పాపభీతి లేకుంటే మనిషిలో నైతిక విలువలుండవా!?
వినదగునెవ్వరుచెప్పిన
*Republished
- పల్లా కొండల రావు,
11-3-2014.
--------------------------------------------------------
మంచిని పం(పెం)చడానికి క్రింది లేబుల్ పై క్లిక్ చేయండి.
*Republished
నాస్తికులకు మానవతా వులువలు ఉందదని ఎక్కడుందీ,భక్తి ఉంటే దేవుని భయం ఉంటుంది, కానీ భక్తులంతా గొప్పవారూ కాదు, మానవత్వానికి మనిషి పుట్టుకా,ఆతని కుటుంబ చరిత్రా,పరిసరాలూ కొంత దోహదపడతాయని నా నమ్మకం.
ReplyDeleteమనిషి పుట్టుక ఏ విధంగా ప్రభావితం చూపుతుంది?
Deleteనీటికి మతానికి బీరకాయపీచు సంబంధం కూడా లేదు
ReplyDeleteనీలి చిత్రాలు ప్రదర్శించే థియేటర్‌లకి సీతారాములు & శివపార్వతుల పేర్లు ఎలా పెడుతున్నారు అని అడిగితే మతం వేరు, నీతి వేరు అని నిర్లజ్జగా సమాధానం చెప్పుకున్నవాళ్ళని చూసాను.
Delete< నీటికి మతానికి బీరకాయపీచు సంబంధం కూడా లేదు >
Deleteఇది చాలా తప్పు. మతం నీతి కోసం ప్రయత్నిస్తుంది. నీతిని నిర్మిస్తుంది కూడా. మతం మనిషికి చాలా మేలు చేస్తుంది. మతం చేసే, చెప్పే కార్యాలకు తిరుగులేని, అనుమానం ఈయని ప్రత్యామ్నయం వచ్చేవరకూ ఆ విశ్వాసం మనిషి కలిగి ఉండడం సహజం. అనివార్యం కూడా.
మతంతో నష్టం, అత్యం ప్రమాదం ఏంటంటే, తాను చెప్పిన, సృష్టించిన, అనుకున్న నీతిని మాత్రమే అదే నీతి అని వాదిస్తుంది. ఎదురు తిరిగితే భయపెడుతుంది. ఆ నీతి తప్పుతుందేమోనని భయపడుతుంది. దానిని కాపాడాలనే భయంతో ఎంత అవినీతికైనా, అకృత్యానికైనా, అధర్మానికైనా చేయడానికి దిగజారుతుంది. అందుకు గాను అనేక అబద్ధాలు ఆడుతుంది. నీతిని సృష్టించింది దైవం దీనిని ప్రశ్నించకూడదు, మార్చకూడదు అని నిస్పిగ్గుగా బొంకుతుంది. అప్డేట్ అనే ప్రాసెస్ ని అంగీకరించలేని మూర్ఖత్వం మతం స్వంతం.
ఏ ఆలోచన అయినా సృష్టించేది మనిషి మాత్రమే. మనసులోనే దైవం, రాక్షసత్వం ఇమిడి ఉంటుంది. ఈ రెండింటి మధ్య ఘర్షణ అనివార్యం. ఆ ఘర్షణ ద్వారా మంచి ఎప్పటికపుడు సాపేక్షంగా అప్డేట్ అవుతుంది. అంతిమంగా మతములన్నీ మాసిపోక తప్పదు. అంతటి మానవత్వం, మానవ చైతన్యం ఒక్కసారిగా రావడం, తేవడం అసాధ్యం. నిరంతర ప్రయత్నం అనివార్యం.
< నీలి చిత్రాలు ప్రదర్శించే థియేటర్‌లకి సీతారాములు & శివపార్వతుల పేర్లు ఎలా పెడుతున్నారు అని అడిగితే మతం వేరు, నీతి వేరు అని నిర్లజ్జగా సమాధానం చెప్పుకున్నవాళ్ళని చూసాను. >
Deleteఅది డబ్బుకు ఉన్న పవర్ ప్రవీణ్ గారూ. మతం అలా పేర్లు పెట్టుకోమని చెప్పదు. మతం నేర్పే భయంకు భయపడి పేర్లు దేవుడివి పెడతారు. డబ్బు ఇచ్చే భౌతిక ప్రయోజనాలకు లొంగి నీలిచిత్రాలు వేస్తారు. డబ్బుకు లోకం దాసోహం. మతం కంటే డబ్బు ప్రయోజనం ఎక్కువ ఇచ్చేటపుడు మనిషి ప్రయోజనం వైపే మొగ్గు చూపుతాడు. ఎక్కడైతే మతంలో కంటే మంచి ప్రత్యామ్నయం ఉంటుందో, ప్రయోజనం ఉంటుందో అటువైపు అనివార్యంగా మనిషి మొగ్గుచూపుతాడు. ప్రతి భావవాది తాను బ్రతకాలంటే అనివార్యంగా భౌతికవాదిగానే ప్రవర్తిస్ధాడు. కడుపు నిండాక భావవాదం శక్తిమేరకు వల్లిస్తాడు.
నాకు ఆ సమాధానం చెప్పినది సాధారణ జనమే కానీ థియేటర్ యజమానులు కాదు. నీలి చిత్రాలు ప్రదర్శించే ధియేటర్ పోర్టికో మీద ఎనుగులు & లక్ష్మీ దేవి బొమ్మలు కనిపిస్తే ఎవరికీ అభ్యంతరం లేదు కానీ ఒక అమెరికన్ కంపెనీవాడు మాంసాహార బర్గర్ పేకెట్ మీద లక్ష్మీ దేవి బొమ్మ ముద్రిస్తేనే ఎందుకు గొడవ చేస్తారు? నీలి చిత్రాలు చూడడం కంటే మాంసం తినడం మహా పాపమా?
Deleteపెరిగిన వాతావరణం మరు పుట్టిన వాతావరణం చుట్టూ ఉన్న స్నేహతులు మనిసి యొక నైతిక విలువులు ఆదార పది ఉంటాయి మరి యు పూర్వ జన్మ సుక్రతం కూడా ఉంటుది బగవతే గీత లో చేపినతులు మనిషి కర్మ అనుసిరిచి అః జీవి కర్మకు సబదిచిన కళేబరం లో ప్రవేస్తుడి
ReplyDeleteపుట్టిన వాతావరణం అంటే వివరణ ఇవ్వగలరా?
DeleteVery simple, my dear Watson! అలగా వెధవలకు పుట్టిన పిల్లలు పరమ దుర్మార్గులు అవుతారు!
Delete>>అలగా వెధవలకు పుట్టిన పిల్లలు పరమ దుర్మార్గులు అవుతారు!
DeleteLet me rephrase this
అలగా వెధవలకు పుట్టిన పిల్లలు పరమ దుర్మార్గులు అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది!
అలగా వెధవలకు పుట్టిన బిడ్డలు పరమ దుర్మార్గులు అవుతారు అనేది తప్పు. కొంతవరకు గ్రీన్‌స్టార్ గారు చెప్పినట్లు అయ్యే అవకాశం ఉంది. గొప్ప వాళ్ల బిడ్డలు కూడా పండితపుత్ర అన్నట్లు .... తయారయ్యే అవకాశం ఉంది.
Deleteనేను వ్యంగ్యంగానే రాసాను. "నైతిక విలువలు" కొందరి సొత్తు అనుకోవడం పొరబాటని చెప్పడమే నా ఉద్దేశ్యం.
Deleteఅలా అయితే ఓ.కే నండీ.
Deleteభయమో భక్తో ఉండాలన్నారండీ. భయము అంటే చట్టభయం, శిక్ష పడుతుందని. భక్తి అంటే ఇలా చెయ్యకూడదు అన్న విశ్వాసం అదే ధర్మం. రెండూ లేకపోతే మనిషి కి ........తేడా లేదు.
ReplyDeleteశర్మ గారు చెప్పినట్టు చట్టం శిక్షిస్తుందన్న భయం వుంటే చాలు. ఇతర భయాలు అవసరం లేదు.
ReplyDeleteపలు రకాల ధర్మాలు పాటించబడే మన దేశంలో పాప భీతి వల్ల మంచి కన్నా చెడే జరగడానికి ఎక్కువ అవకాశముంది. ఎలాగో చూద్దాం.
పందికూర లేదా గొడ్డుకూర తినడం పాపమని ధర్మ గ్రంధంలో రాసి వుందనుకుందాం. ఆ ధర్మాన్ని నమ్మే పాపభీతి గలవాడికి అవి తినే వారిపట్ల వ్యతిరేకత కలుగుతుంది. వారు పాపిష్టులుగా కనపడతారు. ఒకవేళ ఆ పని పొరుగింటివాడే చేస్తున్నాడనుకుందాం. అప్పుడు అతని మనస్సులో సంఘర్షణ మొదలవుతుంది. ఒకవైపు దేవునిపై పాపభీతి. మరొక వైపు దైవవాక్కుకు విరుద్ధంగా జరుగుతున్న పాప కార్యం(అతని దృష్టిలో). ఈ రకమైన సంఘర్షణ హింసగా పరిణామం చెందడానికి ఎక్కువ కాలం పట్టదు.
ఫేస్‌బుక్‌లో నేను చాలా సార్లు వ్రాసాను, ఆవుని రక్షించడానికి మనిషిని చంపుతున్నారంటే దాని అర్థం శాకాహారవాదం యొక్క ఆబ్జెక్టివ్ అహింసావాదం కాదు అని.
Delete< ఫేస్‌బుక్‌లో నేను చాలా సార్లు వ్రాసాను, ఆవుని రక్షించడానికి మనిషిని చంపుతున్నారంటే దాని అర్థం శాకాహారవాదం యొక్క ఆబ్జెక్టివ్ అహింసావాదం కాదు అని. >
Deletegood. it is a valuable statement.
వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏదైనా మనిషిని చంపడాన్ని సమర్థించలేము. "ఆవు తల్లితో సమానం, నువ్వు నీ తల్లిని తింటావా?" అని ఒకడు అంటాడు. "ఆవు మాంసంలో బాక్టీరియా ఉంటది, అది తింటే రోగాలు వస్తాయి" అని ఇంకొకడు అంటాడు. అన్ని జంతువుల శరీరంలోనూ బాక్టీరియా ఉంటుంది. వేరే జంతువుల మాంసాన్ని తినేవాళ్ళని కాకుండా ఆవు మాంసం తినేవాళ్ళనే వీళ్ళు ఎందుకు అసహ్యించుకుంటున్నట్టు? ఆవు బాక్టీరియా కేరియర్ అయితే ఆవుని తల్లిగా ఎందుకు పూజిస్తున్నట్టు? మతంలో సెన్స్, నాన్‌సెన్స్ అనే తేడాలు ఉండవు.
Deleteఆర్యా,
ReplyDelete*మానవులు సుఖంగా జీవించాలంటే సన్మార్గంలో నడవాలి,కొందరు మాత్రమే సన్మార్గంలో నడిస్తే అలా నడవని దుర్మారుల వల్ల సన్మార్గులు బాధలు పడే అవకాశం ఉంది కదా!కాబట్టి మొత్తం మానవసమాజం సన్మార్గంలో సంచరించడానికి ఏదో ఒక రూపంలో దండనభయం చాలా అవసరం.మానవుడు క్షేమంగా జీవించటానికి పనికివచ్చే ప్రతి విషయాన్నీ సమగ్రంగా పరిశీలించిన సనాతన ధర్మం ఈ భయం అనే విషయాన్ని గురించి కూడా విస్తృతంగా చెప్పింది.
*మానవుడు నీతిగా ఉండటానికి అతని పైన నాలుగు ప్రభావాలు ఉండాలి,ఉంటాయి. 1.తల్లిదండ్రులు2.గ్రామ పెద్ద 3.రాజు చేసే శాసనం 4.మతాధికారి చెప్పే నీతిబోధ - వీటిలో మొదటి ఇద్దరూ రాజుగారి యొక్క శాసనాల్ని గానీ మతపెద్ద యొక్క తీర్మానాలని గానీ అమలు చెయ్యటమే తప్ప స్వతంత్రించి శాసనాలు గానీ తీర్మానాలు గానీ చేసే అధికారం లేనివాళ్ళు.
*రాజుగారి శాసనాలు చాలామటుకు ఒక నేరం జరిగాక ఇతరుల సాక్ష్యాల మీద ఆధారపడి ఇచ్చే తీర్పుల సమాహారం కాబట్టి సాక్ష్యాలు బలహీనంగా ఉంటే నేరస్థుడు శిక్ష తప్పించుకునే అవకాశం ఉంటుంది.ఒకవేళ శిక్ష పడినా తర్వాత కాలంలో శిక్ష పట్ల భయం ఉన్నవారు చెయ్యకుండా ఉండటం మాత్రమే జరుగుతుంది!శిక్షనుంచి తప్పించుకోగలను అనుకున్నవాడు, శిక్షాభయం లేనివాడు మళ్ళీ మళ్ళీ అదే నేరం చేస్తూనే ఉంటాడు.
*మతాధికారి దేవుని పేరిట చెప్పేది మాత్రం కొంత భిన్నంగాపని చేస్తుంది! మొదట దేవుణ్ణి నమ్మి తర్వాత ఈ పని దేవుడికి ఇష్తం లేదు,ఈ పని చేస్తే దేవుడు నన్ను శిక్షిస్తాడు అనే భయం అతన్ని అసలు నేరం చెయ్యకుండా ఆపగలుగుతుంది.సనాతన ధర్మం ఈ దైవభీతిని కూడా భయరహితస్థితికి మానవుణ్ణి చేర్చడానికే ప్రతిపాదించింది!భయరహితస్థితిని చేరదమే మోక్షం - అందుకు జ్ఞానమే సాధనం
*మతం అనగానే దైవపూజావిధానం మాత్రమే అనే అపోహ చాలామందిలో ఉంటుంది.కానీ అది నిజం కాదు - 1.దైవభావన,2.నైతికబోధ,3.కర్మకాందలు,4.శిక్షాస్మృతి,5.ఋషిపరంపర అనే అయిదు భాగాలు ఉంటాయి.నాస్తికులు దైవభావనని వదలివేసినా నైతికబోధన మాత్రం వారికీ సామాన్యమే కదా!సనాతన ధర్మం మాత్రం నైతికత విషయంలో ఇహలోకపు సౌభాగ్యాన్ని మాత్రమే పట్టించుకున్నది."శ్రేయము","ప్రేఅయము" - రెండింటిని గురించి చర్చించి శ్రేయమునే పాటించహ్మని చెప్తుంది.
స్వస్తి!
కొందలరావు గారికి,
ReplyDeleteమీరు ఒకప్పుడు సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలని ఆసక్తి చూపించారు.ప్రస్తుతం రేఖామాత్రంగా చెప్తూ ఒక పోష్టు వేశాను.మీరు ఇక్కద కొంతమేరకు సనాతన ధర్మం గురించి తెలుసుకోవచ్చును.అసలు భాగవతం చదవాలంటే ఇక్కద వీలు కుదురుతుంది.టీకా,తాత్పర్యం,భావం అన్నీ తెలుసుకోవచ్చు.
భవదీయుడు
హరి.S.బాబు
ధన్యవాదములు హరి గారు. మీ పోస్టు తప్పక చదువుతాను.
Delete
ReplyDeleteయముండు లేక పోతే ఎనుబోతు అంత నిమ్మళం గా నిల్చొని ఉండే దా :)
చీర్స్
జిలేబి
మాతా జిలేబీ, మహిష నిమ్మళము సంగతి పశుగ్రాస యోధానుయోధ లాలూను అడగవలె.
Deleteపోలీసులు ఉన్నారని మాత్రమే రూల్స్ పాటించే వారు ఉన్నంత వరకూ పాపభీతి లేకుంటే మనిషిలో నైతిక విలువలు ఉండకపోవచ్చు . ఎందుకంటే మనిషి చాలావరకూ స్వలాభం కోసం చూస్తాడు (selfish nature) .
ReplyDelete