------------------------------------------------
అంశం : రామాయణం,ఆధ్యాత్మికం
ప్రశ్నిస్తున్నవారు :  పల్లా కొండల రావు. 
------------------------------------------------

భారతీయ సమాజం లేదా హిందువులపై శ్రీరాముడి ప్రభావం అధికం. ఏ ఇతర పురాణ పురుషునికి లేని ప్రత్యేక గుర్తింపు రాముడిపై ఉంటుంది. రాముడి కేరక్టర్ చిత్రీకరణ, నేటికీ అనేక విషయాలలో రాముణ్ణి ఆదర్శంగా తీసుకోవాలి అని చెప్పడం చూస్తుంటాం. 'రాముడు మంచి బాలుడు' అంటూ మనం చదువుకునేటప్పుడు తెలుగు, ఇంగ్లీష్, హిందీ వంటి అన్ని లాంగ్వేజ్ లలోనూ అనేక ఉదాహరణలు విని ఉంటాము. మన పెద్దలు ఏదైనా వ్రాసేటప్పుడు శ్రీరామజయం అని , శ్రీరామ నీవే కలవు అని , శ్రీరామ అని వ్రాసేవారు. రామ భజనలు, రామ కీర్తనలు వింటుంటాం. రాముడిని రాజకీయనేతలు వాడుకుంటున్నారు. ఎందుకు రాముడికి ఇంత ప్రత్యేకత ఏర్పడింది? ఏ ఇతర దేవుడికి లేదా పురాణ పురుషుడికి లేని ఇమేజ్ రాముడికి రావడానికి కారణాలు ఏమిటి అంటే మీరేమి చెపుతారు?

శ్రీరాముడి ప్రభావం భారత జాతిపై ఎంతకాలం ఉంటుంది? ఎందుకు!? 

--------------------------------------------------
*Re-published

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

janavijayam@gmail.com



Post a Comment

  1. ప్రతి పనినీ శ్రీరామ అనుకుంటూ మొదలు పెట్టే సాంప్రదాయం నిలిచి ఉన్నంతవరకూ ఉంటుంది.మనకు తెలియకుండానే చాలా ఆమూలుగా మనం రాముడితో ఒక అనుబంధాన్ని యేర్పరచుకున్నాం.వివాహ ఆహ్వాన పత్రిక తెలుగులో ఉంటే తప్పనిసరిగా "జానక్యా కమలా మలాంజలి పుటే యా పద్మ రాగాయితా" ఉండాల్సిందే కదా!

    సినిమా అనే ఒక కొత్త కళారూపం మనకు మొదట రామకధని చూడాలనే కుతూహలం తోనే ప్రాచుర్యం లోకి వచ్చింది.టెలివిజన్ మార్కెట్ లోకి వొచ్చి చాలా కాలమయ్యాక "రామాయణ్" కి హారతు లిస్తూ ఇంటింటా కొలువు దీర్చుకున్నాం.

    సంవత్సరమంతట్లోనూ మనం చేసుకునే పది పందగల్లో శ్రీ రామ నవమియే అతి ముఖ్యంగా ఇష్టపడి చేసుకుంటున్నాం. ఆసేతు శీత నగం - ఇక్కద రాముడు తిరిగాడు, ఇక్కడ సీత కూర్చుంది అనే ఆత్మీయత తోనే తమ వూళ్లని ఇష్ట పడుతున్నారు ప్రజలు.

    ReplyDelete
  2. ఒకే మాట 'ఆచంద్రతారార్కం'

    ReplyDelete
    Replies
    1. అదేదో సినిమాలో చిరంజీవి "అంతొద్దు, ఇది చాలు" అన్నట్టు భలే కొసరు వేశారుగా:-)

      Delete
  3. యావత్తోయధరా ధరా ధర ధరాధారాధర శ్రీధరా
    యావచ్చారుచచారుచారుచమరం చామీకరం చామరమ్
    యావద్రావణరామ రామరమణం రామాయణం శ్రూయతే
    తావద్భో భువి భోగభోగ భువనం భోగాయ భూయాద్విభో ॥

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top