చర్చాంశం - తేలిక పదాలు
చర్చాంశాన్ని పంపిన వారు - పల్లా కొండల రావు.
తేలికైన తెలుగు పదాలను తయారు చేయడానికి కృషి చేయడం ఎలా?
తెలుగు భాష అభివృద్ధిలో తెలుగు పదాల వాడకమూ ఒకటని మనం చర్చిస్తున్నదానిలో చూస్తున్నాం. తేలికైన తెలుగు పదాలు సామాన్యుల నుండి కొన్ని వస్తున్నాయి. ఉదాహరణకు fly-over కు 'పై దారి' అని హరిబాబు గారు సూచించారు. అలాగే మనం కొన్ని పదాలను సూచించి వాటికి తెలుగులో తేలికైన పదం ఏది? అని సూచనలు కోరితే బాగుంటుందని హరిబాబుగారే సూచించారు.
ఇదేదో బాగుందనిపించింది. ఎలా? అని ఆలోచిస్తున్న తరుణంలో మీ అభిప్రాయమూ తీసుకోవడమే మంచిదని అనిపించి ఈ పోస్టు ఉంచుతున్నాను. పల్లె ప్రపంచం లోనే దీనికి ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలంటే ఏమి చేస్తే బాగుంటుంది. మీ అభిప్రాయాలన్నీ క్రోడీకరించి ఓ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది.
అయితే ఇక్కడ మనం కేవలం అభిప్రాయాలు తీసుకోగలం. పదనిర్ధారణ పండితులే చేయాలి. వారికి ఓ రిఫరెన్స్ గా మాత్రమే ఈ ప్రయోగం ఉపయోగపడుతుందని కేవలం ఇదొక వారధిలా మాత్రమే ఉపయోగపడుతుందని, అంత మేరకైనా మంచి కృషే అని నా అభిప్రాయం.
ఉదాహరణకు ఒకరు ఒక పదం సూచిస్తారు. అది ఇంగ్లీషు లేదా ఇతర భాషదై ఉంటుంది. దానికి తేలికైన తెలుగు పదం మీ ప్రాంతంలో ఎవరైనా వాడుతూ ఉంటే అది ఇక్కడ చెప్తే ప్రచారంలో పెట్టవచ్చు. లేదా ఇదే అంశాన్ని మీ ప్రాంతంలో మామూలు ప్రజలతో చర్చిస్తే వాళ్లు చెప్పే అవకాశమూ ఉన్నది. ఇంత క్రితం గ్రామాలలో పొడుపు కథలుండేవి నిరక్షరాస్యులు సైతo వాటిపట్ల ఆసక్తి కనబరచేవారు. కనుక వారిని తక్కువ అంచనా వేయొద్దు. అసలు అవసరం నుండే పదాలు పుట్టుకొస్తాయి.
నేను వ్యక్తిత్వ వికాసం శిక్షణలో నేర్చుకున్న చిన్న టెక్నిక్ చెప్తాను. పిన్నీసుతో ఎన్ని ఉపయోగాలున్నాయని ఒకరిని అడిగితే ఓ 10 చెప్తాడనుకుందాము. ఇంకొకరిని అడిగితే 20 చెప్పవచ్చు. మరొకరు 5 చెప్పవచ్చు. వీటన్నింటినీ కలిపి ఓ చోట పెడితే అందరిలొ కామన్ వి తీసేసినా ఖచ్చితంగా వీరందరిలో టాప్ సంఖ్య అయిన 20 కంటే ఎక్కువే వస్తాయి. ఓ పని చేయడానికి ఒక్కరు ఆలోచించిన దానికంటే అందరి ఆలోచనలను ఒక్కచోట చేర్చి వాటిలో మెరుగైనవి కూర్చితే తప్పక ఓ పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నాను. మీ విలువైన అభిప్రాయాలు చెప్పగలరు.
ఈ ఆలోచనకు స్పూర్తినిచ్చిన హరిబాబు గారికి ప్రత్యేక ధన్యవాదములు.
===============
===============
*Re-published
ReplyDelete>>> తేలికైన తెలుగు పదాలను తయారు చేయడానికి కృషి చేయడం ఎలా?
ఓ వంద సంవత్సరాలు అంటే దరిదాపుల్లో రెండు జనరేషన్ 'టెల్గు' మాట్లాడటం, చదవటం, రాయటం ఆపేస్తే సరి ! ఆ పై అన్నీ ఇక తేలిక ఐన పదాలతో మొదలెట్టా వచ్చు !!
జిలేబి
' టెల్గు ' మాని ' తెలుగు ' మాట్లాడాలంటారు. అంతే! అంతే!! జిలేబి గారు. అలా 'మాట్లాడాలని' మీ మాటగా అందరికీ 'విజ్ఞప్తి 'చేయుచుంటిని.
DeleteThis comment has been removed by the author.
ReplyDeleteijinagaramlo fly-over ni ettumadum antunnare eppatinundo
ReplyDelete