చర్చాంశం - తేలిక పదాలు
చర్చాంశాన్ని పంపిన వారు - పల్లా కొండల రావు.


తేలికైన తెలుగు పదాలను తయారు చేయడానికి కృషి చేయడం ఎలా?

తెలుగు భాష అభివృద్ధిలో తెలుగు పదాల వాడకమూ ఒకటని మనం చర్చిస్తున్నదానిలో చూస్తున్నాం. తేలికైన తెలుగు పదాలు సామాన్యుల నుండి కొన్ని వస్తున్నాయి. ఉదాహరణకు fly-over కు 'పై దారి' అని హరిబాబు గారు సూచించారు. అలాగే మనం కొన్ని పదాలను సూచించి వాటికి తెలుగులో తేలికైన పదం ఏది? అని సూచనలు కోరితే బాగుంటుందని హరిబాబుగారే సూచించారు.  

ఇదేదో బాగుందనిపించింది. ఎలా? అని ఆలోచిస్తున్న తరుణంలో మీ అభిప్రాయమూ తీసుకోవడమే మంచిదని అనిపించి ఈ పోస్టు ఉంచుతున్నాను. పల్లె ప్రపంచం లోనే దీనికి ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలంటే ఏమి చేస్తే బాగుంటుంది. మీ అభిప్రాయాలన్నీ క్రోడీకరించి ఓ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. 

అయితే ఇక్కడ మనం కేవలం అభిప్రాయాలు తీసుకోగలం. పదనిర్ధారణ పండితులే చేయాలి. వారికి ఓ రిఫరెన్స్ గా మాత్రమే ఈ ప్రయోగం ఉపయోగపడుతుందని కేవలం ఇదొక వారధిలా మాత్రమే ఉపయోగపడుతుందని, అంత మేరకైనా మంచి కృషే అని నా అభిప్రాయం.

ఉదాహరణకు ఒకరు ఒక పదం సూచిస్తారు. అది ఇంగ్లీషు లేదా ఇతర భాషదై ఉంటుంది. దానికి తేలికైన తెలుగు పదం మీ ప్రాంతంలో ఎవరైనా వాడుతూ ఉంటే అది ఇక్కడ చెప్తే ప్రచారంలో పెట్టవచ్చు. లేదా ఇదే అంశాన్ని మీ ప్రాంతంలో మామూలు ప్రజలతో చర్చిస్తే వాళ్లు చెప్పే అవకాశమూ ఉన్నది. ఇంత క్రితం గ్రామాలలో పొడుపు కథలుండేవి నిరక్షరాస్యులు సైతo వాటిపట్ల ఆసక్తి కనబరచేవారు. కనుక వారిని తక్కువ అంచనా వేయొద్దు. అసలు అవసరం నుండే పదాలు పుట్టుకొస్తాయి. 

నేను వ్యక్తిత్వ వికాసం శిక్షణలో నేర్చుకున్న చిన్న టెక్నిక్ చెప్తాను. పిన్నీసుతో ఎన్ని ఉపయోగాలున్నాయని ఒకరిని అడిగితే ఓ 10 చెప్తాడనుకుందాము. ఇంకొకరిని అడిగితే 20 చెప్పవచ్చు. మరొకరు 5 చెప్పవచ్చు. వీటన్నింటినీ కలిపి ఓ చోట పెడితే అందరిలొ కామన్ వి తీసేసినా ఖచ్చితంగా వీరందరిలో టాప్ సంఖ్య అయిన 20 కంటే ఎక్కువే వస్తాయి. ఓ పని చేయడానికి ఒక్కరు ఆలోచించిన దానికంటే అందరి ఆలోచనలను ఒక్కచోట చేర్చి వాటిలో మెరుగైనవి కూర్చితే తప్పక ఓ పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నాను. మీ విలువైన అభిప్రాయాలు చెప్పగలరు.

ఈ ఆలోచనకు స్పూర్తినిచ్చిన హరిబాబు గారికి ప్రత్యేక ధన్యవాదములు.
===============
*Re-published

31 Dec 2021

Post a Comment


  1. >>> తేలికైన తెలుగు పదాలను తయారు చేయడానికి కృషి చేయడం ఎలా?

    ఓ వంద సంవత్సరాలు అంటే దరిదాపుల్లో రెండు జనరేషన్ 'టెల్గు' మాట్లాడటం, చదవటం, రాయటం ఆపేస్తే సరి ! ఆ పై అన్నీ ఇక తేలిక ఐన పదాలతో మొదలెట్టా వచ్చు !!

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ' టెల్గు ' మాని ' తెలుగు ' మాట్లాడాలంటారు. అంతే! అంతే!! జిలేబి గారు. అలా 'మాట్లాడాలని' మీ మాటగా అందరికీ 'విజ్ఞప్తి 'చేయుచుంటిని.

      Delete
  2. ijinagaramlo fly-over ni ettumadum antunnare eppatinundo

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

Emoticon
:) :)) ;(( :-) =)) ;( ;-( :d :-d @-) :p :o :>) (o) [-( :-? (p) :-s (m) 8-) :-t :-b b-( :-# =p~ $-) (b) (f) x-) (k) (h) (c) cheer
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top