1966 లో వచ్చిన 'మనసే మందిరం' సినిమాలోని ఈ పాటను 'నాకు నచ్చిన పాట' శీర్షిక క్రింద మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి గారు పరిచయం చేస్తున్నారు. సి.వి.శ్రీధర్ దర్శకత్వంలో యర్రా అప్పారావు నిర్మించిన ఈ సినిమాకు 1962లో వచ్చిన  "నెంజిల్ ఒరు ఆలయం" అనే తమిళ సినిమా మూలం. కార్తీక్ వ్రాసిన ఈ పాటను పి.సుశీల గానం చేశారు. ఎమ్.ఎస్.విశ్వనాధన్ సంగీతం సమకూర్చారు. ఈ పాట సన్నివేశంలో జగ్గయ్య - సావిత్రి లు నటించారు.

చాలా రోజులతరువాత మరలా నాకు నచ్చే మరో పాటను మీ ముందుంచుతున్నాను.
  
ఎన్నోరోజులుగా ఈ సినిమా సిడి కోసం వెతికాను.నెట్లో కూడా వెతికి వెతికి,చివరికి విజయవాడలో కార్తీక్ స్వరమాలా ఆడియో షాపతనికి 100రూ/లు వుంచమని నాకు మనసే మందిరం సినిమా సిడి ఎలా ఐనా సంపాదించిపెట్టమని అడిగా. నాకు కావలసిన అరుదైనపాటలన్నీ పాపం ఆయనే రికార్డ్ చేసి ఇచ్చేవారు. మన బ్లాగర్లకు కూడా కనీసం అందులో పాటలు వుంటే పెట్టమని అడిగాను.దొరకలేదని అన్నారు. ఒకానొకరోజు షాపాయన మీ సి.డి వచ్చిందని నా చేతిలో పెట్టారు. నాకెంత సంతోషం కలిగిందో చెప్పలేను. వెంటనే మా అన్నయ్యకి కూడా చెప్పేశాను. మీకు చెప్పలేదు కదూ అన్నయ్యని ఎప్పటినుంచో ఈ సి.డి కోసం అడుగుతున్నాను. అలా దొరికింది.

హిందీలో చిన్నతనంలో చూశాను. నాన్న తెలుగులో కూడా చాలా బాగుంటుంది అనేవారు తప్పించి మాకు చూపించలేదు. పాటలు అంత పాపులర్ కాకపోయినా, సాహిత్యం సినిమా కధంత బలంగా, మనసుకు హత్తుకునేలా, కళ్ళనీరు తెప్పిస్తాయ్. అసలు సావిత్రమ్మ నటన ఇందులో పరాకాష్టకు చేరుకుంటుంది. తమిళంలో దేవిక, హిందీలో మీనా కుమారి, తెలుగులో సావిత్రమ్మ. ముగ్గురిలో సావిత్రమ్మ నటన మిగిలినవాళ్ళను మరిపిస్తుంది. మరో సావిత్రి పుట్టడం జరగదు. విషాద నటనకి ఆమెని మించినవారు లేరు. 

ఇప్పుడు నేను ప్రస్తావించబోయే పాట ఆ "మనసే మందిరం" సినిమాలోదే. కాన్సర్తో మరణించబోయే భర్త ఆపరేషన్‍కు వెళ్ళబోయేముందు పాట పాడమని, సంగీతంతొ నాలాంటి వారికి కొంచెం స్వాంతనని, పాడమని అడుగుతాడు. ఇప్పుడా! అని అభ్యంతరం చెప్పిన భార్యను పాడమని కోరితే ఆ స్తితిలో వున్న భార్య పాడే పాటే ఇది. అంతకు ముందు మరలా వివాహం చేసికోమని కూడా అడిగి వుంటాడు. ఆమె ఒప్పుకోదు. ఆ సంధర్భాలన్నీ ప్రస్తావిస్తూ సాగుతుందీ పాట.

"అన్నది నీవేనా నా నా నా నా స్వామి
వున్నది నీవే, వున్నది నీవే నాలోనా నా స్వామీ,

చెదరిన జీవితమా నాక నాకా
ఏమిపరీక్ష,ఏలానా నాస్వామీ.అన్నది నీవేనా నాస్వామి.

అగ్నిసాక్షిగా ఆలూమగలై అలరితిమింతటిదాకా,
పసుపుకుంకుమల పరిమళమంతా పతి రూపమ్మే కాదా, 
వినలేను,విడలేను,వేరై మనలేను,
సోధనలో వేదనలో బాధను కాలేను.

ఇటులన్నిది నీవేనా నా నా నాస్వామీ.

రెండవ చరణం నాకు చాలా చాలా ఇష్టమైనది. ఎన్ని సార్లు విన్నా మనసు కదిలిపోతుంది. కనులు చెమ్మగిల్లుతాయ్. ఆమె నటన అజరామరం.  మీరూ చూడండి.

దైవదత్తమౌ ప్రేమ కుసుమమే వీదిన విసురుట తగునా
పరులుతాకిన విరిగుండెలలో మలి ఆమని వెలిసేనా

నీకరమే నావరము,నీవే నా జగమూ
మరణమ్మే శరణమ్ము,మారదు నా మనమూ

అన్నదినీవేనా నా నా నాస్వామీ. 

ఇలాంటి సాహిత్యం ఈరోజుల్లో భూతద్దంవేసి వెదికినా దొరకదని ఘంటాపధంగా చెప్పగలను.సాహిత్యం కొంచెం పరవలేదనుకున్నా, నటీ నటులేరి? ఇలా వెతికి వెతికి పాత వాటితోనే సంత్రుప్తి పడాలి. 

మరోసారి మంచి పాటను ప్రస్తావించుకునే అవకాశమిచ్చినందుకు కొండలరావుగారికి ధన్యవాదాలు చెప్తూ,మరలా మరో మంచి పాటతో కలుస్తా...

                                - మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి.
 
*** *** *** మీరూ మీకు నచ్చిన పాట గురించి వ్రాయాలనుకుంటే ఇక్కడ నొక్కండి. *** *** *** 
*Republished

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top