మీరూ ప్రజ కు ప్రశ్నలు పంపాలనుకుంటే వివరాల కోసం ఇక్కడ నొక్కండి.
----------------------------------------------
అంశం : దేవుడు
ప్రశ్నిస్తున్నవారు : పల్లా కొండల రావు.
-----------------------------------------------

*Re-published

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

janavijayam@gmail.com

Post a Comment


  1. చాలా అవసరం - చాలెంజ్ విసిరితే గాని జనాలు ఉలిక్కి పడరు :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. చాలెంజ్ విసిరి ఉలిక్కిపడేలా చేస్తే కలిగే ప్రయోజనం ఏమిటి?

      Delete
  2. అభ్యుదయ వాది, దార్శనికుడు, అపర మేధావి, విజ్ఞాన గని.....తదితర గుర్తింపులన్నీ తక్షణం సచ్చినట్టు వచ్చి పడతాయి కదా!

    ReplyDelete
  3. కొండల రావు గారూ, మీ ప్రశ్న అర్ధం కాలేదు. నాస్తికులు తమ నమ్మకాన్ని సిగ్గు పడుతూ చెప్పుకోవాలా?

    ReplyDelete
    Replies
    1. < కొండల రావు గారూ, మీ ప్రశ్న అర్ధం కాలేదు. >
      అర్ధమయింది. ఈ ప్రశ్నను మరింత క్లారిటీగా అడగాల్సింది.

      < నాస్తికులు తమ నమ్మకాన్ని సిగ్గు పడుతూ చెప్పుకోవాలా? >
      అవసరం లేదు.

      మార్పును కోరుకునేవారు ప్రజలను శాస్త్రీయ ధృక్పథం వైపు మార్చాలనుకునేవారు వ్యవహరించాల్సిన తీరు ఎలా ఉండాలన్నదానిపై నాకు కొన్ని విషయాలపై విస్త్రుత జ్ఞానం కోసం అడిగాను.

      రెచ్చగొట్టడం ద్వారా కంటే.... వినయం, ఖచ్చితత్వం, ఓపికల కలబోతగా ఉంటే మెరుగైన ఫలితాలు వస్తాయన్నది నా అభిప్రాయం.

      జనాల్ని మార్చడం కోసం జనానికి దూరం కావడం, దూరం చేసుకోవడం మంచిది కాదని నా అభిప్రాయం.

      Delete
    2. వినయం అనేది సరైన పదం కాదు. కాపట్యం అనేది సరైన పదం. సౌమ్యత అనేది సరైన పదం.

      నాస్తికులు సౌమ్యంగా వివరించాలి. దేవుడు, మతం లాంటి భావాల పట్ల కఠినంగా వ్యవహరించాలి. దేవుణ్ణి ఆరాధించడం అనేది ఒక లజ్జారహితమైన చర్య. ప్రతిమతంవాళ్ళూ మనుషుల్లో అసమానతలను ప్రొత్సహించే ఒక perversionని ప్రోత్సహిస్తున్నారు. అందుకుగానూ వారు సిగ్గుపడాలి.

      ఒక నాస్తికుడికి ఏదైనా నచ్చకపోతే... వాడు ఒక పుస్తకం రాస్తాడు. ఒక సినిమా తీస్తాడు. ఒక జోక్ వేస్తాడు. అంతేకానీ తలకాయలు నరకడు, బాంబులు పేల్చడు, మనుషుల్ని చితకబాదడు, మనుషుల్ని చంపడు. అదే ఆస్తికులైతే మనఓభావాలు గాయపడ్డాయంటూ నానారచ్చ చేస్తారు. ఎందుకంటే ప్రతి మతమూ హింసను ప్రోత్సహించేదే. హింసను ప్రోత్సహించనిది నాస్తికత్వము మాత్రమే. మరి నాస్తికులు ఎందుకు గర్వపడకూడదు?

      Delete
    3. < వినయం అనేది సరైన పదం కాదు. కాపట్యం అనేది సరైన పదం. సౌమ్యత అనేది సరైన పదం. >

      కాపట్యం......?? కాపట్యం మాత్రం ఎందుకు?


      < సౌమ్యత అనేది సరైన పదం. > yes. i agree with this.

      వినయం కరెక్ట్ కాదు. నిజమే. ధన్యవాదములు.

      Delete
    4. < ఒక నాస్తికుడికి ఏదైనా నచ్చకపోతే... వాడు ఒక పుస్తకం రాస్తాడు. ఒక సినిమా తీస్తాడు. ఒక జోక్ వేస్తాడు. అంతేకానీ తలకాయలు నరకడు, బాంబులు పేల్చడు, మనుషుల్ని చితకబాదడు, మనుషుల్ని చంపడు. అదే ఆస్తికులైతే మనఓభావాలు గాయపడ్డాయంటూ నానారచ్చ చేస్తారు. ఎందుకంటే ప్రతి మతమూ హింసను ప్రోత్సహించేదే. హింసను ప్రోత్సహించనిది నాస్తికత్వము మాత్రమే. మరి నాస్తికులు ఎందుకు గర్వపడకూడదు? >

      good answer.

      Delete
  4. కేతన్ గారు మీరు చెపుతున్నదాన్ని బట్టి మతాన్ని విశ్వసించేవారందరూ హింసావాదులే అన్న అభిప్రాయాన్ని కలిగిస్తుంది. అలా అయితే నాస్తికులు అందరూ అహింసావాదులని,మానవతావాదులని గట్టిగా చెప్పగలరా? ఏ మతావిర్భావమైనా సమాజోద్దరణకే కట్టుబడి వుంటుంది. ఈ మతాలలో సూక్ష్మ జీవులకు కూడా హాని జరగ కూడదని గుడ్డ ద్వారా శ్వాస తీసుకొని బ్రతికేవాళ్ళు వున్నారు - అదే విధంగా మా మతం తప్ప మరే మతం వారు ఈ భూమి మీద జీవించకూడదు అనుకొనే మూర్ఖులు వున్నారు. కాకపోతె బహు తక్కువ శాతం. మతం అన్నది మంచినే ప్రభోదిస్తుందని ప్రపంచంలో అత్యధికులు శాంతి పథంలోనే పయనిస్తున్నారు. కొన్ని మతాలలో, కొద్ది మంది అవలంభిస్తున్న వున్మాదాన్ని అన్ని మతాలకు అంటగట్టడం భావ్యం కాదు. మతం,దేవుడు విషయాలలో భక్తి,విశ్వాసం వుండబట్టే అధిక శాతం ఆస్థికులు సన్మార్గంలో వున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం మనం చేసుకున్న చట్టాలే ప్రస్తుత సమాజానికి అన్వయించబడడం లేదు. మరి వందల, వేల సంవత్సరాల క్రితం ఏర్పడిన మతాల గమనంలో కొన్ని వైరుద్యాలు వుండడంలో ఆక్షేపించేదేముంది? కొన్ని మతాలు తమలొ వున్న మూఢ ఆచారాలను,నమ్మకాలను వదిలించుకొని, వర్తమాన మంచిని ఆచరిస్తు ముందుకు సాగుతున్నాయి. కొన్ని మాత్రం ఇప్పటికీ వదిలించుకోలేక పోతున్నాయన్నది వాస్తవం.వాటిని సంస్కరించడానికి కృషి జరగాల్సిందే. అంతేగానీ మతమన్నదే హింసను ప్రోత్సహిస్తుంది అన్న భావం తప్పు. సమాజ గమనానికి ఆలంభమైన కుటుంబ భాంధవ్యాలు మతం నుండి సంక్రమించినవే. ఇవి మూఢమైనవి, అనాగరికమైనవి అని మీరు ఆ సంబందాలను అతిక్రమించి జీవించడం లేదు కదా! "పరోపకారార్థం ఇదం శ్రీరం", "నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించు" ఇలా మతాలు వేరైనా అంతరార్థం ఒకటే.

    ReplyDelete
    Replies
    1. మతం వేరు. మతోన్మాదం వేరు. కానీ మత నమ్మకాల ఆధారంగా జరిగిన అకృత్యాలు, మతోన్మాదుల ఆగడాలు మనకు తెలిసినవే. ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. కానీ నాస్తికత్వం ద్వారా అలాంటివి జరుగుతున్నాయని చెప్పలేము గదా?

      Delete
    2. @ఇంద్రధనస్సు:

      మతం, నమ్మకం లేదా సిద్ధాంతం ఏది అయినా ఎన్నో రకాలుగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తారు. సదరు భావజాలవ్యాప్తికి హింస (నిజానికి ఫోర్స్ అనాలి తెలుగులో సరయిన పదం ఏమిటో?) కూడా ఒక మార్గంగానే భావిస్తారు అన్నది చరిత్ర చెప్తున్న వాస్తవం.

      అన్ని మతాలు, సిద్ధాంతాలు & వాటివాటి ఆదరణ పెంచాలని తాపత్రయం చెందేవారు ఎల్లప్పుడూ హింసనే వాడకపోవొచ్చు కానీ హింసామార్గం నిషిద్ధం కాదు.

      నాస్తికవాదం & హేతువాదం దీనికి మినహాయింపు. నాస్తికులు తన వాదనను ఇతరులకు చర్చ ద్వారా ఒప్పించే యత్నాలు ఎన్ని చేసినా బలవంతంగా రుద్దే మార్గాన్ని మాత్రం ఎంచుకో(లే)రు.

      Delete
    3. మీరు పొరబడుతున్నారు.

      నేనెప్పుడూ కొన్ని మతాలగురించి మాట్లాడలేదు. అన్నిమతాల గురించీ మాట్లాడాను. హింసాత్మక భావజాలం, మనుషులమధ్య విభేదాలను సృష్టించే భావజాలం లేని మతమంటూ ఏమీలేదు. నీవలెనే నీ పొరుగువాడిని ప్రేమించమని" యేసు చెప్పినదానికి అసలు పరమార్ధం "నీవలెనే నీ పొరుగునున్న యూదుని ప్రేమించ"మని. మరి అదేమతంలో విశ్రాంతి దినమునాడు శ్రమించినవాడిని చావగిట్టమని రాశారే అదేమిటి? పరోపకారార్ధం ఇసం శరీరం అన్నమతంలో స్త్రీలని, దళితులని చిన్నచూపుసూచి, మనుషుల్ని జంతువుల్లాగా ఎందుకు వర్గీకరించారు? బ్రాహ్మణుడు తాపుచేసినా శిక్షార్హుడు కాదు అని ఎలా రాసుకున్నారు. వీటన్నింటినీ పాటించబట్టేనా మనం శాంతియుతంగా జుఈవిస్తున్నాది. ఈ చెత్తలో కొంతైనా వదిలించుకున్నాం కాబట్టే ప్రస్తుతానికి మనం ఇలాగైనా ఉన్నాం. హిందూ మతం శాంతియుతమైనదైతే బౌధ్ధులపై మారణహోమం ఎందుకు సాగింది? క్రైస్తవం శాంతిని బోధించియుంటే క్రూసేడులమాటేమిటి? ఇస్లాం అంటారా... ఖురాన్‌లో శాంతి, హింస రెండూ ఉన్నాయి. ఇలాంటి పనికిమాలిన పుస్తకాలనీ, భావజాలాన్నీ నిక్కంగా మనం ఆచరిస్టే మనముంటున్న ప్రపంచం నరకమౌతుంది. మచ్చుకి కొందరు ఉన్నదున్నట్లుగా ఆచరిస్తేనే మనం ఇలా ఉంటున్నాం.

      కుటుంబ విలువలు మతంకంటే ముందునుంచీ ఉంటున్నవి. ఇంకా చెప్పాలంటే మతాల్లో ఉన్న నియోగమూ, తండ్రీకూతుళ్ళ సంభోగమూ లాంటి వాటిని అంగీకరించే స్థాయికి మనం ఇంకా చేరుకోలేదు.

      Delete
    4. << ఇంకా చెప్పాలంటే మతాల్లో ఉన్న నియోగమూ, తండ్రీకూతుళ్ళ సంభోగమూ లాంటి వాటిని అంగీకరించే స్థాయికి మనం ఇంకా చేరుకోలేదు. >>

      మతంలో ఇలాంటివి ఉంటాయా?

      Delete
    5. @ఇంద్రధనుస్సు: మహమ్మద్ ముందుగా మక్కాలో ఉన్నప్పుడు అతడికి వందకంటే తక్కువమంది అనుచరులుగా ఉండేవారు. అప్పుడు అతడు ప్రేమ, సహనం లాంటి విషయాలను రంజుగా బోధించాడు. అదే మహమ్మదు మదీనా వెళ్ళాక అతడికి బోల్డుమంది అనుచరులు ఏర్పడ్డారు (వాళ్ళనేనుసుకొనే లోకాన్ని తగలెయ్యడానికి బయలుదేరాడు) అప్పుడు అతడికి శంతి, సహనం, ఓదార్పు లాంటి పదాల అవసరమేలేకపోయింది. కురాన్నిండా రక్తం పారింది. ఇస్లాంలో నక్షా అనే సాంప్రదాయం ప్రకారం పాత సురా (మక్కా సురా)ని కొత్త సురా (మదీనా సురా) override చేస్తుంది. కాబట్టి చదువుకోడానికైతే కురాన్లో హింస, శాంతి రెండూ ఉన్నాయి.

      హింస, కాల్చుకు తినడం వంటి విషయాల్లో హిందూమతమేమీ తక్కువతినలేదు. పురాణాల్నీ, ధర్మశాస్త్రాల్నీ కొంచెం కాషాయపు కళ్ళద్దాలు వదిలించుకు చదివితే బాగానే అర్ధమవుతుంది.

      Delete
  5. <<<< ఇస్లాం అంటారా... ఖురాన్‌లో శాంతి, హింస రెండూ ఉన్నాయి. >>>
    ఖురాన్ లో శాంతి ఎక్కడ వుంది? రెండూ వుండడం అంటే అది వైరుధ్యం అవదా? కాఫిర్ అనే పదానికి అర్థం ఏమిటి? ఖురాన్ ఏది ప్రధానంగా 1300 ఏళ్లుగా ప్రోత్సహిస్తుంది? అంత శాంతియుతమైన మతం అయితే బానిసత్వాన్ని మరింత దృఢంగా, సంస్థాగతంగా ఎందుకు చేసింది?

    ReplyDelete
    Replies
    1. మీరు ఆవేశం తగ్గించుకొని. హిందూమతం ప్రోత్సహించిన బానిసత్వం (వర్ణవ్యవస్థ) గురించి ఆలోచించండి సార్. ఇస్లాం దదిద్రపు మతమే. కానీ హిందూఇజం ఇష్ట దరిద్రపు మతం/ జీవన విధానం.

      Delete
    2. హిందు పురాణాల్లాగే కురాన్ కూడా అనేక చేతులతో వ్రాసినది. కురాన్ పుట్టుక గురించి పాకిస్తానీ నాస్తికుడు ఇబ్న్ వర్రాక్ వ్రాసిన పుస్తకం ఆన్లైన్‌లోనే ఉంది. అది గూగుల్‌లో వెతికి చదవండి.

      Delete


  6. చాలా అవసరం. మాకాస్తి నాస్తి సో నాస్తికుల మని‌ సగర్వము గా చెప్పుకొనవలసిన అవసరమున్నది.


    నారదా
    జిలేబి

    ReplyDelete
  7. "మతంలో ఇలాంటివి ఉంటాయా?"

    ఈ చండాలంలేని మతమాలు చాలా తక్కువ. హిందూమతంలోనైతే ఇలాంటి పనులు కోకొల్లలు. క్రైస్తవ ఫాదర్లు నాకు తెలిసినంతవరకూ సోడొం గొమొర్రాల తరువాత జరిగిన ప్రవక్త లాతుగారి పవిత్ర రంకు గురించి ఎలా చెబుతున్నారో నాకు తెలీదు. మహమ్మదు... దత్త పుత్రుడి భార్య జైనబ్ ను కామించి పెండ్లాడిన ఘనుడు ( ఈ దరిద్రానికి అల్ల అనుజ్ఞ ఉంది మరి!!).

    ReplyDelete
  8. హిందూమతపు బండారం చెబుతాను వినండి. ఇది తప్పని చెప్పండి చూద్దాం.


    పరమశివుడు తల్లితో రమించలేదా? బ్రహ్మ తన కూతుర్ని కామించలేదా? బ్రహ్మ కొడుకులు వాళ్ళ చెల్లెల్ని కామించలేదా? చెల్లెల్లాంటి బృందని విష్ణువు చెరిచినతపని చెయ్యలేదా? అమ్మా అమా అంటూనే శారదా స్తుతిలో శంకరాచార్యుడు శరద యోనిని, దానిపైనున్న వెంట్రుకలను, శారద తొడలను, శారద assను వర్ణించలేదా? రామాయణం సంగతే తీసుకోండి... లక్ష్మణుడు, హనుమంతుడు మొదలగువారు సీతను దాని వక్షోజాలగురించీ, తొడల గురించీ, పిర్రలగురించీ పొగుడుతూ సంబోధిస్తారు. ఇలాంటి పనికిమాలిన పనులు ప్రస్తుతం చేస్తే సెక్సువల్ హెరాస్మెంట్ కేసులో బొక్కలో తోస్తారు. మన ఖర్మకొద్దీ ఇవన్నీ మన సంస్కృతి. వీటిని 2019లోకూడా మనం ఆచరించాలి. ఆ గాడిదలౌ కురాన్ని ఇంకా పాటిస్తున్నట్లు!!

    ReplyDelete
  9. ప్రతి వ్యక్తికి తను నాస్తికుడిని అనో, ఆస్తికుడిని అనో, కాముకుడిని అనో, ప్రేముకుడిని అనో చెప్పుకునే స్వేచ్చ ఉన్నది.. కాని తన భావాలే మంచివని అందరు ఒప్పుకోవాలని లేదా అనుసరించాలని ఒత్తిడి చేసే హక్కు, ఇతరుల నమ్మకాలని హేళన చేసే హక్కు లేవు.

    ఎవరి జాతీయ జెండా వారికి గర్వకారణం.. అలాగే ఎవరైనా వాల్ల భావాలు, మతాలు గర్వంగా చెప్పుకోవడం సమ్మతం.

    ReplyDelete
  10. తన భావాలే మంచివని అందరు ఒప్పుకోవాలని లేదా అనుసరించాలని ఒత్తిడి చేసే హక్కు, ఇతరుల నమ్మకాలని హేళన చేసే హక్కు లేవు.
    YES, WELL SAID !

    ReplyDelete
  11. కేతన్ గారు,హిందు పురాణాలన్నీ వేర్వేరు వ్యక్తులు వ్రాసినవి. అందుకే కొన్ని పురాణాలు సతీ సహగమనాన్ని సమర్థిస్తాయి, కొన్ని పురాణాలు విధవా వివాహాలని సమర్థిస్తాయి. వర్ణ వ్యవస్థ విషయంలో మాత్రం హిందు మత గ్రంథాల మధ్య భేదాభిప్రాయాలు తక్కువ. శూద్రుడు వేదాలు చదవకూడదు అని మనుస్మృతిలో ఉంటే శూద్రుడు అసలు చదువే నేర్చుకోకూడదని మహాభారతంలో ఉంది.

    ReplyDelete
    Replies
    1. వేదాల గురించి కూడా భిన్నాభిప్రాయాలున్నాయి ప్రవీణ్ గారు. మార్క్సిజాన్ని, వేదాలను రెండింటినీ సమాజహితమైనవిగానే భావించే మేధావులూ ఉన్నారు. వేదాలపై కూడా భిన్నాభిప్రాయాలున్నాయి. ఈ విషయాలపై సమగ్రసమాచారం తెలియదు కనుక వాదనలలో పరిమితంగానే పాల్టొనగలను.

      Delete
  12. వేదాలు వ్రాసిన టైమ్‌లో అన్ని దేశాల్లోనూ బానిస వ్యవస్థ ఉండేది. అప్పట్లో ఎవరికీ గతితార్కిక భౌతికవాద దృక్పథం కలిగే అవకాశం లేదు. ఎవడైనా మార్క్సిజమ్‌ని వేదాలకి దగ్గరగా చూస్తే అతనికి మార్క్సిజం తెలియదనే అనుకోవాలి. సొంత ఆస్తి వ్యవస్థలో అంతర్గతంగా ఉండే మంచి చెడులతో మార్క్సిజమ్‌కి సంబంధం లేదు. ఎప్పుడో బానిస వ్యవస్థ ఉన్న రోజుల్లో వ్రాసిన వేదాల గురించైతే మార్క్సిస్టులకి పూర్తిగా అనవసరమే.

    ReplyDelete
  13. అవ్వారి నాగరాజు అనే ఆయన హిందు మతానికి వ్యతిరేకమే కానీ ఆయన ఒకసారి వ్రాసారు "హిందు మతంలో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతుంటాయి, అందుకే ఆ మతం ఇప్పుడు కూడా బతికి ఉంది" అని. ఆయన థీసిస్‌లో ఒక లోపం ఉంది. హిందు మతంలో ఎన్ని మార్పులు జరిగినా పల్లెటూర్లలో ఇప్పుడు కూడా వేర్వేరు కులాలవాళ్ళు వేర్వేరు వీధుల్లో ఉంటున్నారు. దాని అర్థం ఈ మతంలో ఎన్ని మార్పులు జరిగినా ఆ మార్పులు కుల నిర్మూలన దిశలో ఉండవనే కదా. ఒక కులంవాళ్ళు ఇంకో కులంవాళ్ళ ఇంటిలో తినడం వేరు, కుల నిర్మూలన వేరు.

    బైబిల్‌లో కూడా ఎన్నో మార్పులు జరిగాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. బైబిల్ కొత్త నిబంధనలని ఈ రెండు వేల సంవత్సరాల కాలంలో అనేక సార్లు మార్చారు. బైబిల్ పాత నిబంధనలని కూడా చాలా సార్లు మార్చారు. బైబిల్ సృష్టి కథల్లో భూమి బల్లపరుపుగా ఉందనీ, అది స్తంభాల మీద నిలబెట్టబడి ఉందనీ వ్రాసి ఉంది. ఆ విషయం దాచి పెట్టడానికి తెలుగు పాస్టర్లు కూడా ప్రయత్నిస్తున్నారు. బైబిల్ నుంచి తొలిగించినవాటిలో కొన్ని సువార్తలు కూడా ఉన్నాయి. వాటిలో బర్నబాస్ సువార్త, అరబ్బీయుల బాల్య సువార్తల పేర్లు నాకు గుర్తున్నాయి. Search for "apocryphal gospels" on google.

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top