిన విధానాన్ని అర్ధంచేసుకోగలను. అత్యంత పురాతనభాషల్లో ప్రావీణ్యం వున్న హరిబాబుగారి విజయాన్నీ, అనువాదాలు మాత్రమే చదువుకోని తృప్తిపదే నా ఓటమిని ఒప్పుకుంటున్నాను.

      Delete
    13. మీ అభిప్రాయం ను మీరు వెల్లబుచ్చవచ్చును కానీ, నా అభిమతంగా రుద్దడం కరెక్టు కాదు. అయినా వేదాలలో గో భక్షణకు సంబంధించి ఒరిజినల్ గా ఏముందన్నది తేల్చలేదెవరూ. నాకు తెలిసినమేరకు వేదాలకు సంబంధించి గో భక్షణ తప్పుగా చెప్పలేదన్నదే. రుషులు కూడా యాగాల సమయంలో గో మాంసం భుజించేవారని విన్నాను. అయితే ఒరిజినల్ విషయం తెలిసినవారు మాత్రమే దీనిని తేల్చాలి.

      Delete
  2. కొండల రావు గారికీ పల్లె ప్రపంచం సభ్యులకీ ప్రజ వీక్షకులకీ దీపావళి శుభాకాంక్షలు!

    ReplyDelete
    Replies
    1. కొండల రావు గారూ!

      Chiru Dreams November 3, 2021 at 4:13:00 PM GMT+5:30
      Dear blogger! Shall we end it here since we can't expect any reasonable answer for this post? అనే కామెంటు యొక్క అర్ధం ఏమిటి?

      ఇక్కడ జరుగుతున్నది ఏమిటో అర్ధం కావడం లేదు నాకు!ఇదే వేదిక వద్ద మీకు ఇటువంటి చర్చలకి అద్యక్ష స్థానం వహించే అర్హత లేదని ంకుండబద్దలు కొట్టి చెప్పాను.ఇక్కడ ఈ కామెంటు కనబడటం అంతే మీరిద్దరూ కలిసి నన్ను అవమానించడమే.

      ఎందుకో తెలుసా!

      పోష్టులో ఉన్నది "వేదాల్లో గోభక్షణ వుందా? ఉంటే అది తప్పు ఎప్పుడయ్యింది?" అనే ఒక్క ప్రశ్న మాత్రమే.దానికి జవాబు చెప్పదానికి నేను ఇక్కడికి రాలేదు."Chiru DreamsOctober 27, 2021 at 1:52:00 PM GMT+5:30 Rig Veda (X.72.6) it appears that .... used for an ox, which is capable to produce semen." అనే కామెంటును మాలిక కామెంట్ల సెక్షనులో చూసి వచ్చాను.hari.S.babuOctober 27, 2021 at 11:23:00 PM GMT+5:30 "గో" అనే వైదిక భాషా పదానికి ఎన్ని పర్యాయ పదాలు ఉన్నాయో మీకు తెలుసా?ఆ పదానికి మీకు తెలిసిన పర్యాయపదాలను కొన్నింటిని ఇక్కడ చెప్పగలరా!...ఇది సత్యం పట్ల నిబద్ధత గల వ్యక్తులు చెయ్యాల్సిన పనేనా అనే కామెంటులో నేను ఏ ప్రతిపాదననీ చెయ్యలేదు. అతనికే అతను అక్కడ ఉటంకించినవి అధికారికమీన వేదసంహితలలోనివే అనడానికి సాక్ష్యం ఉందా అని ప్రశ్న వేశాను.అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ప్రశ్నకి జవాబు ఇవ్వనిది అతను.

      "మీరు భారతదేశ ఉత్తరాన్ని చూడకుండా అక్కడ హిమాల్యాలు వున్నాయని ఎలా నమ్ముతున్నారు?మీరు నమ్మేటట్లు చెప్తున్న ఆ "కొందరు పండితులు" అబద్ధం చెప్తున్నారని ఎందుకు అనుకోకూడదు?" అన్న ప్రశ్నకీ జవాబు లేదు!

      "రెడ్డొచ్చె మొదలాడు అన్నట్టు ఇప్పుడు ప్రశ్నలు వేస్తున్నారు?ఇవేవీ మీకు తెలియవా?తెలియకుండానే అన్ని సూత్రీకరణలు ఎలా చేశారు?" అన్న ప్రశ్నకీ జవాబు ఇవ్వలేదు!

      చర్చలో ఒకరు ఏదైఉనా ప్రతిపాదాన్ చేస్తే ఇతరులు దానిమీద ప్రశ్నలు వేస్తారు.ప్రతిపాదాన్ చేర్సున వ్యక్తి మొదట ఆ ప్రశ్నకు జవాబు చెప్పాలి.తర్వాతనే ప్రశ్న వేసిన వ్యక్తి ఏదైన ప్రతిపాదాన్ చేసి ఉంటే దానిమీద ప్రగానీ లేక తనే చర్చకు సంబంధించిన విషయం మీద అవతలి వ్యక్తిని ప్రశ్నలు వెయ్యాలి.ఇక్కడ ఏ ప్రతిపాదనా నేను చెయ్యలేదు.తాంకి వేసిన ప్రశ్నలకి జవాబులు చెప్పని తను తిరిగి సరైన సమాధానాలు ఇవ్వడం లేదని నన్ను బ్లేం చెయ్యడం ఏంటి?

      వాస్తవం ఇలా ఉంటే మోదరేసన్ పెట్టి కామెంటును చదివి ప్రచురిస్తున్నప్పుడు ఆ కామెంటు ఇక్కడ కనబడటం అంటే ఆ వ్యాఖ్యతో మీరు కూడా ఏకీభవిస్తున్నట్టేనని అనుకుంటున్నాను నేను.

      అసలు "ఇది డ్యూయల్ రోల్ సినిమాకాదుకాబట్టి.. ఒక్కరికిమాత్రమే హీరో చాన్సుఇవ్వలికాబట్టి, హరిబాబుగారి కామెంటుమాత్రమే ప్రచురింపబడిన విధానాన్ని అర్ధంచేసుకోగలను." అనే యేడుపు మిమ్మల్ని బ్లేం చెయ్యటం కాదా?మీరు తన అడ్రసు అడిగితే ఎవడిదో అడ్రస్ ఇచ్చి మీకు చెవిలో పువ్వులు పెట్టిన వెకిలితనం కూడా మీకు హుందాతనంలా కనపడుతున్నదా?

      ప్రతి అడ్డగాడిదా అర్ధం పర్ధం లేని కామెంట్లు వేస్తే అవన్నీ వేసెయ్యాలా మీరు?తన కామెంట్ల వల్లే ప్రజకి పాప్యులారిటీ వచ్చేసిందని డప్పాలు కొట్టుకుంటూ వెయ్యకపోతే "నా కామెంట్లు వెయ్యట్లేదు,హరిబాబు కామెంట్లు మాత్రమే వేస్తున్నారు" ఆని యేడ్చేవాళ్ళని ఎంటర్టెయిన్ చెయ్యాల్సిన అవసరం మీకేంటి?ఆ కామెంటును ప్రచురుంచడం అంటే తను కాదు మీరే నన్ను అవ్మానించ్జినట్టు అవుతుంది!

      ఇప్పుడు మీరు చెయ్యాల్సినది ఒకటే - "hari.S.babu
      రెడ్డొచ్చె మొదలాడు అన్నట్టు ఇప్పుడు ప్రశ్నలు వేస్తున్నారు?ఇవేవీ మీకు తెలియవా?తెలియకుండానే అన్ని సూత్రీకరణలు ఎలా చేశారు?" కామెంటు తర్వాత పడిన అన్ని కామెంట్లనీ డెలిట్ చెయ్యండి,}Chiru DreamsNovember 3, 2021 at 4:13:00 PM GMT+5:30Dear blogger! Shall we end it here since we can't expect any reasonable answer for this post? నుంచి పల్లా కొండల రావు November 5, 2021 at 10:28:00 PM GMT+5:30మీ అభిప్రాయం ను మీరు వెల్లబుచ్చవచ్చును .... విషయం తెలిసినవారు మాత్రమే దీనిని తేల్చాలి.} వార్కు నేంబు వేసిన కామెంట్లతో సహా అన్నిట్నీ తొలగించడం ఒక్కటే సరైన పని.

      Delete
    2. కొండల రావు గారూ!
      మీరు కూడా అతను చెసిన తప్పునే చేస్తున్నారు.

      మీ వాక్యం ఒకటి:వేదాలలో గో భక్షణకు సంబంధించి ఒరిజినల్ గా ఏముందన్నది తేల్చలేదెవరూ.

      నా ప్రశ్న ఒకటి:ఎవరూ తేల్చలేదని మీకెలా తెలుసు?కనీసం దాశరధి అరంగాచార్య అనువాదం కూడా స్వయాన చదవకుండానే ఎవరూ తేల్చలేదని ఎట్లా అంటున్నారు?ప్రపంచ స్థాయిలో ఎంతోమంది వేదం మీద పరిశోధనలు చేశారు.వారి వారి మాతృభాషల్లోకి అనువాదాలు చేసుకున్నారు.వాళ్ళంతా మీ ముందుకొచ్చి చెప్తేనే మీకు తెలిస్తేనే వేదాలలో గో భక్షణకు సంబంధించి తేల్చి చెప్పేసినట్టు అవుతుందా?

      నా ప్రశ్న రెండు:"వేదాలకు సంబంధించి గో భక్షణ తప్పుగా చెప్పలేదన్నదే" అని కూడా ఖండితంగా చెప్పలేక "నాకు తెలిసినమేరకు" అని ఎందుకు కప్పదాటు మాటని వాడుతున్నారు?

      వేదాలు గోభక్షణని నిషేధించలేదు, ప్రోత్సహించాయి అనే ప్రతిపాదన మీరు చేస్తున్నప్పుడు దానికి సాక్ష్యాలు ఉన్నాయో లేవో చూసుకోవటం మీ బాధ్యతయే కదా, మరెందుకు మీకు తెలియని విషయం గురించి ప్రతిపాదన చేసి సాక్ష్యాలు మమ్మల్ని అడుగుతున్నారు?

      నా మడవ ప్రశ్న:"రుషులు కూడా యాగాల సమయంలో గో మాంసం భుజించేవారని విన్నాను." అని సరిపెట్టెస్తే ఎలా?ఎక్కడ విన్నారు?ఎప్పుడు విన్నారు?ఎవరి నోట విన్నారు?

      మీ నాల్గవ వాక్యం:అయితే ఒరిజినల్ విషయం తెలిసినవారు మాత్రమే దీనిని తేల్చాలి.

      నా ప్రశ్న:అసలు ఎవరు ఎవరికి వేదాల్లో గోభక్షణ ఉందని తేల్చి చెప్పాలి?వేదం హిందువులకి మాత్రమే ప్రామాణిక గ్రంధం.ఒక్క హిందువులే కాదు ఐన్స్టీన్,father of the atomic bomb లాంటివాళ్ళు కూడా నిత్యం చదివేది గీత.అందులో చాలా చోట్ల ఇక్కడ నేను చెప్పిన వాటిలో నీకు వచ్చిన సందేహాల్ని శాస్త్రం తీరుస్తుంది అని ఉంటుంది.అక్కడ శాస్త్రం అన్నది వేదం గురించే.

      హిందువులకి ఒక్క వేదమే ప్రమాణం.మిగిలిన వేదశాస్త్రాలలో గానీ పురాణాలలో గానీ ఉపనిషత్తులలో గానీ వేదం చెప్పిన సత్యాలకు విరుద్ధమైనవి ఉంటే వాటినీ అనుసరించాల్సిన అవసరం లేదనేది హిందువైన ప్రతి ఒక్కరికీ తెలుసు.

      మరి, అంత ప్రాధాన్యత ఉన్న వేదం గనక గోభక్షణని ప్రోత్సహిస్తే మీ దగ్గిర దాచిపెట్టాల్సిన అవసరం మాకేంటి?"మా వేదం తినమన్నది, తింటున్నాం!" అని చెప్తే మీరు అభ్యంతరం చెప్పగలరా?అలా అభ్యంతర పెట్టే హక్కు మీకే కాదు, ఎవరికీ లేదు, అవునా?ఇంక వేదాల్లో మాంసభక్షణ కానీ గోభక్షణ కానీ ఉందా లేదాని రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు,దశాబ్దాల పాటు చర్చించి ప్రయోజనం ఏమిటి?

      ఇక, ఆ వేదాన్ని ప్రమాణం కింద తీసుకుని అనుసరించాలనే లక్ష్యం లేనివాళ్ళకి వేదం గోభక్షణని సమర్ధించిందా వ్యతిరేకించిందా అనేది అవసరమా?ఒకవేళ తెలుసుకుని నచ్చితే అనుసరించాలనే ఉద్దేశం ఉంటే ఆర్యసమాజం వాళ్ళ శాఖని వెతుక్కుని పోయి చదివి తెలుసుకోండి.

      జై శ్రీ రాం!

      Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top