అంశం : మహిళలపై వేధింపులు,అత్యాచారాలు
అత్యాచారాలు జరగడానికి మగబుద్ధి కారణమా !?
అత్యాచారాలు జరగడానికి మగబుద్ధి కారణమా !?
సహజంగానే మగబుద్ధి ఆడవాళ్లను చూస్తే తప్పు చేయాలని భావిస్తుందా?
పుట్టుకతోనే బుద్ధి ఏర్పడుతుందా?
పరిస్తితులు - పెంపకం - పెరిగిన వాతావరణం బుద్ధి ఏర్పాటులో ఏ మేరకు పాత్ర వహిస్తాయి?
*Re-published
మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
kondalarao.palla@gmail.com
అందరు మగవాళ్ళూ అదేవిధంగా ప్రవర్తిస్తుంటే మీరన్న జెనరలైజేషన్ చెయ్యచ్చు. కోటిలో ఒక్క వెధవ చేశె పనికి, మగ జాతిని మొత్తాన్ని దుమ్మెత్తిపొయ్యటం ఎంతవరకూ సమంజసమంటారు.
ReplyDeleteపరిస్తితులు - పెంపకం - పెరిగిన వాతావరణం may cause delinquent behaviour.
ReplyDeleteసమాజం ఆలోచనా మారాలి అందాన్ని ఆరాదించాలే గాని ఆక్రమించాలనే ధొరణి దాన్ని ఎరగా వేసి వ్యవహరించడం విపరిమాణాలకుదారితీస్థున్నాయ్
ReplyDeleteఆడబుద్ధి కూడా దుర్మార్గంగానే ఉంటుంది అదీ మగాళ్లలో ఉన్నట్లే కొద్దిమందిలోనే.
ReplyDeleteఆడా - మగా బుద్ధిని బట్టి కాక , వ్యక్తుల బుద్ధిని బట్టే ఉంటుంది. అకృత్యానికి సంబంధించి. వెలుగులోకి వచ్చేవి ఎక్కువగా మృగాళ్ల అకృత్యాలు మాత్రమే. దానికి కారణం పురుషాధిక్య సమాజం కాబట్టే.
బుద్ధి అనేది పెంపకాన్ని బట్టి, పెరుగుదలను బట్టి నిత్యం చైతన్యవంతమవుతుంటుంది. దీనికి కారణమైన కుటుంబo - సమాజం లో మార్పు రావాలి తప్ప, సంఘటనలుగా చూడకూడదు.
సమాజం ఏ విలువలకి విలువ ఇస్తూ వాటినే గొప్పగా ప్రచారంలో ఉంచుతుందో సహజంగా అలా తన ఈగోని శేటిస్ఫై చేసుకోవడానికి వ్యక్తి ప్రవర్తిస్తుంటాడు.
కాబట్టి అత్యాచారాలనిరోధం అనేది మొత్తం సమాజపు కట్టుబాట్లు - వాటి అమలుపై ఉంటుందని నా అభిప్రాయం.
మోడల్లు సినీ నటీలు ఎందుకు బట్టలు విప్పుకొని విచ్చలవిడిగా అంగ ప్రదర్శన చేస్తున్నాయో ఆవి మహిళాసంఘాలు ఎందుకు ఖండించవో చెప్పాలి. మృగాళ్లు ఇంటర్నెట్ పోర్న్ సైట్ లతో యువత నిర్వీర్యమైపోతుంది. అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఆశీల సైట్ కు ప్రత్యేక డొమైన్ ఇచ్చి నిషేధించాలి.
ReplyDelete