ఇతరులను కావాలని అవమానించడం ..........,
పైకి నికరం గా నటిస్తూ లోపల కుళ్లు ను కుతంత్రాన్ని కలిగి ఉండడం ( దీనినే నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించడమంటారు) ...................,
ఇతరుల జ్ఞానం పట్ల ఈర్ష్య పెంచుకోవడం............... ,
మనకర్ధం కాలేదని నిజాన్ని జీర్నించుకోలేక అదే అభిప్రాయంతో మనలాగే ఉన్న మరికొందరు మూర్ఖులను కూడగట్టుకుని రాక్షసానందం పొందడం.........,
మనం చెప్పినదానిని సమర్ధించుకోవడం కోసం అడ్డమైన అబద్ధాలు ఆడడం, మనకు తోచిందే రైట్, ఇంకొకడు చెపితే వినకూడదనుకోవడం ...............,
పుకార్లు సృషించడం ...........................,
ఇలా అజ్ఞానం తో ఎన్నో ఎన్నెన్నో చిన్నెల్ని జ్ఞానులు చిద్విలాసం తో భరిస్తారు.
అప్పుడే జ్ఞానం నేర్చుకుందామనుకునేవారు మానసికంగా కృంగి పోతారు. కొందరు రాలిపోతారు.
అయినా .......................!
ఈ రాక్షసులకు చీమ కుట్టినట్లైనా ఉండదు. వీరికి సిగ్గూ, ఎగ్గూ, చీమూ, నెత్తురు ..... లాంటి పదాలు తెలియవు. వారి డిక్షనరీలో ఆ పదాలను వీరు మింగేశారు.
రాటుదేలిన వారు తిరగబడి రాక్షాసానందం ను పారద్రోలుతారు.
అనగననగ రాగమతిశయ్యిల్లుతుంది. తినగ తినగ వేము తీయనవుతుంది. సాధనమున పనులు సమకూరుతాయి ఈ ధరలోన.
అలావటయితే విషమే అయినా హాయిగా తాగుట సాధ్యమే. సాధన చేయుమురా నరుడా సాధ్యము కానిది లేదురా !
సో నేస్తం ! రాలిపోవద్దు. కృంగిపోవద్దు.
రాటుదేలు! రాటుదేలు!! రాటుదేలు!!!
- పల్లా కొండల రావు,
24-03-2015.
24-03-2015.
మంచి సందేశాత్మక టపా, థాంక్సండీ!
ReplyDeleteబాగుంది.
ReplyDeleteసంస్కారానికి నిలువెత్తు నిదర్శనం సార్ మీ బ్లాగు వ్యాసాలు. అవి చదువుతుంటే ఎంతో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.
ReplyDeleteధన్యవాదాలు GKK గారు.
Deleteఎవ్వడ వీవు కాళ్ళు మొగ మెర్రన ? హంసమ! ఎందునుందువో?
ReplyDeleteదవ్వుల మానసంబునను! దాన విశేషము లేమి చెప్పుమా?
మవ్వపు కాంచనాబ్జములు, మౌక్తికముల్ కలవందు! నత్తలో?
అవ్వి యెరుంగ మన్న ‘నహహా’ యని నవ్వె బకంబులన్నియున్!
హంసలు హిమాలయంలో ఉన్న మానస సరోవరంలో విహరిస్తాయి. ఆ సరస్సులో బంగారు వర్ణంతో మెరిసే పద్మాలు, మేలిమి ముత్యాలు ఉంటాయి. నత్తగుల్లలు కప్పలు వంటివి ఉండవు. మామూలు చెరువులలో వుంటూ నత్తలు, చేపలు తిని బ్రతికే కొంగలకి శ్రేష్టమైన పద్మాల, ముత్యాల యొక్క విలువ తెలియదు. అందుకే అవి హంసని పరిహసిస్తాయి.
Deleteరాజారావు సర్, ధన్యవాదములు.