'పల్లె ప్రపంచం ఫౌండేషన్' సంస్థ మా మండల కేంద్రమైన బోనకల్ లో ఈ రోజు (5-4-2015) ప్రారంభించడం జరిగింది. కొన్ని ఆటంకాల వలన 2 సంవత్సరాలుగా వాయిదా పడుతూ వచ్చిన ఈ కార్యక్రమం ఈ రోజు నిర్వహించడం జరిగింది. మా అమ్మ పల్లా స్వరాజ్యలక్ష్మి గారి చేత ప్రారంభింపజేయడం జరిగింది.
|
పల్లె ప్రపంచం ఫౌండేషన్ సంస్థను ప్రారంభిస్తున్న పల్లా స్వరాజ్య లక్ష్మి |
'పల్లె ప్రపంచం' లో మార్కెటింగ్ చేయనున్న3 పుస్తకాలను ( ప్రొడక్టులను) పరిచయం చేశాము.
1) ఆదెళ్ళ శివకుమార్ వ్రాసిన లైఫ్ మేనేజ్ మెంట్ బుక్ : దీనిని పల్లె ప్రపంచం ఫౌండేషన్ సభ్యులు పల్లా రామకోటయ్య గారు విడుదల చేయగా మొదటి ప్రొడక్టును చలమల అజెయ్ కుమార్ గారు కొనుగోలు చేశారు.
|
' లైఫ్ మేనేజ్ మెంట్ ' బుక్ ప్రొడక్టు ను విడుదల చేస్తున్న శ్రీ పల్లా రామకోటయ్య |
|
లైఫ్ మేనేజ్ మెంట్ బుక్ పై అట్ట |
2) ఆదెళ్ళ శివకుమార్ వ్రాసిన "నాకు టైం లేదు" బుక్ : దీనిని యడ్లపల్లి లీల గారు విడుదల చేయగా మొదటి ప్రొడక్టును లగడపాటి రామారావు గారు కొనుగోలు చేశారు.
|
'నాకు టైం లేదు' బుక్ ప్రొడక్టును విడుదల చేస్తున్నశ్రీమతి యడ్లపల్లి లీల |
|
నాకు టైం లేదు బుక్ పై అట్ట |
3) ఎస్.వెంకట్రావు వ్రాసిన 'వానరుడు - నరావతరణ' బుక్ : దీనిని పల్లా చైతన్య విడుదల చేయగా మొదటి ప్రొడక్టును బోయనపల్లి అంజయ్య గారు కొనుగోలు చేశారు.
|
' వానరుడు-నరావతరణ' బుక్ ప్రొడక్టును విడుదల చేస్తున్న పల్లా చైతన్య. |
|
'వానరుడు-నరావతరణ' బుక్ పై అట్ట |
ఈ కార్యక్రమానికి పల్లె ప్రపంచం ఫౌండేషన్ సభ్యులు పల్లా కొండల రావు, బోయనపల్లి అంజయ్య, పల్లా రామకోటయ్య, యడ్లపల్లి నరసింహారావు, రచ్చా మధుసూదన్ రావు, కొండేటి అప్పారావు, మార్కంపుడి బ్రహ్మం లతో పాటు స్తానిక టి.ఆర్.ఎస్ నాయకుడు గుదిమళ్ల వెంకయ్య, ఖమ్మం నియోజకవర్గ వినియోగదారుల సంఘం ప్రతినిధి లగడపాటి రామారవు, చలమల అజెయ్ కుమార్ తదితరులు హాజరయ్యారు.
|
' పల్లె ప్రపంచం ఫౌండేషన్ ' సభ్యుల గ్రూప్ ఫోటో |
ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ ధన్యవాదములు.
- పల్లా కొండల రావు.
News Clippings
Your are great, sir!
ReplyDelete"పల్లెప్రపంచం ఫౌండేషన్" మరిన్ని మంచి కార్యక్రమాలతో విశ్వవ్యాప్తం కావాలని, దేశ అభివృధ్ధిలో తనవంతు పాత్ర పోషించాలని కోరుకుంటూ ... శ్రీనివాస్
ధన్యవాదములు శ్రీనివాస్ గారు.
Delete