ప్రజాస్వామ్యంలో ఓటు విలువను కాపాడుకోవడానికి చాలా క్రుషి జరగాల్సి ఉంది. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన అవసరం ఉండగా కేంద్రం చేతిలో ఎన్నికల కమీషన్ కీలుబొమ్మగా మారిందన్న ఆరోపణలు ఇటీవల వెల్లువెత్తుతున్నాయి. కొన్ని సంఘటనలపై పత్రికలలో వస్తున్న కథనాలను బట్టి సామాన్యులు సైతం ఇవిఎంలపై అనుమానాలు పెంచుకుంటున్నారు. వివిప్యాట్ ల వంటి కొత్త ప్రయోగాలు వస్తున్నా విపక్షాల  ఆరోపణలతో మరోసారి ఈ అంశంపై చర్చ జరుగుతోంది. ఇవిఎంల టాంపరింగ్ కు సంబంధించిన అంశంపై మీ అభిప్రాయం ఏమిటి? ఫలానా పార్టీ ఆరోపణలు, ప్రత్యారోపణలు, సమర్ధనలు ఆధారంగా కాకుండా ఈ అంశంపై సామాన్యుల అనుమానాలు నివ్రుత్తి చేసేందుకు ఎన్నికల కమీషన్ చేపట్టాల్సిన చర్యలేమిటి? మీ అభిప్రాయాన్ని పంచుకోవాలని వినతి.
- పల్లా కొండలరావు
*Re-published

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

janavijayam@gmail.com

Post a Comment

  1. ఇవే ఆరోపణలు ఇంతే స్థాయిలో గతంలోనూ వచ్చాయి మున్ముందు కూడా వస్తాయి. పాత్రల తారుమారు తప్ప వీటిలో కొత్తేమీ లేదు.

    పాతకాలపు PBT లాండ్ లైను ఫోన్లు SMS ఎందుకు పంపలేవు? మీరు ఈ ప్రశ్నకు కారణాలతో సమాధానం చెప్పక నేను ఈవీఎం గురించిన ఎలెక్ట్రానిక్స్ విపులీకరిస్తాను.

    ReplyDelete
  2. < పాతకాలపు PBT లాండ్ లైను ఫోన్లు SMS ఎందుకు పంపలేవు? మీరు ఈ ప్రశ్నకు కారణాలతో సమాధానం చెప్పక నేను ఈవీఎం గురించిన ఎలెక్ట్రానిక్స్ విపులీకరిస్తాను. >

    ఎందుకో? ఈ రెండింటికీ లింకుని ఉదహరిస్తూ ఇవిఎం ల గురించి మీరు విపులీకరిస్తే వచ్చే నష్టమేమీ లేదనుకుంటున్నాను.

    ReplyDelete
  3. సామాన్యునికి సైతం అనుమానం లేకుండా, నమ్మకం కలిగేలా అనుమానాలను వ్యక్తీకరించడం, ఆఖరు ప్రశ్నకు కూడా అవగతమయ్యేలా సరైన సమాధానం చెప్పగలగడం ప్రజాస్వామ్యంలో చర్చకు ఉండాల్సిన మంచి లక్షణం. అందునా స్వయం ప్రతిపత్తి కలిగిన ఎన్నికల వ్యవస్థకు మరీ అవసరం అన్నది నా అభిప్రాయం.

    ReplyDelete
  4. Sorry నా వ్యాఖ్యలో "పంపలేవు?" అని పొరపాటుగా వచ్చింది. దీన్ని "పంపలేరు?" అని చదవగలరు. Typing mistake మన్నించండి.

    "ఎందుకో?"

    మీరు నా ప్రశ్నకు జవాబు చెప్పితే నేను "సామాన్యునికి సైతం అనుమానం లేకుండా" చెప్పగలను.

    నేను నా బ్లాగులో కొన్నేళ్ల కిందటే ఈ అంశాన్ని విశ్లేషించాను. నేను ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదివి చాలా ఏళ్లయినా ఈవీఎం core technology మాత్రం అప్పటిదే.

    ReplyDelete
    Replies
    1. పంపలేవు, పంపలేరు ఈ పదాల మధ్య తేడా జస్ట్ ఇది మర్యాదకు సంబంధించిన అంశం. ప్రశ్న అర్ధంలో మార్పు ఉండదు కనుక వదిలేద్దాం.
      నేను మీరడిగిన ప్రశ్నకే సమాధానంగా : ‘ఎందుకో? ఈ రెండింటికీ లింకుని ఉదహరిస్తూ ఇవిఎం ల గురించి మీరు విపులీకరిస్తే వచ్చే నష్టమేమీ లేదనుకుంటున్నాను.’ అని మళ్ళీ చెపుతున్నాను జై గారు.

      ఎందుకంటే ఇది చంద్రబాబు, కే.సీ.యార్, మోడీ ల మధ్య దొంగాటకు సంబంధించింది కాదు. ఎన్నికల వ్యవస్థకు సంబంధించినది. సి.పి.ఐ కూడా అనుమానం వ్యక్తం చేస్తోంది. సుప్రీం కోర్టు ఐదు వి.వి ప్యాట్ లు లెక్కించాలని చెపుతోంది. సగం లెక్కించాలని బాబు వంటి వారు అంటున్నారు.

      గతంలో కూడా ఇలాంటి అనుమానాలు వచ్చినపుడు సముద్రంలో పారవేసిన ఇవిఎంలను తీసి మళ్ళీ చూసినా అవి కరెక్టుగానే పనిచేస్తున్నాయని నిరూపించినట్లు చదివిన గుర్తు.

      సాంకేతిక పరమైన అంశాలలో అందరికీ మీ అంత నాలెజ్ ఉండదు. కానీ అనుమానం లేకుండా ప్రత్యామ్నయ నిరూపణలు కూడా క్రాస్ చెకింగ్ చేసుకునేలా వీలు కల్పించి సాంకేతికత పవర్ ని నిలబెట్టాల్సిన అవసరం వ్యవస్థకు ఉంది. అపుడే పనికిమాలిన ఆరోపణలు తగ్గుతాయి. స్వతంత్ర సంస్థలు స్వతంత్రంగా పనిచేసేలా మరో అడుగు ముందుకు పడుతుంది.

      నాకు తెలిసి టి.ఎన్.శేషన్ వచ్చాకనే ఎన్నికల వ్యవస్థ పవర్ ప్రజలకు తెలిసింది. మరింతగా దీనిని స్వతంత్రీకరించాల్సిందే. అందుకు ఆఖరు అనుమానికి కూడా అనువైన, నమ్మకమైన సమాధానం దొరికే వరకూ చర్చలు చేయడం తప్పు కాదు. చర్చలకు , ఆరోపణలకు తేడాని గమనించాలి.

      Delete
  5. హైదరాబాద్ కి కంప్యూటర్ లను పరిచయం చేసిన వ్యక్తి, బిల్ గేట్స్ కి హగ్గులు ఇచ్చిన వ్యక్తి ఈ వీ యం గురించి విమర్శిస్తుంటే ఏం చెప్పాలో అర్ధం కావడం లేదు.

    ఆఖరు నిమిషంలో ఎన్నికల ప్రధానాధికారుల బదిలీ వల్ల చంద్రబాబుగారికి కలిగిన అనుమానం వల్ల ఆరోపణలు చేస్తున్నారు కానీ ఆ విమర్శలు నమ్మశక్యంగా లేవు. ఎలక్షన్ కమీషన్ సమర్ధవంతంగా పనిచేయకపోవచ్చు, యంత్రాలు మొరాయించవచ్చు కానీ సాంకేతిక వ్యవస్థనే తీసేయాలని ఎవరు కోరుకున్నా అది తిరోగమనమే !

    కంప్యూటర్ గురించి ఓనమాలు కూడా తెలియని కేసీఆర్ గారు కూడా ఈ వీ ఏం యంత్రాలను విమర్శించడం లేదు. చంద్రబాబుగారిలో ఆత్మవిశ్వాసం లేదు అని అనిపిస్తుంది.

    ఓడినాక ఈ వీ యం లు వోటా ?

    ReplyDelete
    Replies
    1. ఇది చంద్రబాబు, చంద్రశేఖరరావులకు మాత్రమే సంబంధించినది కాదు. చంద్రబాబు కంటే చంద్రశేఖరరావుకే అన్నింటా నాలెజ్ ఎక్కువ అని నా అభిప్రాయం.

      Delete
    2. చంద్రబాబుకు నిజంగా కంప్యూటర్ నైపుణ్యం ఉందా లేదా అన్న విషయం పక్కన పెడితే ఈవీఎం యంత్రాలలో కంప్యూటర్లు ఏవీ లేవు. వీటికి కంప్యూటర్లతో/సాఫ్టువేరుతో ఎటువంటి సంబంధం లేదు. ఇక్కడ సబ్జెక్ట్ ఎలక్ట్రానిక్స్.

      Delete
    3. ఈ వీ ఎం కి కంప్యూటర్ తో సంబంధం లేదని నాకూ తెలుసు. నేను పోల్చింది యంత్రం గురించి.మీరు ఎలక్ట్రానిక్స్ చదివారని డప్పు కొట్టక్కరలేదు.అవసరమైనంతవరకూ మాట్లాడండి చాలు. కంప్యూటర్ కీ బోర్డ్ మీటటం రాని కేసీఆర్ కూడా ఈవీ ఎం మీటని విమర్శించలేదు అని అన్నాను. మీ తెలివి తెల్లారినట్లే ఉంది.

      Delete
    4. చంద్రబాబు కంటే చంద్రశేఖరరావుకే అన్నింటా నాలెజ్ ఎక్కువ అని నా అభిప్రాయం.
      కొండలరావుగారూ మీరు నిరూపించగలరా ?

      Delete
    5. నీహారిక గారు,

      ఖచ్చితంగా CBN is an edge over KCR in terms of knowledge కాని KCR has better communication/oral skills.

      ఇప్పటి సమాచార సాంకేతిక సమాజంలో ఎవరు బాగా communicate/convince చేస్తారో వారే విజేతలు.

      మా స్నేహితులలో చాలా మంచి technical knowledge ఉన్నా కూడా career at a standstill ఉండిపొయినవాల్లున్నారు కేవలం poor communication skills వలన.

      దయ చేసి నా Tenglish లేదా mixing ENGLISH words in TELUGU ని క్షమించండి.
      Most of us are Michif and I'm no exceptional

      మరొక్కసారి నా హృదయపూర్వక కృతజ్ఞ్ణతలు!!

      Delete
    6. < చంద్రబాబు కంటే చంద్రశేఖరరావుకే అన్నింటా నాలెజ్ ఎక్కువ అని నా అభిప్రాయం.
      కొండలరావుగారూ మీరు నిరూపించగలరా ? >

      అన్నింటా అనడం కంటే చంద్రబాబు కంటే చంద్రశేఖరరావే తెలివైన నాయకుడు అని చదువుకోగలరు. ఇది నా అభిప్రాయం అన్నాను తప్ప ఛాలెంజ్ చేయలేదు కనుక నిరూపించాల్సిన పనిలేదని వినతి.

      Delete
    7. కంప్యూటర్ కీ ఈ వీ ఎం కీ సంబంధమే లేనట్లే చంద్రబాబుగారికీ కేసీఆర్ గారికీ సంబంధమే లేదు. ఈ వీ ఎం లాంటి కేసీఆర్ గారు తెలివైన నాయకుడు అని మీరెలా నిర్ణయిస్తారు ?
      మీరు ఒక స్టేట్‌మెంట్ ఇచ్చిన తరువాత దాని మీద నిలబడాలి లేదా తప్పు అని ఒప్పుకోవాలి. నిరూపించాల్సిన పనిలేదని అంటే ఎలా ?

      Delete
    8. అభిప్రాయాన్ని ఎలా నిరూపించాలి?

      Delete
    9. ఎన్.టి.రామారావు అల్లుడు కాకుంటే చంద్రబాబుకి ఈ స్థాయి వచ్చేది కాదు. చంద్రబాబు చంద్రశేఖరరావుకు మంత్రి పదవే ఇవ్వడానికి ఇష్టపడకపోయినా పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకుని తాను సి.ఎం కావడమే గాక చంద్రబాబుని దాదాపుగా తెలంగాణ నుండి తరిమివేశాడు.

      పాలనలోనూ, ప్రజల కోణంలో పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలోనూ, రాజకీయంగా ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడంలోనూ, కుండబద్దలు కొట్టినట్లు ప్రజల భాషలో కమ్యూనికేట్ చేయడంలోనూ, తనను నమ్మని వారిని సైతం ఒప్పించి తనవైపు ఆకర్షించడం, వారితో పనిచేయించుకోగలగడం చంద్రశేఖరరావులో పాజిటివ్ అంశం కాగా, తన నీడనే తాను నమ్మలేని నిత్య అభద్రతా జీవి చంద్రబాబు. పత్రికలు, బాకాగాళ్ళు లేనిదే ఫోకస్ కాలేని నేత చంద్రబాబు కాగా పత్రికలను సైతం ఎదిరించి ప్రజలను మెప్పించగలగడం చంద్రశేఖరరావు అనుసరించే వ్యూహం ( ఇవి రెండూ ఒప్పు కాదు). ఇలా చాలా చెప్పవచ్చు. కానీ వీటిని మీరు అంగీకరించాలని లేదు కనుక నిరూపించాల్సిన పనిలేదనేదే నా అభిప్రాయం.

      Delete
    10. "ఎన్.టి.రామారావు అల్లుడు కాకుంటే చంద్రబాబుకి ఈ స్థాయి వచ్చేది కాదు."

      ఎన్.టి.రామారావు గారికి అల్లుడు కాకమునుపే కాంగ్రెస్ లో ప్రముఖుడుగా ఉన్నారు.

      Delete
    11. పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకుని తాను సి.ఎం కావడమే గాక చంద్రబాబుని దాదాపుగా తెలంగాణ నుండి తరిమివేశాడు.

      దీనిని తెలివితేటలు అనరు "చావు" తెలివితేటలు అంటారు.

      Delete
    12. >>>పత్రికలు, బాకాగాళ్ళు లేనిదే ఫోకస్ కాలేని నేత చంద్రబాబు కాగా పత్రికలను సైతం ఎదిరించి ప్రజలను మెప్పించగలగడం చంద్రశేఖరరావు అనుసరించే వ్యూహం.>>

      నవ తెలంగాణా, తెలంగాణా న్యూస్ చానెళ్ళు శ్రీ రామ కధా కాలక్షేప కబుర్లు చెబుతున్నాయా ?

      Delete
    13. >>>ఇలా చాలా చెప్పవచ్చు. కానీ వీటిని మీరు అంగీకరించాలని లేదు.>>>

      మీలాంటి సామాన్యులకు తెలియచెప్పాల్సిన అవసరం నాది.

      Delete
    14. :) మీరు చెపుతానంటే నే వద్దంటానా? కానివ్వండి.

      Delete
  6. కొండలరావు గారూ,

    PBT ఫోన్లకు కేవలం తంతుల ("తీగల" అనాలేమో?) ద్వారా మాత్రమే సంకేతాలు (signals) పంపవచ్చు. SMS పంపాలంటే రిసీవర్ పరికరంలో GPRS తరహా వసతి (communications protocol) ఉండాలి. ఈ కారణం చేతనే PBT ఫోన్లకు SMS పంపడం కుదరదు.

    ఈవీఎం మెషీన్లు ఇంతే, వీటిలో RS232C తరహా wired serial interface వసతులు మాత్రమే ఉన్నాయి. GPRS, bluetooth, wifi, TCP/IP లాంటివి ఏమీ లేవు. ఈ పరికరాలకు బాహ్య ప్రపంచంతో ఎటువంటి లింకు లేదు, ఒకవేళ బలవంతంగా నెట్వర్కుకు కలిపినా ప్రొటొకాల్స్ లేవు కనుక కమ్యూనికేషన్ జరగదు.

    టీవీలు, డ్రోన్లు వగైరాలతో ఉన్న line-of-sight sensors కూడా ఈ యంత్రాలలో లేవు కనుక hand held remote ద్వారా నియంత్రించడం అసంభవం. వీటిని తంతి సంపర్కం ద్వారా తప్ప ఇంకే రకంగా వాడలేము.

    Summarizing in English, EVM is an offline stand-alone-system without any facility for external or remote communications.

    పాత లాండులైన్ ఫోన్లకు SMS పంపడం కుదరనట్టే ఈఏఎమ్ మెషీన్లకు బయట నుండి సంకేతాలు పంపడం అసంభవం అని నేనన్నది ఇందుకే. ఈ ఉదాహరణ సామాన్యులకు అర్ధం అయేటట్టుగానే ఉందని ఆశిస్తాను.

    ఒకరకంగా చెప్పాలంటే పాత ఫోన్లకంటే (వాటికి తంతుల ద్వారా ఎక్స్ఛేంజీ, అక్కడి నుండి వేరే ఫోన్లకు సంబంధం ఉంది కనుక) ఈవీఎం ఇంకా టాంపర్ ప్రూఫ్.

    చివరిగా ఒక క్లారిఫికేషన్. నేను ముందటి వ్యాఖ్యలో "మెషీన్లు పంపలేవు" అంటూ డ్రాఫ్టింగ్ మొదలెట్టి తరువాత "మనుషులు పంపలేరు" తరహా మార్చాను కానీ తదనుగుణంగా సవరించలేదు. "వచన సమస్య" కాదు "వాచక తప్పిదం"!

    ReplyDelete
    Replies
    1. దీని మీద అధ్యయనం కోసం మీరు చెప్పింది నోట్ చేసుకుంటున్నాను జై గారు. నాకు దీనిపై ఇతరులకు వివరించేంత లేదా వాదించేంత నాలెజ్ లేదు.

      Delete
    2. ఇ.వి.ఎంలలో ప్రోగ్రామింగ్ ఉంటుందా? లేదా? జై గారు.

      Delete
  7. ఇక వీవీపాటులు. ఎన్నికల సంఘం మాన్యువల్ ప్రకారం అభర్ధుల/ఏజెంట్ల సమక్షంలో లాటరీ పద్దతిలో ఒక పోలింగ్ బూతు ఎంచుకుంటారు. కౌంటింగ్ సమయంలో సదరు బూతు వీవీపాటులు లెక్కిస్తారు.

    ఒక్కటి మాత్రమే సరిపోదని 50% బూతులతో వీవీపాటులు లెక్కించాలని కొన్ని పార్టీలు సుప్రీం కోర్టుకు
    వెళ్లాయి (వెళ్లారు అనాలేమో?). దీన్ని న్యాయస్థానం తోసిపుచ్చుతూ ఆడిట్ సంఖ్యను 5 (లోక్సభ 35) బూతులకు పెంచాలని ఆదేశించింది. కోర్టు ఉత్తర్వుల తరువాత ఇంకా రాద్ధాంతం చేయడం తగదని నా అభిప్రాయం.

    ReplyDelete
    Replies
    1. వీ వీ ప్యాట్ లను మొదట మా జిల్లాలోనే పాలేరు అసెంబ్లీ ఉప ఎన్నికలలో వాడారు. కోర్టు చెప్పింది సరిపోతుందని నా అభిప్రాయం.

      Delete
    2. సుప్రీం కోర్టు తన పాత నిర్ణయాన్నే పునురుద్ఘాటించింది. ఇక ఈ లొల్లికి తెర పడ్డట్టే.

      https://www.indiatoday.in/elections/lok-sabha-2019/story/vvpat-election-petition-congress-supreme-court-1518995-2019-05-07

      The bench headed by Chief Justice of India Ranjan Gogoi said the Supreme Court was not inclined to interfere. "We are *not inclined* to modify our order. [For] *how many days will we hear the same matter*," the Supreme Court bench said while dismissing review plea on random matching of VVPAT slips.

      Delete
  8. "Summarizing in English, EVM is an offline stand-alone-system without any facility for external or remote communications."

    హమ్మయ్యా తెలుగులో చెప్పి బతికించారు. లేకపోతే ఆ వాచకాలు, వచనాలు గట్రా అర్థం చేసుకోలేక కిందా మీదా పడుండే వాన్ని. మనలో మాట, మీరు ఈనాడులో జాబ్ కోసం అప్లై చేసుకోవచ్చు.

    ReplyDelete
    Replies
    1. ")

      ఈనాడు: నాకున్న "అర్హతలు" సరిపోవు.

      Delete
    2. ఈయనగారి తెలుగు అంత గొప్పగా ఉందా ? సామాన్యులకు అర్ధం అవుతుందా ?

      Delete
    3. గొప్పగా ఉందో లేదో నాకు తెలీదు. ఈనాడు తెలుగులాగా సామాన్యులకు పంటికింద రాయిలా అనిపించి చెప్పాను అంతే !

      Delete
    4. "ఈనాడు: నాకున్న "అర్హతలు" సరిపోవు"

      కరక్టే. అసలు విషయం మరిచాను :-)

      Delete
    5. ఇంతకుముందు వినని, వాడని పదాలు కనిపించినపుడు కాస్త పంటికింద రాయిలా అనిపించినా వాడుతూ ఉంటే అదే అలవాటు అవుతుంది. అయినా ఆంగ్ల మాధ్యమపు పై చదువుల్లో నోరుతిరగని దిక్కుమాలిన పదాలు ఎన్ని తగిలినా కుక్కిన పేనులా కిక్కురుమనకుండా బుర్రనిండా కుక్కేసుకుని పరీక్షల్లో కక్కేసి పాసైపోలేదూ?
      తెలుగులో అక్కడా అక్కడా నాలుగు పదాలు తగిలేసరికి ఈ ఆరున్నొక్క రాగాలేందుకో?!

      Delete
    6. తెలుగులో అక్కడా అక్కడా నాలుగు పదాలు తగిలేసరికి ఈ ఆరున్నొక్క రాగాలేందుకో?!
      పద్యాలు పాడలేక అనుకుంటా :)

      Delete
  9. Well explained Jai garu!! Unless pre-programmed and fuzzy login changed, EVMs can't be tampered but unfortunately no stringent auditing/verification before starting the voting for these EVMS too.

    BTW, Neeharika garu I could see sarcasm in all your comments against Jai :) but no idea why?

    ReplyDelete
    Replies
    1. మీరు ఈ ఒక్క పోస్ట్ చూసి ఒక నిర్ణయానికి రాకూడదు.ఇదివరకు హరిబాబుగారు జై గారిని తిట్టేవారు. ఎందుకు పాపం తిడుతున్నారు అని నేనూ అనుకునేదాన్ని. కంప్యూటర్ కీ ఏవీఏం కీ తేడా ఉందని నాకూ తెలుసు. కేసీఆర్ ని సమర్ధిస్తూ వ్రాసినా నాకు తెలియదు అన్నట్లు వ్రాయడమే కాకుండా చంద్రబాబు గారి నైపుణ్యం గురించి మాట్లాడుతున్నారు.

      Delete
    2. పాత లాండులైన్ ఫోన్లకు SMS పంపడం కుదరనట్టే ఈఏఎమ్ మెషీన్లకు బయట నుండి సంకేతాలు పంపడం అసంభవం అని నేనన్నది ఇందుకే. ఈ ఉదాహరణ సామాన్యులకు అర్ధం అయేటట్టుగానే ఉందని ఆశిస్తాను.
      See here he wrote that he is a scholar and others are samanyulu.

      Delete
    3. స్కాలర్లకు తప్ప, landline కి sms పంపడమనే రొమాంటిక్ థాట్ ఎవరికీ రాదు.

      Delete
    4. Haha!! నీహారిక గారు,
      నేను 3 సంవత్సరాలుగా మీ అందరిని follow అవుతున్నాను.
      మీ సుతిమెత్తని వెటకారం నాకు బలే ఇస్టం.
      కాని ఇప్పుడు మీరు కూడ open అయిపొయారు అందుకే అడిగాను.
      అయినా ఎవరి subject లో వారికి పట్టు ఉండటం సహజం మరియు ఇతరులకి అర్ధం అయితే సంతోషం!!

      What ever, thanks much again for you all and Happy week-end :)

      Delete
  10. please read fuzzy login as fuzzy logic..

    You guys make our life here in Europe also home.. Thanks for the posts, time and comments.

    ReplyDelete
  11. @విసుకి వాడి మనస్సె ఒక విశ్వం:

    ప్రతీ పోలింగ్ బూతులో (100% coverage, not sampling) ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ చేస్తారు. దాని ఫలితాలను రికార్డ్ చేసి ఏజెంట్లతో బాటు అధికారులు సంతకం చేస్తారు. మాక్ పోలింగ్ వీవీపాటులను సెగ్రగేట్ చేసి, టెస్ట్ ఓట్లు డిలీట్ చేసాకే అసలు వోటింగ్ మొదలెడతారు.

    మీకు కుదిరితే ఎన్నికల సంఘం వెబ్ సైట్లో మాన్యువల్ చదవండి. As an ISO 9001 Management Representative, I am impressed with the structured manner the process is fleshed out and also with the extent of checks and balances. There is a good deal of documented information amenable to audit trail.

    ఇక fuzzy logic వగైరాలకు వస్తే వీటికి ఎన్నో ప్రతికూలతలు ఉన్నాయి ఒక్కటి మాత్రం ఇక్కడ ఉదాహరిస్తాను. 64 kb మెమరీ EEPROM పరిమితిలో ఎటువంటి కాంప్లెక్స్ machine language programming కోడింగ్ పట్టదు.

    ReplyDelete
    Replies
    1. Thanks again Jai garu for the updates and explanation. I got it!

      I'm a SAP database Architect and have been working with very large scale machinery and almost all Banking data centers in Europe but very little idea about these EVMs.

      Delete
    2. SAP database architecture: wow! Meeting you (unfortunately only on the web) made my day.

      Delete
    3. I always feel proud of you people Jai garu!! Your posts and comments are great relief and pleasure during stressful Days.

      BTW, I visit India every quarter and again in mid of May to Hyderabad, Vizag and Vijayawada. I'm now settled in Amsterdam and You all are welcomed to visit the pleasant and beautiful Tulip Gardens and Europe trip anytime during May-Aug.. My pleasure to guide, help and accommodate/Host :)

      Please add my Indian WhatsApp number --> +91 99499 99469.

      Thanks again Jai garu, Kodala Rao garu, Neeharika garu and Haribabu garu..

      Delete
    4. Thanks a lot, happy weekend & bon voyage :)

      Delete

    5. < విసుకి వాడి మనస్సె ఒక విశ్వం...April 20, 2019 at 3:55:00 PM GMT+5:30 >
      welcome and noted ur whatsapp no. tq.

      Delete
  12. @ విసుకి వాడి మనస్సె ఒక విశ్వం...
    Thanks for ur kind words.

    ReplyDelete
  13. @ విసుకి వాడి మనస్సె ఒక విశ్వం...
    మా వాళ్ళు ఒకరు చికాగో నుండి Amsterdam కు ఉద్యోగ రీత్యా వచ్చారు. అక్కడ తెలుగు సంఘం లాంటి దేమన్నా ఉందా. మీరు తరచుగా కలుస్తూ ఉంటారా.మీకు వీలయితే తెలుపగలరు. థాంక్స్.

    ReplyDelete
  14. ఈవీయమ్ములను వైఫైద్వారా హ్యాక్ చెయ్యొచ్చా అన్నది నాకు తెలీదుగానీ, ఒక నెట్వర్క్కి అనుసంధానించినప్పుడు దాని firmware మార్చవచ్చు. ఒక ఈవీయమ్మును physicalగా తాకగలిగితే దాని firmware మార్చవచ్చు. ఇప్పుడు ప్రశ్నల్లా పై రెండింటిలో ఏదైనా సాధ్యమా అనే!

    అభివృధ్ధి చెందిన దేశాల్లో కూడా పూర్తిగా ఈవీయమ్ములపై ఆధారపడడంలేదు. ఎవరి అనుమానాలు వారికున్నాయి. మనమ్మాత్రం ఎందుకు ఆద్షారపడాలి? ఏమాత్రం హ్యాక్ చెయ్యలేని సిస్టం అనేది మిధ్య (Nortan, FBI, CIA, Apple లాంటివాటికే లకే దిక్కులేదు). కానీ ఆవిషయం ప్రతిపక్షాలకీ, ప్రతిపక్షం కాబోతున్నామన్న భయమున్న పార్టీలకీ మాత్రమే పడుతుందేం!

    ఈ విషయంలో చంద్రబాబు అల్లరి నిజాయితీలేమి కాక మరొకటి కాబోదు.

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top