మతం అనేది వ్యక్తిగత విశ్వాసాలకు సంబంధించినది. వివిధ మత విశ్వాసాలమధ్య ఘర్షణలు లేకుండా రాజ్య లేదా రాజకీయ విషయాలలో మత ప్రసక్తి లేకుండా ఉండడం లౌకికవాదం అవుతుంది. రాజకీయాలకు మతాన్ని వాడుకోవడం మతపరమైన ఘర్షణలు చోటుచేసుకోవడం , ప్రజలను కూడా అలా వేరు చేసి చూడడం విజ్ఞానవంతుల్లోనూ ఉండడం దురదృష్టకరమే. అలాగే ఓ వర్గం మతోన్మాదానికి పాల్పడుతుందంటూ మరో వర్గంపై అవసరానికి మించిన సానుభూతి ప్రకటించడమూ జరుగుతోంది. ప్రజలను మతపరంగా విభజించి చూడడం వారిని తమ స్వార్ధ రాజకీయాలకు వాడుకోవడం, బలి చేయడం అనేది ఓటుబేంక్ రాజకీయాలలో నిత్యం పెరుగుతున్నది. ఈ వైఖరి దేశప్రయోజనాలకు, సమాజ భద్రతకూ ఆటంకం కలిగించే అంశాలు.
ఏది మతోన్మాదం - ఏది కుహనా లౌకికవాదం నిర్వచించడమెలా?
వీటివల్ల సమాజానికి కలిగే ప్రమాదం పై మీ అభిప్రాయం?
ఈ నేపధ్యంలో రాజకీయాలలో మతం జోక్యం తగ్గాలన్నా, మతోన్మాదం - కుహనా లౌకికవాదం రెండింటి మధ్యా ప్రజలు బలికాకుండా ఉండాలన్నా చేయాల్సినది ఏమిటి? ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటి?
-: పల్లా కొండల రావు.
------------------------------------*Re-published
మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
kondalarao.palla@gmail.com
మతం విషయంలో ఒక పార్తీ వైఖరి ఏమిటి అనే దాని కంటే ఆ పార్తీ ఆర్థిక విధానం ఏమిటి అనేది ఇక్కడ చూడాలి. బి.జె.పి. విదేశీ సంస్కృతిని వ్యతిరేకిస్తుంది కానీ విదేశీ పెట్టుబడులని వ్యతిరేకించదు. గుజరాత్‌లోని స్కూల్ పుస్తకాలలో పుట్టిన రోజు నాడు కేక్ కొయ్యకూడదు అని బోధించే పాఠాలు ఉన్నాయి కానీ ఆ రాష్ట్రం నుంచి వచ్చిన బి.జె.పి. నాయకుడు నరేంద్ర మోదీ విదేశీ పెట్టుబడులని బహిరంగంగా సమర్థిస్తున్నాడు. కాంగ్రెస్ 1991 నుంచి తాము గ్లోబలైజేషన్‌కి అనుకూలం అని చెప్పుకుంటోంది కానీ బి.జె.పి.లాగ నాటకాలు మాత్రం ఆడలేదు, సిక్కుల ఊచకోత విషయంలో తప్ప.
ReplyDeleteనాకు చాలా కాలం నుండి తెలుసుకోవాలనుకుంటున్న ఓ ప్రశ్న? విదేశీ సంస్కృతినీ వ్యతిరేకించడానికీ-విదేశీ పెట్టుబడులను వ్యతిరేకించడానికీ తేడా లేదా? అవి రెండూ ఒకటి ఎలా అవుతాయి?
Deleteవిదేశీ పెట్టుబడిదారులు మనకి దేశ కరెన్సీ విలువ తగ్గించుకోవాలాని ఆదేశించి, అలా చేస్తేనే మన దేశంలో పెట్టుబడులు పెడతామంటారు. విదేశీ పెట్టుబడుల వల్ల దేశానికి నష్టమే కానీ విదేశీ సంస్కృతి వల్ల నష్టం లేదు. భా.జ.పా.వాళ్ళకి విదేశీ పెట్టుబడులు కావాలి కానీ విదేశీ సంస్కృతి మాత్రం వద్దట!
Deleteమతోన్మాదం:
ReplyDeleteఒక మతమే సర్వోత్కృష్టమైనదని కొంతమంది భావిస్తూ ఆ మతం యొక్క నియమ నిబంధనలకు నయానో భయానో సాధికారత, చట్టబద్ధత కల్పించాలని ప్రయత్నిస్తూ, తద్వారా ఇతర మతాలయొక్క ఆచార వ్యవహారాలను, నమ్మకాలను అణగదొక్కే ప్రయత్నం.
కుహనా లౌకికవాదం:
సంకుచిత రాజకీయ ప్రయోజనాలకోసం లౌకిక వాదానికి తూట్లు పొడుస్తూ మైనారిటీగావున్న మతానికి అవసరానికన్నా ఎక్కువ లబ్ది చేకూర్చేవిధంగా ఆ మతం యొక్క తర్కవిహిత ఆచార వ్యవహారాలకు సాధికారత, చట్టబద్ధత కల్పించే ప్రయత్నం.
కలిగే ప్రమాదం:
పై రెండు ప్రయత్నాల వల్లా, మతాల మధ్య అపనమ్మకాలు పెరిగి, సామరస్యత నశించి అంతర్యుద్ధాలు లేదా మత తీవ్రవాదం చెలరేగే అవకాశం.
శ్రీకాంత్ చారి గారు మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను.
Deleteశ్రీకాంత్ చారి గారు మీ అభిప్రాయంతో నేను కూడా ఏకీభవిస్తున్నాను.
Deleteశ్రీకాంత్ చారి గారూ, చాలా బాగా చెప్పారు! రెంటికీ మీరిచ్చిన నిర్వచనాలు అద్భుతంగా వున్నాయి.
DeleteVery well said
Deleteఈ దేశ చరిత్రలోని కొన్ని అనివార్యతలు నన్ను చాలా బాధ పెడుతున్నాయి.అనివార్యత అంటే ఒకటి - ముఖ్యంగా హాని చేసే దుస్సంఘటన - జరగబోతుందని తెలిసినా ఆపలేని నిస్సహాయత! యెందుకొస్తుంది?ఒకటి మనకి హాని కలిగిస్తుందనీ దాన్న్ని వొదిలేస్తే మంచి జరుగుతుందనీ తెలిసినాసరే వొదలకుండా గట్టిగా పట్టుకుని ఒక విధ్వంసం యెదురయ్యే వరకూ అకర్మణ్యంగా వుండిపోతున్నాం.మొదటిసారి జరిగినప్పుడు దాని నుంచి నేర్చుకుంటే రెండవసారి జరగ్కుండా ఆపవచ్చు, కానీ నేర్చుకునే చురుకుదనం మనలో లేనట్లుంది?!
ReplyDeleteదారా షికో - గొప్ప పండితుడు, సజ్జనుదయిన ప్రభువు.మన భారతీయ సాంప్రదాయం పట్ల గౌరవాదరాలు వుండి మన సాహిత్యాన్ని పారసీ భాషలోకి తర్జుమా చేసి ప్రపంచాని కందించాలని కలలు గన్న దార్శనికుడు.ఔరంగజేబు - ఈ దేశాన్ని యెంత దుర్మార్గమయిన పధ్ధతిలో నైనా సరే తనకు నచ్చిన మతానికి అంటుగట్టాలని చూసిన సంకుచిత మనస్తత్వం గలవాడు.వీరిద్దరి మధ్యనా అధికార మార్పిడికి పట్టిన ఆ అయిదు నిముషాల కాలం హిందువులూ ముస్లిములూ అన్యోన్యంగా కలిసి వుండి వుండేవాళ్లేమో అని అనుకోవాల్సిన జరగని భవిష్యత్తు నుంచి ఇవ్వాళ మనం చూస్తున్న ఈర్ష్యా ద్వేషాలతో రక్తపుటేరులు పారించుకుంటున్న పరిస్థితి దాపరించింది!?
Pls raeda full artikil at : http://harikaalam.blogspot.in/