లైంగిక దాడులను ప్రసారం చేయడం లో మీడియాలో రావలసిన మార్పులు ఏమిటి?

మీడియా !

ప్రజాస్వామ్యం లో భావ ప్రకటనా స్వేచ్చ కు ఓ ఆయుధం! 

కొన్ని సందర్భాలలో మితిమీరిన పోకడలు ఉంటున్నా, ప్రజలను చైతన్య పరచేదానిలో ఇటీవల కాలంలో మీడియా గణనీయమైన పాత్రను పోషిస్తోంది. 

ఇది ఆహ్వానించదగ్గ పరిణామమే అయినా రేటింగ్‌లను పెంచుకోవడానికి తామే ముందు వార్తలను ప్రసారం చేస్తున్నామనే అత్యుత్సాహంతో ఏ అంశాన్ని ఎలా ప్రెజెంట్ చేయాలనేదానిలో కొన్ని అభ్యంతరకర పోకడలుంటున్నాయనే చెప్పాలి. చాలా విషయాలలో కూడా మీడియా ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడం లేదు. 

ముఖ్యంగా అత్యాచారం, లైంగికదాడులు వంటి వాటి విషయంలో జెండర్ సెన్సివిటీతో ఎలా వ్యవహరించాలనేదానిలో మీడియా పాత్ర మెరుగు కావలసిన అవసరం ఉందనిపిస్తోంది. 

లైంగిక దాడుల విషయంలో సమాజం ప్రమాదపుటంచులకు చేరుకుంటోందనే ఆందోళనకలిగించే అంశాలను ఎలా డీల్ చేయాలి? 

సమాజంలో మార్పుకు, మహిళల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచేందుకు వార్తల ప్రసారంలో మీడియా తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి?
===========================
*Re-published

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

kondalarao.palla@gmail.com

Post a Comment

  1. Hope there are no double standards in "reporting" an event. For media today every thing is a "story" and there itself the standard of journalism has come down. If events involving real people is a "story" to some, earning their living by calling it as such, how can you expect balance when such "story" is splashed across pages or shown on the tube.

    ReplyDelete
  2. లైంగిక దాడులు పెరగడానికి విచ్చలవిడిగా అందుబాటులో ఉన్న ఇంటర్ నెట్ అశ్లీల సైట్లు ఒక కారణం. పరమ జుగుప్సాకరంగా బట్టలు విప్పుకొని ఫోటోషూట్ పేరుతో అంగాంగప్రదర్శన చేస్తున్న మోడల్లు సినీతారలు ఇంకోకారణం. మగాళ్లు ఇవి చూస్తూ పైశాచికంగా అత్యాచారాలు చేస్తున్నాయి. ఇంకా మీడియా వ్యభిచారం కంటే దారుణంగా పదేపదే లైంగిక వార్తలు ప్రసారం చేస్తుంది. చీ ఏమి ప్రపంచంలో బతుకుతున్నాము అనిపిస్తుంది. ఈ టీవీ కూడా జబర్దస్త్ లాంటి నీచ నికృష్ట కార్యక్రమం ప్రసారం చేస్తుంది. అది మగవేధవలు లొట్టలేసుకుంటూ ఆస్వాదిస్తున్నాయి.

    ReplyDelete
    Replies
    1. మగవారే కాదు, “నీచ”మైన ఈ “జబర్దస్త్” కార్యక్రమాన్ని వీక్షించే ఆడవారు కూడా చాలామందే ఉన్నారు “బుచికి” గారూ. పైగా ఈ షో లో పాల్గొనడం ద్వారా ఆ జడ్జీలిద్దరూ, ఆ యాంకరిణి కూడా ఈ షో ని సమర్ధిస్తున్నట్లే కదా? ఇంకేం బాగుపడుతుంది? ఇన్ని సంవత్సరాలుగా సభ్యసమాజం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా “ఈటీవీ” వారికి చీమ కుట్టినట్లు కూడా లేదు, కేరే జాట్ అన్నట్లుంది వారి వైఖరి; అయినా వ్యాపారం, దాని ద్వారా వచ్చే లాభాల ముందు ఇటువంటి అభ్యంతరాలన్నీ ఏ పాటి? పైపెచ్చు ఈ షో లో తరచూ కనిపించేవారికి సినిమా ఛాన్సులు, సెలెబ్రిటీలన్న బిరుదూ. ఖర్మ ఖర్మ (మనది).

      మీడియాలో రావలసిన మార్పులేమిటి అనే చర్చ కూడా అనవసరం. ఎందుకంటే వారి ధోరణిలో ఏ మార్పూ రాదు. విలువలు లోపించిన వ్యాపారాలు కదా. పైసా మే పరమాత్మా. దీని మీద చేసే చర్చలు చివరికి కంఠశోష / బ్లాగుశోష అవుతాయి.

      Delete
    2. ఎన్నో చానళ్ళు ఉండగా ఈటీవీ ఎవరు చూస్తారండీ.దారిలో ముళ్ళు ఉంటే తివాచీ పరిచి ఉండాలనుకోవడం అవివేకం.మంచి చెప్పుల జత కొనుక్కుంటే సరి !

      Delete
    3. పుర్రె కొ బుద్ధి జిహ్వ కొ చాపల్యం !!

      ఎన్నో చానల్స్ ఉన్నట్లే ఎన్నో పుర్రెలున్నాయండి.. ఏది ఏమైనా జబర్దస్ట్ అత్యంత ప్రజాదరణ పొందుతున్న ప్రోగ్రాం!! ఇక్కడున్న తెలుగు వారందరు (almost 90%) youtube లో వెంటనే చూస్తారు అది కూడా తిట్టుకుంటూనే ఏమి ప్రొగ్రం రా బాబు అంటూ! నాకు contestants కన్న judges వెగటుగా అనిపిస్తారు so చూడను!

      Delete
    4. నీహారిక గారు,
      < దారిలో ముళ్ళు ఉంటే తివాచీ పరిచి ఉండాలనుకోవడం అవివేకం.మంచి చెప్పుల జత కొనుక్కుంటే సరి ! >
      దారిలో ముళ్ళు లేకుండా ఏరివేయడం ఇంకా మంచిది కదా?

      Delete
    5. ఒకప్పుడు దారిలో ముళ్ళన్నీ ఏరివేయాలనే ఆలోచన ఉండేది.ఎన్నని ఏరతాం? కేసీఆర్ లాగా నిషేదించే అధికారం లేనప్పుడు రిమోట్తో మారిపోవడమే బెటర్ కదా ? మార్చడం కష్టం...మారడం సులభం. ఉద్ధరేదాత్మనాత్మానాం !

      Delete
    6. గౌడ్‌ల మీద కామెడీ వేసినందుకు ఆ కులస్తులు కొట్టినది జబర్దస్త్ నిర్మాతనేనా

      Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top