ఉన్న ఊరునీ, కన్న తల్లినీ మరచిపోకూడదంటారు. "జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ" అన్నారు.
పల్లెటూరి గొప్పతనాన్ని చాటేందుకు, పల్లెల్లో అజ్ఞానాన్ని పారద్రోలేందుకు, నా వంతుగా పాటు పడేందుకు ఈ బ్లాగును ఉపయోగిస్తాను.
భారత దేశం యొక్క ఆత్మ పల్లెల్లో ఉందని మహాత్ముడంటే, పెట్టుబడిదారీ విధానాలతో మార్కెట్ విస్తరణకు - మార్కెట్ సౌకర్యానికి మాత్రమే పట్టణాలు వచ్చాయి తప్ప, మానవత్వపు విలువలు పల్లెల్లోనే ఉంటాయని కారల్ మార్క్స్ అన్నాడు.
వాస్తవంగా పల్లెలే ప్రగతికి, శ్రమకు, మానవత్వపు విలువలకు ప్రతి రూపాలు.
అలాంటి పల్లెలు ప్రపంచీకరణ నేపధ్యంలో విలువలు కోల్పోతున్నాయి. ఇతర ఇక్కట్లకు గురవుతున్నాయి.
పల్లెలు వెనుకబాటుకు శ్రమదోపిడీ ఓ కారణమైతే - అజ్ఞానం మరో కారణం.
పల్లెల్లో అజ్ఞానాన్ని పారద్రోలితే భారత దేశాన్ని మరింత శక్తివంతమైన దేశంగా, అత్యున్నతమైన మానవ వనరులున్న దేశంగా మనం తయారు చేయొచ్చు.
భారతీయ సంస్కృతినీ, విలువలను మనం కాపాడాలంటే పల్లె సంస్కృతిని కాపాడాలి. పల్లెలనుండి మేధావుల వలసలను ఆపాలి.
ప్రభుత్వాలతో పాటు ప్రతి ఒక్కరూ ఆ దిశగా కృషి చేయాల్సి ఉంది.
పల్లె సంస్కృతిని కాపాడే ప్రయత్నంతో పాటు, పల్లెప్రపంచం విజన్ కార్యక్రమాలను మీతో పంచుకునేందుకు ఈ బ్లాగును ఉపయోగిస్తాను.
పల్లెల అభివృద్ధికీ, పల్లెల్లో అజ్ఞానాన్ని పారద్రోలేందుకు, పల్లెలనుండి మేధావుల వలసలను ఆపేందుకూ మీ వంతు సలహాలివ్వండి.
మీకు తెలిసి పల్లెల అభివృద్ధికీ లేదా జన్మభూమికీ సేవలు అందిస్తున్నవారి వివరాలు తెలిపితే ఈ బ్లాగులో వారి వివరాలను ఉంచుతాము. అందరికీ స్పూర్తినిచ్చేందుకు ఈ బ్లాగు ద్వారా కూడా ఓ ప్రయత్నం చేసేందుకు సహకరించాలని విజ్ఞప్తి.
పల్లెప్రపంచం లేబుల్ ద్వారా పల్లెప్రపంచం విజన్ గురించి , ఆచరణకు సంబంధించిన కార్యక్రమాలను కూడా పోస్టులుగా వ్రాయడం జరుగుతుంది.
చాలా మంచి ప్రయత్నమండి.గాంధీ గారి గ్రామ స్వరాజ్యం అయినా,పల్లెలు బలంగా తయారుకావాలని కలాంగారు చెప్పినా అందు కనుగుణమయిన వ్యవస్థ ఏర్పడి ప్రణాలికలు తీసుకు రావాలండి.మీ ఆలోచనావిధానం స్పూర్తిదాయకం.
ధన్యవాదములు రవిశేఖర్ గారు. మీరన్నట్లు గాంధీ - అబ్దుల్ కలాం లాంటి వాళ్ల కలలు కలలుగానే ఉంటున్నాయి. వ్యక్తులంగా మనం కొంతమేరకు చేయగలం. ప్రభుత్వం లేదా ప్రజలంతా కలసి ఉద్యమిస్తే తప్ప గ్రాంస్వరాజ్యం అందుబాటులోకి వచ్చే పరిస్తితి లేదు. వ్యక్తిగతంగా నా వంతుగా కొంత ప్రయత్నం చేస్తాను.
మీ ప్రయత్నం కి మనః పూర్వక అభినందనలు. ఈ బ్లాగ్ విజవంతం అయితే.. మన పల్లె బతికినట్లే! కేవలం జ్ఞాపకాలు మాత్రమే కాకుండా.. ఇప్పుడు పల్లె స్థితి ఎలా ఉంది..మనం ఏం చేయగాల్గుతున్నాం అని ఆలోచిస్తే..సగం లక్ష్యం నెరవేరినట్లే! మంచి ప్రయత్నం ఆరంభించినందుకు ధన్యవాదములు.
ధన్యవాదములు వనజ గారు. నా శక్తి మేరకు పల్లెప్రపంచం విజన్ ను ముందుకు తీసుకు పోయేందుకు ప్రయత్నిస్తానండీ. ఆ అంశాలను కూడా ఇదే బ్లాగులో విజన్-ఆచరణ అనే లేబుల్ క్రింద పోస్టులు వ్రాస్తాను. మీ సలహాలు సూచనలు ఎప్పటిలాగే అందిస్తారని ఆశిస్తున్నాను.
* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి * పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. * నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. * పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు. * ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. . * అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
చాలా మంచి ప్రయత్నం.
ReplyDeleteఅభినందనలు.
ధన్యవాదములు శ్యామలరావు గారు.
Deleteచాలా మంచి ప్రయత్నమండి.గాంధీ గారి గ్రామ స్వరాజ్యం అయినా,పల్లెలు బలంగా తయారుకావాలని కలాంగారు చెప్పినా అందు కనుగుణమయిన వ్యవస్థ ఏర్పడి ప్రణాలికలు తీసుకు రావాలండి.మీ ఆలోచనావిధానం స్పూర్తిదాయకం.
ReplyDeleteధన్యవాదములు రవిశేఖర్ గారు. మీరన్నట్లు గాంధీ - అబ్దుల్ కలాం లాంటి వాళ్ల కలలు కలలుగానే ఉంటున్నాయి. వ్యక్తులంగా మనం కొంతమేరకు చేయగలం. ప్రభుత్వం లేదా ప్రజలంతా కలసి ఉద్యమిస్తే తప్ప గ్రాంస్వరాజ్యం అందుబాటులోకి వచ్చే పరిస్తితి లేదు. వ్యక్తిగతంగా నా వంతుగా కొంత ప్రయత్నం చేస్తాను.
Deleteచక్కని ప్రయత్నం చేస్తున్నారు. సంతోషం.
ReplyDeleteధన్యవాదములు శరత్ గారు.
DeleteGood attempt. All the best.
ReplyDeleteThank you sir.
Deleteమీ ప్రయత్నం కి మనః పూర్వక అభినందనలు.
ReplyDeleteఈ బ్లాగ్ విజవంతం అయితే.. మన పల్లె బతికినట్లే!
కేవలం జ్ఞాపకాలు మాత్రమే కాకుండా.. ఇప్పుడు పల్లె స్థితి ఎలా ఉంది..మనం ఏం చేయగాల్గుతున్నాం అని ఆలోచిస్తే..సగం లక్ష్యం నెరవేరినట్లే!
మంచి ప్రయత్నం ఆరంభించినందుకు ధన్యవాదములు.
ధన్యవాదములు వనజ గారు. నా శక్తి మేరకు పల్లెప్రపంచం విజన్ ను ముందుకు తీసుకు పోయేందుకు ప్రయత్నిస్తానండీ. ఆ అంశాలను కూడా ఇదే బ్లాగులో విజన్-ఆచరణ అనే లేబుల్ క్రింద పోస్టులు వ్రాస్తాను. మీ సలహాలు సూచనలు ఎప్పటిలాగే అందిస్తారని ఆశిస్తున్నాను.
DeleteManchi initiative andi..
ReplyDeleteMee prayatnam vijayavantam avalani korukuntunna.
Thank you sir.
Deleteమీ ప్రయత్నం సఫలీకృతం కావాలని కోరుకుంటూ .మీకు .అభినందనలు .
ReplyDeleteధన్యవాదములు నాగరాణి గారు.
Delete