శారీరకంగా పురుషునికంటే స్త్రీ బలహీనురాలు అనడానికి బయలాజికల్ ఎవిడెన్స్ ఉందా?

- Palla Kondala Rao,
16-08-2014.

*Re-published

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

kondalarao.palla@gmail.com

Post a Comment

  1. పూర్వం యూరోపియన్‌లు పురుషుల పక్కటెముకల కంటే స్త్రీల పక్కటెముకలు చిన్నగా ఉంటాయని నమ్మేవాళ్ళు. ఒక శాస్త్రవేత్త సమాధుల్ని తవ్వి స్త్రీల పక్కటెముకలు పురుషుల పక్కటెముకలతో సమానంగా ఉంటాయని నిరూపిస్తే అతన్ని జనం నమ్మలేదు సరికదా, జెరుసలెం వెళ్ళి పాప ప్రక్షాలన చేసుకుని రమ్మన్నారు. ఆ శాస్త్రవేత్త జనానికి భయపడి ఒక యాత్రికుల బృందంతో కలిసి జెరుసలెం వెళ్ళి తిరిగి వస్తుండగా దారిలో పడవ మునిగి చనిపోయాడు.

    మైక్రోస్కోప్ లేని రోజుల్లో, క్రోమోజోంలు ఎలా పని చేస్తాయో తెలియని రోజుల్లో, స్త్రీలకి జ్ఞాపక శక్తి తక్కువ అని మన పెద్దలు చెపితే నమ్మేసాం. స్త్రీలకి జ్ఞాపక శక్తి తక్కువ కాదు అని ఇప్పుడు ఎవరైనా చెపితే మనవాళ్ళు నమ్మే స్థితిలో లేరు. సామాజికంగా అభివృద్ధి నిరోధకంగా ఉన్నవి వ్యక్తిగత విశ్వాసాలైనా సరే వాటిని తేలికగా తీసిపారెయ్యలేము.

    ReplyDelete
  2. దయచేసి శాస్త్రీయవిషయాలపైన అధునిక పరిశోధనల వివరాలు ప్రచురించే అంతర్జాలం సైట్లను పరిశీలించండి.

    ReplyDelete
  3. స్త్రీ పురుషుల్లో ఎవరు శారీరకంగా బలహీనులు? ఈ విషయం గురించి అంతగా వాదించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు బలహీనులైనా పోయేదేం లేదు, బలవంతులకు వచ్చేది ఏమీలేదు. ఎందుకంటే, కేవలం శారీరక బలం మీదనే ఆధారపడి బ్రతికే రాతియుగం నుండి చాలా దూరం వచ్చేశాం.

    ఆడా మగా ఇరువురిలో బలహీనతలూ, బలాలూ ఉన్నాయి. ఇరువురూ తమ బలాలను ఉపయోగించుకుంటు, తమ బలహీనతలను అధిగమించుకుంటూ పోవడం ఒక్కటే ప్రస్తుతం సమాజములో చేయగలిగింది. అలా చేస్తేనే మనుగడ ఉంటుంది కూడా. ఇక్కడ ఒకరు శారీరకంగా బలహీనులు అంటే వారు వల్ల సమాజానికి తక్కువ ఉపయోగమనో, సమాజములో వారి స్థానం చిన్నదనో చెప్పడం కాదు. ఒక కోణములో వారు బలహీనమైతే మరో కోణములో వారు తమ శక్తియుక్తులు నిరూపించుకుంటూనే ఉన్నారు. కాబట్టి, స్త్రీలు శారీరక బలహీనులు అని నేను చెబుతున్న మాటలు వారి స్థాయిని తగ్గించాలన్న ఉద్దేశ్యముతోనో ( నేను తగ్గించాలని ప్రయత్నించినా అది అయ్యే పని కాదని నాకు తెలుసులెండి :-) ), వారిని హేళన చేయడానికో చెబుతున్నవి కావని గ్రహించవలసిందిగా మనవి.

    ఇక, ఎవరు శారీరకంగా బలహీనులు అనే విషయానికి వస్తే, దీని మీద ఇదివరకు చాలా పరిశొధనలు జరిగాయి. ఈ ప్రశ్నే మెడికల్ ఎక్స్‌పర్టులను అడిగితే వారు కొన్నింటిని ప్రమాణికంగా తీసుకుని వివరించే ప్రయత్నం చేశారు.

    క్యాన్సర్: ఈ విషయములో మగవారే బలహీనులు. ఆడవారికి, మగవారితో పోలిస్తే రిస్కు తక్కువ. ఆడవారు బలవంతులు.
    ఎముకలు: ఈ విష్యములో మాత్రం మగవారిదే పైచేయి. మగవారి ఎముకలు ఆడవారి ఎముకలతో పోలిస్తే దృడంగా ఉంటాయట. మగవారు బలవంతులు.
    గుండె: దీనివిషయములో పునురుషులే బలహీనులు. ఆడవారిలోని ఈస్ట్రోజన్ హార్మోను గుండెకు రక్షణ కల్పిస్తుందట. మగవారితో పోలిస్తే ఆడవారి గుండె ఆరోగ్యవంతంగా ఉంటుందని చెబుతున్నారు డాక్టర్లు. ఆడవారు బలవంతులు.
    కండరాలు: కండలు దండలు పెంచడములో మగవారిదే పైచేయి. మగవారిలా కొంత మంది స్త్రీలు కూడా కండలు పెంచుతున్నా, ఈ విషయములో మాత్రం మగవారిదే పైచేయి. మగవారిలో అధికంగా ఉండే టెస్టోస్టిరాన్ అనే హార్మోన్, దీనికి కారణం. మగవారు బలవంతులు.
    కళ్ళూ, చెవులు: ఇందులో ఇద్దరూ సమానమే. ఇక్కడ వచ్చే సమస్యలకి ఆడా మగా అన్న బేధం లేదు.
    మెదడు: డిప్రెషన్ అనేది మగవారికన్నా ఆడవారిలోనే అధికమని వీరు చెబుతున్నారు. దాని వలన మెదడు ఆరోగ్యము విషయానికి వస్తే పురుషులదే పైచేయి అంటున్నారు. కానీ, నాకెందుకో ఇది తప్పని పిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకునే మగవారు సంఖ్య, స్త్రీలతో పోలిస్తే రెట్టింపు ఉంటుంది. వైధ్యుల ప్రకారం అయితే పురుషులదే పైచేయి. కానీ నా అనాలసిస్ ప్రకారం స్త్రీలదే పైచేయి.

    Are women really the weaker sex? The intriguing medical facts that settle the oldest argument of all
    http://www.dailymail.co.uk/health/article-562627/Are-women-really-weaker-sex-The-intriguing-medical-facts-settle-oldest-argument-all.html

    ఇవేకాకుండా, జెనెటికలుగా X క్రొమోజోములో 1098 జన్యువులు ఉంటే, Y క్రొమోజోములో 78 జన్యువులు మాత్రమే ఉంటాయి. అంటే పురుషులతో పోలిస్తే, స్త్రీలలో 1000కి పైగా జన్యువులు ఎక్కువగా ఉంటాయి. (ఇది బలమా లేక బలహీనతా అన్నది అడక్కండి, నాకు వాటి గురించి అంత అవగాహన లేదు).

    Female chromosome has X factor
    http://news.bbc.co.uk/2/hi/science/nature/4355355.stm

    గర్భములో ఉన్నప్పుడు ప్రతికూల పరిస్థితులు ఏవైనా ఏర్పడితే, ఆడపిల్ల అయితే బ్రతికే ఛాన్స్ ఎక్కువ. అదే మగపిల్లడు అయితే, బ్రతికే ఛాన్సు చాలా తక్కువ (ఆడపిల్లలతో పోలిస్తే). పుట్టినప్పుడు ఆడపిల్లలే బలంగా ఉంటారట ( ఏదో టీ.వీ షోలో విన్నట్టు గుర్తు). కానీ, ఒక్కసారి మగవారిలో "టెస్టోస్టిరోన్" హార్మోను తన ప్రభావం చూపడం మొదలు పెట్టిన తరువాత పరిస్థితులు మారిపోతాయి.

    అందుకే ఓవరాలుగా చూసినప్పుడు ఎవరి బలాలు, బలహీనతలు వారికున్నాయి.

    నేను వేరే పోస్టులోని కామెంట్లలలో, స్త్రీలు శారీరకంగా బలహీనులు అన్నది, కండరాల బలం, శక్తి, వేగం వంటి విషయాల్లో మాత్రమే (కండలు దండలు పెంచుకోవడం). అక్కడ (ఆపోస్టులో) సందర్భం కూడా అదే.

    ReplyDelete
    Replies
    1. Bone fitness is more related to age than to gender. Therefore, we cannot say that women's bones are weak.

      Delete
  4. ఎవరు బలవంతులు, ఎవరు బలహీనులు అనే విషయాలు చర్చించే ముందు ఏది బలం, ఏది బలహీనత అని కూడా చర్చించుకోవలసి వస్తుంది.

    కేవలం శారీరక బలమే డామినేటింగ్ ఫ్యాక్టర్ అయితే, మనుషుల కన్నా ఏ ఏనుగులో సింహాలో ఈ ప్రపంచాన్ని శాసిస్తుండాలి. కేవలం మేధా శక్తే బలం అనుకుంటే ఏ ఐనిస్టైనో అమెరికా అధ్యక్షుడు అయ్యుండాలి.

    దెబ్బ కొట్టడమే బలం కాదు. ఆ దెబ్బ తట్టుకొనే సహనం, ఓర్పు కూడా బలమే. ఎముకలు ధృడంగా ఉండడమే బలం కాదు, కొవ్వు పొర కలిగి ఎముకలు విరక్కుండా రక్షించుకో గలిగి వుండడం కూడా బలమే. ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే.

    పురుషులకన్నా బలంగా వున్న స్త్రీలు అక్కడక్కడా ఉన్నప్పటికీ వారి శాతం తక్కువే. దీనికి అనేక కారణాలున్నాయి. నెలసరి వల్ల రక్తం కోల్పోవడం, శరీర పరిశ్రమకు మగవారు ఇచ్చినంత ప్రాథాన్యత ఇవ్వక పోవడం, గర్భ ధారణ సమయంలో ఫిట్ నెస్ కోల్పోవడం. ఇళ్ళల్లో మగవారికి బలవర్థక మైన ఆహారాన్ని ఇస్తూ ఆడవారికి మాత్రం మిగిలిపొయినది పెట్టె అలవాట్లు ఉండడం, లావేక్కితే పెళ్లి కాదేమోనని భయపడి ఆడపిల్లలకి తక్కువ ఆహారాన్ని పెట్టడం, లేక వారే స్వచ్చందంగా డైటింగ్ చేయడం. వీటన్నిటి వల్ల పెద్ద గీత మరింత పెద్దగానూ, చిన్న గీత మరింత చిన్నది గాను తయారవుతుంది.

    ReplyDelete
  5. నాకు తెలిసినంతవరకూ పురుషులతో పోల్చుకుంటే స్త్రీలు శారీరకంగా బలహీనులు. ఈ విషయం ఖమ్మం పార్లమెంట్ సభ్యునిగా పని చేసిన డా. వై. రాధాకృష్ణమూర్తి గారు ఒక క్లాసులో చెపుతుంటే విన్నట్లు గుర్తు. ఆయన్ డాక్టర్ కూడా. కనుక నేను అదే విషయాన్ని మరో ప్రశ్నలో చెప్పాను. అక్కడ వచ్చిన కామెంట్లమేరకు దీనిని నిర్ధారించుకునేందుకు ఈ ప్రశ్న ఉంచాను.

    ఈ చర్చలో ఇప్పుడు శ్రీకాంత్ చారి గారు అడిగినట్లు ఏది బలం? ఏది బలహీనత? అనేదీ తేల్చుకోవాల్సినదే. కానీ నా ఉద్దేశ శారీరక బలం వరకు చూస్తే పురుషులకంటే స్త్రీలు సహజాతంగానే బలహీనులు. ఈ విషయం శాస్త్రవేత్తలు కూడా చెప్పారనే నాకు తెలిసిన సమాచారం. ఆధారాలు నా దగ్గర లేవు. నేనదే నమ్ముతున్నాను. కాదంటే ఎలానో ఆధారాలు చూపాలి. అవుననుకున్నా ఉన్న ఆధారాలు చూపితే ఈ విషయంలో క్లారిటీ వస్తుంది.

    ReplyDelete
    Replies
    1. ఆధారాలు నా దగ్గర లేవు. నేనదే నమ్ముతున్నాను. కాదంటే ఎలానో ఆధారాలు చూపాలి

      కొండల రావు గారు,

      పైన రాసిన వ్యఖ్యను చదవండి. అమ్మా నాన్నలలో 65+ దాటాక ఎవరు ఎక్కువ బరువులు మోయగలరో చూడండి. ఉదా|| రైల్వే ఫ్లాట్ ఫాం పైన ఒక సూట్ కేసు ఇచ్చి ఇద్దరిని నడవడం గమనిస్తే, ఎక్కువమంది పురుషులు ఆ సూట్ కేస్ బరువులను మోసుకు పోగలరు. స్రీల వలన అది సాధ్య పడదు. కంటి ముందు కనిపించేదానికి, శాస్రవేత్తలు చెప్పాలి, సాక్షాలు ఆధారాలు కావాలనటం అతి గా అనిపిస్తుంది. సాధారణ మనిషి వివేకాన్ని తక్కువగా అంచనా వేయటం అవుతుంది.

      Delete
    2. This comment has been removed by the author.

      Delete
    3. // నాకు తెలిసినంతవరకూ పురుషులతో పోల్చుకుంటే స్త్రీలు శారీరకంగా బలహీనులు//
      నిజమే! ప్రస్తుతం. కానీ చారిత్రికంగా చూస్తే ఎవరూ బలహీనులు కాదు. ఆ బలహీనత సామాజిక పరిణామ క్రమములో ఏర్పడింది మాత్రమే. ప్రకృతి సహజంగా కాదు. స్త్రీలను రకరకాల పరి మాణాల్లో, రకరకాల ఆకృతిల్లో పెంచుకున్నట్టు చారిత్రిక ఆధారాలు ఉన్నాయి. ఉదా:- చైనా భూస్వామ్య సామాజంలో అక్కడి జమీందార్లు , రాజులకు స్త్రీలు బాతుల్లాగా నడవటం అందంగా కనిపిస్తుందట. వారు ఎంత మంది భార్యలనైనా ఉంచుకోగలరు కనుక వారు ఏ ఊరు వెలితే ఆ ఊరులో ఒక భార్య లేక ఉంపుడు గత్తె ఉండేదట. ఆ స్త్రీలు అందంగా కనిపించడానికి, బాతూల్ల నడవడానికి పసి వయసులోనే వారి పాదాలకు రాళ్లు కట్టి అవి పెరగ కుండా పగలంతా కూచ్చో బెటే వారట వారి తల్లిదండ్రులు. ఇలా రోజూ ప్రాక్టీసు చేసినందు వల్ల వారి పాదాలు చిన్నవై వారు నడుస్త్మ్టే బాతులా అందంగా వుంటుంది కనుక, ఆలాంటి ఆడ పిల్లలని ఇ రాజులు, జమీందార్లు డబ్బు ఇచ్చి ముందుకొచ్చే వారట. ఇలా స్త్రీలను ఆయా సమాజాల్లో వారి సంప్రదాయాలకనుగునంగా ఆడ పిల్లల్ని మలుచు కొనే వారు. మనం హెతు బద్దంగా ఆలోచిస్తె ఈ విషయం రుజువౌతుంది. ఈ డాక్టర్‌ గారు చెప్పింది మనం కాదనలేము ఎందుకంటే ఆయన డాక్టర్‌ కనుక. ఈ డాక్టర్‌ ఈ విషయం రుజువు పరచడానికి చరిత్రకారుడు కూడ అయiu్మ్డాలి.
      ఇంకొక ఉధా:- బెంగాల్‌ రచయిత్రి మహో శ్వేతా దేవి మనకు తెలుసు. ఆమే కధలు రుడాలి అనే సంపుటానికి ముందు మాట రాసు కుంటు ఇలా అంటుంది. '' బ్రజిల్‌ పౌష్టికాహార సంస్థ - న్యూట్రిషన్‌ ఇనిస్టిస్ట్యూట్‌ ఆఫ్‌ బ్రెజిల్‌) వ్యవస్తాపకుడు కాస్ట్రో రచించిన '్జాగ్రఫీ ఆఫ్‌ హంగర్‌ ' తీవ్ర మైన్‌ పౌష్టికాహార లోపం మనుషుల్ణీ జంతువుల్ని సారీరకంగా ఎదనీకుండా గిడసబారుస్తుంది. షెత్‌ లాండ్‌ ద్వీపం లో కనపడ్ద పిగ్మీ గుర్రాలను అమెరికాలో అమ్మ కానికి తీసుకెల్లారు. అక్కడ మంచి పుష్టికరమైన మేత దొరికె సరికి అవి తిరిగి ఎదగడం ప్రారబించాయి.మూడు తరాలు గడిచే సరికి అవి దృడంగా ఎత్తుగా ఇతర గుర్రాలాగా మారిఫొయినాయి. ఎమిల్‌ టార్డి అనే మానవ శాస్త్ర వేత్తాఫ్రికాలోని భూమధ్యaRెఖాప్రాంతంలో చాలా పొట్టిగా వుండే పిగ్మీలను కనుగొన్నాడు. అయితే ఆ ప్రాంతంళొ వ్య్వసాయకంగా అభివృద్ది చెంది అక్కడి వాతావరణంలో మార్పులొచ్చాక పిగ్మీలు సాధరణ మానవ పరిమాణాన్ని సంతరించుకున్నారు.
      ఇక్కడ ఇనప కచ్చడాల గురించి కూడా మాట్లాడు కోవాలి. స్త్రీలు ఎంత అణచి వేతకు గురైందో తెలిస్తే గాని వీటికి కూడా రుజువులు దొరకవు. స్త్రీలు పరపురుషుడితో తిరగ కుండా మర్మాంగాలకు ఇనుప కచ్చాడాలు తగిలిచిన రోజులు కాడ వునాయి. స్త్రీలు తమకు లొంఘి ఉండరని అటు మానసికంగాను ఇటు శారీకంగాను తయారు చేసుకున్నారు ఈ పురుషాదిక్యులు. ఈ నాడు బయో టెక్నొలొజి పెరిగి ఏ జంయువులతో ఏజంయువులు కలిపితే ఏలాంటి రంగు కాయలో లేక చేత్ళొ పెరుగుతాయో తెలుసు. మోన్‌ శమ్మ్ట్‌ విత్త నాలతో వ్యవసాయ మోనో పాలి సంపాదించాలని ఒక అమెరికా కంపిని ఉవ్విల్లురుతున్న కాలం. ఇవన్ని పరోక్ష ఆదారాలే. మత భావాలు మననుండి వదిలి పోవక పోడానికి కారణం తరతరాల మానవుడిలో వస్తున్న మత భావాలు మనిషి జీన్స్‌ లో నిక్షిప్త మై పోవడమే నంటారు కొడవటి రోహిణి ప్రసాద్‌.

      Delete
    4. సమాజం నుంచి సంక్రమించిన నమ్మకాలు MBBS చదివినా పోవు. స్త్రీ పురుషుని కంటే ఐదారేళ్ళు ఎక్కువ కాలం జీవిస్తుంది. పురుషుడు తన కంటే ఐదారేళ్ళ పెద్ద అయిన స్త్రీని పెళ్ళి చేసుకున్నా ఎలాంటి సమస్య రాదు. కానీ హిందూ కుటుంబంలో పుట్టినవాడు వైద్యుడైనా తన కంటే వయసులో పెద్దైన స్త్రీని పెళ్ళి చేసుకోడు. ముస్లింలలో ఇలాంటి నిషేదం లేదు. అందుకే సద్దాం హుస్సేన్ తన కంటే వయసులో పెద్దైన స్త్రీని పెళ్ళి చేసుకున్నాడు. 10వ తరగతి వరకు చదివిన సద్దాం హుస్సేన్‌కి క్రోమోజోంల గురించి తెలియకపోవచ్చు. క్రోమోజోంల కారణంగా స్త్రీల ఆయుష్షు, జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటాయనే విషయం కూడా తెలియకపోవచ్చు. తన సమాజం అనుమతిస్తుంది కనుక తన కంటే వయసులో పెద్దైన స్త్రీని పెళ్ళి చేసుకున్నాడు, అంతే.

      మన ఆంధ్రాలోనే ఇండ్ల రామసుబ్బారెడ్డి అనే మానసిక వైద్యుడు స్త్రీలు విడాకులు తీసుకుంటే పిల్లలు చెడిపోతారని అన్నాడు. విడాకులకీ, చెడిపోవడానికీ మధ్య ఎలాంటి సంబంధం లేదు. విడాకులు తీసుకోవడం తప్పని మన తాతలు మాత్రమే కాదు, మన సమకాలీనులు కూడా అనుకుంటున్నారు కనుక మన దేశంలోని వైద్యులు కూడా ఇలాగే అనుకుంటున్నారు. కేవలం చదువుల వల్ల నమ్మకాలు మారవు అనేది మార్క్సిస్త్‌లందరికీ తెలిసిన విషయమే.



      Delete
    5. రాధాకృష్ణ గారు వైద్యుడా, కాదా అనే దాన్ని బట్టి ఇక్కడ విశ్వసనీయత ఉండదు. కులం, కట్నం లాంటి సాంఘిక దురాచారాల్ని వైద్యులు కూడా ఎందుకు ఆచరిస్తున్నారు? బ్రాహ్మణుడు, మాదిగవాడు బయలాజికల్‌గా ఒకటేనని తెలియకనా?

      కొండలరావు గారు తాను మార్క్సిస్త్‌నని చెప్పుకున్నారు కనుక ఆయనకి ఓ ప్రశ్న వేస్తాను. ప్రకృతిలో ప్రతి వస్తువూ మారుతుంది కనుక సమాజం కూడా మారాలి అని అంటే పాలకవర్గంవాళ్ళు ఒప్పుకుంటారా? మరి వైద్యుడు శరీర ధర్మం గురించి తెలిసినంత మాత్రాన కులం, లింగం గురించి అభిప్రాయాలు మార్చుకుంటాడని ఎలా అనుకోగలం?

      Delete
    6. ప్రవీణ్ గారు, రాధాకృష్ణమూర్తి గారు వైద్యుడే కాదు. జీవితాంతం మార్క్సిస్టుగానే ఉన్నారు. అయినా ఆయన ఏ సందర్భంలో ఎలా చెప్పినదీ నాకు సరిగా గుర్తు లేదు. వైద్యుడుకి శరీర ధర్మం గురించి తెలిస్తే కులం, లింగం గురించి అభిప్రాయం మార్చుకుంటాడా? మార్చుకోవచ్చు. మార్చుకోక పోవచ్చు. అది వారి చైతన్యస్థాయిని బట్టి ఉంటుంది. ఇక్కడ డాక్టర్ అయితే శరీర నిర్మాణ శాస్త్రం గురించి ఎక్కువ తెలిసే అవకాశం ఉంది. పైగా ఆయన సమాజ పరిణామ క్రమం కూడా బాగా తెలిసినవాడు. ఆయనకు ఇలాంటి వాటిలో మార్చుకోలేనంత అజ్ఞాని అయితే కాదు. అతివాదం చేసేవాడు అసలేకాదు. నేను ఈ ప్రశ్నను మరో మిత్రుడిని అడిగితే శాస్త్రవేత్తలు కూడా స్త్రీ శారీరకంగా బలహీనురాలని ధృవీకరించినట్లు చెప్పాడు. అయితే మీరేమైనా ఈ విషయమై ఆధారాలు సైంటిఫిక్ గా ఉన్నవి చెప్పగలరా?

      Delete
    7. మనిషిలో స్వార్థానికి కారణం జన్యువులు అని వాదించే శాస్త్రవేత్తలు ఉన్నారు. వారి వాదనని మీరు నమ్ముతారా? స్వార్థానికి జన్యువులతో సంబంధం లేదు. ఎంత వెనుకబడిన సమాజంలోనైన మనిషి తనని తాను నమ్మినంత స్థాయిలో ఇతరులని నమ్మడు. ఆ విధంగా మనిషి ప్రాథమికంగా స్వార్థ జీవి అనుకోవచ్చు కానీ దానికి జన్యువులతో ముడిపెట్టడం అనవసరం అని నేను అంటాను. కమ్యూనిజమ్ని ఓడించడానికి పెట్టుబడిదారులకి survival of the fittest లాంటి బయాలజీ కాన్సెప్త్స్ దొరుకుతాయి. అలాగే స్త్రీవాదాన్ని ఓడించడానికి పురుషాహంకారులు ఇంకేవో కాన్సెప్త్స్‌ని పట్టుకుంటారు.

      Delete
    8. నేను సంపూర్ణంగా మార్క్సిజాన్ని విశ్వసించేవాడిని కాదు. మార్క్సిజం నాకు చాలా విషయాలలో తేల్చుకోవలసినవి ఉన్నాయి. దానికి కొన్ని తేల్చుకుని నిర్ధారించుకుని వాదించేవాటికీ పొంతన పెట్టాల్సిన అవసరం లేదు. శాస్త్రవేత్తలు ఆధారాలతో నిరూపించినవి నేను నమ్ముతాను. పెట్టుబడిదారుల కొమ్ము కాసే దొంగ శాస్త్రవేత్తలను నేను నమ్మను. మానవునికి బుద్ధి ఎలా ఏర్పడుతుందనేదానిలో మార్క్సిజం చెప్పేదానిపై కూడా నాకు సంపూర్ణ ఏకీభావం లేదు. ఒకేరకమైన పరిస్తితులలో అనేకమంది అనేక రకాలుగా ఎందుకు పరాయీకరణ చెందుతారనేదానికి మీరె ఏమి సమాధానం చెప్తారు ప్రవీణ్? స్త్రీవాదం అంటూ ప్రత్యేక వాదం దేనికసలు? అది మార్క్సిజానికి విరుద్ధమయినది కాదా?

      Delete
    9. నేను స్త్రీవాదినని చెప్పుకోవడానికి కంటే మార్క్సిస్త్‌నని చెప్పుకోవడానికి ప్రాధాన్యత ఇస్తాను. నేను మార్క్సిస్త్‌నని చెప్పుకోవడానికి కంటే భౌతికవాదినని చెప్పుకోవడానికి ప్రాధాన్యత ఇస్తాను. వాదం అనేది భౌతిక పరిస్థితిని తెలియజేస్తుంది కానీ వాదం నుంచి భౌతిక పరిస్థితి పుట్టదు కదా.

      రష్యాలో జాతుల సమస్యని ఎలా పరిష్కరించాలో మార్క్స్ చెప్పలేదు. అయినా స్తాలిన్ జాతుల సమస్య పరిష్కారాన్ని ఒక చాలెంజ్‌గా ఎలా తీసుకున్నాడు? మార్క్సిజం అంటే మార్క్స్ చెప్పినవి మాత్రమే స్కూల్ పాఠంలా చదవడం కాదు కదా.


      Delete
    10. భౌతిక పరిస్తితులనుండే భావం పుడుతుంది. ఇందులో మార్క్సిజం ఏ ఇతరులకన్నా చక్కగా చెప్పింది. మార్క్సిజం కంటే భౌతికవాదినని చెప్పుకోవడం అనేదే గొప్పది. అయితే ఒకే పరిస్తితి ఉన్నప్పుడు వివిధ వ్యక్తులందరి ఆలోచన ఒకేలా ఉండదు కదా? దీనికి మీరేమి చెప్తారు? అనేది నా ప్రశ్న.

      Delete
    11. Comprehension (అర్థం చేసుకోవడం)లో ఇద్దరి మధ్య తేడాలు ఉండవా? ఆ ఇద్దరూ సమాజాన్ని ఒకేలా పరిశీలిస్తారని అనుకోలేము. పిల్లల్ని బెల్త్‌తో కొట్టి చదివించే కసాయి తండ్రి పెంపకంలో పెరిగినవాడు పెద్దైన తరువాత దొంగ అవుతాడు కానీ ఆఫీసర్ అవ్వడు అని సైకాలజిస్త్‌లు అంటారు. నేను ఆ రెండిటిలో ఏదీ అవ్వలేదు.

      Delete
    12. పిల్లల్ని బెల్త్‌తో కొట్టి చదివించే కసాయి తండ్రి పెంపకంలో పెరిగినవాడు పెద్దైన తరువాత దొంగ అవుతాడు కానీ ఆఫీసర్ అవ్వడు అని సైకాలజిస్త్‌లు అంటారు
      ఏ సైకాలజిస్టు చెప్పాడు? అదే నిజమైతే, భారత దేశములో 90% మంది దొంగలే ఉంటారు. తప్పు చేసినప్పుడు తండ్రి కొట్టడం సహజం. అది వారి బాగు కోసమే కానీ వారిని హింసించాలన్న తలంపుతో కాదు. కాకపోతే అలా కొట్టడం వలన పిల్లలపై మానసికంగా కొంత ప్రభావం అయితే పడుతుంది. ఒక సారి కొట్టినా, తరువాత తండ్రి చూపే వాత్సల్యం దాన్ని కవర్ చేస్తుంది. ఏవో కొన్ని ప్రత్యేక కేసుల్లో తప్ప.

      Delete
    13. This comment has been removed by the author.

      Delete
    14. 1) అర్ధం చేసుకోవడంలో తేడాలు కు కారణాలు ఏమిటి? ఆ కారణాలు ఎలా సరవుతాయి? ఈ ప్రశ్నకు సూటిగా సమాధానం కావాలి నాకు.

      2) తండ్రి బెల్టుతో కొడితే పెద్దయ్యాక దొంగ అవుతాడని సైకాలజిస్టులు చెప్పరు. అలా చెప్పేవాడు సైకాలజిస్టు కాదు. మీరు దొంగ అయ్యారా? మీ నాన్న బెల్టుతో కొట్టేవాడని మీరే చెప్తుంటారు కదా?

      3) పరిస్తితిని బట్టే మెదడుకు ఆలోచన వస్తుంది. ప్రతి మెదడు ఆలోచించే శక్తిని కలిగి ఉంటుంది. ఆలోచించే శక్తిలో తేడాలుంటాయి. అయితే నేనడిగేది బుద్ధి అనేది (ప్రవర్తన) మనిషి మనిషికీ తేడా ఉంటుంది ఒకే పరిస్తితిలో కూడా. అంటే కేవలం పరిస్తితులే కాక మరేదో మానవ స్వభావంపై ప్రభావం చూపుతుంది కదా? దీనికి మీరేమంటారు?

      Delete
    15. శ్రీకాంత్ గారు, మనిషి ప్రవర్తనను నియంత్రించడంలో బహుమతి (వాత్సల్యం) - శిక్ష (కొట్టడం) రెండూ ప్రభావం చూపుతాయి. ఏది ఎప్పుడు ఏ సందర్భంలో వినియోగించాలనే విచక్షణే ఇంపార్టెంట్.

      Delete
    16. 11 ఏళ్ళ పిల్లవానికి బిహేవియర్ అంటే ఏమిటో తెలియదు. మరి అతన్ని బిహేవియర్ పేరుతో కొడితే అతనికి మంచి బిహేవియర్ వస్తుందా? వీళ్ళు పిల్లల్ని చదువు పేరుతో కొట్టి, దాన్ని బిహేవియర్ పేరుతో కవర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.

      Delete
  6. This comment has been removed by the author.

    ReplyDelete
  7. ఇక్కడ ఒక విషయం గురించి మనం మాట్లాడుకోవాలి. చాలా మంది స్త్రీవాదులు, వారు చెప్పిన దానికల్ల తలూపే లెఫ్టిస్టులు, జెండర్ అనేది సమాజ నిర్మితమని (social construct) అని భావిస్తున్నారు (అని రుద్దుతున్నారు అంటే కరక్టుగా ఉంటుంది). కానీ, స్త్రీ పురుషుల మధ్య ఉన్న విబేధాలు "సమాజ నిర్మితాలు" కావు. అవి "బయోలాజికల్" గా ఉన్నవి. కొన్ని విషయాలలో సమాజం అంక్షలున్న మాటా నిజమే అయినా, బియోలాజికలుగా చాలా తేడాలు స్త్రీ పురుషుల మధ్య ఉన్నాయి. ఆ విషయం తెలుసుకోకుండా, ప్రతీ దానికి సమాజములో స్త్రీలపై ఉన్న వివక్షే కారణం అనుకోవడం అశాస్త్రీయ ఆలోచణా దృక్పదానికి నిదర్శనమని చెప్పొచ్చు.

    పురుషులలో టెస్టోస్టిరోన్ అనే హార్మోను కండరాల దృడత్వానిక తోడ్పాటునిస్తుంది. టెస్టోస్టిరోన్ స్త్రీలలో కూడా ఉంటుంది కానీ పురుషులలో ఉన్నంత ఉండదు. అలానే ఈస్త్రోజెన్ హార్మోను స్త్రీలలో మరికొన్ని రకాలైన ప్రభావాల్ని చూపిస్తుంది, పురుషులలో కాదు. దురదృష్టమేమిటంటే, స్త్రీవాదులు తమ సిద్దాంతాన్ని సైన్సు మీద కూడా బలవంతంగా రుద్దుతున్నారు. ఒకప్పుడు మతం (దాని తరపు మతాధిపతులు) తనకు అనుకూలంగా లేని విషయాలను చెబుతున్నందుకు సైన్సును అణచివేయాలని చూసింది. ఇప్పుడు ఆ పని స్త్రీవాదం, వామపక్షవాదమూ చేస్తోంది. అంటే వారు పూర్తిగా సైన్సును వ్యతిరేకిస్తున్నారు అని కాదు. తమకు ఉపయోగపడే సైన్సును వీరు స్వాగతిస్తూ, శాస్త్రీయ ఆలోచణ చేస్తున్నామని చెప్పుకుంటూనే, తమకు నచ్చని విషయాలలో మాత్రం సైన్సును నాశనం చేస్తుంటారు.

    ఉదాహరణకి, శారీరక బలం అనేది సమాజ నిర్మితమే కానీ బియోలాజికల్ కాదు అని చెప్పడం, ఇక్కడే చూస్తున్నాం.

    ReplyDelete
    Replies
    1. మన పూర్వికులకి బయాలజీ గురించి ఏమీ తెలియదు. అయినా వారు స్త్రీలు శారీరకంగా బలహీనులని ఎలా అనుకున్నారు? ఇందియాలో బానిస వ్యవస్థ అంతరించి కుల వ్యవస్థ ఏర్పడి 2500 సంవత్సరాలైంది. కుల వ్యవస్థని సృష్టించినవాళ్ళకి కూడా బయాలజీ తెలియదు. మన తాతల నమ్మకాలని జస్తిఫై చెయ్యడానికి బయాలజీ అవసరం లేదు.

      Delete
    2. అన్నీ మన వేదాల్లోనే ఉన్నాయిష! బయాలజీని కూడా మన వేదాల నుంచే దొంగిలించారుష!

      Delete
    3. మా సంస్కృతిని వెక్కిరించేటంతటి సీన్ లేదు. గణితం లో ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందిన శ్రీనివాసన్ రామనుజన్ నుంచి నేటి మంజుల్ భార్గవ వరకు హిందూ సంస్కృతి ఇన్ స్పిరేషన్ ఇస్తున్నాది. Pls read ...
      My greatest influences while growing up were my grandfather, a renowned scholar of Sanskrit and ancient Indian history, and my mother, a mathematician with strong interests also in music and linguistics. As a result, I also developed deep interests in language and literature, particularly Sanskrit poetry, and in classical Indian music. I learned to play a number of musical instruments, such as sitar, guitar, violin, and keyboard. But I always enjoyed percussion the most! My favorite instrument was the tabla, which I started playing when I was quite young as well.

      I always found the three subjects-music, poetry, and mathematics-very similar. In fact, I find that I think about them all in very similar ways. In school, mathematics is generally grouped in the "science" category. But for mathematicians, mathematics-like music, poetry, or painting-is a creative art. All these arts involve-and indeed require-a certain creative fire. They all strive to express truths that cannot be expressed in ordinary everyday language. And they all strive towards beauty.

      The connection between music/poetry and mathematics is not only an abstract one. While growing up, I learned from my grandfather how much incredible mathematics was discovered in ancient times by scholars who considered themselves not mathematicians, but poets (or linguists). Linguists such as Panini, Pingala, Hemachandra, and Narayana discovered some wonderful and deep mathematical concepts while studying poetry. The stories that my grandfather told me about them were very inspirational to me not just poetically, but mathematically.

      Maybe I can give you an example, originating in 500 B.C., that has been particularly fascinating to me as a drummer. In the rhythms of Sanskrit poetry, there are two kinds of syllables-long and short. A long syllable lasts two beats, and a short syllable lasts one beat. A question that naturally arose for ancient poets was: how many rhythms can one construct with exactly (say) 8 beats, consisting of long and short syllables? For instance, one can take long-long-long-long, or short-short-short-long-long-short.
      The answer was discovered by the ancients, and is contained in Pingala's classical work

      http://timesofindia.indiatimes.com/home/stoi/deep-focus/Math-teaching-in-India-is-robotic-make-it-creative/articleshow/40321279.cms

      Delete
    4. This comment has been removed by the author.

      Delete
    5. ఉదాహరణకి, శారీరక బలం అనేది సమాజ నిర్మితమే కానీ బియోలాజికల్ కాదు అని చెప్పడం, ఇక్కడే చూస్తున్నాం*
      అదే పెద్ద కామేడి అంటే. ఇంత మంది చెప్తున్నా, వివరించిన తరువాత కూడా ఆ అభిప్రాయం వల్లేవేస్తున్నారంటే ఎక్కడో, ఏదో లోపం ఉంది. మిలటరిలో ఆడవారికి డ్రిల్ లో ఎన్నో మినహాయిపులు ఇస్తారు. మగవాళ్లు అవలీలగా చేసే ఎన్నో పుషప్స్/దండాలు తీయటం, పరుగెత్తటంలో కూడా ఆడవారికి మినహాయింపులే! కారణం వారికి శారీరక బలం విషయం లో ఉన్న పరిమితులు.
      -----------------
      శ్రీకాంత్ ,
      సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం నుంచి ప్రపంచ వ్యాప్తంగా జరిగిన సంఘటనలు కోట్ చేస్తూ, అక్కడోక ముక్క ఇక్కడోక ముక్క తీసుకొని వాదన వినిపిస్తే విసుగేస్తుంది. కనుక ఇక పెద్దగా చర్చలో పాల్గొనక పోవచ్చు. ఈ విషయాల గురించి చాలా రోజుల క్రితం పుస్తకాలు చదివాను. నెట్ లో వెతికి లింక్ లు ఇస్తున్నాను. ఇవి మీకు ఉపయోగపడతాయి అనుకొంట్టున్నాను.
      Women in the Armed Forces
      http://www.indiandefencereview.com/interviews/women-in-the-armed-forces/0/
      Plight of Women in the US Military
      http://www.indiandefencereview.com/spotlights/plight-of-women-in-the-us-military/

      Women in the Indian Army-1
      http://www.indiandefencereview.com/spotlights/women-in-the-indian-army-i/0/

      Army veteran Brian Mitchell shatters stock Pentagon assurances to reveal that women have had a profoundly negative effect on U.S. fighting capabilities. A few of the grim facts:

      When the going gets tough, the tough get "stress passes"
      The truth about female troop performance during the Gulf War
      The two countries that tried a feminized military and quickly abandoned it
      The hard data on soaring attrition rates, skyrocketing medical costs, lower rates of deployment, mushrooming levels of single parenthood, and more...

      http://www.amazon.com/Women-Military-Flirting-With-Disaster/dp/0895263769

      Women-Military-Flirting-With-Disaster Review
      http://cssronline.org/CSSR/Archival/2000/327_review_Krason.pdf

      Delete
    6. శ్రీకాంత్ గారు, స్త్రీవాదులు చెప్పేదానికల్ల తలూపేవారు లెఫ్టిస్టులు కారు. అసలు లెఫ్టిస్టులు స్త్రీవాదమంటూ ప్రత్యేకంగా ఉండకూడదనే చెప్తారు. జెండర్ అనేది సహజాతమని జెండర్ పరంగా అసమానతలు సమాజనిర్మితమని లెఫ్టిస్టులు చెప్తారు. నాకు తెలిసినంతవరకు బయలాజికల్ ఎవిడెన్స్ ప్రకారం కూడా శారీరకంగా స్త్రీ పురుషునికంటే బలహీను రాలు. అయితే ఒక పని చేయాలంటే శ్రమ+తెలివి రెండు అంశాలు ఇమిడి ఉంటాయి. మనిషి అంటేనే మనసు ప్రధానమైన జీవి. ఇతర జీవులకి మనిషికీ తేడా అదే కనుక, మనుషులలో స్త్రీ - పురుషులలో ఎవరూ ఎక్కువా తక్కువా కారు. ఇద్దరూ కలిస్తేనే పునరుత్పత్తి అయినా, సమాజ పురోగతి అయినా సాధ్యం.

      Delete
    7. ఎ వాధమైన ఎందుకు ఏర్పడుతుంది? ఆ వాధానికి లేక ఆవాధం చేసే వారికి సమాజంలో సరైన ప్రాధాన్యత లేదు కాబట్టి అని నేను అనుకుంటున్నాను. ఉధా:- పురుష వాధమనేది లేదు ఇప్పటి వరకు. పురుషాధిక్యత అని అంటున్నారు ఎందు కంటే స్త్రీల కంటే బలవంతులు కాబట్టి. స్త్రీ వాదమైనా, దలితవాదమైనా మరో వాధ మైన సమాజములో సమానత్వం లేదు కనుక ఆ సమానత్వం కొరకు వాధాంచే వారు ఆ వాధాల్ని వెనుకేసు కొస్తారు. వారికి న్యాయం కావాలంటారు. అంతవరకే వారు ఇతరులకంటే గొప్ప వారు అవుదామని కాదు. అలా అయినా, వారి నుండి పీడించ బడె వారు మళ్లీ ఇంకో వాధాన్ని లేవదీస్తారు ఆధిక్య వాధులకు వ్యతిరేకంగా. ఒక వేల స్త్రీ వాదులు ఆధిక్యతకు సాదిస్తే వారికి వ్యతి రేకంగా పురుష వాదులు వస్తారు. స్త్రీ వాధాన్ని సమర్ధిస్తున్న మంటె వారిని ఆధిక్యతలో కూర్చో బెట్టడం కాదు. బేలన్స్‌ ఎప్పుడు పడి పోతుందో వైరుధ్హ్యాలేర్పడతాయి అవునన్నా కాదన్న. లెప్టిష్టులు సమాజంలో బలహీన వర్గాల తరుపున ( స్త్రీలను కూడా) ఆధిక్యవాదుల మీద వాదిస్తారు కనుక ఏ వర్గాన్ని ఆధిక్య పరిచేలా చెయ్యరు.
      స్త్రీలు శారీకంగ బలహీనులా అన్న విషయం నేను కత్తి పద్మా రావు అనే ఆయన భారతదేశ చరిత్రలో స్త్రీ అనే పుస్తకం నుండి తీసుకున్నది. కొన్నేల్లకింద చదివాను. ఆ రెఫెరెన్స్‌ ఇద్దామనుకుంటే ఆపుస్తకం నాదగ్గెర లేదు.

      Delete
    8. పెట్టుబడిదారీ వ్యవస్థలో కూడా అంతర్గతంగా భిన్న వాదాలు ఉన్నాయి. ఉదా: అనార్కోకేపితలిజం (ప్రభుత్వం ఉండకూడదనే వాదం), లిబర్తేరియన్ కేపితలిజం (ప్రభుత్వం కేవలం పోలీస్ స్తేషన్‌లు, కోర్త్‌లు లాంటివి నిర్వహించడానికి పరిమితమవ్వాలనే వాదం) వగైరా. ప్రస్తుతం ఉన్న పాలక వర్గం వల్ల పెట్టుబడిదారీ వ్యవస్థకి వచ్చిన నష్టం ఏమీ లేదు కాబట్టి ఈ వాదాలు పాప్యులర్ అవ్వలేదు.

      స్త్రీవాదం, దళితవాదం బాగా పాప్యులర్ అవ్వడానికి కారణం స్త్రీలు, దళితులూ అణచివేతకి గురవుతూ ఉండడమే. కొంత మంది 498a కేసుల పేరు చెప్పి పురుషవాదం అనే కొత్త కాన్సెప్త్ లేవనెత్తినా అది పాప్యులర్ అవ్వలేదు. విడాకుల కోసం కోర్త్‌కి వెళ్ళొచ్చు అని తెలియని స్త్రీలు ఉన్న దేశంలో 498a గురించి తెలిసినవాళ్ళు ఎంత మంది ఉంటారు? దాని గురించి తెలిసిన స్త్రీల సంఖ్యని ఎక్కువ చేసి చూపినా ఎంత మంది నమ్ముతారు? అందుకే పురుషవాదం పేరుతో లేవనెత్తిన కొత్త వాదం ఓడిపోయింది.

      నిజమైన వాదం అనేది వైరుధ్యం నుంచే పుడుతుంది కానీ కృత్రిమంగా పుట్టదు.

      Delete
    9. సమైక్యాంధ్రవాదం ఎందుకు ఓడిపోయిందో కూడా ఇక్కడే అర్థమవుతుంది. తెలంగాణాతో పోలిస్తే సారవంతమైన వ్యవసాయ భూములు ఉన్న కోస్తా ఆంధ్ర వెనుకబడిందని చెప్పి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఎంఫసైజ్ చెయ్యడానికి అవ్వదు కదా. ఈ విషయం కోస్తా ఆంధ్ర నాయకులకి తెలుసు. వాళ్ళు తెలంగాణా చచ్చినా రాదని ప్రచారం చేసి కాలం గడిపారు కానీ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి నిజాయితీగా ప్రయత్నించలేదు.

      Delete
    10. నిజానికి వామపక్ష వాదం మీద నేనొక బ్లాగు పోస్టు రాయాలని ఎప్పుటినుండో అంకుంటున్నానండీ. అది తప్పకుండా రాస్తాను. ఆ పోస్టులో నేను ఇంత వరకూ గమనించిన, గ్రహించిన విషయాలను రాస్తాను. రాసిన వెంటనే ఇక్కడ లింకు ఇస్తాను.

      Delete
  8. 1) Testosterone (aka male hormone) కండరాల్ని గట్టిపరుస్తుంది. Estrogen (aka female hormone) తద్విరుధ్ధంగా మృదుత్వాన్ని కలిగించే స్వభావాన్ని కలిగి ఉంటుంది.
    2) ప్రస్తుత ప్రపంచంలో hard skills (I.Q.) కన్నా soft skills(E.Q.) ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. (ఆమాటకొస్తే షావొలిన్ యుధ్ధవిద్యల్లోని The Furious Fiveలో మూడు ఉదా:- Preying Mantis, Snake, The Great Stork feminine arts కాగా, రెండు మాత్రమే ఉదా :- Monkey, Tiger Male arts గా పరిగణిస్తారు).

    పురుష, స్త్రీ స్వభావాలను చైనీస్ తత్వశాశ్త్రంలో 'యిన్', 'యాంగ్' అంటారు. రెండూ బ్యాలెన్స్డ్‌గా ఉండటాన్నే వాళ్ళు సంపూర్ణారోగ్యంగా పరిగణిస్తారు. ఏ ఒక్కటి ఎక్కువగా ఉన్నా అది మంచిదికాదు. ఇలాంటిదే ఒకటి జాతీయం తెలుగులో ప్రచారంలో ఉంది. ఒక పరిపూర్ణమైన మగాడు కొంచెం ఆడతనాన్ని కలిగుండాలి, ఒక ఆడది పరిపూర్ణమవడానికిగానూ కొంచెం మగలక్షణాలు అలవర్చుకోవాలి (కృష్ణుదు-సత్యభామల్లాగా).

    ReplyDelete
  9. అమ్మ నాయనోయ్ ఇది యేదో మామూలు టాపిక్కనుకుని మొదట్లో ఇటు రాలేదు.తీరా చూస్తే చర్చ చాలా హాటుగా వుందే!
    కొంచెం లూబ్రికేట్ చెయ్యడానికి ఒక జోక్ చెప్పనా?
    విశ్వనాధ పావని శాస్త్రి గారు(విశ్వనాథ సత్యనారాయణ గారబ్బాయి?!) ఆంధ్రజ్యొతి వీక్లీలో కాలం దాటని కధలు అని వేసేవారు.వాటిల్ల్లో ఒకదాని సారాంసం: కొన్ని కాపురాలు తిరపతి రకంవి(డామినేషన్ సారుది!),మరికొన్ని బెజవాడలు(మేదం గారి డామినేషన్!) అని చెప్పి మా పొరిగింటాయనది బెజవాడ, ఆ పకింతాయన ది కూడా బెజవాదే అని ఒక పొడుగాటి లిష్టు చెప్పి ఆఖర్లో మాదీ బెజవాడే అని ఫినిష్షింగ్ టచ్ ఇచ్చారు.

    ReplyDelete
  10. Iconoclast గారి ఒపీనియన్ బాగుంది.అర్ధనారీశ్వర తత్వమూ అదే.

    ReplyDelete
  11. నిరంతరం హిందూ సంస్కృతిని ఎగతాళిచేసే వారికి. ఈ రోజు ఈనాడు పేపర్లో వచ్చిన వార్త.

    మన యోగులు....సిస్టంస్ శాస్త్రవేత్తలు 5000 ఏళ్ల క్రిందటే ఇంజనీరింగ్ సూత్రాలను కనుగొన్నారు.
    విశ్వసం శరీరం పరస్పర అనుసంధానిత వ్యవస్థ అని తేల్చారు. ఈ మైల్ ఆవిష్కర్త శివ అయ్యాదురై వెల్లడి.

    http://eenadu.net/news/newsitem.aspx?item=story&no=4
    _______________________________________

    How Maths 'Nobel' winner Manjul Bhargava solved a 200-year-old number theory puzzle via Sanskrit texts and Rubik's Cube

    http://indiatoday.intoday.in/story/maths-nobel-fields-medal-manjul-bhargava-solved-gauss-200-year-old-number-theory-puzzle/1/376911.html

    ReplyDelete

  12. పోస్టు తో సంబంధంలేని వ్యాఖ్యలు ఎక్కువగా వచ్చాయి.స్త్రీ పురుషునికన్న శారీరకంగా బలహీనురాలు అన్నది వాస్తవం.అంటే ఒకజాతిలో సగటు స్త్రీ సగటు పురుషుని కన్న బలహీనురాలని అర్థం.ఐతే ఆమె మిగతా చాలా విషయాల్లో పురుషునికన్నా superior గాని,సమానురాలు గాని కావచ్చు. ఉదా ;తెలివితేటల్లో.

    ReplyDelete
    Replies
    1. @కమనీయం, అసలికి ఈ అంశంపై చర్చించటానికి ఏముంది? అందరికి తెలిసిన నిజాలు కంటి ముందు కనిపిస్తున్నా ఇజాలను, నమ్మినవారు నిజాలను నమ్మకుండా అనవసరంగా వాదించారు.

      Delete
    2. వరసలకీ, inbreedingకీ మధ్య లేని సంబంధం పెట్టి చర్చించినవాళ్ళు ఇజాలూ, నిజాలూ అంటూ మాట్లాడడం విచిత్రంగా ఉంది. అందరూ నమ్ముతున్నారా లేదా కొద్ది మంది నమ్ముతున్నారా అనే దానితో సైన్స్‌కి సంబంధం ఉండదని నేను ఇందాకటి వ్యాఖ్యలోనే వ్రాసాను.

      Delete
    3. సైన్స్ అనే జీవితం లో ఒక భాగం. అంతేకాని జీవితం సైన్స్ కోసం కాదు జీవించేది. ఆధునిక మానవుడికి సైన్స్ లో ని ఆవిష్కరణల వలన ఎంత మేలు జరిగిందో అంత కీడు జరిగింది. ఉదా|| జపాన్ పై అణుబాంబు దాడి, డ్రోన్ లతో ఆధునిక యుద్దాలు మొదలైనవి. మన దేశంవారి కీడు జరగలేదు కనుక సైన్స్ ను దేవుడితో సమానమన్నట్లు కొంతమంది మాట్లడుతూంటారు. సైన్స్ కూడా నిరంతరం మారుతూంటే ఏ సైన్స్ గురించి మాట్లాడేది. న్యుటన్ కాలం నాటిదా? ఐన్ స్టీన్ కాలం నాటిదా, ఇప్పటిదా? సైన్స్ రోజు కొత్తవి కనుకొంట్టున్నాది కనుక అందరు మనిషులు తన అలవాట్లను సైన్స్ మాగజైన్ చదివి, నేను ఆధునిక మానవుడిని అని నిరూపించుకోవటానికి మార్చుకొంట్టు కూచోరు. అవసరమైతేనే సైన్స్ ను జీవితంలోకి ఆహ్వానిస్తారు. టెక్నాలజి వలన సైన్స్ గురించి చదువుకొన్నవారు తలచుకొంట్టున్నారు గాని లేకపోతే న్యుటన్, ఐన్ స్టీన్ మొదలైన శాస్ర వేత్తల గురించి ఎంతమంది ప్రజల కి తెలుసు?

      Delete
  13. స్త్రీ బలవంతురాలే. సైన్స్ విషయంలో పది మంది నమ్మేది ప్రమాణం కాదు. స్త్రీ పురుషుని కంటే శారీరకంగా బలహీనురాలనడానికి ఎవిదెన్సెస్ లేవు కదా. ఎముకల సాంద్రత అనో, ఇంకో పేరో చెప్పి సంబంధం లేని విషయాలు ప్రస్తావించినంతమాత్రాన వాస్తవాలు మారవు.

    ReplyDelete
  14. @praveen
    మన పూర్వికులకి బయాలజీ గురించి ఏమీ తెలియదు. అయినా వారు స్త్రీలు శారీరకంగా బలహీనులని ఎలా అనుకున్నారు? ఇందియాలో బానిస వ్యవస్థ అంతరించి కుల వ్యవస్థ ఏర్పడి 2500 సంవత్సరాలైంది. కుల వ్యవస్థని సృష్టించినవాళ్ళకి కూడా బయాలజీ తెలియదు. మన తాతల నమ్మకాలని జస్తిఫై చెయ్యడానికి బయాలజీ అవసరం లేదు.
    An:
    చరక సమ్హిత యే కాలం నాతిదో తెలుసా మీకు?అక్కద సరీర ధర్మ శాస్త్రం మొగ్గ దసలో కూడా యెదగని కాలంలోనే హ్ర్ద్రోగాలలోని రకాల్ని గురించి వర్ణిచాదు.ప్లాస్తిక్ సర్జరీ గురించి మరొకాయన ప్రస్తావించాడు.వాళ్ల కాలం గురించి నేను చెప్పను,మీరు తెలుస్కోంది.వాళ్లంతా కాల్పనిక వ్యక్తులు కాదు.వాళ్ళు రాసినవి పుక్కితి పురానాలు కాదు.ఇవ్వాళ్తి సిధ్ధాంతిక గ్రంధాల కున్న ప్రామాణికత వుంది.

    ReplyDelete
  15. Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. 17వ శతాబ్దంలో జాన్ డాల్టన్ కనుక్కున్న అణుధర్మ శాస్త్రం గురించి డాల్టన్ కన్న 2,500 సంవత్సరాలకి పూర్వమే ఆచార్య కణాదుడు ఇక్కడ ప్రతిపాదించాడు!అది యేదో భంగు మత్తులో వుండి వాగిన సొల్లు కాదు,అతని అసలు పేరు కశ్యపు డయితే ఈ సిధ్ధాంతం పేరు మీద కణాదు డనేది బిరుదుగా ఇవ్వగా వచ్చింది!ఈ ఋషి క్రీ.పూ 600లో ఇప్ప్పటి గుజరాతు లోని అప్పటి ప్రభాస క్షేత్రంలో జన్మించాడు.ఈ విశ్వమంతా అతి చిన్న అంశమయిన కణములు లేదా అణువులతో నిర్మించ బడింది అనీ,ఆ కణాన్ని అంతకన్నా చిన్న భాగాలుగా విడగొట్టలేము అనీ సిధ్ధాంతం లాగా వివరించి చెప్పాడు.కానీ మనం మాత్రం అణుధర్మ శాస్త్ర పితామహుడిగా జాన్ డాల్టన్ మహాసయుణ్ణే కీర్తిస్తాం.

      "భూమికి గల ఆకర్షణ వల్ల వస్తువులు భూమి పైన పడుతున్నాయి.ఇదే ఆకర్షణ వల్ల భూమి,ఇతర గ్రహాలు,నక్షత్ర సమూహాలు,సూర్యుడు,చంద్రుడు తమ తమ కష్యలలో పరిభ్రమిస్తున్నాయి" - ఇది మనం న్యూటన్ పేరు మీద గురుత్వాకర్షణ శక్తి నియమంగా చదువుకుంటున్నాం.కానీ ఈ మాటలు క్రీ.స 400-500 మధ్యన జీవించిన భాస్కరాచార్యు డనే భారత దేశపు ఖగోళ శాస్త్రవేత్త రచించిన్ "సూర్య సిధ్ధాంత" మనే గ్రంధం లోనివి!ఇది మనకి ఐజాక్ న్యూటన్ ద్వారా 1200 సంవత్సరాల తర్వాత తెలిసింది?

      పాశ్చాత్య శరీర ధర్మ శాస్త్రం ఇంకా శైశవ దశలో వున్న కాలం లోన ఐక్కడ ఆచార్య చరకుడు అనాటమీ,ఎంబ్రియాలజీ,ఫార్మకాలజీ శాఖలకి సంబంధించిన యెన్నో విషయాల్ని విపులంగా చెప్పాడు!మధుమేహం, హృదయ సంబంధమయిన వ్యాధుల గురించి యెన్నో విషయాలు చెప్పాడు!ఇక క్రీ.శ 499లోనే తన "ఆర్యభటీయం"లో గ్రహగతుల గురించీ గ్రహణాలు యేర్పదే విధం గురించీ వ్యాఖ్యానించాడు!కోపరంకికస్ ద్వారా మనం తెలుసుకున్న దానికి 1000 సంవత్సరాలకు ముందే భూమి గుండ్రంగా వుంటుందనీ అది సూర్యుడి చుట్టూ ఒక అక్షం మీద పరిభ్రమిస్తుందనీ చెప్పాడు?2600 సంవత్సరాలకు పూర్వమే శుశ్రుత మహర్షి సిజేరియన్,క్యాటరాక్ట్,ప్లాస్టిక్ సర్జరీ,బ్రైన్ సర్జరీ లాంటి యెన్నో క్లిష్తమయిన శస్త్ర చికిత్సలు చేశాడు!
      >>
      ఇవి కూడా అభూత కల్పనలేనా?నేను మిమ్మల్ని అడిగింది మీరు యెద్దేవా చేస్తున్న పాతకాలం వాళ్లకి బయాలగీ కన్నా యెక్కువే తెలుసుననే సాక్ష్యాలు అని చెప్పీన్ వాళ్ళ కాలం గురించి?

      Delete
    3. హిందూమతం, భవద్గీతను నమ్మిన శాస్రవేత్తలు రాకేట్ ను లాంచ్ చేసి, మార్క్స్ మీదకు ఉపగ్రహం వరకు పంపి సఫలం అయ్యారు. మరి కమ్యునిజాన్ని, ఇతర మతాలను వెనుకేసుకొచ్చే మీలాంటివారు సైన్స్ కు చేసిన సేవ ఎమిటి? ఈ దేశానికి చేసిన సేవ ఎమిటి? కనుక్కొన్న కొత్త విషయాలు ఎమిటి? మీకు,మిమ్మల్ని సమర్ధిస్తూ పసలేని వ్యాఖ్యలు రాసే వారికి తెలిసిన సైన్స్ ఎంతో చర్చలు చదివేవారందరికి తెలుసు. మీరేదైనా ఐ.ఐ.టి. టాప్ రాంకరా లేక కొత్తగా ఎదైనా ఆవిషకరించారా సైన్స్ గురించి స్పీచ్ లు ఇవ్వటానికి. హార్వర్డ్, ఐ.ఐ.టి.లో చదువుకొనే విద్యార్ధిలు ఉపనిషత్ లు, వేదంతం మీద ఉపన్యాసాలు ఏర్పాటుచేసుకొని,దానికి ఎంతోమంది హాజరౌతూంటారు. రోడ్ సైడ్ పుస్తకాలు చదివి ఆ జ్ణానంతో వచ్చి వాదనలు దిగటం. ఎందుకులే అనవసరంగా మీతెలివిని బయటపెట్టించి, ఎగతాళి చేయటం బాగుండదని గమ్ముగా ఉంటే, అది గ్రహించకుండా మళ్ళి వ్యాఖ్యలు రాయటం. మీరేమైనా శాస్రవేత్తలై ఎదైనా కొత్త విషయాన్ని కనుకొంటే హిందువులు దానిని వ్యతిరేకించి, మత గ్రంథాలలో చెప్పినవాటికి వ్యతిరేకంగా ఉన్నాయని ఇతరదేశాలలో వలే రాళ్ళేసి కొట్టారా? మీరంత బ్రిలియంట్ అయితే ఇక్కడ బ్లాగులో చేరి సైన్స్ గురించి మాట్లాడేకన్నా, ఎదైనా పరిశోధనా సంస్థలోచెరో, ఐ.ఐ.టి. లో ఆచర్యుడుగా పనిచేస్తూ శాస్రవిజ్ణానం బ్లాగాయన లాగా రాస్తే ఒక విలువ. అది తెలుసుకోకుండా ఎంత సైన్స్ గురించి మాట్లాడినా వినేవారుండరు.

      65 ఏళ్లైనా కమ్యునిస్ట్ లు కేంద్రంలో అధికారంలోకి రాలేదు సరికదా! దేశంలో ఏ రాష్ట్రంలో ఆపార్టి ప్రభావంచూపించే పరిస్థితిలో లేదు. కనీసం కార్మిక సంఘాలలో బలంగా ఉన్నట్లు లేదు. అది మీరు సాధించిన ఘనవిజయం. సైన్స్ సంగతి తరువాత మీపార్టి సంగతి చూసుకొండి.

      Delete
  16. పాము కరిచినా, తేలు కరిచినా మంత్రగాని దగ్గరకి వెళ్ళే అజ్ఞానంలోనే మన పల్లెటూరి జనం ఉన్నారు. పాము కాటుకి వైద్యం కనిపెట్టలేని మనవాళ్ళు ఇంకేవో పరమ రహస్యాలు కనిపెట్టారట!

    ReplyDelete
    Replies
    1. అడిగిన దానికి చెప్తే మంచిది!అదే సరయిన వాదనా పధ్ధతి,పైన చెప్పిన అవాళ్ళ కాలం తెలిసింది గదా?కప్పదాటు జవాబులు చెప్తూ ప్రసనని తప్పించుకునే మీలాంతివాళ్ళు వుందబట్టే - పాము కరిచినా, తేలు కరిచినా మంత్రగాని దగ్గరకి వెళ్ళే అజ్ఞానంలోనే మన పల్లెటూరి జనం ఉన్నారు.
      >>
      స్మిత్తుగారి సిధ్ధాంతాన్నే పిండి పిసికీ జీడిపాకం సిధ్ధాంతాన్ని కనిపెట్టేసీనట్టు ఫీలయ్యేవాళ్ళ్ యేందో మేధావులట!

      Delete
    2. పల్లెటూరి ప్రజలు అజ్ణానం లో ఉన్నారని మీకేమైనా చెప్పారా? ఒకసారి వాళ్లదగ్గరకెళ్లి ఇదే మాట అను, వారు ఒప్పుకొంటారో లేదో నీకేతెలుస్తుంది.
      పాముకాటుకు మందు కనిపెట్టే ప్రాజెక్ట్ చాలా చిన్న ప్రాజేక్ట్. ఆరోజుల్లో మనవాళ్లు తెల్లవారికి దానిని అవుట్ సోర్సింగ్ ఇచ్చారు. భారతదేశ శాస్రావేత్తలు పెద్ద ప్రాజెక్ట్ ల పై దృష్టి సారించేవారం. నీకు ఆ విషయం ఇప్పటి వరకు తెలియదా?

      Delete
    3. పాముకాటుకు మందు కనిపెట్టే ప్రాజెక్ట్ చాలా చిన్న ప్రాజేక్ట్. ఆరోజుల్లో మనవాళ్లు తెల్లవారికి దానిని అవుట్ సోర్సింగ్ ఇచ్చారు.
      LOL - అ.హా!

      Delete
  17. మా తాతల ఊరిలో అయితే పాము కరిస్తే నోటిలో ఆకు పసరు పోసేవాడు కూడా లేడు. పసరు మందులు కూడా ప్రయోగించలేనోళ్ళు ప్లాస్తిక్ సర్జరీ చేసేదొకటి! వినేవాడు వెంగళప్ప అయితే పంది పురాణం చెపుతుంది అని ఇందుకే అన్నారు. విజయవాడలో పుట్టి పెరిగిన హరిబాబు గారికి మంత్రగాళ్ళ దగ్గరకి వెళ్ళే పల్లెటూరివాళ్ళ జీవితాలు జోక్‌లానే కనిపిస్తాయి. హరిబాబు గారిది విజయవాడేనని నాకు ఖచ్చితంగా తెలుసు. సూరనేనివారు విజయవాడ దగ్గర మైలవరం జమీందారీ సంస్థానం నుంచి వచ్చినవాళ్ళు.

    ReplyDelete
    Replies
    1. మీ తాతల ఊరిలో వైద్య్లు లేకపొతే ఎమి చేయాలి? నేటికి ఎన్నో పల్లేలో వైద్యులు లేరు. దానర్థం ఈ రోజుల్లో ఆధునిక వైద్యం సిటిలల్లో, జిల్లా కేంద్రాలలో లేదని చెప్పగలవా?

      Delete
    2. *మంత్రగాళ్ళ దగ్గరకి వెళ్ళే పల్లెటూరివాళ్ళ జీవితాలు జోక్‌లానే కనిపిస్తాయి*
      మా తాతలు పల్లెలో నే ఉన్నారు. పల్లేటురి వారు చాలా అమాయకులని నోట్లో వేలు పెడితే కొరకలేని వారని సినేమాలలో చూపిస్తూంటారు, కథలలో రాస్తూంటారు. వాస్తవానికి వారేమి అంత అమాయకులు కారు. మీరేదో ఆ రోజుల్లో వారు చాలా కష్టాలు పడినట్లు సింపథి ని క్రియేట్ చేయవలసిన అవసరంలేదు. ఇంతకి మీ ఉద్దేశం ఎమిటి? హిందువులంతా తెలివితేటలు లేని మొద్దువారు, మిగతావారు చాలా తెలివిగలవారా? మిమ్మల్ని మీరు కించపరచుకోవాలను కొంటే అది మీ ఇష్టం. కాని దానిని మాకాపాదిస్తామని వెంటపడితే వినేవారు ఎవరు లేరు. ప్రపంచంలో ఎంతో తెలివిగల వారైన యుదులను సైతం వారి రంగంలో ఓడీంచిన చరిత్ర హిందువులకు ఉంది. అది మీకు నచ్చకపోతే దానికి ఎవ్వరు చేసేదేమి లేదు.

      Delete
    3. ఈ పైత్యకారి డిడ్డక్టివ్ రీజనింగు దేనికి పనికొస్తుంది?మా తాతగారూ అంతే,కమ్యునిష్టు పార్టీని తిట్టినా యేమనే వాడు కాదు గానీ కనిపిస్తే కాల్చివేత వుత్తర్వులిచ్చి ప్రాణాలరచేత పట్టుకుని కొందపల్లి గట్లలో దాక్కునేలా చేసిన ఇందిరాగాంధీని తిడితే మాత్రం ఆగ్రహోదగ్రుదై పోయేవాడు!పెతీ కమ్యునిష్టు లోనూ వేపకాయంతయినా వెర్రి వుండటం సహజమేనేమో:-)

      Delete
  18. పల్లెటూర్లలో westetn medicine దొరక్కపోవచ్చు కానీ కలబంద, ఆముదం లాంటి మూలికా మందులు కూడా దొరక్కపోతే ఏమనిపిస్తుంది?

    ReplyDelete
    Replies
    1. పసరు మందులు కూడా ప్రయోగించలేనోళ్ళు ప్లాస్తిక్ సర్జరీ చేసేదొకటి! వినేవాడు వెంగళప్ప అయితే పంది పురాణం చెపుతుంది అని ఇందుకే అన్నారు.
      TIT forTAT:
      రష్యాలోనే చచ్చిన కమ్యూనిజం ప్రపంచాన్ని వుధ్ధరించేదొకటి!
      వినేవాడు వెంగళప్ప అయితే పంది పురాణం చెపుతుంది అని ఇందుకే అన్నారు.
      మరే కదూ?!

      Delete
    2. శుశ్రుతుడూ చరకుడూ చేసిన వాటి గురించి చెప్తుంతే పసరు మందుల పల్లెటూరి వాళ్ల గురించి తీసుకొస్తావు.నోటికి యేం తింటున్నావు?

      Delete
  19. మధ్యలో కమ్యూనిజమ్ మీద పడి ఏడవడం ఎందుకు? పెట్టుబడిదారుడు తన సొంత ఆస్తి కోసం కమ్యూనిజమ్‌ని వ్యతిరేకిస్తాడు తప్ప కమ్యూనిజమ్‌ని సమర్థిస్తే కళ్ళు పోతాయనో, దేవుడు శపిస్తాడనో భయపడి కాదు. మతం పేరుతో కమ్యూనిస్త్‌ల మీద పడి ఏడ్చేవాళ్ళ కంటే పెట్టుబడిదారులకే సెన్స్ ఎక్కువ ఉంటుంది.

    ReplyDelete
    Replies
    1. నువ్వు పాతకాలం వాళ్ళకి బయాలజీ యేమి తెలుసు అంటే నేను చరకుడి గురించి చెప్పాను.దానికీ పసరు మందుల వాళ్లకీ సంబంధం కలిపుతావు,మనిషి లాగా అలోచించేవాడెవడూ నీలాగా మాట్లాదడు!పసరు మందుల వాళ్ళు సస్త్ర చిత్సలు చెయ్యగలరని నేనన్నానా?యెదటి వాడు యేమి మాట్లాడినా నీకు తోచే అర్ధం తీసుకుని నీ కమ్యునిష్టు చెత్తననతా కక్కడానికి తయారయి వాగుతున్నది నువ్వు!హిందూమతం మీద పడి నువ్వు యేడుస్తూ కాసేపు పెళ్ళికై వరసలు అకావాలా అంటావు,అన్ని చోట్లా వరసలు విడివిడిగానే వున్నాయి కదా అని నీకు నువ్వే జవాబు చెప్పేసుకుంటావు,అసలు నీకీ చర్చల్లో పనేంటి?

      Delete
    2. మతం పేరుతో కమ్యూనిస్త్‌ల మీద పడి ఏడ్చేవాళ్ళ కంటే పెట్టుబడిదారులకే సెన్స్ ఎక్కువ ఉంటుంది.
      Ans:
      నా సెన్స్ గురించి తర్వాత తెలుసుకుందువు గానీ ఇక్కడ నువ్వు మాకు యేమి తెలియజెప్పుదామని అనుకుంటున్నావు?మా నుంచి యేమి తెల్సుకోవాలనుకుంటున్నావు/యెదటివాడితో మర్యాదగా యెట్లా మాట్లాదాలో కూడా తెలియని నీకు ఈ చర్చల్లో పాలు పంచుకునే అర్హత వుందా?

      Delete
    3. స్మిత్తుగారు చెప్పిన మనిషి వస్తుగతవాది అని మార్క్సు గారు కూడా వొప్పుకున్నాడు అంటావు,మరి వస్తుగత వాది అయిన ఈ మనిషి సొంత ఆస్తి రద్దుకి యెలా సుముఖంగా వుంటాడు?స్వంత ఆస్తి రద్దుకి వొప్పుకోనప్పుడు వర్గరహిత సమాజం యెట్టా వచ్చుద్ది - కొంచెం ఇదమరిచి చెప్పగలవా?ఇంత సెన్సులేని సిధ్ధాంతాన్ని నమ్ముతున్న నీకే సెన్సు లేదు!యేద్టివాళ్లకి సెన్సు లేదని నువ్వు వాగీతే పడటానికి ఇక్కడున్నవాళ్ళు నీ నౌకర్లు కాదు,భాష జాగత్త?!

      Delete
  20. ఉత్పత్తి సాధనాలు పెట్టుబడిదారుల చేతుల్లో ఉన్నాయా లేదా కార్మికవర్గం చేతుల్లో ఉన్నాయా? ఉత్పత్తి సాధనాలు కార్మికవర్గం చేతుల్లో ఉంటే అది పెట్టుబడిదారీ వ్యవస్థ అవ్వదు. ఆస్తి లేనివాళ్ళకే సొంతాస్తివాదంతో వైరుధ్యం ఉంటుంది. మార్క్సిజం చదివినవానికి ఈ ముక్క తెలియదా? తెలుగు బ్లాగుల్లో చాలా మందికి కమ్యూనిజం అంటే ఏమిటో తెలియదు, కమ్యూనిజం అంటే ప్రైవేత్ ఆస్తిని రద్దు చెయ్యడం అని కూడా తెలియదు. ఇప్పుడు కూడా కమ్యూనిస్త్ వ్యతిరేక బ్లాగర్లు "కమ్యూనిస్త్‌లు మా మతాన్ని తిడుతున్నారు" అని బాధపడడమే తప్ప సొంత ఆస్తి ఉండాలా, వద్దా అనే దానిపై ఒక్క వ్యాసం కూడా వ్రాయలేదు.

    ReplyDelete
    Replies
    1. ప్రవీణ్ గారు, ఉత్పత్తి సాధనాలపై యాజమాన్యమా? ఉత్పత్తి సాధనాలా? కమ్యూనిస్టులు మతాన్ని తిడతారా? మతోన్మాదులని తిడతారా?

      Delete
    2. మళ్ళీ అడిగినదానికి సూతిగా చెప్పకుండా కప్పదాటు జవాబులు మొదలు పెట్టావు?నీకు శుశ్రుతుడు యే కాలం వాడో తెలియకుండానే పాతకాలం వాళ్లకి బయాలజీ తెలియదు అని యెందుకు వాగావు?చర్క సంహిత గురించి చెప్పమంటే పసరు వైద్యం పల్లెటూరి వాళ్ల ప్రసక్తి దేనికి?యేవడు యే జమీదారీ సంస్థానమో ఇప్పుదు ఇక్కడ అవసరమా?

      అడిగిన దానికి జవాబు చెప్పకపోతే నువ్వు ఇక్కడ వాగే సుత్తికి జవాబు లిచ్చే వుదారు లెవరూ లేరిక్కడ!నీలాంటి వీరముష్టి గాళ్ల దగ్గిర నీ స్వకుచమర్దనం దురద తీర్చుకో,ఫో?!ఒక మనిషి సొంత ఆస్తి రద్దు చేసుకోవాలంటే ఆ రద్దు చేసుకున్న సొంత ఆస్తికి బదులుగా అతని మౌలికస్వభావమయిన వస్తుగత ప్రయోజనాలలో అధిక సౌలభ్యాన్ని చూపించతం నీలాంటి వర్గరహిత సమాజాన్ని సృష్టించాలనుకునే వాడి పని,నాది కాదు!

      Delete
    3. నువ్వు వాగే ఈ చెత్తని మాలాంటి వాళ్ళ దగ్గిరే కాదు, నీలాగా కాకుండా తెలిసి మాట్లాదే నిజమయిన కమ్యునిష్టులు ఇంకా వున్నారు - ఆ నిజమయిన కమ్యునిష్టుల దగ్గిర వాగినా వాళ్ళు కూడా నీకు గడ్డి పెదతారు!

      Delete
    4. పోని కమ్యునిజం గురించి తెలుసుకొని మీరు చేసిందేముంది? అతను రాసిన ఫాంటసి పుస్తకాని మీరు కావాలంటె రోజు చదువుకొని చర్చించుకోండి. ఆయన అబద్దాలు రాస్తే దానికి ఇతరులు ఎందుకు జవాబివ్వాలి? ఆయన రాసిన దానిలో దమ్ము ఉంటే ఎవరు అడ్డుకొన్నా ఎంత అడ్డుకొన్నా ఈపాటికి కమ్యునిజం ప్రపంచవ్యాప్తంగా అమలు జరుగుతూండాలి. సిద్దాంతంలొ సత్తాలేదు కాబట్టే అది విఫలమయ్యింది. మళ్లీ దానిపై చర్చ ఒకటా?

      Delete
  21. స్త్రీలకి జ్ఞాపక శక్తి ఎక్కువ అనే నిజాన్ని ఇప్పటికీ చాలామంది అంగీకరించరు. చరక సంహిత వ్రాసిన కాలంలో దీని గురించి జనానికి తెలుసనుకోవాలా? మన దేశం వైద్యశాస్త్రంలోఅంత అభివృద్ధి చెంది ఉంటే మన వైద్యులు బహుళజాతి కంపెనీలు తయారు చేసిన మందులు ప్రిస్క్రైబ్ చెయ్యక్కరలేదు.

    ReplyDelete
  22. http://blog.yagati.com/2009/07/1.html
    http://blog.yagati.com/2009/07/2.html

    ReplyDelete
    Replies
    1. యెప్పటి సంగతి యెత్తారు తమరు?అక్కద మలక్పేత రౌడీ అదిగిన వాటికీ జవాబులు చెప్పరా లేదా!ఇక్కద నేను అదిగిన వాటికి ఆ లింకు ఇవ్వడమంటే ఇక ఇక్కడ నీ సొల్లుకి జవాబులు ఇవ్వక్కర్లేదు,అంతేనా?నీ పాటికి నువ్వు కామెంట్లేసుకో,నిన్నెవడూ ఇక్కడ పట్తించుకోడు.మానుంచి జవాబులు మాత్రం ఆశించకు,ఫోవాయ్ పుల్లాయ్!

      Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top