పాలగుమ్మి పద్మరాజు గారు వ్రాసిన "గాలి వాన" కథలో రావు గారనే న్యాయవాది ఉంటారు. ఆయన తాను చాలా నీతివంతుణ్ణని చెప్పుకుంటాడు. తన పిల్లలని కూడా చాలా క్రమశిక్షణలో పెంచుతాడు. తన కూతురు జడ ఎలా వేసుకోవాలో కూడా ఆయనే నిర్ణయిస్తాడు. ఆయన ఒక అధ్యాత్మికవేత్త కూడా. ఆయన ముసలైపోయి తన కొడుక్కి న్యాయవాద వృత్తి అప్పజెప్పి ఆధ్యాత్మిక ప్రసంగాల మీద దృష్టి పెంచుతాడు. 

రావు గారికి క్రమశిక్షణతో పాటు సంకుచితత్వం కూడా ఉంటుంది. ఎదుటివాళ్ళు సిగరెత్‌లు తాగడం ఆయనకి నచ్చదు కానీ తన ఎదురుగా ఎవరైనా సిగరెత్ తాగితే ఆయన అభ్యంతరం చెప్పడు, అలా చెప్పడం సంస్కారం కాదనుకుంటాడు, తన ముక్కులోకి సిగరెత్ పొగ వెళ్ళి ఉక్కిరిబిక్కిరి చేసినా ఆయన అభ్యంతరం చెప్పే ధైర్యం చెయ్యడు. ఇందు వల్ల రైలులో అతని తోటి ప్రయాణికుడు అతని ఎదురుగా సిగరెత్ తాగి అతన్ని ఇబ్బంది పెడతాడు.

రావు గారికి ఒక విషయంలో మాత్రం స్థిర అభిప్రాయం ఉంటుంది. అది యాచకులకి డబ్బులు ఇవ్వకూడదని. ఆయన రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ఆయన ఎక్కిన పెట్టెలోకి ఒక యాచకురాలు వస్తుంది. ఆమె తన మాట తీరుతో అందరినీ ఆకర్షించి భిక్షం వెయ్యించుకుంటుంది కానీ రావు గారిని మాత్రం ఆకర్షించలేకపోతుంది. "ఈ పెట్టెలో డబ్బున్నవాళ్ళు ఉంటారనే ఇక్కడికి వచ్చాను. మూడో తరగతి పెట్టెలోని ప్రయాణికులే నయం. వాళ్ళకి జాలి ఉంటుంది, డబ్బున్నవాళ్ళకి అది ఉండదు" లాంటి మాటలు చెప్పి ఆ యాచకురాలు ప్రయాణికుల్ని ఆకర్షించి డబ్బులు వెయ్యించుకుంటుంది కానీ రావు గారు మాత్రం డబ్బులు వెయ్యరు.

రావు గారు దిగవలసిన స్తేషన్ వస్తుంది. అదే సమయంలో TTE యాచకురాలిని కిందకి దింపేస్తాడు. అక్కడ హోరు గాలి వీస్తూ జోరు వాన పడుతోంది. ఈ వానలో ఊరిలోకి వెళ్ళడమే కష్టం అనుకుంటాడు రావుగారు. యాచకురాలు రావుగారి లగేజ్ దించి స్తేషన్‌లోని విశ్రాంతి గదికి తీసుకువెళ్తుంది. లగేజ్ మోసినందుకు రావుగారు యాచకురాలికి డబ్బులు ఇస్తాడు. ఆమె నిరభ్యంతరంగా తీసుకుంటుంది. వానకి ఆమె తడిసిపోయిందని రావుగారు ఆమెకి పొడి పంచె ఇస్తాడు. అది కూడా ఆమె నిరభ్యంతరంగా తీసుకుంటుంది. ఆ యాచకురాలు తనకి ఎన్నడూ పరిచయం లేని వ్యక్తికి కూడా శరీరాన్ని అర్పించే రకం. ఆమె పూర్వ చరిత్ర చూస్తే ఆమె తల్లిని తండ్రి చంపేశాడు. ఆమె ఒక వ్యక్తితో స్నేహం చేసి కలిసి ఉంటూ పిల్లల్ని కనింది. ఆమె మొగుడు అనబడే స్నేహితునికి తాగుడు అలవాటు ఉంది. ఆమె ముష్టెత్తుకుని రోజుకి ఐదు రూపాయలు సంపాదిస్తే అందులో పావలా ఆమె మొగుడనబడే వ్యక్తికే ఇస్తుంది. ఈ వాతావరణంలో పుట్టిపెరిగిన ఆమెకి వ్యభిచారం తప్పుగా అనిపించదు.

కానీ సంస్కారవంతుడైన రావుగారు ఆమెతో కలిసి తప్పు చేస్తాడు. గాలివాన దాటికి విశ్రాంతి గది తలుపులు ఊడిపోగా ఆయన యాచకురాలితో కలిసి బీరువాని అడ్డుపెడతాడు. గది పై పెంకులు ఊడిపోయి లోపలికి నీరు కారుతుండగా రావుగారు భయంతో యాచకురాలిని కౌగిలించుకుంటాడు. ఆ యాచకురాలు రావుగారి కౌగిట్లోనే ఉంటుంది. ఉదయం లేచేసరికి రావుగారు తన జేబులో పర్సు మాయమైనట్లు గమనిస్తారు. యాచకురాలే అది తీసిందని అర్థమై ఆమెని వెతుక్కుంటూ tikect counterలోకి వెళ్తాడు. అక్కడ చిందరవందర అయిన సామాను కింద యాచకురాలి శవం కనిపిస్తుంది. ఆమె చేతిలో రైల్వేవాళ్ళ డబ్బు కూడా కనిపిస్తుంది. ఆమె చేతిలోని డబ్బుని తీసి రావు గారు దాన్ని ద్రాయర్‌లో వేస్తారు. ఎన్నడూ పరిచయం లేని వ్యక్తితో ఒక రాత్రి పంచుకున్నందుకు ఆమె మీద జాలి వేసిన రావుగారు ఆమె మీద దొంగ ముద్రపడకూడదని ఆమె చేతిలో పర్సుని అలాగే ఉంచేస్తారు, అందులోని తన గుర్తింపు కార్దుని మాత్రం తీసేసి. 

అందరికీ నీతులు చెప్పే రావుగారే తనతో ఎన్నడూ పరిచయం లేని స్త్రీతో ఒక రాత్రి పంచుకున్నాడు. మనిషి సమాజంలో బతకడానికి అనేక నియమాలు ఏర్పరుచుకుంటాడు. కానీ ఆ నియమాల్ని సమయాన్ని బట్టి తనకి అనుకూలంగా మార్చుకుంటాడు. ఈ విషయం చెప్పడానికే శ్రీ పద్మరాజు గారు ఆ కథ వ్రాశార్రు. 

క్రమశిక్షణ పేరుతో పిల్లల్ని బెల్తుతో కొట్టి పెంచే తండ్రులు కూడా ఉన్నారు. పిల్లల్ని కొట్టడం వల్లో, తన్నడం వల్లో వాళ్ళ ప్రవర్తన మారదు. సమాజం గురించి ఎంతో తెలిసిన న్యాయవాదులు వంటివారే సమయం దొరికితే తప్పుడు పనులు చేస్తారు. సమాజం గురించి ఏమీ తెలియని పిల్లలు తప్పులు చెయ్యడం విచిత్రం కాదు, పిల్లలకి చిన్నతనం నుంచే మంచి నడవడిక నేర్పించాలి కానీ క్రమశిక్షణ పేరుతో వాళ్ళకి తమ మీద రూల్స్ ఎందుకు పెడుతున్నారో తెలియకుండా చేసి పెంచడం వల్ల మాత్రం ప్రయోజనం ఉండదు. 
- Praveen Kumar

--------------------------------------------------
మీరూ 'జనవిజయం' కు రచనలు పంపాలనుకుంటే వివరాల కోసం ఇక్కడ నొక్కండి.
*Republished

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top