తెలుసుకోవాలనుకుంటున్న పదం : వేదం
పదం పంపినవారు : పల్లా కొండల రావు.
ఆయన మాటే వేదం అంటుంటారు కదా? వేదం అనే పదానికి అర్ధం ఏమిటి? ఇది తెలుగు పదమేనా? తెలిసినవారు ఈ పదం గురించిన వివరణ ఇవ్వగలరు?
*****
*Re-published
-----------------------------------------
-----------------------------------------
తెలుగు భాష అభివృద్ధి పడే ఏ అంశం గురించి అయినా మాకు వ్రాసి పంపితే తెలుగు-వెలుగు లేబుల్ క్రింద పబ్లిష్ చేస్తాము. ఏదైనా పదం గురించి చర్చించాలనుకుంటే వివరాలకోసం ఇక్కడ నొక్కండి.
---------------------------------------------
అసలు వేదం తెలియాలంటే యజ్ఞోపవీతం కావాలి!
ReplyDeleteవిస్సనపేటలో చాలాకాలం క్రితమే వేదంలో యేముందో అందరికీ విప్పి చెప్పేవారు,ఆయన పేరు మీదనే విస్సనపేట అనే వూరూ "విస్సన్న చెప్పింది వేదం" అనే నానుడీ పుట్టాయి.
ఇంతకు మించి మనం తెలుసుకోవదం అసాధ్యం?
యజ్ఞోపవీతం అవసరం లేదు.
Deleteవేదం అంటే ఏ పరిస్థితులలోనైనా అసత్యం కానిది ...
ReplyDeleteఎదురు ప్రశ్నించకుండా ఆచరించాల్సిన విషయాన్ని వేదం అంటారని విన్నాను. ఇది సరయినదేనా? తెలిసినవారు చెప్పగలరు.
ReplyDeleteయెన్సైక్లోపెడియా అనేది ఒకటి వుంది, దాన్ని యెందుకు చూస్తాము?
ReplyDeleteఅక్కడ ప్రశ్నిస్తున్నామా,మనకు కావలసిన సమాచారాన్ని వెతుక్కుంటున్నామా?
వేదమూ అంతే,ఒకరు కాదు అనేక మంది ఋషులు తమకు తెలిసిన దంతా అక్కద వుంచారు.
యేవరిని ప్రశ్నిచడాని కయినా అక్కద యెవరూ లేరే?
అక్కడున్న విషయం నిజమా కాదా అని తెలుసుకోవడం వరకూ చెయ్యగలం,అంతే?!
రాహుల్ సాంకృత్యాయన్ "ఋగ్వేద ఆర్యులు" అని ఒక పుస్తకం రాశారు.తెలుగులో కూడా అనువదించబడింది.వేదం చదవగూదదనే నిషేధం ఇప్పుడు అంత గట్టిగా లేదేమో,చాలా మంది మేధావులు వేదాల లోని విషయం మీద చాలా పుస్తకాలు రాసారు.అవి చదివితే తెలుస్తుంది!
వేదం అనే పదం అర్ధం ఏమిటి హరి గారు?
Deleteవేదం = విదితం అంటే మామూలుగా నాలెడ్జి అనే వస్తుంది.కొంచెం గంభీరమయిన విషయాల గురించి గనక కొందరు గీత గురించి మాట్లాదినట్టుగా దీని గురించి కూడా మాట్లాదతారు అనేది రూఢి అయిపోయింది గనక ఇంతకంటే పొడిగించినా వుపయోగం లేదు?
Delete