ame:విన్నకోట నరసింహారావు  
E-Mail:deleted
Subject:వాల్మీకి, వ్యాసుడు బ్రాహ్మణులా, బ్రాహ్మణేతరులా? 
Message:ప్రశ్న :- వాల్మీకి, వ్యాసుడు బ్రాహ్మణులా, బ్రాహ్మణేతరులా? బ్రాహ్మణులు కాదు అంటూ ఒకరి వ్యాఖ్య రెండు మూడు రోజుల క్రితమే బ్లాగుల్లో కనిపించింది. ఆ వాదన సరైనదేనా?





*Re-published

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

kondalarao.palla@gmail.com

Post a Comment

  1. https://www.facebook.com/meepurohit/posts/1201830006526722

    ReplyDelete
  2. http://www.telugubandhu.com/2015/07/blog-post_968.html

    ReplyDelete
  3. ఎన్నో మంచి విశేషాలు, ఉపయోగపడే విషయాలు BLOG చేసే మీరు కూడా ఇప్పుడు అనవసరమైన BLOCK చెయ్యాల్సిన ఈ Post లు ఎందుకు పెడుతున్నారండి??

    ReplyDelete
    Replies
    1. sorry Kasi V Dogga garu, ఇది నా పోస్టు కాదు. ప్రజ పాలసీలో భాగంగా విన్నకోట నరసింహారావు గారు అడిగింది. మీరు సూచించిన పాయింట్ గమనంలో ఉంచుకుని ప్రజ పాలసీలో కొన్ని మార్పులు చేస్తాను. ధన్యవాదములు.

      Delete
    2. మీరంటే నాకు చాల అభిమానం (ఇంక చాల మంది మంచి తెలుగు బ్లాగర్స్ అంటే కూడా).
      sorry ఎందుకు Sir! నా ద్రుష్ఠిలో వాల్మీకి, వ్యాసుడు బ్రాహ్మణులా, బ్రాహ్మణేతరులా అన్నది అనవసరం. వాల్లు గొప్ప భారతీయులు!
      Thanks much for the understanding sir!!

      Delete
  4. కొండలరావు గారూ,

    నేను కొంత స్పష్టతనివ్వాల్సిన అవసరం ఉందనిపించింది. నా ప్రశ్నే మరి కాస్త వివరంగా అడిగుండాల్సింది.

    మీ పోస్ట్ కాదు అన్నారు. అలాగే ఇది నా “పోస్టూ” కాదు. నేనడిగినది ఒక ప్రశ్న మాత్రమే. అలా ప్రశ్నలు కామెంట్ బాక్స్ లో కాకుండా శీర్షిక లాగా అడిగే సౌకర్యం మీరే కలగజేసారు కాబట్టి నేను అడగడం జరిగింది.

    ఇక ఆ ప్రశ్న అడిగి చాలా రోజులయింది కాబట్టి ఎందుకడిగాను అన్న background అంతగా జ్ఞాపకం లేదు, కానీ ఆ రోజుల్లో ఇదే అంశం మీద బ్లాగుల్లో విరివిగా వాదోపవాదాలు జరుగుతుండేవని గుర్తు, మీకూ గుర్తుండే ఉంటుంది. తెలుగు సినిమాల పరిభాషలో చెప్పాలంటే ఆ వాదాలు “రచ్చ రంబోలా” లాగా ఉండేవి. అటువంటి నేపధ్యంలో అసలు సంగతి ఎవరైనా ... విషయపరిజ్ఞానం కలిగిన వారు ... స్పష్టతనిస్తారేమోననే ఉద్దేశ్యంతో మాత్రమే అడిగాను. అంతే కానీ వాల్మీకి, వ్యాసుడు, మరేయితర పురాణ వ్యక్తులు, ఆధునిక వ్యక్తులు, ఇతర “గొప్ప భారతీయులు” బ్రాహ్మణులయినా బ్రాహ్మణేతరులయినా నాకొరిగేదేమీ లేదు. I couldn’t care less.

    నేనడిగిన అంశం యొక్క ... అసలు విషయం ... మీద పెద్దగా స్పష్టతేమీ రాలేదు, ఇంక ఇప్పుడు వచ్చే సూచనలూ లేవు. మీరు డిలీట్ చేస్తే చెయ్యండి, ఇబ్బందేమీ లేదు.

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు గారూ,

      ప్రస్తుత 'ప్రజ' పాలసీ ప్రకారం మీరు ప్రశ్న అడగడం తప్పు కాదు. నేను 'ప్రజ పాలసీని' కొంత మార్చాలనుకుంటున్నాను. వివిధ రకాల అనుభవాల రీత్యా మాత్రమే.

      మీరన్నట్లు వారి కులం తేల్చడం వలన ఎవరికీ ఒరిగేదేమీ లేదన్నది నిజం. ఆ అభిప్రాయమే నాది కూడా.

      కాకుంటే 'బోయవాడు ఋషి గా ఎదగడం' (అది కల్పనా, నిజమా అన్నది పక్కన బెడితే) ఆ అంశంలోని పాజిటివ్ మోటివేషన్ మాత్రం ఎనర్జీని పెంచుతుంది. అడవిరాముడు సినిమాలో ఎన్టీయార్ పాత్రతో గిరిజనులను మోటివేట్ చేయడానికి వేటూరి వ్రాసిన పాట బాలు గానంతో నేటికీ వినపడుతుండడం వెనుక పవర్ అదేననుకుంటాను.

      అంతకు మించి లోతుగా అర్ధాలు ఆ పాట విన్నవారు వెతికినట్లు అనిపించదు. ఈ విషయమై ఈ మధ్య నాకూ కొంత తెలుసుకోవాలనిపించి శ్యామలీయం గారికి మెయిల్ వ్రాసి కొంత తెలుసుకున్నాను.

      మతానికి, మతోన్మాదానికి ఉన్న తేడా రీత్యా .... ఆ అంశం ఆధారంగా మాత్రమే నేను ప్రజ పాలసీలో కొన్ని మార్పులు చేద్దామనుకుంటున్నాను తప్ప మీరు ప్రశ్న అడగడమే తప్పు అని కాదు. అలా అనుకుంటే అసలు పబ్లిష్ చేయకుండా ఉండేవాడిని. రీ పబ్లిష్ అసలు చేసేవాడిని కాదు. ప్రజలో పాత పోస్టులలో ఏ మాత్రం పనికి వస్తాయి అనుకున్నా వాటిని రీ పబ్లిష్ చేస్తుంటాను.

      డిలీట్ చేయడం కంటే ఎప్పటికపుడు ఇంకా ఉన్నతంగా 'ప్రజ'లో ప్రశ్నలున్చేందుకు ప్రయత్నిస్తాను. ధన్యవాదములు.

      Delete
  5. ప్రశ్నించనిదే నిజాలెలా తెలుస్తాయి ? ప్రశ్నలో తప్పు లేదు.
    హిందువులకు అనుకూలమయిన ప్రశ్నలే వేయాలా ?

    ReplyDelete
    Replies
    1. హిందువులకు అనుకూలమా, మరొకరికి వ్యతిరేకమా అన్నది పాయింట్ కాదు నీహారిక గారు.

      అందరికీ, అన్నివేళలా నచ్చేలా, మెచ్చేలా ఉండాలనుకుంటే ఏమీ ప్రశ్నించలేము, ఏమీ తెలుసుకోలేము.
      గొప్ప వ్యక్తులుగా ఉన్నవారి కులం ఇపుడు తెలుసుకుని ప్రయోజనం లేదు కదా?

      బ్రాహ్మణుడైనా, దళితుడైనా ఎవరు ఏమి చెప్పినా అందులో పనికివచ్చేదేమిటన్నది ముఖ్యం కావాలి తప్ప, వారి కులం గురించి చర్చ అనవసరం అన్న సూచన కాసి గారు చెప్పినదానిలో కనిపించిన పాజిటివ్ అంశంగా చూడాలని విజ్ఞప్తి.

      Delete
    2. రామాయణం రాసిన వ్యాసుడు, వేదాలని గ్రంధస్థం చేసిన వ్యాసుడు ఒకరేనా? వేరు వేరా?

      Delete
    3. Sorry correcting myself. please read bharatam in place of ramayanam

      Delete
    4. రామాయణాన్ని వ్యాసుడు వ్రాసాడని మీరెక్కడ చదివారు?

      Delete
    5. Why didn't you publish my correction after that?

      Delete
    6. హిందూ మతం తెల్సిన వాళ్ళు ఈ పిచ్చి ప్రశ్నలు వేయరు. ఇవి వేసేది హిందూ వ్యతిరేకులో, హేతువాదం మూర్ఖత్వంతో, ఇంగ్లిషు బానిస చదువులు మాత్రమే చదివి , తమ భారత సొంత విషయాలు తెలుసుకోని వాళ్ళు, లేదా కమ్యునిస్టులు, దేశ వ్యతిరేకులు, కుల గబ్బు ఉన్న వాళ్ళు అడుగుతారు.

      Delete
    7. హిందూ మతం తెలిసినా, తెలియక పోయినా ప్రశ్నలు ఎవరు వేసినా సత్యం ఒక్కటే అయినపుడు ఓపికగా సమాధానం చెప్పగలగాలి. లేదా మీరంటున్నవారు వేసే నిందలనే నమ్మడం చాలా సందర్భాలలో ప్రత్యామ్నయం అవడం సాధారణం. నాకు తెలిసి ఈ ప్రశ్న వేసినవారు మీరాక్రోషంతో ఆపాదించినవారు కారు.

      Delete
    8. >>హిందూ మతం తెల్సిన వాళ్ళు ఈ పిచ్చి ప్రశ్నలు వేయరు. ఇవి వేసేది హిందూ వ్యతిరేకులో, హేతువాదం మూర్ఖత్వంతో, ఇంగ్లిషు బానిస చదువులు మాత్రమే చదివి

      ఆన్సర్ మాత్రం చెప్పరు.

      Delete
    9. On maheshuduNovember 24, 2021 at 4:33:00 PM GMT+5:30

      వీల్లకి కావల్సింది.. "అయ్యా! దొరా! చిత్తం" అంటూ వాళ్ళ కాల్లదగ్గర పడుండాలి. వాల్లే నిజమైన హిందువులు. వాళ్ళు చెప్పింది నోట్లో ఏలేసుకోని వినాలి. అప్పుడే వాళ్ళు నిజమైన హిందువులు.

      నాకైతే ఈ మహేషుడు అనే వ్యక్తి ఎన్నో సంవత్సరాలనుంచి మనసులో పెట్టుకున్న కసి అంతా పై కామెంటులో కనిపించింది. ఇలాంటివారికి హిందుత్వం అంటే ఏంటో, అస్సలు దాని మౌలిక స్వరూపం కూడా తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా.. వాళ్ళలో అంతర్లీనంగావున్న సైకోయిజాన్ని బయటపెట్టుకోడానికి ఒక మార్గం కావాలి.దాన్ని ఎవ్వడూ ఖండించకుండా ఒక దేవుడు తోడుండాలి. కావాలంటే చూడండి. మోడీ అధికారంలోకి రాకముందువరకూ రాముడి ఫొటోలన్నీ ఆశీర్వదిస్తున్న ఫోజులో వుండేవి. ఇప్పుడు మాత్రం, బాణమేస్తున్న పోజులోనే వుంటున్నాయి. ఇంకా చెప్పాలంటే, ఆ బాణానికి టార్గెట్గా దూరంగా.. ముస్లీముల మసీదులు చిత్రిస్తున్నారు.

      ఇలాంటివారినుంచి సవ్యమైన సమాధానం ఇంకేం ఆశిస్తాం?

      Delete
  6. నాకు తెలిసినంతవరకూ వ్యాసుడు ఒక pseudonym/grouponym. ప్రస్తుతార్ధంలో anonymous అనుకోవచ్చు. ఆరోజుల్లో తమకు పేరుప్రఖ్యాతలు అఖ్ఖర్లేదనుకొనే రచయితలు వ్యాసుడిపేరున తమ రచనలను విడుదల చేసేవారు.

    ReplyDelete
  7. Sir, I recommend you to use quora.com for posting your questions and get the answers from various people across internet. It has large number of users from India

    ReplyDelete
  8. శ్రీ వేదం వ్యాస మహర్షి వారు పరాశర రుషి కుమారులు. సత్యవతి వారి తల్లి గారు.
    అప్పటి ఇప్పటి కుల వ్యవస్థలు వేరువేరు. ఇప్పటి లెక్క ప్రకారం శ్రీ వ్యాసఉల వారు బ్ర్కహ్మణులు.
    వాల్మీకి మహర్షి వారు బోయ జాతిలో పుట్టినా అప్పటి వ్యవస్థ ప్రకారం బ్రాహ్మణులే.
    ఇప్పటి లెక్కలలోని ఏ కులంలో అప్పుడు పుట్టినా వారు చేసే పని, బ్రతికే తీరును బట్టి వారు ఎ వర్ణానికి చెందినా వారో నిర్ణయించడం జరిగేది కాదా. అంటే ద్లితుడిగా పుట్టినా బ్రహ్మము కొరకు, సదాచారంతో జీవించితే వాళ్ళు బ్రాహ్మణులే కదా.
    అసలు సనాతన ధర్మం ప్రకారం పుట్టుకతో అందరు శూద్రులే. సంస్కారాలు చేయబడిన దానిని బట్టి గుణ కర్మ కులాలు వస్తాయి.
    ఇప్పటి తండ్రి కులం పిల్లలకు వస్తుంది అనే నియమం ప్రకారం బ్రహ్మ దేవుల వారి ద్వారా సృష్టిలో పుట్టిన జీవులు, వారి వారి సంతానములో ఇప్పుడు ఉన్న అందరూ అన్ని పురుగు, పిట్ట, పాము, కప్ప,ఇలా లక్షలాది రకాలు, మనుషులు అంతా బ్రాహ్మణులే. కాబట్టి కులం పేరుతొ కొట్టుకోవడం మాని, కలిసి ఉండి, ప్రగతి సాధించండి.అందరూ దేవుడి బిడ్డలే, ఒకరికి ఒకరు బంధువులే.
    మంచి చెడు గుణం/ చేసే కర్మల ప్రకారం మాత్రమే ఎక్కువ తక్కువ.
    రావణుడు బ్రాహ్మణుడు కానీ చెడ్డ పనుల వలన రాక్షసుడు. నరకుడు స్వయంగా శ్రీ మహా విష్ణువు, భూదేవికి పుట్టినటువంటి (దేవతల) కొడుకు కానీ మధ్యలో చెడ్డ వాళ్ళ సావాసం తో దుష్ట పనులు చేసి రాక్షసుడిగా మారాడు/ లెక్కించబడ్డాడు. ప్రహ్లాదుడు, బలి, విభీషణుడు రాక్షసులైనా మంచిపనులతో గౌరవించబడుతూ, పూజింపబడుతున్నారు.

    ReplyDelete
    Replies
    1. >>ద్లితుడిగా పుట్టినా బ్రహ్మము కొరకు, సదాచారంతో జీవించితే వాళ్ళు బ్రాహ్మణులే కదా.
      అసలు సనాతన ధర్మం ప్రకారం పుట్టుకతో అందరు శూద్రులే. సంస్కారాలు చేయబడిన దానిని బట్టి గుణ కర్మ కులాలు వస్తాయి.

      రామాయణ మహా భారతాల్లో ఇలా మారిన లేక అవతారపురుషులు ఏవరిననా మార్చిన దాఖలాలున్నాయా?

      >>వాల్మీకి మహర్షి వారు బోయ జాతిలో పుట్టినా అప్పటి వ్యవస్థ ప్రకారం బ్రాహ్మణులే.

      మరి రాముడు.. శూదృడైన శంభూకుడితల ఎందుకు తల నరికాడు?
      బ్రాహ్మణుడు శూద్రుడి ఇంట తింటే, లోకంలో సమస్త శుద్ధాన్ని తిన్నట్టే అని ఎందుకన్నాడు? మతగ్రంధాల్లో(బైబిలు ఖురాన్ తో సహా) కులవివక్షగురించి చర్చించడానికి మహేషుడు సిధ్ధమా? నేను చూపిస్తే.. మతగ్రంధాలన్నీ చెప్పేది తప్పే అని ఒప్పుకుంటాడా? ఇది నా సవాలు. పైన వాగిన మహేషుడి చెత్తకి ఇది నా సవాలు.

      Delete
  9. చాలా కాలం క్రితం ప్రజ బ్లాగులో గీత గురించి ఒక ప్రశ్న వేస్తే కొందరితో వాదన మొదలెట్టాక క్షేమంగా ఇందులోంచి బయట పడగలనా,యెరక్కపోయి ఇరుక్కున్నాను గదా అని పరితపించాల్సిన దుస్థితి యెదుర్కొన్నాను?మొత్తం విషయాన్ని తెలుసుకుంటే కానీ అర్ధం కాని విషయాన్ని గురించి ముక్కలు ముక్కలుగా తెలుసుకుని అసలు మొత్తం యేమి అర్ధాన్ని ఇస్తుందో ముందు ముందయినా తెలుసుకోవాలనుకోకుండా రెండు మూడు ముక్కల్ని, అది కూడా వాట్ని విమర్శించడం ద్వారా అసలు రచయితల కన్నా నేను తెలివయిన వాణ్ణి అని తమ పాండిత్యాన్ని చూపించుకోవాలనే రకం వాదనలు నాకు గీత గురించిన చర్చల్లో యెదురయినాయి.

    Einstein విశ్వంలో వంపుదారే తిన్ననిదారి అని చెప్పాడు అని ముక్తాయించి వొదిలేస్తే యెలా వుంటుంది?ఆ వొక్క ముక్క చుట్టూరా ఆయన యేం చెప్పాడో దాన్ని యెలా సమర్ధించాడో తెలియకపోతే ఆ ముక్క అర్ధమవుతుందా యెవరికయినా!ఒక్క సాపేక్ష సిద్ధాంతం గురించే కాదు కారు అనే పేరు కూడా తెలియని వాడికి చెవర్లెట్,క్యాడిలాక్,బెంజి కార్ల గొప్ప్పదనం గురించి చెప్తే ఎలా ఉంటుంది?


    ఉదాహార్ణకి ketan May 20, 2018 at 11:11:00 AM GMT+5:30 అనే వ్యాఖ్యాత తమ వ్యాఖ్యలో "నాకు తెలిసినంతవరకూ,అనుకోవచ్చు." అనడం దేనికి?వ్యాసుడు కల్పిత పాత్ర అయితే వ్యాసుడికి సమాబంధించిన చారిత్రక ఆధారాలు లేవనే సాక్ష్యాలు చూపించి చెప్పాలి.అసలు వ్యాసుడు వాస్తవ వ్యక్తియో కల్పిత పాత్రయో తెలియకపోతే ఆ విషయాన్ని ప్రస్తావించనే కూడదు.అవునా?

    విష్ణు పురాణం ఒకరు కాదు 28 మంది వాయ్సులను ప్రస్తావిస్తున్నది.ఉషశ్రీ తాన్ అరెడియోర్ కార్యక్రమానికి పేరు పెడుతూ ఈదే విషయాన్ని ప్రస్తావించ్ఘి వేదవుభజన కోసం ఒక పీఠం,సంఘం,సంస్థ ఏర్పరచి దానికి అద్యక్షుణ్ణి వ్యాస నామంతో పిలిచేవారనేది ఆయన చెప్పిన విషయం.వారిలోని ఏ ఒక వ్యాసుడూ ద్రష్ట కాదు.అప్పటికి వయ్క్తమైన వేదరాశిని నాలుగు విభాగాల కింద విభజించడమే అప్పుడు జరిగినది.ఒక్కొక్క సూక్తాన్నీ చదువి అర్ధం చేసుకుని ఏయే సూక్తాలని ఒకచోట కూర్చాలో నిర్నయించదం అనేది పాందిత్యానికి సంబంధించినదా కులానికి సంబంధించినదా అనేది కొండల రావు గారూ ఇక్కడ చర్చలో పాల్గిఒంటున్న ప్రతి వ్యాఖ్యాతా జవాబు చెప్పాల్ద్సిన ప్రశ్న.

    ఆ ప్రశ్నకి ఏది సరైన జవాబు అని అందరికీ అనిపిస్తే ఇక్కడి చర్చలో వేసిన ప్రశ్నకీ అదే సరైన జవాబు అవుతుంది. కానీ,"మొత్తం విషయాన్ని తెలుసుకుంటే కానీ అర్ధం కాని విషయాన్ని గురించి ముక్కలు ముక్కలుగా తెలుసుకుని అసలు మొత్తం యేమి అర్ధాన్ని ఇస్తుందో ముందు ముందయినా తెలుసుకోవాలనుకోకుండా రెండు మూడు ముక్కల్ని, అది కూడా వాట్ని విమర్శించడం ద్వారా అసలు రచయితల కన్నా నేను తెలివయిన వాణ్ణి అని తమ పాండిత్యాన్ని చూపించుకోవాలనే రకం వాదనలు" చెయ్యడమే తప్ప ఇతరులు అడిగిన ప్రశ్నలకి జవాబులు చెప్పలేక ట్రోలింగుకి దిగేవాళ్ళు ఉన్నచోట అలాంటి ప్రశ్నలకి సరైన జవాబులు వస్తాయని అనుకోవడంలేదు నేను.

    జై శ్రీరాం!

    ReplyDelete
  10. Chiru DreamsNovember 24, 2021 at 8:29:00 PM GMT+5:30
    >>ద్లితుడిగా పుట్టినా బ్రహ్మము కొరకు, సదాచారంతో జీవించితే వాళ్ళు బ్రాహ్మణులే కదా.
    అసలు సనాతన ధర్మం ప్రకారం పుట్టుకతో అందరు శూద్రులే. సంస్కారాలు చేయబడిన దానిని బట్టి గుణ కర్మ కులాలు వస్తాయి.

    ?????రామాయణ మహా భారతాల్లో ఇలా మారిన లేక అవతారపురుషులు ఏవరిననా మార్చిన దాఖలాలున్నాయా?

    hari.S.baabu
    రామాయణ భారతాలు కేవలం కధలని అంటూ వాటికి ప్రామాణికత ఉందని మీరు ఒప్పుకోవడం లేదు కదా!మళ్ళీ మీరే వాటినుంచి దాఖలాలు అడిగితే ఎట్లా సార్!

    నేను ఆధునిక చరిత్ర నుంచే సాక్ష్యాలు తీసుకుని వేరే కులంలో పుట్టినవాళ్ళు సైతం బ్రాహ్మణులయ్యారు అనేది నిరూపిస్తాను.అయితే, నిరూపించిన సత్యాన్ని ఒప్పుకోవడానికి మీరు సిద్ధమా?

    క్రీ.శ 1000వ సంవత్సరంలోని కురవాడ శాసనంలో "అనే చ్చిమూరువాస్తవ్యో దేవార్యో దేవసన్నిభః భ్రద్వాజాన్వయః కమ్మకులజః కులవర్ధనః తస్యాం భవత్సూత్ శ్రీమాన్ గోవిందో గురునందనః శ్రౌతస్మారత్క్రియాధార స్సత్తమ స్సద్విజోత్తమః" అని స్పష్టంగా ఉంది.ఈ శాసనం వేయించినది రెండవ అమ్మరాజ విజయాదిత్యుడు.ఇలాంటి అనేక శాసనాలను పరిశోధించిన చిలుకూరి వీరభద్రరావు గారు విశ్లేషించి చెప్పిన దాని ప్రకారం కమ్మకులజుడైన దేవనయ్య వేదం నేర్చుకుని శుద్ధవైదికబ్రాహ్మణుడిగా జీచించినట్టు స్పష్టంగా తెలుస్తున్నది.అబ్బెబ్బే,వీళ్ళు పెద్ద్ద కులాల వాళ్ళు,బాగా డబ్బు సంపాదించి కొనుక్కున్నారు,కిందపడ్డ కులాలకి మాత్రం ఆ చాన్సు రాలేదు అనటానికి వీల్లేకుండా ఎపిగ్రాఫికా ఇండికా సం.6 పే.236 ప్రకారం క్రీ.శ 973లో కమ్మకులస్థుల్లో షట్కర్మ నిరతులు ఉండేవారనీ, కౌండిన్య గోత్రులైన వంగ్ర బోయ,కొళ్ళిపుర బోయ,కురియెద బోయ అను బోయ కులాల నుండి కూడా వేదం నేర్చుకుని బ్రాహ్మణులుగా జీవించినవారు ఉన్నారని దృష్టాంతాలు ఉన్నాయి.

    ఇది ఆంధ్ర ప్రాంతాన్ని శాతవాహనులు పరిపాలిస్తున్న కాలం.తొలి శాతవాహనుల్లో శ్రీముఖ శాతకర్ణి రాజ్యాన్ని స్థాపించి నిలబెట్టినా 1వ శాతకర్ణి మహా బలంతో పరాక్రమించి ప్రస్తుతం మనం చూస్తున్న భారతదేశంలోని అన్నివైపులకీ వ్యాపించి "దక్షిణాపధపతి" అనే బిరుదు సంపాదించాడు.ఉత్తరం వైపున ఖారవేలుణ్ణి కూడా జయించి మగధ వరకూ వ్యాపించాడు!తూర్పున నర్మద వరకూ వ్యాపించి శకుల నుంచీ గ్రీకుల నుంచీ జరుగుతున్న దండయాత్రల్ని నిరోధించి దేశాన్ని సుస్థిరంగా నిలబెట్టాడు.మలి శాతవాహనుల్లో తన పూర్వీకులు పోగొట్టుకున్న భూభాగాల్ని శకుల నించి మళ్ళీ సాధించి నిలబెట్టిన క్రీ.శ 1వ శతాబ్ది నాటి గౌతమీపుత్ర శాతకర్ణి ప్రముఖుడు.బౌధ్ధులకి చెప్పుకోదగిన రీతిలో దానాలు చేసి మతాతీతంగా వ్యవహరించాడు.బ్రాహ్మణుడు కావటం వల్ల "యేక బ్రాహ్మణ" అనే బిరుదును సాధించాడు!తొలి సాతవాహనులు బ్రాహ్మణులు కాదని దాదాపు అందరు చారిత్రక వేత్తలూ చెప్తున్నారు.కొందరు వ్యాపారస్తులు అంటే కొందరు ఆటవికులు అని అంటున్నారు.అప్పుడు లేని బ్రాహ్మణ్యం మలి శాతవాహనులకి దక్కిందంటే అది వాళ్ళు ఇష్టపడి సాధించుకున్నదే కదా!

    "నేను హిందువు నెట్లయిత" అన్న కంచె ఐలయ్య గారు సైతం వైదిక యుగం అని చెప్పబడుతున్న పూ.సా 1500 నాటి హిందూసమాజంలో కులాలు లేవని ఒప్పుకున్నారు.ఇక్కడ కొఇంచెమే చెప్పిన శాతవాహనుల కాలపు సామాజిక జీవితాన్ని విహంగదృష్టితో పరిశీకించిన నాకు ఇప్పుడు తెలుగువారిలోని కులాలు అన్నీ సాతవాహనుల కాలంలో ఏర్పడినవే అనడానికి సాక్ష్యం కనిపిస్తున్న్నది.ప్రభుత్వంతో తమ వృత్తికి కావలసిన సౌకర్యాల కోసం సంప్రదించటానికి "శ్రేణులు" అనే వ్యవస్థను ఏర్పాటు చేశారు.ఒక్కొక్కపుడు రాజు కూడా బడ్జెట్ అవసరాల కోసం ఈ శ్రేణుల నుంచి అప్పులు తీసుకునేవాళ్ళు అని చెప్పడాన్ని బట్టి ఆ వ్యవస్థ యొక్క సక్సెస్ రేంజి అర్ధం అవుతున్నది కదా!అలా ఒక వృత్తికి సంబంధించి ఒకచోట కలిసిన శ్రేణులలోని వ్యక్తులే క్రమేణ కులాల కింద స్థిర పడిపోయారు.వాళ్ళ సౌకర్యం కొద్దీ వాళ్లు ఏర్పరచుకుని కొనసాగించి ఆ సౌకర్యం లేని ఇప్పుడు ఆయా కులాల్ని వదిలేస్తుంటే చూస్తూ కూడా బ్రాహ్మణులు కులవ్యవస్థను ఏర్పర్చారని నిందించటం హేతువిరుద్ధమూ అశాస్త్రీయమూ అయిన సూత్రీకరణ.

    ఇప్పుడు అసలు చర్చకు పెట్టిన ప్రశ్నకు వస్తే కురవాడ శాసనం ప్రకారం కమ్మ కులంలో పుట్టిన దేవనయ్య వేదం నేర్చుకుని శుద్ధవైదికబ్రాహ్మణుడిగా జీవించినట్టు వ్యాసుడు సైతం వేదవిభనకు అవసరమైన పాండిత్యం ఉన్నందువల్ల వల్ల బ్రాహ్మణుడే అవుతాడు.

    ఆసక్తి ఉంటే ఇప్పుడు కూడా Chiru Dreams వేదాధ్యనం చెయ్యవచ్చును.గత కొద్ది కలం నుంచి వేద పాఠశాలల సంఖ్య పెరిగింది.గురుముఖత సమగ్రం నేర్చుకోవాలంతే ఏ పాఠశాలాలో చేరినా నేర్పుతారు.కులాన్ని బట్టి అభ్యంతరం తెలిపితే అప్పుడు చట్టం ప్రకారం కేసు వెయ్యొచ్చును.అలా కాక వేదంలో ఏముందో తెలుసుకోవడమే మీ లక్ష్యం అయితే ఆర్యసమాజం వారి శాఖల వద్ద నాలుగు వేదాలకీ తెలుగు అనువాదాలు ఉంటాయి.చదివి తెలుసుకోండి.

    జై శ్రీ రాం!

    ReplyDelete
  11. "ప్రశ్నించనిదే నిజాలెలా తెలుస్తాయి ? ప్రశ్నలో తప్పు లేదు.హిందువులకు అనుకూలమయిన ప్రశ్నలే వేయాలా ?" అంటున్న నీహారిక ప్రశ్నలు నాకు నచ్చాయి.

    "హిందువులకు అనుకూలమా, మరొకరికి వ్యతిరేకమా అన్నది పాయింట్ కాదు" అంటున్న కొందల రావు గారి తీర్పు చాలా బాగుంది.ఆదినుంచీ బ్రాహ్మనత్వం గురంచి నేను ఒకే మాట చెప్తున్నాను.అన్ని కులాల్లో ఉన్నట్టే బ్రాహ్మణుల్లోనూ మంచివాళ్ళూ ఉన్నారు, చెడ్డవాళ్ళూ ఉన్నారు.

    పశువధ నియంత్రణకి సంబంధించిన వివాదాలలో ఒక కేసుకు తీర్పునిస్తూ న్యాయమూర్తి ఆవు కార్బన్ డై ఆక్సైడ్ పీల్చుకుని ఆక్సిజన్ వదులుతుందని చెప్పారు.ఆంధ్రాలో బ్రాహ్మణ కార్పొరేషన్ అనే సంస్థలో ప్రభుత్వం నియమించిన అధికారి సొంత పెత్తనం చేస్తూ పదవి వూడగొట్టుకుని రాజకీయాలు మాట్లాడుతూ మొండికేస్తున్నాడే తప్ప చేస్తున్నది తప్పు అనుకోవడం లేదు.ఆ న్యాయమూర్తి బ్రాహ్మణుడో కాదో తెలియదు గానీ బ్రాహ్మణ కార్పొరేషన్ అనే సంస్థకి అటాచ్ చెయ్యడం ఇతరుల్ని చెయరు గాబట్టి ఇతను బ్రాహ్మణుడే అయి ఉంటాడు!

    గతంలో బ్రాహ్మణాధిక్యత అనేది ఉన్నది - అది అమానుషమైనది కూడా!వ్యతిరేకత పెరిగి ఇతర కులాల వాళ్ళు రాజకీయ ఉద్యమాలు నడిపి వీళ్ళని అధికార పీఠానికీ రాజవైభవాలకీ దూరం చెయ్యడం కూడా చారిత్రక సత్యమే!

    మిగతా కులాలలో ఆ కులసంస్కృతి అందరికీ సమానంగానే ఉంటుంది.కానీ బ్రాహ్మణ కులంలో వైదికులు,నియోగులు అనే రెండు శాఖల వారు ఉన్నారు.స్వభావంలో గానీ వ్యవహారశైలిలో గానీ ఒకరికొకరికి ఏమాత్రం పోలిక ఉండదు - అయినా బైటినుంచి చూసేవారికి అందరూ ఒకరకం బ్రాహ్మణులే అనిపిస్తారు!వైదికులు ప్రాచీన కాలం నుంచీ అధ్యయనానికీ, నిష్ఠకీ, సంప్రదాయాలకీ అంకితమైపోయారు.ఋగ్వేదం 2వ మండలం,3వ సూక్తం,6వ ఋక్కు:బట్టలు నేయు విద్య,ఋగ్వేదం 3వ మండలం,53వ సూక్తం,19వ ఋక్కు:బండ్లు,రధములు మరియు లోహపు పనులు చేయుట,ఋగ్వేదం 1వ మండలం,140వ సూక్తం,10వ ఋక్కు:బంగారు పని చేయుట,ఋగ్వేదం 2వ మండలం,34వ సూక్తం,6వ ఋక్కు:బంగారమును త్రవ్వి యెత్తెడి విధానం,ఋగ్వేదం 4వ మండలం,57వ సూక్తం,1 మరియు 8వ ఋక్కులు:కృషి విద్య,ఋగ్వేదం 10వ మండలం,101వ సూక్తం,3 మరియు 7వ ఋక్కులు:బావులను త్రవ్వి నగలిని చేసి విత్తులు చల్లదం వంటి విషయాలు,ఋగ్వేదం 10వ మండలం,93వ సూక్తం,13వ ఋక్కు:బావుల నుండి నీరు తోడి పైరులకు పారించు విధానం,ఋగ్వేదం 1వ మండలం,23వ సూక్తం,2వ ఋక్కు:సముద్రంపైన ఓడలు నడిపే విధానం - ఇవన్నీ బ్రాహ్మణేతరుల కులవృత్తులకి సంబంధించిన విషయాలే కదా!బ్రహ్మణులు చెప్పకుండా ఈ విద్యలు కులవృతుల వాళ్ళకి ఎలా తెలిశాయి?మరి, బ్రాహ్మణులు ఇతర కులాల వాళ్ళని వేదం చదవనివ్వకుండా చేసి దాచుకుని దోచుకున్నది ఎక్కడ?మెకాలే విద్యావిధానం ఈ దేశంలోకి రాకముందు ఉన్న ఓరియెంటల్ ఎడ్యుకేషన్ సిస్టం ఉన్నప్పుడు కూడా స్టూడెంట్లుగా బ్రహ్మణేతరులే ఎక్కువగా ఉండేవాళ్ళు - కట్టుకధలు కాదు ఖచ్చితమైన లెక్కలే ఉన్నాయి వీటికి!

    ఈర్ష్యతో కూడిన నిష్కారణ బ్రాహ్మణద్వేషం పోయినప్పుడు మాత్రమే అసలైన బ్రాహణాధిక్యత యొక్క స్వరూపం అర్ధమవుతుంది!కరణాలు, మంత్రులు, సైన్యాధ్యక్షులు, రాజులుగా ప్రభుత్వాలను నడిపిన వారు తమ ఆధిక్యతని సాగించుకోవటానికి ఎక్కువ బ్రాహ్మణాధిక్యతని ప్రదర్శించారు.వీరు చేసిన సూత్రీకరణల్ని గ్రంధస్థం చెయ్యడానికి కొందరు వైదికులు చేతివాటపు సహాయాలు చేసినది కూడా వాస్తవమే!

    బ్రాహ్మణాధిక్యతకి సంబంధించిన ప్రముఖమైన సాక్ష్యం పరశురాముడు 21 సార్లు అప్పటి క్షత్రియ ప్రభువుల్ని సంహరించి తను జయించిన భూమి నంతట్నీ బ్రాహ్మణులకి దానం చేశాడని చెప్పే కధ. దీనిలోని కొసమెరుపు బూతు యేమియేమిటంటే,ఆ బ్రాహ్మణులకీ విధవలయిన రాజపత్నులకీ పుట్టిన సంకరజాతి రాజవంశాలే కలియుగంలోని రాజవంశాలు అనేది!నిజానికి భారతదేశంలో రాజ్యం అనేది ఏర్పడిన తొలిదశలో బ్రాహ్మణులే రాజులు,తర్వాతి కాలంలో బ్రాహ్మణేతరులు కూడా ప్రభువు లయ్యారు.పరశురాముడు ఈ రాజవంశనిర్మూలన ఎప్పుడు చేశాడు?రామాయణ కాలానికి ముందు అయితే దశరధుడూ జనకుడూ సంకరులు కావాలి,రామాయణ కాలానికి తర్వాతా మహాభారత కాలానికి ముందూ అయితే కురువంశం సంకరమైనది కావాలి - యుద్ధం జరిగిన కొద్ది కాలానికే కలియుగం వచ్చేసింది కదా!ఈ కధని కల్పించి మధ్యలో ఇరికించిన వాళ్లలో ఉన్నది మామూలు స్థాయి అహంకారం కాదు కలియుగంలోని రాజులంతా మేము వాళ్ళ పూర్వీకుల భార్యలకి కడుపు చేస్తే పుటినవాళ్లే అని చెప్పుకునే పైత్యకారిబూతుతెలివి కూడా ఉంది!

    ఇవన్నీ ఒక్కచోట చేర్చి రాస్తే మొదట్లోనే వీళ్ళ దుర్మార్గం మిగతావాళ్ళకీ తెలిసేది అప్పుడే వీళ్ళని ఉతికి ఆరెసి చిలక్కొయకి తగిలించేవాళ్ళు - అందుకే అక్కడక్కడా ఇరికించారు!ఒక తొమ్మిది కడుచక్కని సుభాషితాలు రాసి పదోదిగా దీన్ని ఇరికించేవాళ్ళు.దీన్ని విడమర్చి చెప్పే పౌరాణికులూ వ్యాఖ్యాతలూ ప్రేక్షకుల్ని బట్టి దీన్ని వదిలేసి మిగతావి చెప్పేవాళ్ళు - అంతా ఒక తానులో ముక్కలే కదా.

    ReplyDelete
  12. చరిత్రను ఎంత నిశితంగా పరిశీలించినా ఈనాడు కొందరు అక్కసు వెళ్ళగక్కుతున్నట్టు కులవ్యవస్థ బ్రాహ్మణులు పైనుంచి రుద్దడం వల్ల ఏర్పడలేదు - అది కూడా ఆర్యద్రవిడసిద్ధాంతం లాగే కమ్యునిష్టులు కల్పించిన ఆబద్ధం!మిగిలిన కులాలు రాజ్యానికి కావలసిన ఉత్పత్తికి సంబంధించిన లౌకికపరమైన ఏర్పాటు వల్ల పుట్టినవి కాగా ఇవ్వాళ మనం చూస్తున్న బ్రాహ్మణకులం అన్ని కులాలకు సంబంధించిన ఆధ్యాత్మిక అవసరాల కోసం చేసుకున్న ఏర్పాటు!బ్రాహ్మణకులం కూడా కులవ్యవస్థలోని ఒక భాగమే - చాతుర్వర్ణంలోని బ్రాహ్మణ పదం వీరి కులానికి పర్యాయం కావడం వల్ల ఈ అబద్ధపు వాదన నిజమేనని అందరూ భ్రమపడటం జరిగింది.బ్రాహ్మణులలోని కొందరు తమ పాండిత్యం యొక్క ఔద్ధత్యాన్ని చూపిస్తూ వ్యాస మహర్షి వంటి గొప్పవారి కావ్యాలలో కూడా వారి ఆదర్సవంతమైన భావాలకు విరుద్ధమైన ప్రక్షిప్తాలను చేర్చి కల్పిత విప్రాధిక్యతని ప్రచారం చేశారు.అది కమ్యునిష్టులకి బ్రాహ్మణులే కులవ్యవస్థని పైనుంచి రుద్దారనే సూత్రీకరణ చెయ్యడానికి దారి చూపించింది.వ్యాసప్రోక్తాలుగా నిర్ధారించబడిన బాగాల్లో కనిపించే శరీధర్మశాస్త్రం, యోగశాస్త్రం, ఖగోళశాస్త్రం, భూగోళశాస్త్రం మొదలైన విషయాలను పరిశీలిస్తే అతడు సత్యానికి కట్టుబడిన నిజమైన జ్ఞాని అని తెలుస్తుంది.అటువంటి వాడు సమజాన్ని సంస్కరించాలనే సదుద్దేశంతో రచన చేస్తూ మళ్ళీ తద్విరుద్ధమైన ప్రస్తావనల్ని ఎందుకు చేస్తాడు?కల్పితమైన ఆధిక్యత కోసం పాకులాడిన పండిత ప్రకాండులు తమకి ఏ విషయం గురించి ఎలాంటి సమర్ధన అవసరం అవుతుందో దాని ప్రకారం వ్యాసుడి శైలిలో ఒక ఉపాఖ్యానం రాసేసి ఇరికించేసే వాళ్ళు!

    ReplyDelete
  13. శోకం:నిషాదో మార్గవం సూతే దాసం నౌకర్మజీవనం
    కైవర్తమితి యం ప్రాహు రార్యావర్తనివాసినః
    మనుధర్మశాస్త్రం 4వ శ్లోకం
    భావం:బ్రాహ్మణునకు శూద్రభార్య యందు బుటినవాడైన నిషాదుఁ డాయోగవస్త్రీయందు నావ నడుపుటయే వృత్తిగా గలిగిన మార్గవుని గలుగఁజేయుచున్నాడు.వాని నార్యావర్త దేశవాసులు కైవర్తుడు(బెస్తవాడు) అని పిలుచుచున్నారు.
    శ్కోకం:క్షత్రియా ద్విప్రకన్యాయాం సూతో భవతి జాతితః
    వైశ్యా న్మాగధ వైదేహౌ రాజవిప్రాంగనాసుతౌ.
    భావం:క్షత్రియునకు బ్రాహ్మణస్త్రీయందుఁ బుటినవాడు సూతుఁడనియు,వైశ్యునకు క్షత్రియ స్త్రీయందుఁ బుట్టినవాడు మాగధుఁడనియు,వానికే బ్రాహ్మణస్త్రీయందుఁ బుట్టినవాడు వైదేహుఁడనియు జెప్పబడును.

    చారిత్రకంగా ప్రతి కులానికీ ఒక వృత్తి మూలమై ఉండటమూ ఆ వృత్తికి ఉన్న ప్రాధాన్యతని బట్టి కొన్ని తరాల పాటు ఆ వృత్తిని ఆదాయమార్గంగా చేసుకోవడం ద్వారానే స్థిరమై నిలిచాయనేది కళ్ళకి కట్టినట్టు గోచరిస్తుంటే ఇట్లా X అనే బ్రాహ్మణుడు Y అనే కులానికి చెందిన Z అనే స్త్రీకి కడుపు చేస్తే A అనే కులం పుట్టిందని రాయడం ఎంత నీచత్వం?లేదని బుకాయిమంచడానికి వీల్లేకుండా బ్రాహ్మణాధిక్యత అనేది ఉన్నదని స్పష్టంగా తెలుస్తున్నది కదా!ఇది తెలియాల్సిన వాళ్ళకి తెలియడంతో బ్రాహ్మణ వ్యతిరేకతా ఉద్యమం పుట్టింది.ఈ పేరు చెప్పగానే తమిళనాడులోని పెరియార్ గుర్తుకు రావటం సహజం,కానీ ఈయన 19వ శతాబ్దం వాడు, ఆంధ్ర ప్రాంతంలో వీరేశలింగం పంతులు కన్నా ముందుగానే తెలుగునాట ఒక చిచ్చరపిడుగు పుట్టాడు - అతని పేరు స్వామినేని ముద్దునరసింహం(జననం:క్రీ.శ.1792, మరణం:క్రీ.శ.1856)!అతను పేల్చిన బాంబు పేరు హితసూచని అనే గ్రంధరాజం!తర్వాత కాలంలో ఆత్మూరి నరసింహం(1845-1901), కందుకూరి వీరేశలింగం(1848-1919), గురజాడ అప్పారావు(1862-1915) లాంటివాళ్ళు ఎత్తుకున్న పరస్పర విభిన్నమైన సంస్కరణా ప్రణాళిక లన్నిటికీ programmatic background ఇచ్చింది హితసూచనియే - పేలింది ఆటంబాంబు కాబట్టి దానివల్ల జరగాల్సిన పని కూడా చాలా నిక్కచ్చిగా జరిగింది!

    హితసూచనిలో ముద్దునరసింహం ఇచ్చిన కార్యక్రమం తెలుగునాట 20వ శతాబ్దం ప్రారంభానికే ఒక స్పష్టమైన రూపు తీసుకున్నది.కుల సంఘాలు ఏర్పడి తమ కులాన్ని అభివృద్ధి చెసుకోవడానికి కార్యక్రమాలు మొదలుపెట్టాయి.క్రీ.శ.1903లో పుట్టిన విశ్వబ్రాహ్మణ కుల సంఘం నుండి క్రీ.శ.1926లో పుటిన క్షత్రియ కుల సంఘం వరకు అందరిదీ ఒకటే ప్రణాళిక:1).స్వకుల విద్యాభివృద్ధిని గుర్తించి వారి కులానికి చెందిన విద్యార్ధుల కొరకు ప్రత్యేక హాస్టళ్లను నిర్మించడం,వీలయితే బీద విద్యార్ధులకు ధనసహాయం చేసి విదేశాలకు పంపించడం.2).విద్య,ఉద్యోగ,ఉపాధి రంగాలలో తమ స్థానం కోసం పోరాడటం.3).బాల్యవివాహాలను వ్యతిరేకించడం,వితంతు పునర్వివాహం లాంటివాటిని ప్రోత్సహించడం - ఇదంతా హితసూచని వేసిన రాజమార్గమే!

    ReplyDelete
  14. ముద్దునరసింహం నుంచి రాఘవయ్య చౌదరి వరకు గల బ్రాహ్మణేతర మేధావులలో ఎవ్వరికీ హిందూమతద్వేషం లేదు - కేవలం కల్పిత విప్రాధిక్యత వల్ల తేజస్సు కోల్పోయిన సనాతన ధర్మాన్ని పూర్వరూపంలో నిలబెట్టడానికి వారు చేసిన కృషిలో నిజాయితీ ఉంది,కనుకనే సత్యానికి కటుబడిన బ్రాహ్మణులు కూడా వీరిని అనుసరించారు!అయితే,తిరిగి సనాతన ధర్మాన్ని పూర్వరూపంలో నిలబెట్టడం అసాధ్యం అని వీరు తెలుసుకోలేకపోయారు.అందుకే ఉద్యమం చల్లబడిపోయింది.మాయమైపోయింది.కాలానికి ఒక చిత్రమైన లక్షణం ఉంది - ఎంతమంది ఎంత మొండికి తిరిగి ఎన్ని రకాలుగా ప్రయత్నించినా అది పొరపాటున కూడా వెనక్కి నడవదు, ఎప్పుడూ ముందుకే నడుస్తుంది!తిరిగి సాధించలేని చేజారిన గతం,ఎప్పటికీ చేరుకోలేక వూరించే భావి - ఈ రెంటి మధ్యన అర్ధం చేసుకోవడానికీ ఆలోచించడానికీ దిశను మార్చుకోవడానికీ చాలినంత సమయం ఇవ్వకుండా హఠాత్తుగా మనమీదకి దూకే అత్యంత కీలకమైన ఈ వర్తమానం అనే బిందువు యొక్క పరిమాణం ఎంత?సంవత్సరమా, ఆయనమా, మాసమా, వారమా, దినమా, క్షణమా - బ్రాహ్మణులు తమకు లేని గొప్పను ఆపాదించుకుని ఇతర కులాల్ని అణిచివెయ్యడం అనేది నిజంగా జరిగిందా!జరిగితే ఎప్పుడు మొదలైంది?

    ReplyDelete
  15. ఈ కల్పితవిప్రాధిక్యత మొత్తం ఉదరపోషణ నిమిత్తమే జరిగిందనేది వాస్తవం.కానీ సాహిత్యంలో ఇంత విస్తారంగా ఉన్నప్పటికీ సమాజంలో ఈ కల్పితవిప్రాధిక్యత పని చేసిందని చెప్పడానికి దాఖలాలు లేవు.ఇవ్వాళ తమ ఇళ్ళలో దైవకార్యం,పితృకార్యం నిర్వహించిన బ్రాహ్మణులకి సంభావన ఇచ్చేటపుడు మనుస్మృతిలో చెప్పారని ఇవ్వడం లేదు కదా!ఏనాడూ మనుస్మృతి చదవని వాళ్ళని అసలు తెలియనే తెలియని విషయం ఎట్లా ప్రభావితం చేస్తుంది?ఎక్కువ అడిగితే ఇవ్వను పొమ్మని గృహస్థు అంటే సరిపెట్టుకుని వెళ్ళేవాళ్లని పట్టుకుని వాళ్ళు వీళ్ళ మీద పెత్తనం చేస్తున్నారని ఆరోపించడం అన్యాయమే!

    ReplyDelete
  16. ఉద్యమం పలచబడిపోవటం వల్ల మరుగున పడినప్పటికీ వారు సంద్గించిన ప్రశ్నలు మాత్రం బ్రాహ్మణులు తప్పనిసరిగా జవాబు చెప్పి తీరాల్సినవే.ఇవ్వాళ కమ్మ, కాపు, రెడ్డి, వెలమ కులాల వారు ప్రదర్శిస్తున్న కులాధిక్యతకి తొలినాటి కల్పిత విప్రాధిక్యతయే కారణం గనుక దీనిని రూపుమాపే బాధ్యతని వారే తీసుకోఎవాలి!మొదట సనాతన ధార్మిక సాహిత్యం నుంచి కల్పిత విప్రాధిక్యతకి సంబంధించిన ఆనవాళ్లని వారు చెరిపివేయాలి.దీనివల్ల వారు బ్రాహ్మణేతరుల విశ్వాసాన్ని పొందగలుగుతారు.తర్వాత బ్రాహ్మణేతరులకి కూడా పుట్టుకని బట్టి గాక ఆసక్తిని బట్టి వేదం మీద అధికారాన్ని ఇవ్వాలి.దీనివల్ల సనాతన ధర్మం కేవలం బ్రాహ్మణులకే సొంతం అనే అపప్రధ పోతుంది.కల్పిత విప్రాధిక్యత వల్ల వారికి జరిగిన మేలూ లేదు, దేవనయ్య వారి లాంటి వల్ల వారికి జరిగిన కీడూ లేదు.మెకాలే విద్యావిధానం వల్ల తమకు కొత్తగా వచ్చిపడిన సామాజిక స్థాయి నుంచి పుట్టిన అహంకారాన్ని వదులుకుని బ్రాహ్మణేతరులు కూడా చరిత్రని నిష్పాక్షిక దృష్టితో చూసి వాస్తవాల్ని తెలుసుకోవాలి.పొట్టకూటి కోసం తప్పుడుపనులు చేసి అపఖ్యాతి పాలైన కొద్దిమంది పుట్టు బ్రాహ్మణులను మినహాయిస్తే వ్యాసుని వంటి సాత్వికులైన బుద్ధి బ్రాహ్మణులు సృష్టించిన జ్ఞానసంపద చాలా గొప్పది.

    ReplyDelete
  17. హిందూ మతానికి చెందిన పురాణకధలలో స్థల దేవతలు.జలదేవతలు అంటూ ఇచ్చిన వర్ణనల ఆధారంతో క్రీ.శ.1801లో లెఫ్టినెంట్ ఫ్రాన్సిస్ గిల్బర్ట్ అనే వ్యక్తి ఒక దేశపటాన్ని తయారుచేసి, "హిందువుల ప్రాచీన గ్రంధాల నుంచి కాలీ లేక నైలు నది పక్కనే ఉన్న ఈజిప్టు తదితర దేశాలను గురించిన సమాచారం" అనే వ్యాసం రాస్తే దానికి 60 యేళ్ళ తర్వాత జె.హెచ్.స్పెకే అనే పరిశోధకుడు ఆ వివరాల సాయంతో నైలునది పుట్టుకను గుర్తించాడు!ఇతరులకు తమ ప్రక్కన ఉన్నవాటి గురించే తెలియని కాలంలోనే ప్రపంచం మొత్తాన్ని చుట్టివచ్చి అందర్నీ మెప్పించిన గొప్ప వారసత్వాన్ని సృష్టించడం ద్వారా కలిగిన మంచికీ అంతర్గతంగా కులాధిక్యతలకు కారణం కావడం ద్వారా కలిగిన చెడుకీ - ఈ దేశానికి సంబంధించి చరిత్ర మనకి చూపిస్తున్న విభిన్న కోణాలు రెంటికీ బ్రాహ్మణులే కారణం అయ్యారు అనేది నిజమే. మంచికి మాత్రమే బాధ్యత తీసుకుని చెడుకి బాధ్యత వహించడంలో బ్రాహ్మణులు తప్పుకోకూడదు.అలాగే, చెడుని మాత్రమే చూసి దూషిస్తూ బ్రాహ్మణుల వల్ల జరిగిన మంచిని బ్రాహ్మణేతరులు తక్కువ చేసి మాట్లాడకూడదు.ఇవ్వాళ నడుస్తున్న ఆధ్యాత్మికతతో పనిలేని లౌకిక జీవితంలో బ్రాహ్మణులకి ప్రాధాన్యత లేదు కాబట్టి బ్రాహణులకి ప్రాధాన్యత లేకపోయినా హిందూమతం కొనసాగుతుందని కొందరికి అనిపించవచ్చు, కానీ ఆధ్యాత్మికత లేని హిందువుల జీవనవిధానం ఎట్లా ఉంటుంది?వూహించటం కూడా కష్తమే!కాబట్టి గత డెబ్భయ్యేళ్ళుగా క్రైస్తవ, ముస్లిం, కమ్యునిస్ట్ భావజాలాల తాకిడికి పెరిగిన అంతరాల్ని తగ్గించుకుని బ్రాహ్మణులూ బ్రాహ్మణతరులూ కలిసికట్టుగా నిలబడితేనే హిందూమతం ఉనికిలో ఉంటుంది.

    ReplyDelete
  18. మహేషుడికి: వాల్మీకి ఎంత రాసినా బోయవాడు అన్నారేగానీ.. అతన్ని బ్రాహ్మణుడు అనలేదు. కాబట్టి, పుట్టుకతో కులం స్థిరపడదు అనేది అబద్ధం అని తేలిపొయింది కదా! కాబట్టి హైందవేతరులపై, కమ్యూనిష్టులూ, హేతువాదులపై మీకున్న అకారణద్వేషాన్ని మానుకోని.. సత్యాన్ని మాత్రమే చూడమని మనవి.

    ReplyDelete
  19. >>hari.S.baabu
    రామాయణ భారతాలు కేవలం కధలని అంటూ వాటికి ప్రామాణికత ఉందని మీరు ఒప్పుకోవడం లేదు కదా!మళ్ళీ మీరే వాటినుంచి దాఖలాలు అడిగితే ఎట్లా సార్!

    అలాంటి ప్రశ్నలు మిమ్మల్ని అడగనవసరంలేదండి. తన అసహనాన్ని కౄరంగా ప్రదర్శించిన మహేషుడికి మాత్రమే అది.

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top