----------------------------------
అంశం - 'రాజీనామా' పదం అర్ధం తెలుసుకోవడం
పదం పంపిన వారు - Praveen
----------------------------------
example:
తెలుగు పత్రికలు "రాజీనామా" అనే పదాన్ని పదవీత్యాగం అనే అర్థంతో వాడుతున్నాయి. నిజానికి రాజీనామాకి పదవీత్యాగంతో సంబంధం లేదు. పెర్సియన్ భాషలో రాజీ అంటే అంగీకారం, నామా అంటే పత్రం, రాజీనామా అంటే agreement. హిందీ, ఒడియా భాషల్లో రాజీనామా అనే పదాన్ని agreement అనే అర్థంతోనే వాడుతారు. ఒరిస్సాలోని మా ఊరిలో అందరూ agreementని రాజీనామా అనే అంటారు. పదవీత్యాగాన్ని హిందీలో ఇస్తీఫా లేదా పదత్యాగ్ అంటారు తప్ప రాజీనామా అనరు. హైదరాబాదీ ఉర్దూ శబ్దాలని సరిగా వినకుండానే తెలుగులో చేర్చడం వల్లే తెలుగులో ఈ పరిణామం జరిగి ఉంటుందని నేను అనుకుంటాను. మీ అభిప్రాయం తెలుపగలరని విజ్ఞప్తి.
*Re-published
*Re-published
You are right! రాజీనామా అంటే ఒప్పందపత్రమ్మాత్రమే!
ReplyDeleteకానీ ఒకే పదానికి వేర్వేరు భాషాల్లో వేర్వేరు అర్ధాలుండడం సహజమే. ఉదాహరణకి ఇంగ్లీషులో gourmet restaurant అని రాస్తుంటారు. ఒక ఇంగ్లీషువాడిని gourmet అనంటే వాడు పొంగిపోతాడు. అదే ఒక ఫ్రెంచివాడిని ఆమాటంటే కర్రిచ్చుకు వెంటబడతాడు (ఆమాటకి ఫ్రెంచిలో 'తిండిబోతు' అని అర్ధం. ఫ్రెంచి వాణ్ణి తిండి విషయంలో పొగడాలంటే connoisseur అని అనాలి).
బహుశా ఆ పత్రాన్ని అవతలివారు ఆమోదిస్తే ఇవతలివారు పదవి లేని స్థితితో రాజీపడాల్సిన దుస్థితిలో ఉంటారు కాబట్టి ఆ పత్రానికి రాజీనామా అని వాదటం కరెక్టేనేమో:-)
ReplyDelete"తిండిబోతు" అర్ధంలో gourmet కాదు, gourmand అంటారనుకుంటాను ఫ్రెంచ్ భాషలో కూడా.
ReplyDelete