ప్రజాశక్తి-హైదరాబాద్‌బ్యూరో
విధి నిర్వహణలో నిజాయితీగా వ్యవహరించిన స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్‌ను ముఖ్యమంత్రి కేసిఆర్ అభినందించారు. విధినిర్వహణలో భాగంగా నారాయణరావు అనే స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ పాస్‌పోర్టు విచారణ కోసం శనివారం నాడు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10కి వెళ్లారు. విచారణ పూర్తయిన తర్వాత దరఖాస్తు దారుడి ఇంటి చుట్టుపక్కల వారి నుంచి కూడా వివరాలు సేకరించిన తర్వాత దరఖాస్తు దారుడి తండ్రి సదరు కానిస్టేబుల్‌ను పిలిచి డబ్బును ఆఫర్ చేశారు. దీంతో నారాయణరావు డబ్బును సున్నితంగా తిరస్కరించాడు. ఇస్తున్నది తక్కువగా ఉండొచ్చనుకుని దరఖాస్తు దారుడి తండ్రి జేబులోంచి మరికొంత డబ్బును జోడించి ఇవ్వడానికి ప్రయత్నించగా ముఖ్యమంత్రి కేసిఆర్ మా జీతాలను పెద్ద మొత్తంలో పెంచారు. కాబట్టి మీరిచ్చే డబ్బులు మాకు అవసరంలేదని తిరస్కరించారు. అయితే ఈ విషయాన్ని దరఖాస్తు దారుడు స్వయంగా ముఖ్యమంత్రికి ఫోన్‌చేసి చెప్పారు. మీ పోలీసులు చాలా నిజాయితీగా పనిచేస్తున్నారు, డబ్బులు తీసుకోవాలని బలవంతం చేసినా తీసుకోలేదని చెప్పారు. దీంతో ముఖ్యమంత్రి ఆదివారం ఉదయం కానిస్టేబుల్ నారాయణరావును క్యాంప్ కార్యాలయానికి పిలిపించి అభినందించారు. ముఖ్యమంత్రితో పాటు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, జాయింట్ కమిషనర్ (స్పెషల్ బ్రాంచ్) నాగిరెడ్డి, స్పెషల్ బ్రాంచ్ అదనపు డిసిపి గోవర్ధన్‌రెడ్డి, పశ్చిమ మండలం ఎస్బీ ఏసిపి కె.ప్రసాద్, ఇన్‌స్పెక్టర్ సంతోష్ కిరణ్‌ల సమక్షంలో నారాయణరావును ముఖ్యమంత్రి అభినందించారు. నిజాయితీగా వ్యవహరిస్తూ పోలీసు శాఖకు గౌరవం దక్కేలా విధి నిర్వహణ చేశావంటూ అక్కడే ఉన్న మంత్రి లక్ష్మారెడ్డి, రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు కూడా అభినందించారు.
జీతాలు పెరగడం వల్ల తెలంగాణాలో అవినీతి తగ్గు ముఖం పడుతుందా?
*Re-published
మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
janavijayam@gmail.com
ప్రైవేత్ ఉద్యోగుల సంగతి ఏమిటి? ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలని అమ్మేసి ఇతర ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు పెంచుతారా?
ReplyDelete