సాంప్రదాయం గొప్పదా!? సైన్స్ గొప్పదా!? ఈ రెండింటి మధ్య సమన్వయం సాధ్యమా!?


- Palla Kondala Rao,
03-09-2014.

*Re-published

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

kondalarao.palla@gmail.com

Post a Comment

  1. సాంప్రదాయం వెనక ఉన్న సైంటిఫిక్ కారణం కనుగొనగలిగితే సమన్వయం సాధ్యపడుతుంది. కానీ దురదృష్టవశాత్తు మన వారికి విమర్శించడం మీద ఉన్న ఆసక్తి అసలైన ఉద్దేశ్యం కనుగొనడం మీద లేదు. ఒకప్పుడు మూఢ నమ్మకం అని కొట్టిపారేయబడిన అనేకానేక సంప్రదాయాలు తర్వాత శాస్త్రీయంగా నిరూపించబడ్డాయి.

    ReplyDelete
    Replies
    1. స్వర్ణమల్లిక గారు మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. అయితే సాంప్రదాయం పేరుతో చెప్పేవన్నీ కరెక్టు కూడా కాదు. సాంప్రాదాయాలను ఫేషన్ గా విమర్శించకుండా అనుభవపూర్వకంగా ఏర్పడిన సాంప్రదాయాలలోని మంచిని సైన్స్ అందరికీ వివరించగలగాలి. అప్పుడు సాంప్రదాయాల విలువ పెరుగుతుంది. మూఢంగానో బలవంతంగానో సాంప్రదాయాలను బ్రతికించలేము.

      Delete
    2. స్వర్ణమల్లిక గారు,
      "ఒకప్పుడు మూఢ నమ్మకం అని కొట్టిపారేయబడిన అనేకానేక సంప్రదాయాలు తర్వాత శాస్త్రీయంగా నిరూపించబడ్డాయి"

      కొన్ని ఉదాహరణలు ఇవ్వగలరా?

      Delete
    3. ఉదయాన్నే వ్యాయామం చెయ్యడం - Vitamin D కోసం
      తులసి తీర్ధం తీసుకోవడం - cancer దగ్గు మరియు జలుబులకు మంచి మందు.
      కల్లాబు జల్లడం - anti bacterial

      Delete
    4. “ఉదయాన్నే వ్యాయామం చెయ్యడం” ఏ సమాజంలోను సంస్కృతి లోను మూఢ నమ్మకంగా పరిగణించ బడిందని నేననుకోవడం లేదండి.

      “తులసి తీర్ధం తీసుకోవడం”, “కల్లాబు జల్లడం” మరియు “ఎదురు మేనరికం పెళ్ళిళ్ళు” శాస్త్రీయంగా నిరూపించబడ్డాయనే విషయం కూడా నా దృష్టికి రాలెదు. మీ దగ్గర వివరాలు, ఆధారాలేమైనా ఉంటే, దయచేసి share చెయ్యగలరు.

      Delete
    5. ఎదురు మేనరికం ఎందుకు చెడ్డది అంటే
      Girl born from Mother(x1,x2) and Father(X3,Y1) - as per
      Boy born from Sister of Girls Mother(x3/x4,x5) and mother(X6 and Y2)

      Girls XY combination is (x1/x2,x3)
      Boy XY combination(y2,x3/x4/x5)
      if this combination boy marries girl see there is a possibility of girl getting born with combination x3,x3 which lead to non existence of girl, as science proves if parents have genetic similarities you will have child with disabilities.

      Delete
    6. I understand genetics and agree with your point.

      ఏ antibiotics లేనిరోజుల్లో కళ్ళాపి కొంతమేరకు మనుషుల్ని రక్షించి ఉండవచ్చనికూడా ఒప్పుకుంటున్నాను. పెన్సిలిన్ లాంటి వాటికే సూక్ష్మక్రిములు రోగనిరోధక శక్తిని అభివృధ్ధిచేసుకునడాన్ని మనం చూశాం. బాక్టీరియా, వైరస్‌లూ ఇలా తెలివిమీరుతుండడంవల్ల గతదశాబ్దపు మందులు ఈ దశాబ్దానికి పనికిరావు. అలాంటప్పుడు ఈ కళ్ళాపిజల్లడం అనేది ఇంకా ప్రభావవంతమేనా అన్నదానిపై ఏమైనా పరిశోధనలున్నాయా?

      మనకు నిత్యజీవితంలో ఎదురయ్యే బాక్టీరియంలు మనకు జానిచేసేవికాకపోగా మేలుచేసేవి. ఉదా:- పాలు పెరుగుగా మారడానికీ, మనం తిన్నాహారంలోని కొన్ని componentsని అరిగించుకోవడానికి బాక్టీరియంలు సహాయపడతాయి. ఈ కళ్ళాపిజల్లడం పరితీరు హానికరమైన బాక్టీరియాపై ఒకరకంగానూ, మేలు కలిగించే బాక్టీరియాపై మరోవిధంగా ఉంటుందని ఋజువుచేయడానికి ఏమైనా పరిశోధనలు జరిగుంటే వాటి వివరాలు పంచుకోగలరా?

      Delete
    7. మా సైన్స్ మాస్టారు మాకు ఒకసారి వాళ్ళ మామ్మగారు చెప్పిన మాట చెప్పారు.

      మూఢనమ్మకం: "చంద్రగ్రహణం గ్రహణం రోజు టాయిలెట్ వాడకూడదు"
      ఆయన చెప్పిన కారణం: పూర్వకాలంలో టాయిలెట్స్ లేవు. పొద్దు గుంకిన తరువాత పొలం గట్లకేసి వెళ్ళేవాళ్ళు. "చంద్రగ్రహణం రోజున చంద్రుని కిరణాలు సోకిన గర్భిణీ స్త్రీలకి పుట్టే పిల్లలు సంపూర్ణ ఆరోగ్యంతో పుట్టరు" అనేది జనాల నమ్మకం. అందుకని చంద్రగ్రహణం రోజు తెల్లవారుఝాము/రాత్రి [గ్రహణం ఎప్పుడు వస్తుందో తెలీదు కాబట్టి కావచ్చు] టాయిలెట్ కి - ఆరు బయటకు వెళ్ళకూడదు అని అనేవారుట. కాలక్రమేణా ఇంట్లోనే టాయిలెట్స్ కట్టుకున్నారు. అయినా ఆవిడ "చంద్రగ్రహణం గ్రహణం రోజు టాయిలెట్ వాడకూడదు" అనేదిట.

      చంద్ర/సూర్య కిరణాలు గ్రహణం తరువాత చాల తీవ్రంగా వుంటాయి అని అలా అనేవారుట.

      Delete
    8. గ్రహణం అంటే ఒక ఖగోళవస్తుకి, భూమిపైనున్న మనకి మధ్యలో ఇంకొకవస్తువురావడం లేదా భూమినీడలోకి ఇంకొక వస్తువురావడం. ఈ రెండింటిలో దేని ప్రభావం వల్లకూడా ఆయా వస్తువులు వెలువరించే కిరణాల్లోని తీవ్రతో మరొకటో మారదు. కాబట్టి సూర్యగ్రహణంనాడో, చంద్రగ్రహణంనాడో బయటతిరగడంవల్ల ఏదో అవుతుందనేది ఒట్టిభ్రమ అంతకుమించి సాంప్రదాయ కలిగించిన ఒక అపోహ. ఆసమయంలో జనాలని panicకి గురిచేసి పూజలూ అవీచేయించి డబ్బుదండుకొందామని కొందరు ప్రబుధ్ధులు చేసిన.చేస్తున్న మోసం.

      కాకుంటే సూర్య గ్రహణంనాడు సూర్యకాంతి తీవ్రత తక్కువగా ఉంటుందికాబట్టి (మనకు అందాల్సిన కాంతిలో కొంతభాగాన్ని చంద్రుడు అడ్డుకుంటాడు కాబట్టి) సూర్యగోళాన్ని నేరుగా చూసేప్రయత్నం చేయగలం కాబట్టి మనకళ్ళు UV rays ప్రభావానికి గురౌతాయికాబట్టి సూర్యగ్రహణ సమయంలో సూర్యుణ్ణి చూడవద్దని చెబుతారు (మామూలు రోజుల్లో మనకంటిలోని aperture ఈపనిని చెయ్యనివ్వదు). ఈ విషయం పట్టాని కొందరు మేధావులు దర్భలు గ్రహణంవల్ల కలిగే రేడియేషన్‌ని శుధ్ధిచేస్తాయని ఏవేవో తము తెలియనిదానికి సైన్సునుతోడుతెచ్చుకొని చెబుతుంటారు. అసలు రేడియేషన్అన్న ఇంగ్లీషుపదానికి అర్ధాన్ని సరిగ్గా తెలుసుకోకుండా రేడియేషన్ అంటే అదేదో భూతమన్నట్లు ఉంటాయి వీళ్ళుచెప్పేమాటలు.

      Delete
  2. సందర్భాన్ని బట్టి రెండూ గొప్పవే.
    కారులో గుడికి వెళుతున్నాము అంటే సమన్వయం సాధ్యమయినట్టే కదా!

    ReplyDelete
    Replies
    1. మీరిచ్చిన ఉదాహరణ బాగుంది బోనగిరి గారు.

      Delete
    2. అదేమిటలా అనేశారు! పట్టుశాలువతో పీకనులిమిచంపేస్తే, గౌరవాన్నీ, కోపాన్నీ సమన్వితం చేసినట్లా?

      కారును కొనగలగడం అనేది ఆర్ధికస్థితిని తెలుపుతుందేతప్ప ఆ మనిషి తెలివితేటల స్థాయినికాదు. ప్రపంచం ఎలా పనిచేస్తుందో తెలిసినవారు మిగతా మనిషులకంటే మతనమ్మకాలను తక్కువగా కలిగుంటారు. ప్రపంచాన్ని గురించిన వాళ్ళ అవగాహన పెరిగేకొద్దీ వాళ్ళు 'దేవుడు' అన్నపదాన్ని 'సంభావ్యత' అన్నపదంతో రీప్లేస్ చేస్తారు. ఈ తీరుని మనం భౌతికశాస్త్రవేత్తలలోనూ, ఆర్ధికశాస్త్ర నిపుణుల్లోనూ బాగా గమనించవచ్చు.

      మనిషికి unknown అన్నది ఎప్పుడూ discomfort కలిగిస్తుంది. కాబట్టే అలాంటి unknowns అన్నింటికీ ఒక వివరణగా ఒకనాడు దేవుణ్ణి చెప్పుకొని (ఆల్జెబ్రాలో 'x' లాగా అన్నమాట), దానికి అనుబంధంగా కొన్ని పధ్ధతులు (పూజలూ, సాంప్రదాయాలు) ఏర్పాటుచేసుకున్నాడు. రాన్రానూ ఈ 'దేవుడు' వివరణ ఖచ్చితంగా పనిచేయడంలేదనీ తెలుసుకొని (ఉదాహరణకి దేవుడు అన్నివేళలా predictable waysలో పనిచెయ్యడు) ప్రస్తుతం దన్ని solve చెయ్యడానికి పూనుకుంటున్నాడు. కాబట్టే ఒకప్పుడు 0% నికి దగ్గరగా ఉండిన హేతువాదుల (మరియు నాస్తికుల సంఖ్య) ఇప్పుడూ పదుల శాతాల్లో ఉంటొంది. ఆ మిగిలిన ఆస్తికుల్లోనూ 'providence', 'శరణాగతి' లాంటి వాటిని నమ్మేవారు ఒకటోరెండోశాతం ఉంటారు. ఇదేమాట ఇంకోలా చెప్పాలంటే ప్రస్తుత ప్రపంచంలో ఆస్తికులు ఎక్కువేకానీ దైనందిన జీవితంలో వారు హేతువాదుల్లానే ఆలోచిస్తారు. ప్రస్తుత ప్రపంచంలో హేతువాదభావాలే ఆస్తికభావాలకంటే ఎక్కువ.

      క్షమించాలి విషయం సాంప్రదాయాల గురించైనా, దేవాలయాన ప్రస్తావన వచ్చేసరికి దేవుడు కోణంలో నా వ్యాఖ్య సాగింది.

      Delete
  3. సంప్రదాయాలు & science మధ్య ఉన్న ఒక ముఖ్య తారతమ్యం - సార్వత్రిక ప్రామాణికత (universal validity). దేశము, జాతి , భాష, మతము, కులము లాంటి ఎన్నో అంశాలు సంప్రదాయాలను ప్రభావితం చేస్తాయి. భౌగోళిక, సామాజిక, కాలమాన, స్థితిగతుల ప్రభావంతో సంప్రదాయాలలో నిరంతర విరుద్ధతలు, మార్పులు కొనసాగుతూనే ఉంటాయి. But, science is universal. The validity or validation of science doesn’t change based on any of these factors or, in other words, science is valid irrespective of these factors.

    కొంచెం తీవ్రమైన ఉదాహరణలైనా, సతీ సహగమనం, బాల్య వివాహాలు, అంటరానితనం భారతదేశంలో ప్రస్తుతం చట్ట విరుద్ధమైన ఒకనాటి సంప్రదాయాలు. చాలా ఇస్లామిక్ దేశాల్లో బాల్య వివాహాలు ఇప్పటికీ సంప్రదాయమూ చట్టబద్ధమూనూ. జీవ, వైద్య శాస్త్రాలపరంగా తల్లికి బిడ్డకి, సామాజిక శాస్త్ర పరంగా కుటుంబానికి హానికరమైన బాల్య వివాహం లాంటి సంప్రదాయాలు ఇప్పటికీ మూడోవంతు ప్రపంచ జనాభాలో కొనసాగుతున్నయంటే, సంప్రదాయం science కంటే బలమైనదని ఒప్పుకోవచ్చేమో కాని, ఉన్నతమైనదని చెప్పలేము.

    తరచి చూస్తే, సంప్రదాయమన్నా science అన్నా ఒక set of rules. అర్ధం లేని, అర్ధం కాని నిబంధనలు సంప్రదాయాలు. అర్ధం చేసుకొనబడి, సార్వత్రికంగా ఉపయోగించబడుతున్న నియమాలు science.

    ReplyDelete
    Replies
    1. సాంప్రదాయం కంటే సైన్సే ఉన్నతమైనది నిస్సందేహంగా. సాంప్రదాయాలలో మీరు చెప్పినట్లు దుస్సంప్రదాయాలున్నట్లే మంచివీ ఉంటాయి. కొన్నింటిలో సాంప్రదాయంలో ఉన్న ఔన్నత్యాన్ని సైన్స్ ప్రూవ్ చేయలేకపోవచ్చు. సైన్స్ పరిధిని మించి సాంప్రదాయం మనిషికి మంచికి కూడా దోహదపడవచ్చు. అటువంటి వాటిని సోషల్ సైన్స్ అనవచ్చు కూడా.

      సాంప్రదాయంలో అర్ధం కాని అర్ధం లేని కొన్ని రూల్స్ ఉండవచ్చునేమో కానీ సాంప్రదాయమంతా అర్ధం లేని లేదా అర్ధం కాని నిబంధనలమయమైతే కాదని నా అభిప్రాయం.

      Delete
    2. "సాంప్రదాయంలో ఉన్న ఔన్నత్యాన్ని సైన్స్ ప్రూవ్ చేయలేకపోవచ్చు"

      ఈ సోకాల్డు ఔన్నత్యాన్ని నిగ్గుతేల్చేది సైన్సే ఐనప్పుడు, విషయమింకా ఋజువుచేయబడకుండానే అది ఉన్నతమైనదని ఎలా చెప్పగలుగుతున్నారుమీరు. Medical sciences ఋజువుచెయ్యనంతమాత్రాన ఇది మందుకాకుండా పోదుకదా అని మనిష్టం వచ్చిన వైద్యాన్నిపాటిస్తే అది ప్రాణాలమీదకు తీసుకురాదూ? ఋజువుకానంతమాత్రాన ఇది బంగారం కాకుండాపోదు అంటూ నేనుమీకు ఒక మెరిసేలోహాన్ని కొసప్రయత్నిస్తే మీరు కొనేస్తారా? నిజజీవితంలో ఎప్పుడూ ఇలా ఋజువుల ప్రాసెస్‌పూర్తయ్యేదాకా ఆగేమనం సాంప్రదాయాల విషయంలో ఋజువుని ఎందుకు బైపాస్ చెయ్యాలని ఎందుకు మీరు చెబుతున్నారు?

      "సాంప్రదాయంలో అర్ధం కాని అర్ధం లేని కొన్ని రూల్స్ ఉండవచ్చునేమో కానీ సాంప్రదాయమంతా అర్ధం లేని లేదా అర్ధం కాని నిబంధనలమయమైతే కాదని నా అభిప్రాయం."

      Exactly!. That's the point. ఏరూల్ అర్ధవంతమైనదన్నదాన్ని ఏనాటికైనా నిగుతేల్చవలసింది సైన్సే. ఈలోగా తొందరపడి అర్ధంలేని రూల్స్‌కి మనల్ని మనం కట్టేసుకోవడమెందుకు?

      Delete
  4. కొండలరావు గారూ, నా వ్యాఖ్యను తెలుగులో కాక ఇంగ్లీషులో రాస్తున్నందుకు మన్నించండి.

    Science is a compilation of knowledge. The key features are 1. descriptive approach and 2. evidence based acceptance

    Custom is a compilation of actions and beliefs. The key features are 1. prescriptive approach and 2. social based acceptance

    ReplyDelete
    Replies
    1. జై గారు, నాకర్ధమైన మేరకు మీరు science and custom ల వివరణ ఇచ్చినట్లున్నారు. అయితే ఈ రెండింటిలో సమాజానికి ఏది ఎక్కువ మేలు చేస్తుంది. రెండింటి మధ్య సమన్వయం అవసరమా!? అవసరం అనుకుంటే ఎలా సాధ్యం చేయొచ్చు? అనేది మీ అభిప్రాయం చెప్పగలరు. వీలయితే ఉదాహరణలు వివరించగలరు.

      Delete
    2. Contrary to the people's belief, సైన్స్‌ది hard power (సైన్సు ఒకవిషయాన్ని 'నిరూపిస్తే' ఇక దానిమీద ప్రతివాదాలకు లేదా వేరే అభిప్రాయాలకు తావులేదు). మతం విషయంలో ఇది నిజంకాదు. ఒకరు విష్ణువు గొప్పవాడంటే, ఇంకొకరు శివుడు గొప్పవాడనవచ్చు, ఇంకొకరు వారిరువురూ ఒక్కటే అనవచ్చు. ఇంకొకరు యేసు గొప్పవాడనవచ్చు మరొకరు అలా గొప్పవాడనవచ్చు. ఇవన్నీ ఏసినీహీరో గొప్పవాడన్న ప్రశ్నకు సమాధానంగా వినవచ్చే 'అభిప్రాయా'లేతప్ప ఋజువులులేని విషయాలు. Religion is soft power. One could easily contradict what a particular rel. says because rel. is not about facts but about opinions.

      Delete
  5. సంప్రదాయం అనేది మానవ మనుగడకు, వారి అవసారాలకు అది అజ్నానమైనా, విజ్నానమైనా సరే ఉపయోగమైనదే. అది మానవ అనుభవాలనుండి, వాస్తవికత నుండి విడదీసి చూడలేము. నిజానికి సాంప్రదాయం కూడా ఒక ప్రదమిక విజ్నానమే! కానీ అది అవసరాలకు అనుగునంగ అభివృద్ది నిరోదకంగా, ఒక శ్లాశాసనంగా మారినపుడు మాత్రమే సాంప్రదాయంతో మనకు పేచి! అపుడు మాత్రమే దాన్ని '' సాంప్రదాయం ' అని నిరంకుశత్వంగా బావిస్తున్నాం. ఎందుకంటే అభివృద్ది నిరోదకానికి దోహదకారిగా, సమాజంలో కొందరి చేతిలో ఆయుధంగా పనిచేస్తుంది కనుక. సైన్స్‌ ఎప్పుడూ నిరంకుశత్వానికి వ్యతిరేక మైనిదే. దానికి ప్రశ్నించే గుణం ఉన్నది కాబట్టి ప్రశ్నించడాన్ని నిరంకుశత్వం, లేక అధికారం ఇష్టపడదు. సైన్స్‌ ఎప్పుడూ అభివృద్దికి దోహదకారి. సాంప్రదాయంకూడా సైన్స్‌ ను ఉపయోగించు కుంటుంది. దాన్ని ప్రశ్నించనంతవరకు. ఇది తాత్కాలమైనదే!

    ReplyDelete


  6. నిస్సందేహంగా సైన్సే గొప్పది.దీనిమీద చర్చ కూడా అనవసరమేమో.ఐతే సైన్సు ప్రకారం మంచిది అని రుజువైన సంప్రదాయాలను మాత్రం పాటించవచ్చును.

    ReplyDelete
  7. ఈ టపాకోసం నేనొక వ్యాఖ్య వ్రాసినట్లు గుర్తు. నాకు గుర్తున్నంత వరకూ అదే మొదటి వ్యాఖ్య కూడా. కాని అది కనబడటం లేదు. బహుశః దానిని స్పాము అనే పాము మింగేసిందేమో కొండలరావుగారు కొంచెం గమనించగలరు.

    ReplyDelete
    Replies
    1. నాకు తెలిసి మీ కామెంట్ ఒక్కటి కూడా పబ్లిష్ కాకుండా లేదు. ఆ అవాకాశం ఉండదనుకుంటున్నాను కూడా. దయచేసి మీ అభిప్రాయాన్ని మరోసారి కామెంట్ ద్వారా తెలుపగలరు.

      Delete
    2. మతిమరుపు వచ్చేస్తోంది వచ్చేస్తోంది అనుకునే లోగా వచ్చేసింది కాబోలు నాకు!
      బహుశః టైపు చేసి Publish Button నొక్కటం మరిచిపోయానేమో.

      Delete
  8. Today’s scientific studies lead to tomorrow’s tradition and tomorrow’s discoveries lead to day after tomorrow’s traditions. Both are interlinked.

    ReplyDelete
  9. సాంప్రదాయిక గోమూత్రం కరోనాని నిరోధిస్తుందని ఆర్.ఎస్.ఎస్.వాళ్ళు ప్రచారం చేసారు కానీ ఇప్పుడు ఏమయ్యింది? Search on Google for "gaumutra".

    ReplyDelete
    Replies
    1. ప్రపంచాన్ని కమ్యూనిజం ఉధ్ధరిస్తుందని ఎందరో ప్రచారం చేసారు. కానీ చివరికి ఏమయ్యింది? ఒకవేళ గోమూత్రం వ్యవసాయానికి ఎరువులాగా ఐనా పనికి వస్తుందేమో. మరి కమ్యూనిజం? ప్రవీణ్, వాదనల వలన ఏమి లాభం? కాలక్షేపం కొట్లాటల వలన అందరి సమయమూ వృధా కావటం ఒక్కటే జరిగేది!

      Delete
    2. కమ్యూనిస్ట్ మేనిఫెస్టో తెలిసినవాడు ఎవడూ సోవియట్ సమాఖ్యలో ఉండినది కమ్యూనిజం అనుకోడు. "ఇండియాలో హిందు మతం ఉంది కనుక ఇక్కడ కొత్త వైరస్ పుట్టదు" అని భక్తి టి.వి.లో జరిగిన ప్రచారం నేను చూసాను. 1918లో స్పానిష్ ఫ్లూ వచ్చి ఇండియాలో కోటి మందికి పైగా చనిపోయారని ఆ చానెల్ వక్తలకి తెలియదు. మా తాతలు గౌమూత్రం తాగారు కనుక మాకు అల్లోపతి మందులు అవసరం లేదు అనుకునేవాళ్ళు ఫేస్‌బుక్‌లో ఇప్పుడు కూడా ఉన్నారు.

      Delete
    3. < సాంప్రదాయిక గోమూత్రం కరోనాని నిరోధిస్తుందని ఆర్.ఎస్.ఎస్.వాళ్ళు ప్రచారం చేసారు కానీ ఇప్పుడు ఏమయ్యింది? >

      సత్యం.

      < ఒకవేళ గోమూత్రం వ్యవసాయానికి ఎరువులాగా ఐనా పనికి వస్తుందేమో. >

      పనికి వస్తున్నది కూడా ఇతరత్రా ఉపయోగాలూ ఉన్నాయి. కానీ గోమూత్రం సర్వరోగ,సర్వపాప నివారణి అనే సాంప్రదాయం పచ్చి అబద్దం కాదా గురువుగారూ?

      < కమ్యూనిస్ట్ మేనిఫెస్టో తెలిసినవాడు ఎవడూ సోవియట్ సమాఖ్యలో ఉండినది కమ్యూనిజం అనుకోడు. >

      కమ్యూనిష్టు మేనిఫేష్టో ప్రకారం ఏయే దేశాలు కమ్యూనిష్టు దేశాలని మీ అభిప్రాయం ప్రవీణ్ గారు.

      Delete
    4. నమ్మకం వేరు, సిద్ధాంతం వేరు. గౌమూత్రానికి వైరస్‌కి చంపే శక్తే లేదు. మన సంప్రదాయ వైద్యంలో గౌమూత్రం ఉంది కనుక ఎయిడ్స్‌కీ, కరోనాకీ కూడా గౌమూత్రం వాడుదామంటే కుదరదు. క్యూబాలో కూడా పోలీస్ స్టేషన్‌లు, కోర్ట్‌లు ఉన్నాయంటే దాని అర్థం క్యూబా కూడా కమ్యూనిస్ట్ దేశం కాదనే కదా. ఇప్పటి వరకు రాని కమ్యూనిజం ఓడిపోయిందని ఎలా అనగలుగుతున్నారు?

      Delete
    5. సాంప్రదాయాలన్నీ తప్పు కాదు ప్రవీణ్ గారు. సాంప్రదాయాలలో కూడా అనుభవపూర్వక ఫలితాలతో ఏర్పడేవి శాస్త్రియాలే. హిందుమతం కు చెందినది కావున నేను ఆయుర్వేదాన్ని నమ్మను అంటే మూర్ఖత్వమే కదా? అన్నింటికీ సైన్స్ మీదనే ఆధారపడడం ప్రస్తుతానికి అసాధ్యం. సైన్స్ ప్రకృతిలో, ప్రకృతి ధర్మంలో భాగమే తప్ప, సైన్స్ ద్వారా ప్రకృతి సూత్రాలు ఏర్పడవు. పైగా దుర్మార్గుల చేతిలో సైన్స్ వల్ల ప్రకృతికీ, పర్యావరణానికీ ముప్పు కలుగుతున్నది కూడా. సాంప్రదాయాలలో ఫలితం ఇస్తున్నప్పటికీ సైన్స్ గుర్తించకపోతే అది సైన్స్ పొరపడుతున్నట్లుగా లేక సైన్స్ స్వేచ్చగా లేక బందీగా ఉండే పరిస్తితులలో ఉన్నదేమో అనుమానంతో పరిశీలన చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు పన్ను పీకాలని అల్లోపతి డాక్టర్ నిర్ధారించాడు. నాటు వైద్యం లో బరింక చెట్టు పాలు చిగుర్లకు మర్ధన చేస్తే ఆ పన్ను పీకాల్సిన అవసరం లేకుండా తిరిగి వైద్యం అవసరం లేకుండా గట్టిపడింది అనుకుందాం. ( అలా జరుగుతుంది కూడా ) అపుడు సైన్స్ ఒప్పుకోదు కాబట్టి, అల్లోపతి సిలబస్ లో లేదు కాబట్టి నాన్సెన్స్ అన్టానడం కూడా మూర్ఖత్వమే కాగలదు. లోఅకజ్ఞానానికీ, పుస్తక జ్ఞానానికీ చాలా సందర్భాలలో పొంతన కుదరకపోవచ్చు. ఫలితం ఇచ్చేది, ఆచరణలో అనుభవంలో నిలబడేదే సైన్స్.

      కమ్యూనిస్టు దేశం ఉండే అవకాశమే లేదు. ఉంటే కమ్యునిస్టు ప్రపంచం (వసుధైక కుటుంబం) ఉండాలి. లేదా సాధించుకోవాలి. అందుకే కమ్యూనిజానికి మరణం ఉండదు. కానీ సాధారణ పరిభాషలో కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో జరిగే ప్రజాస్వామ్యేతర పాలనలను కమ్యూనిస్టు ప్రభుత్వాలుగానే పరిగణిస్తారు కదా? ఆ లెక్కలో మీరు గుర్తించే కమ్యూనిస్టు ప్రభుత్వాలు ఏవి అన్నది నా ప్రశ్న. లేదా కమ్యూనిస్టు పార్టీ, వర్గపోరాటం, పాలన లేకుండా ఒకేసారి కమ్యూనిజం వస్తుందని భావిస్తున్నారా?

      Delete
    6. చివరి పోలీస్ శ్రమికుడిగా మారినప్పుడు, చివరి తుపాకీ వదిలెయ్యబడినప్పుడు కమ్యూనిజం వచ్చినట్టు. అంత వరకు రాని కమ్యూనిజం ఓడిపోయింది అనే వాదన అనవసరం. గోమూత్రం సంగతా? పిడుక్కీ, బియ్యానికీ ఒకే మంత్రం ఎప్పుడూ పని చెయ్యదు. గోమూత్రాన్ని నమ్మితే మునిగేది గంగే.

      Delete
    7. < చివరి పోలీస్ శ్రమికుడిగా మారినప్పుడు, చివరి తుపాకీ వదిలెయ్యబడినప్పుడు కమ్యూనిజం వచ్చినట్టు. అంత వరకు రాని కమ్యూనిజం ఓడిపోయింది అనే వాదన అనవసరం. >

      ఓ.కే. రాజ్యరహిత సమాజం రావాలని ఆశిద్దాం. గోమూత్రాన్ని నమ్మడమొక్కటే సాంప్రదాయమా? కాదు కదా? ఇక్కడి ప్రశ్న సాంప్రదాయం గొప్పదా!? సైన్స్ గొప్పదా!? ఈ రెండింటి మధ్య సమన్వయం సాధ్యమా!?....... దీనికి మీ సమాధానంలో గానీ, శ్యామలరావు గారి సమాధానంలో గానీ క్లారిటీ రాలేదు. ఒకదానికొకటి ప్రత్యారోపణలతో పక్కదోవపట్టడం తప్ప మీ వాదనలతో ఈ ప్రశ్నకు సమాధానం దొరికినట్లు కాదు.

      Delete
  10. సంప్రదాయాలన్నీ సైన్స్ తెలియని రోజుల్లో కనిపెట్టినవే. న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతం చాలా సందర్భాల్లో శాస్త్రీయమైనదే కానీ మరీ వేగంగా కదిలే వస్తువుల విషయంలో న్యూటన్ సిద్ధాంతంలో కూడా లోపాలు కనిపిస్తాయి. సైన్స్ అభివృద్ధి చెందని రోజుల్లో పుట్టిన సంప్రదాయాల్ని సైన్స్‌తో పోల్చడం అనవసరం. అనుభవాలతో తెలుసుకోవడం సైన్స్ నేర్పిస్తుంది. పెద్దలు చెప్పినది గుడ్డిగా నమ్మడం సంప్రదాయం నేర్పిస్తుంది.

    ReplyDelete
    Replies
    1. < సంప్రదాయాలన్నీ సైన్స్ తెలియని రోజుల్లో కనిపెట్టినవే. >

      తప్పుడు ఆలోచనా విధానం. అప్పటికి తెలిసిన సైన్స్ అది అని ఆలోచించి మెరుగైనది రూపొందించడం శాస్త్రీయ విధానం, సైన్స్ పద్ధతి.

      < అనుభవాలతో తెలుసుకోవడం సైన్స్ నేర్పిస్తుంది. >

      అవును. సాంప్రదాయాలు కూడా అనుభవ పూర్వకంగా తెలుసుకున్నవి, నమ్మినవి. వాటిలో గుడ్డి నమ్మకంతో ఏర్పడినవి కాలానుగుణంగా మనుగడలో లేకుండా పోతాయి. మనుగడలో లేకుండా పోయినవాటిలో కూడా సైన్స్ ఉంటే మళ్లీ వెతుక్కుని మరీ ఆచరిస్తారు.

      < పెద్దలు చెప్పినది గుడ్డిగా నమ్మడం సంప్రదాయం నేర్పిస్తుంది. >

      సాంప్రదాయాలను గుడ్డిగా నమ్మాలనే సాంప్రదాయం, పెద్దలు ఏది చెప్పినా వినాల్సిందేననే సాంప్రదాయం మంచి సాంప్రదాయం కాదు. ఆలస్యం అమృతం విషం అన్న పెద్దలే నిదానమే ప్రధానం అన్నారు. సందర్భాన్ని బట్టి మనం వాడుకుంటాము. సైన్స్ చెప్పినా, సాంప్రదాయం చెప్పినా ఫలితాన్ని బట్టి అవి మనుగడలో ఉంటాయి. ఇది మనం శాస్త్రీయ ధృక్పథంతో తేల్చుకోవలసిన అంశం.

      Delete
    2. < న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతం చాలా సందర్భాల్లో శాస్త్రీయమైనదే కానీ మరీ వేగంగా కదిలే వస్తువుల విషయంలో న్యూటన్ సిద్ధాంతంలో కూడా లోపాలు కనిపిస్తాయి. >

      చాలావరకు సైన్స్ విషయాలలో ఇదే వర్తిస్తుంది. కాబట్టి ప్రకృతి ధర్మంలో సైన్స్ కొంతమాత్రమే కనిపెట్టగలుగుతుంది. తప్పు అని ఋజువైతే అప్డేట్ చేసుకుని వినమ్రతతో పురోగమిస్తుంది. కానీ మతపరమైన సాంప్రదాయాలు మాత్రం మొండిగా దబాయించడానికి, బొంకడానికీ, అతిశయోక్తులు, అబద్దాలు వల్లెవేస్తుంటాయి. నిజం ఒప్పుకోవడానికి జంకుతాయి. ఎప్పటికోగాని డొంకతిరుగుడుగా అంగీకరించక తప్పని స్తితి, పరిమితి మతానిది. సాంప్రదాయాలన్నీ మతపరమైనవి మాత్రమే అనుకోవడమూ తప్పు. అనుభవం, ఆచరణ, ఫలితం, పరిశీలన.... ఈ ప్రాసెస్ ద్వారా ఏర్పడే సాంప్రదాయాలు కూడా సైన్సేనని గమనంలో ఉంచుకోవాలి. సాంప్రదాయం అంటే సైన్స్ కు విరుద్ధం అనే విపరీత ధోరణి అతివాదం అవుతుంది తప్ప సైన్స్ కాదు.కాలేదు.

      Delete
  11. Regarding fast motion, Albert Einstein's theory is precise. సంప్రదాయం అంటే పది మంది నమ్మినది ఆచరించడం తప్ప అనుభవంతో తెలుసుకోవడం కాదు. భూమి గుండ్రంగా ఉందని ఆరిస్టాటిల్, ఎరాస్తెతనీస్ వంటి వారు అనుభవాత్మక ఆధారాలు (ఎంపైరికల్ ఎవిడెన్సెస్)తో చెపితే ఎవరూ నమ్మలేదు. నావికులు దక్షిణం వైపు ప్రయాణిస్తున్నప్పుడు దాక్షిణాత్య నక్షత్రాలు పైకి లెగుస్తున్నట్టు కనిపిస్తాయి. రోమ్‌లో కనిపించే కొన్ని నక్షత్రాలు ఈజిప్ట్‌లో కనిపించవు, ఈజిప్ట్‌లో కనిపించే కొన్ని నక్షత్రాలు రోమ్‌లో కనిపించవు. భూమి వంకరగా ఉంది అనడానికి ఇవి ఆధారాలు అని చెపితే అప్పట్లో ఎవరూ నమ్మలేదు. చంద్ర గ్రహణం సమయంలో భూమి నీడ చంద్రుని మీద వృత్తాకారంలో పడుతుంది. భూమి నీడ చంద్రుని మీద పడడం వల్లే చంద్ర గ్రహణాలు ఏర్పడతాయని చెపితే మన పెద్దవాళ్ళు ఇప్పుడు కూడా నమ్మరు. పెద్దవాళ్ళు చెప్పేది వేరు, సైన్స్ వేరు.

    ReplyDelete
    Replies
    1. మూఢనమ్మకాలను, సాంప్రదాయాలనూ ఒకే గాటన కడుతున్నారు ప్రవీణ్. భూమి గుండ్రంగా ఉందని చెపితే ఎవ్వరూ నమ్మకపోతే ఇప్పటికీ భూమి బల్లపరపుగానే ఉందని బైబిల్ లో ధైర్యంగా చెప్పేవారు. మరి వారా పేజీలను మూసుకోక తప్పనిది సైన్స్ వల్లనే. సైన్స్ ని ప్రజలు నమ్మడం వల్లనే. సాంప్రదాయాలైనా అంతే. గుడ్డిగా చెపితే అందరూ, అన్ని వేళలా గుడ్డిగా నమ్మరు. నమ్మడానికి ఏదో ఒక పునాది, స్పష్టమైన నమ్మకం లేకపోవడం మాత్రమే. కోవిడ్ 19 వస్తే దేవాలయాలు మూతపడక తప్పలేదు. కానీ ఆసుపత్రులు, డాక్టర్లు, పారిశుధ్య కార్మికులే దేవుళ్ళుగా మారారు. కోవిడ్ కు మందు కనుక్కునేది ప్రకృతినుండే అనేది నిజం. ప్రకృతిలో లేనిదానిని మనిషి సైన్స్ ద్వారా సృష్టించలేడు. ఉన్నదానిని కనిపెట్టడం, వివరించగలగడం సైన్స్ చేయగలదు. సాంప్రదాయాలలో సైన్స్ ఉండే సందర్భాలను సైన్స్ నిశితంగా పరిశీలించాలి. మూఢంగా ఉన్నవాటిని తప్పని చెప్పాల్సిన, వివరించాల్సిన, ప్రూవ్ చేయాల్సిన బాధ్యత సైన్స్ తీసుకుంటుంది. అది సైన్స్ గొప్పదనం. మనిషి దుర్మార్గపు ఆలోచనలతో ప్రకృతిని నాశనం చేయడానికి కూడా సైన్స్ ఉపయోగపడుతుంది. ఇక్కడ సైన్స్ ని ఎలా వాడుకోవాలనే తాత్వికత (ధర్మం) చాలా కీలకం. ధర్మం పరిధిలో సైన్స్ వినమ్రతగా అభివృద్ధి చెందాలి. అదే శ్రేయష్కరం.

      Delete
    2. "సైన్స్ ని ఎలా వాడుకోవాలనే తాత్వికత (ధర్మం) చాలా కీలకం. ధర్మం పరిధిలో సైన్స్ వినమ్రతగా అభివృద్ధి చెందాలి. అదే శ్రేయష్కరం."- చాలా బాగా చెప్పారు కొండల్ రావు sir. Majority of communists and rationalists aren't willing to understand the concept of dharma.

      Delete
    3. సైన్స్‌ని గొప్పదనం అనడం కంటే అవసరం అంటే బాగుంటుంది. న్యూటన్ కాలంలో కాంతి యొక్క వేగం ఎంతో తెలియదు. కాంతి వేగంతో ప్రయాణిస్తే క్లాక్ టవర్ ముల్లు యొక్క మోషన్ ఎలా కనిపిస్తుందో న్యూటన్ కాలంలో తెలియదు, తెలిసే అవకాశం కూడా లేదు. ఐన్స్టీన్ కాలానికి వచ్చేసరికి అది తెలుసుకోవడం తప్పనిసరి అయ్యింది.

      Delete
    4. < సైన్స్‌ని గొప్పదనం అనడం కంటే అవసరం అంటే బాగుంటుంది. > ఔను ప్రవీన్ గారు.

      ధర్మం ను కాపాడడానికి సైన్స్ ని ఉపయోగించుకోవాలి. ప్రకృతి ధర్మమే ధర్మం. ప్రకృతి సూత్రాలే ధర్మానికి ప్రాతిపదిక కావాలి తప్ప ఫలానా మతం కాకూడదు.

      < Majority of communists and rationalists aren't willing to understand the concept of dharma. >

      అందరికంటే ధర్మం గురించి ఎక్కువ తెలుసుకోవలసింది నిజమైన కమ్యూనిస్టు GKK సర్.

      Delete
    5. సంస్కృతి, మతం, సంప్రదాయం అనేవి నమ్మకాలకి సంబంధించినవి. వాటికి సైన్స్‌తో సంబంధం ఉండాలని రూల్ లేదు. జేమ్స్ బ్రాడ్లీ లాంటి సైంటిస్టులు చర్చ్ పాస్టర్ ఉద్యోగాలు చేసినా కూడా సైన్స్ & మతం వేరువేరుగా ఉంటాయి.

      Delete


  12. సాంప్రదాయము గొప్పది. సాయిన్సు గొప్పది. రెండింటికి మధ్య సమన్వయము కుదురదు.

    ఈనాటి సాయిన్సు రాబోవు సాంప్రదాయానికి పునాది. రాబోవు సాయిన్సు నిన్నటి సాంప్రదాయానికి విరోధి‌.


    ఇట్లు
    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ప్రస్తుతం ఆచరణలో ఉన్నది జిలేబి గారు చెప్పారు. కానీ ఆ స్తితి మారాలి. సైన్స్ ని అవగాహన చేసుకుని, అవసరమైన మేర్కు వాడుకోవడం ద్వారా ధర్మాన్ని నిలబెట్టడానికి మంచి సాంప్రదాయాలను కాపాడుకోవాలి. ఏర్పరచుకోవాలి వారసత్వంగా రాబోవు తరాలకు అందించాలి అని నా అభిప్రాయం మేడం.

      Delete
    2. సంప్రదాయం సైన్స్ రెండూ శాశ్వతం కాదు, కాలంతో పాటు ఫలితాలకు అనుగుణంగా మారుతాయి. శాస్త్రం ఆ మార్పును స్వాగతిస్తుంది: ఇదొక్కటే తేడా.

      మా ISO/QMS భాషలో చెప్పాలంటే:

      P+B= S
      P-B= R
      B-P= A

      P: Process
      B: Benefit
      S: System
      R: Ritual
      A: Anarchy

      Delete
    3. సంప్రదాయంలో మంచి ఉందా అనే ప్రశ్న అరిగిపోయిన గ్రామఫోన్ రికార్డ్ లాంటిది. మనిషి తాను బతకడానికి మంచిని ఏర్పరుచుకుంటాడు కానీ మంచిని ఏర్పరుచుకోవడానికి బతకడు.

      Delete
    4. "మనిషి తాను బతకడానికి మంచిని ఏర్పరుచుకుంటాడు కానీ మంచిని ఏర్పరుచుకోవడానికి బతకడు"

      100% agree. Excellently put!

      Delete
    5. < సంప్రదాయం సైన్స్ రెండూ శాశ్వతం కాదు, కాలంతో పాటు ఫలితాలకు అనుగుణంగా మారుతాయి. శాస్త్రం ఆ మార్పును స్వాగతిస్తుంది: ఇదొక్కటే తేడా. >

      శాస్త్రమూ, సంప్రదాయమూ కూడా కొత్తవాటిని వెంటనే అంగీకరించే పరిస్థితి లేనపుడు ధర్మసంస్థాపనార్ధం మహనీయులు అందుకు పూనుకుంటారు. శాస్త్రీయ థృక్పథంలో అది ఎలా, ఎందుకు మానవతకు మంచిదో నిరూపిస్తారు. జనాలను ఆ మార్గంలో నడిచేలా చేస్తారు. ఆ మహనీయులు మనుషులలోని మహాత్ములే.

      Delete
    6. < సంప్రదాయంలో మంచి ఉందా అనే ప్రశ్న అరిగిపోయిన గ్రామఫోన్ రికార్డ్ లాంటిది.>

      తొండి, మొండి వాదన లేదా జవాబు.

      < మనిషి తాను బతకడానికి మంచిని ఏర్పరుచుకుంటాడు కానీ మంచిని ఏర్పరుచుకోవడానికి బతకడు. >

      ప్రవీణ్ గారి మెదడులోనుండి వచ్చిందా? లేక ఎత్తిపోతలనుండి ఉంచారా? ఆయనే చెప్పాలి, కానీ ఇది అద్భుత వాక్యం. మనిషి తాను బ్రతకడానికి మంచిని ఏర్పరచుకుంటాడు. ఇది నిజం. మరి సాంప్రదాయాలను ఎవరు ఏర్పాటు చేసుకుంటారు? మనిషే కదా? కాదా?

      మంచి అనుకునే బ్రతకడానికి సాంప్రదాయం ఏర్పాటు చేసుకుంటాడు. కాలక్రమంలో అవి మంచి కాదని తేలవచ్చు. అపుడు ఏది ధర్మాన్ని నిలబెట్టడానికి అవసరమో, ఏమి సవరణ చేయాల్నో, ప్రత్యామ్నయం ఏమిటో సైన్స్ తేలుస్తుంది.సైన్స్ కూడా తప్పు చేస్తే ధర్మమే మళ్ళీ కొత్త సాంప్రదాయాన్ని ఏర్పరచడానికి మార్గం చూపుతుంది. ఇది నిరంతర ప్రాసెస్ అని నా అభిప్రాయం.

      Delete
    7. మనిషి అనేవాడు పునాది అయితే ఆలోచన అనేది ఉపరితలం. పునాది ముందు పుడుతుందా లేదా ఉపరితలం ముందు పుడుతుందా? మనిషి అనేవాడు లేకపోతే మంచి అనేది ఎలా ఉంటుంది? నా బుర్రకి మాత్రమే కొత్త ఐడియాలు రావాలని రూల్ లేదు.

      Delete
    8. అనుమానం ఎందుకు? మనిషి లేకుండా ఆలోచన ఎలా పుడుతుంది? ఇక్కడ పునాది, ఉపరితలం అనే సమస్యను కాదు గదా మనం చర్చించేది. ప్రతి మనిషికీ ఒకే పరిస్థితులలో ఒకే రకం ఆలోచనలు రావు. ఏ ఆలోచన మనిషి మనుగడకు మంచిది అనేది తేల్చడం గురించి. మీ బుర్రకు వచ్చినా, వేరేది అయినా ఆ వాక్యం అద్భుతం.

      < మనిషి తాను బతకడానికి మంచిని ఏర్పరుచుకుంటాడు కానీ మంచిని ఏర్పరుచుకోవడానికి బతకడు. >

      ఈ చర్చకు ఈ ఒక్క లైన్ ని బేస్ చేసుకుని సవ్యంగా ఆలోచిస్తే జవాబు ఇట్టే దొరికిపోతుంది. ధన్యవాదములు మరోసారి అభినందనలు.

      Delete
    9. నీతి లేకపోతే సమాజం అస్తిత్వంలో ఉండదు కనుక మనిషి నీతిని ఏర్పరుచుకుంటాడు. మంచి-చెడు అనే తేడాలు ఏర్పడినవి మనిషి బతకడానికే. ఆ తేడాలు ఏర్పరుచుకోవడానికి మాత్రమే మనిషి పుట్టలేదు కదా. This awareness is not confined to me. That's what I intended to say.

      Delete
  13. "సైన్స్ ని అవగాహన చేసుకుని, అవసరమైన మేరకు వాడుకోవడం ద్వారా ధర్మాన్ని నిలబెట్టడానికి మంచి సాంప్రదాయాలను కాపాడుకోవాలి. ఏర్పరచుకోవాలి వారసత్వంగా రాబోవు తరాలకు అందించాలి ". చాలా విలువైన మాట చెప్పారు కొండలరావు గారు.

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top