Related Posts
- ఓటరును ప్రభావితం చేస్తున్న అంశాలేమిటి? చేయాల్సిన అంశాలేమిటి?06 Aug 202114
ప్రజాస్వామ్యంలో ఎన్నికలు కీలకం. ఓటరు చైతన్యవంతుడైతే మంచి నేతలు చట్టసభలలోకి ప్రవేశించే...Read more »
- EVM ల టాంపరింగ్ పై ప్రతిపక్షాల ఆరోపణలు సరైనవేనా?02 Aug 202148
ప్రజాస్వామ్యంలో ఓటు విలువను కాపాడుకోవడానికి చాలా క్రుషి జరగాల్సి ఉంది. స్వతంత్రంగా వ్యవహరించాల...Read more »
- ఈ.వి.ఎం లను రద్దు చేసుకున్న దేశాలేవి? ఎందుకు?02 Aug 20217
- Palla Kondala Rao*Re-published మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంట...Read more »
- తిరుపతిలో దొంగ ఓట్ల వ్యవహారంలో జగన్ ఇమేజ్ డ్యామేజ్ అయిందా?18 Apr 20211
తిరుపతిలో దొంగ ఓట్ల వ్యవహారంలో జగన్ ఇమేజ్ డ్యామేజ్ అయిందా? తిరుపతిలో ఎన్నడూ ల...Read more »
Post a Comment
* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

































Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.
కొండలరావు గారూ, మీరు ప్రశ్నలను అడిగిన పద్దతిలోనే క్లారిటీ లోపించిందని అనిపిస్తుంది:
ReplyDelete1. నిజాయితీ అన్న బ్రహ్మ పదార్ధం వర్తించాల్సింది అభ్యర్థులకా పార్టీలకా?
2. అసలు నిజాయితీ అంటే ఏమిటి? ప్రజల సమస్యలేమిటో వినడానికి ఓపిక & ఆసక్తి లేక మూస "పరిష్కారాలు" చెప్పే వారికి ఎంత నిజాయితీ ఉంటే లాభం ఏమిటి?
‘పార్టీల తరపున లేదా ఇండిపెండెంట్ గా నైనా నిలబడే వారిలో సాపేక్షంగా మంచివారికి’..... అనుకుంటే..... అలాంటివారికి ఓటు వేస్తున్నారా? అని అర్ధం చేసుకుని మీ అభిప్రాయం చెప్పండి జై గారు.
ReplyDeleteమీ ప్రశ్నకు సమాధానం (సాపేక్షంగా & స్థూలంగా) ఔననే చెప్పాలి.
Deleteఒక అభ్యర్థి అందుబాటులో ఉంటాడని, మనం చెప్పేది కొంతయినా వింటాడని (తాను చెప్పేదే మనం వినాలని కాకుండా) & ఎదో ఒకింత మనకోసం చేస్తాడని జనం నమ్మితే ఖచ్చితంగా ఓట్లు వేస్తారు. ఇంకో రకంగా చెప్పాలంటే "మేధావులు" తింటాడా అని చూస్తారేమో కానీ జనం మాత్రం "మనవైపు ఉంటాడా" అని అడుగుతారు.
తెలంగాణా ఎన్నికలలో (ఖమ్మం జిల్లా & హైదరాబాదు పాతబస్తీ మినహా) తెరాస ప్రభంజనాన్ని ఎదిరించి నిలబడ్డ విజేతలను చూద్దాం. గెలిచినా ఓడినా ప్రజల పక్షాన ఉంటాడన్న నమ్మకం (మొదటి సారి బరిలో ఉన్నవారిలో) లేదా గతంలో ఉన్నాడన్న అభిప్రాయం (చిరపరచితులలో) కలిగించగలిగిన అభ్యర్థులకు జనం పట్టం కట్టారు (ఉ. సబితా ఇంద్రారెడ్డి, గండ్ర వెంకటరమణ, శ్రీధర్ బాబు వగైరా). మరోవైపు పదవిలో ఉన్నప్పుడు మనవైపే చూడలేదన్న అనుమానం పొడసూపిన నాయకులు హవాలో సైతం మట్టి కరిచారు.
కోరుకంటి చందర్ & జాజల సురేందర్ లాంటి "అనామకులు" గెలవడమే కాదు జానారెడ్డి, డీకే అరుణ & రేవంత్ లాంటి "మహారథులు" ఓడడం రెంటికీ ఇదే కారణం. "మేధావుల" మీద మీడియా ప్రభావం ఎక్కువే కానీ "సామాన్యులకు" ఇదంత పట్టదు.
ఒక్కోసారి ఈ రకంగా వచ్చిన మద్దతు గెలుపుకు ఆమడ దూరంగా ఆగవచ్చు లేదా right man in wrong place కావొచ్చు. గుమ్మడి నర్సయ్య ఇందుకు ఉదాహరణ.
వ్యక్తుల కన్నా పార్టీల ప్రభావమే శానా ఎక్కువ, అయితే ఇదే సూత్రం వర్తిస్తుంది. ఈ పార్టీ మనకోసం నిలబడుతుందా అన్నదే అతి ప్రధానం.
మంచి విశ్లేషణ జై గారు. ప్రజలు ఓట్లు ద్వారా ఇచ్చే తీర్పుని పాఠాలుగానే భావించాలి. ముఖ్యంగా భారత్ లో కమ్యూనిస్టు పార్టీలు.
Deleteఇంకా సూటిగా అడగాలంటే నిజాయితీ ఉన్న అభ్యర్ధులుంటున్నా కమ్యూనిస్టులకు ప్రజలు ఎందుకు ఓట్లు వేయడం లేదు? ఇది కమ్యూనిస్టులు నేర్చుకోవలసిన, తమ ఎత్తుగడలు మార్చుకోవలసిన అవసరాన్ని తెలుపుతోందని నా అభిప్రాయం.
Deleteఎల్ బీ నగర్ లో కాంగ్రెస్ అభ్యర్ధి సుధీర్ రెడ్డి గారు గెలిచారు. స్థానికంగా బాగా పనిచేస్తారని పేరుంది. నిజాయితీగా ఉంటారు. ఇక్కడ పార్టీ పనిచేయలేదు.
Deleteకమ్యూనిష్టులు కేవలం ఉద్యమాలు మాత్రం చేస్తారు. ప్రజలకు పనికివచ్చే పనులు చేసినట్టు కానీ, ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవడం కానీ చేయరు.
మోడీ 5 లక్షల కోట్లు ఇచ్చారు అని చెపితే కాబోలు అనుకుంటాం. లోక్ సత్తా పార్టీ ఎవరు ఎంత ఇచ్చిందీ ఎవరు ఎంత ఖర్చుపెట్టిందీ కమిటీ వేసి తేల్చింది.ప్రజల సపోర్ట్ లోక్ సత్తాకి ఉంటే ఒక్కొక్కడి తోలుతీసి బైసన్ పోలో మైదానంలో పూడ్చిపెడతారు.
< ప్రజలకు పనికివచ్చే పనులు చేసినట్టు కానీ, ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవడం కానీ చేయరు. >
Deleteచేసినా తగిన ప్రచారం లభించదు. నకారాత్మక ఎత్తుగడలు, ప్రజలకు అర్ధంకాని భాషలో ప్రవచనాలు చెప్పినట్లుండడం వంటి లోపాలు సవరించుకోవాలి.
"నిజాయితీ ఉన్న అభ్యర్ధులుంటున్నా కమ్యూనిస్టులకు ప్రజలు ఎందుకు ఓట్లు వేయడం లేదు?"
Deleteకమ్యూనిస్టులకు (అందరికీ కాకపోవొచ్చు) సమస్యల అధ్యయనం కంటే వాటిని తాము పుస్తకాల ద్వారా తెలుసుకున్న నమూనాలో బిగించడమే ముఖ్యం. ఇది పేషంటును పరీక్షించకుండా, రోగి చెప్పే విషయాలను వినకుండా వైద్యం చేయడం వంటిది. వెటర్నరీ డాక్టర్లకు తప్పదు కానీ మనుషులకు ఇలా వైద్యం చేయలేము కదా. "మీ సమస్యలు మీకు తెలీదు నాకే తెలుసు" అన్న ధోరణి "నిజాయితీ" కాదు.
"కమ్యూనిష్టులు కేవలం ఉద్యమాలు మాత్రం చేస్తారు. ప్రజలకు పనికివచ్చే పనులు చేసినట్టు కానీ, ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవడం కానీ చేయరు"
"ప్రజలకు పనికివచ్చే ఉద్యమాలు" చేస్తే సరిపోతుంది కాకపొతే వారి పుస్తకాలలో "ఐర్లాండ్ ఓడ కళాసీ, చెక్ దేశపు గనిపనిమనిషి" ల కష్టసుఖాలే ఉన్నాయి. జీవితంలో ఉండే సమస్యలకు గ్రంధాలలో ఉండే "పరిష్కారాలకు" పొత్తు కుదరాలని ఎర్ర చొక్కాలకు అర్ధం అయితే బావుణ్ణు.
"చేసినా తగిన ప్రచారం లభించదు"
ప్రచారం అక్కరలేదు ఫలితం దక్కితే అదే నోటిమాట ప్రచారం అవుతుంది.
< "మీ సమస్యలు మీకు తెలీదు నాకే తెలుసు" అన్న ధోరణి "నిజాయితీ" కాదు >
Deletegood n evergreen statement for every honest person or group.
< జీవితంలో ఉండే సమస్యలకు గ్రంధాలలో ఉండే "పరిష్కారాలకు" పొత్తు కుదరాలని ఎర్ర చొక్కాలకు అర్ధం అయితే బావుణ్ణు. >
Delete100% true. accepted.
< "ప్రజలకు పనికివచ్చే ఉద్యమాలు" చేస్తే సరిపోతుంది >
Deleteyes. అవసరమైన పోరాటం చేయాలి తప్ప పోరాటవ్యసనం నిరర్ధకం.
< ప్రచారం అక్కరలేదు ఫలితం దక్కితే అదే నోటిమాట ప్రచారం అవుతుంది. >
Deleteచాలా అరుదు. ప్రచారమూ పని చేస్తుందని చంద్రన్న నిరూపిస్తున్నడా? లేదా?
>>ప్రచారం అక్కరలేదు ఫలితం దక్కితే అదే నోటిమాట ప్రచారం అవుతుంది.>>>
Deleteకదా ? 70 ఏళ్ళుగా కాంగ్రెస్ దేశాన్ని దోచుకుతింది అని కూసేవాళ్ళను ఏం చేయాలంటారు ?
అందులో నిజం ఉంటే అంగీకరించాలి. లేదనుకుంటే వాస్తవాలు తెలియజేయాలి.
Deleteకమ్యూనికేషన్స్ వ్యవస్థలో నాలుగు భాగాలు: ప్రచారకర్త (sender), సందేశం (message), మాధ్యమం (medium) & శ్రోత (receiver). ఇవన్నీ వివిధరకాలుగా ప్రభావం చూపిస్తాయి.
Deleteఉ. రేవంత్ రెడ్డి సూపర్ హీరో అంటూ పచ్చ మీడియా ఊదరగొట్టింది. అతగాడు ఊళ్లలో తక్కువ, టీవీలో ఎక్కువ కనిపిస్తాడని తెలిసిన జనం చాచి తన్నారు. కోడంగల్ అలగా వెధవల కంటే తనకే "మేధోతనం" ఎక్కువ కనుక వేమూరి ఈ నిజాన్ని ఒప్పుకోలేకపోతున్నాడు.
పింకుహీరో గారు శాసనసభలో అడుగుపెట్టక పోయినా గెలిచారంటే ఏదో మతలబు ఉండాలి లేకపోతే అవసరమైనచోట కనిపించని వాళ్ళని చాచిన్నే పక్షంలో సదరుహీరోనూ తన్నేవారే కదా మరి.
Delete< కోడంగల్ అలగా వెధవల కంటే >
DeleteIs it good?
< పింకుహీరో గారు శాసనసభలో అడుగుపెట్టక పోయినా గెలిచారంటే ఏదో మతలబు ఉండాలి >
Deleteకూటమి అధికారంలోకి రాకముందే కాట్లాడుకునే స్థితిని చూసిన జనం వ్యతిరేకత ఉన్నా కె.సి.ఆరే నయమని ఓట్లు వేశారు. మా ఖమ్మంలో కేవలం ఒక్క సీటు .... అధీ జనానికి దూరంగా ఢిల్లీలో ఎక్కువ గడిపే నామా నాగేశ్వరరావు అసమర్ధత కారణంగానే టి.ఆర్.ఎస్ గెలిచింది.
"జనానికి దూరంగా ఢిల్లీలో ఎక్కువ గడిపే నామా నాగేశ్వరరావు"
Deleteనామా బదులు మద్దినేని బేబీ/కోనేరు బుజ్జి ఉండుంటే గెలిచే వారేమో అనుకుంటా.
ఏదేమయినా వనమా & రేగా లాంటి నిఖార్సయిన నాయకులు గెలవడం నిజంగా సంతోషం.
"కూటమి అధికారంలోకి రాకముందే కాట్లాడుకునే స్థితి"
ఇది కూడా *ఒక* కారణం కావొచ్చును కానీ ఇదొక్కటే కాదు. 46.9% ఓట్లు తెలంగాణాలో ఒక రికార్డు. అలాగే 14.1% (46.9%-34.1%) తేడా 1989 ఎన్టీఆర్-వ్యతిరేక సునామీ (కాంగ్రెస్: 43.1% టీడీపీ: 27.5% తేడా: 15.6%) తరువాత ఎప్పుడూ కనిపించలేదు.
గాయత్రి రవి కూడా గెలిచేవాడు ఈజీగా.... తెలుగుదేశం కు కాకుండా కాంగ్రెస్ కు ఇచ్చివుంటే గెలిచేది.
DeleteCorrection: "14.1% (46.9%-32.8%)"
Deleteఅవును గాయత్రి రవి ఖమ్మంలో గెలిచే వారు. అనవసరంగా అయన వరంగల్ వెళ్లి మరీ ఓడిపోయారు.
వైరా కూడా కాంగ్రెస్ ఉంచుకోవాల్సింది.
< వైరా కూడా కాంగ్రెస్ ఉంచుకోవాల్సింది. >
Deleteyes.
ఏదేమయినా ఈ ఎన్నికలలో ఖమ్మం జిల్లా రాజకీయ ముఖపటం పూర్తిగా మారిపోయింది. 2014 ఎన్నికలలో కేవలం 9.5% గెలిచిన తెరాస ఈసారి నాలుగింతలుగా (40.6%; 674,630 ఓట్లు) బలపడింది. అప్పట్లో 51.0% వచ్చిన కాంగ్రెస్/టీడీపీ/సీపీఐ కూటమి ఇప్పుడు 43.8% (727,490 ఓట్లు)కి పడిపోయారు. మూడు పార్టీలు కలిసినా తేడా కేవలం 52,860 ఓట్లు, అదీ అధికారంలో వస్తామన్న ప్రచార ఆర్భాట నేపథ్యంలో. లోకసభ ఎన్నికల వరకు ఇంకా డీలా పడిపోయే ప్రమాదం లేకపోలేదు. కేవలం తెరాస అంతర్గత కుమ్ములాటను నమ్ముకుంటే మొదటికే మోసం వస్తుంది.
Deleteకాంగ్రెస్ ఇప్పటికయినా మేలుకుంటుందా ప్రశ్నార్ధకమే. ఖమ్మం నుండి ప్రియాంకా గాంధీ పోటీ చేస్తారట, దీనితోనయినా ఉత్సాహం పెరుగుతుందేమో చూద్దాం.
తె.రా.స కుమ్ములాటలు తె.రా.సని దెబ్బతీసాయి. అయినా అవి ఇంకా కొనసాగుతున్నాయి. తుమ్మల వర్సెస్ పొంగులేటి గ్రూపులు యథాశక్తి పోటాపోటీగా కొనసాగుతున్నాయి. తె.రా.స అభ్యర్ధుల ఎంపికలో లోపాలున్నాయి. ముఖ్యంగా సత్తుపల్లిలో పిడమర్తి రవి వంటి జనాకర్షణ లేని వ్యక్తి కంటే మరొకరికి ఇస్తే తప్పక తె.రా.స గెలిచేది.
Delete>>>అందులో నిజం ఉంటే అంగీకరించాలి. లేదనుకుంటే వాస్తవాలు తెలియజేయాలి.>>>
Deleteఎవరైనా నిజం చెపితే నమ్ముతారా ?
నిజం చెప్పకపోతే థిర్డ్ డిగ్రీ ఉపయోగించి నిజం చెప్పిస్తారా ?
ఎవరికివారు నిజాయితీపరులమనే చెపుతారు. ఇదివరకు అవినీతి చేసి సంపాదించిన డబ్బుతో ఓట్లు కొనుక్కునేవారు. రాజశేఖర్ రెడ్డి గారు వచ్చాక ప్రజలసొమ్ముతో ఉచిత హామీలు అమలుచేసి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుని మళ్ళీ గెలిచారు.
తర్వాత వచ్చిన చంద్రబాబు గారు, ఆ తర్వాత వచ్చిన కేసీఆర్ గారు రైతు బంధు లాంటి పధకాలతో నేరుగా డబ్బు ఇవ్వడం మొదలుపెట్టారు.
ఉచితం అని చూసుకుంటున్నారు కానీ దీనివెనుక ఉన్న నిజాలు చెపుతారా ?
కాంగ్రెస్ అడ్డదారిలో చేసింది ఇపుడు పబ్లిక్ గా చేస్తున్నారు.
ఎవరండీ నిజాయితీపరులు ?
ఎవరు నిరూపించుకోవాలి ?
@Kondala Rao Palla:
Deleteపొంగులేటి-తుమ్మల కుమ్ములాటలు తెరాసను దెబ్బ తీసాయి & ఇంకా అలానే కొనసాగుతున్నాయి నిజమే. తెరాస అభర్ధుల ఎంపికలో లోపాలు కూడా పూర్తిగా కరెక్ట్.
కాకపొతే కొన్ని విషయాలు గమనించాలి:
1. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ స్థానికంగా బలహీనంగా ఉన్నా నిలదొక్కుకోగలదు (ఉ. కడపలో టీడీపీ). ఒకే ఒక్క జిల్లాలో పట్టు మిగిలిన కాంగ్రెస్ వారికి ఈ సదుపాయం లేదు.
2. ఇదే తరహా కీచులాటలు & ఎంపిక సమస్యలు (దాదాపు అంతే స్థాయిలో) కాంగ్రెస్ పార్టీలోనూ ఉన్నాయి. ఉ. బాబు సాయంతో వనమాకు టికెట్ కోయడానికి చాలా ఎత్తులే వేసారు, సంభానిని పక్కన పడేసారు.
3. అవతలి పక్షం సెల్ఫ్ గోల్ కొట్టుకుందని ఆటలో దిగడం మూర్ఖత్వం.
"ప్రజలసొమ్ముతో ఉచిత హామీలు అమలుచేసి"
Deleteతమిళనాడులో అన్నాడీఎంకే ప్రభుత్వం చౌక బియ్యం, మధ్యాహ్న భోజనం వగైరా పథకాలు మొదలు పెట్టింది. దేశంలో సంక్షేమయుగం మొదలయింది అక్కడి నుండే. వీటినే "కాపీ రాయుళ్లు" నఖల్ మార్నేకో అఖల్ హోనా అన్న సూత్రం మరిచిపోయి మరీ పక్క రాష్ట్రాలకు వర్తించారు.
"రైతు బంధు లాంటి పధకాలతో"
పట్టణాలలో ఒక్క రైతు కూడా ఉండదు మరి ఎలా గెలిచారు?
అసలు ఉచిత విద్యుత్ పధకం ఎందుకు వచ్చింది? మాగాణి భూములలో కులక్ వర్గాల బడాబాబులకు కాలువనీళ్లు అప్పణంగా వస్తుంటే బక్క రైతులు వేలాది రూపాయలు బోరు బావుల మీద ఖర్చు పెట్టి కూడా అల్లాడారు. గోరేటి వెంకన్న అందుకే "మడుగులన్ని అడుగంటి పోయినవి, బావులు సావుకు దగ్గరయ్యినవి, వాగులు వంకలు ఎండిపోయినవి" అన్నారు.
>>>పట్టణాలలో ఒక్క రైతు కూడా ఉండదు మరి ఎలా గెలిచారు ? >>>
Deleteపట్టణంలో ఉంటే పొలాలు కొనరా ? మా బంధువుకి ప్రభుత్వ ఉద్యోగం ఉంది. 25 ఎకరాల బీడు భూమి కొన్నది. అక్షరాలా రెండు లక్షలు వచ్చాయి. కేసీఆర్ గారికి ఎంత వచ్చి ఉంటుందో లెక్కేసుకోండి.
పట్టణంలో ఉంటే పొలాలు కొనరా ? ....... కొంటారు. కానీ గ్రామీణంతోపాటు, అర్బన్ ఏరియాలో కూడా టిఆర్ఎస్ కు తెలంగాణ ఓటర్లు బ్రహ్మరధం పట్టారు. ముఖ్య కారణం సరైన ప్రత్యామ్నయం లేకపోవడమే. ఎవరిని ఎందుకు నమ్మాలి? ఎవరు ముఖ్యమంత్రి? .... ఇలాంటి సాధారణ ప్రశ్నలకు కూడా సరైన లేదా సాధారణమైన నమ్మకం కలిగించే సమాధానం లేదు. ఇది తె.రా.స గెలుపుకు ప్రధాన కారణం.
Deleteఎవరిని ఎందుకు నమ్మాలి? ఎవరు ముఖ్యమంత్రి? .... ఇలాంటి సాధారణ ప్రశ్నలకు కూడా సరైన లేదా సాధారణమైన నమ్మకం కలిగించే సమాధానం లేదు. ఇది తె.రా.స గెలుపుకు ప్రధాన కారణం.
DeleteExactly...agreed.
అది మామూలు బీడు భూమా లేదా రాళ్ళు, రప్పలు ఉన్న భూమా? రాళ్ళు, రప్పలు ఉన్న భూమిలో కందులు తప్ప ఏవీ పండవు. రాళ్ళు తక్కువగా ఉంటే చోళ్ళు, పొద్దుతిరుగుడు పండుతాయి.
Deleteజై గారు, యూరోప్‌లోని కార్మికుల సమస్యలు వేరు, ఇండియాలోని కార్మికుల సమస్యలు వేరు. ఇండియాలో వ్యవసాయం మెషీన్‌లతో చెయ్యరు, కూలీల చేత చెయ్యిస్తారు. కూలీలకి కూలీ రేట్ పెంచితే రైతులకి ఏమీ మిగలదు. ట్రాన్స్‌ప్లాంటర్‌తో వరి నాట్లు వెయ్యడానికి ఇద్దరు పని మనుషులు మాత్రమే సరిపోతారు. ట్రాన్స్‌ప్లాంటర్‌తో వరినాట్లు నాట్లు వెయ్యిస్తే, హార్వెస్టర్‌తో కోతలు కొయ్యిస్తే, థ్రెషర్‌తో నూర్పిడి చెయ్యిస్తే, ధాన్యం పండించేవాళ్ళు మాత్రమే ఉన్న ఊరిలో ఐదు లేదా ఆరు మంది తప్ప మిగితా కూలీలందరూ నిరుద్యోగులుగా మారుతారు. యూరోప్‌లో రైతుల దగ్గర ఒకరిద్దరు పని మనుషులు మాత్రమే ఉంటారు కనుక అక్కడ పని మనుషులకి జీతం ఎంత పెంచినా వ్యవసాయ ఉత్పత్తుల రేట్‌లు పెరగవు కానీ ఇండియాలో కూలీలకి కూలీ రేట్‌లు పెంచితే వ్యవసాయ ఉత్పత్తుల రేట్‌లు ఆకాశాన్ని అంటుతాయి. మావోయిస్టులు ప్రధానంగా భూసమస్య మీద దృష్టి పెట్టడానికి బలమైన కారణం ఉంది. భూమిని అందరికీ సమానంగా పంచడం అనేది రాజ్యాంగ పరధిలో లేనిది. భూసమస్య మీద దృష్టి పెడితేనే భూమి లేని కూలీలు పార్టీకి దగ్గర అవుతారు.
Delete"పట్టణంలో ఉంటే పొలాలు కొనరా ? ....... కొంటారు"
Deleteనిజమే కావొచ్చు కానీ గ్రామాలలో పోలిస్తే తక్కువ కదా. తెరాస గెలిచిన కోటి ఓట్లు అన్నీ *కేవలం* రైతు బంధం వలన కాదేమో. అదే నిజమయితే ఖమ్మం జిల్లాలో రైతులు లేరా లేదా వారికి మాత్రమే రైతు బంధం మినహాయించారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.
"ఎవరు ముఖ్యమంత్రి?"
రాజస్థాన్, ఎంపీ & ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో స్పష్టంగా తెలుసు. శివరాజ్ & రమణ్ సింగ్ ఇప్పటికీ చాలా పాపులర్ నాయకులు. మరోవైపు కాంగ్రెస్ సీఎం అభ్యర్థులు ఎవరో తెలీని పరిస్థితి. అలాంటప్పుడు ఫలితాలు కమలానికి అనుకూలంగా ఎందుకు రాలేదు?
లోకసభ ఎన్నికలకు ముఖ్యమంత్రి ఎవరో అనవసరం కనుక ఆ ఫలితాలూ చూద్దాం. అప్పుడూ తెరాస గెలిస్తే మీరు మేము ఇక్కడే ఉంటాం కనుక ఈ ప్రశ్నను పునర్దర్శించవచ్చును.
కాంప్లెక్స్ ప్రశ్నలను విషయం లోతును విస్మయించి anecdotal evidence ద్వారా విశ్లేషిస్తే గజిబిజి జవాబులు వస్తాయి. టీవీలలో వచ్చే "నిపుణులు" ఎల్లకిల్లా పడేందుకు ఇది ఒక ముఖ్య కారణమయితే preference vs. prediction తేడా తెలీకపోవడం మరోటి.
ఊరికే వాదనలెందుకు గానీ కేసీఆర్ గారు మళ్ళీ గెలుస్తారని నేను ఒప్పుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గెలుస్తారని మీరు ఒప్పుకుంటారా ?
DeleteWhat is your prediction ?
గొర్రె కంటే కసాయివాడే బలవంతుడు. అలాగే తెలంగాణా ప్రజల కంటే క.చ.రా. బలవంతుడు, ఆంధ్ర ప్రజల కంటే చం.బా.నా బలవంతుడు.
Deleteనీహారిక గారూ, నాకు "ఎవరు" కంటే "ఎందుకు" అన్న ప్రశ్నపైనే ఆసక్తి.
Deleteఆంధ్రా ఎన్నికల గురించి ప్రస్తుతానికి ఒక్క prediction మాత్రమే చేస్తాను: బీజేపీకి గత ఎన్నికల 2.2% కంటే తక్కువయితే రావు.
మీ రాష్ట్రానికి కేసీఆర్ ఎలాగో ఆంధ్రాకి చంద్రబాబు నాయుడు గారు అంతే అవసరం. మీరు చాలెంజ్ లు విసురుతున్నారు కదా అని అడిగాను. మీ ఆసక్తి ఎందులో ఉందో నాకు తెలుసు.
DeleteWho cares BJP ?
"ఆంధ్రాకి చంద్రబాబు నాయుడు గారు అంతే అవసరం"
DeleteIs this a preference or prediction? అదేదో ఓటర్లలో ఎక్కువ మందికి అనిపిస్తే గెలుస్తాడు లేకపోతే లేదు. నేనయితే ఇంకా ఒక అంచనాకి రాలేదు వచ్చాక చెప్తాను. I never base predictions on preference.
"Who cares BJP"
You may not care but the man who rode on their votes twice in the past does so.
ఆంధ్రాలో బీజేపీ ఓట్లు 2014 మీద పెరుగుతాయా (పెరగాలా వద్దా కాదు) అన్న విషయంపై మీకు ఆసక్తి లేకపోతే ఇంకో prediction చేస్తాను. ప్రరాపాకు ఆంధ్రాలో 2009లో వచ్చిన 19.3% ఓట్లు పవన్ కళ్యాణ్ అధిగమించలేడు. దీనిపై షరతు వేద్దామా?
< గొర్రె కంటే కసాయివాడే బలవంతుడు. అలాగే తెలంగాణా ప్రజల కంటే క.చ.రా. బలవంతుడు, ఆంధ్ర ప్రజల కంటే చం.బా.నా బలవంతుడు. >
Delete100% true.
< ప్రరాపాకు ఆంధ్రాలో 2009లో వచ్చిన 19.3% ఓట్లు పవన్ కళ్యాణ్ అధిగమించలేడు. దీనిపై షరతు వేద్దామా? >
Deleteఓట్లేనా? సీట్లు కూడా రావంటారా? సీట్ల విషయంలో ప్రరాపాకంటే పవన్ కు ఎక్కువ వస్తాయా? తక్కువ వస్తాయా? జై జీ.
@Kondala Rao Palla:
Deleteఅప్పట్లో ప్రరాపాకు ఆంధ్రాలో 16 సీట్లు వచ్చాయి. ఇప్పుడు పవన్ గారికి 10 వచ్చినా ఆశ్చర్యమేనని నా అంచనా.
కసాయివాడు ఎంత తెలివితక్కువవాడైనా అతను ఎల్లప్పుడూ గొర్రె కంటే తెలివిగానే వ్యవహరిస్తాడు. తెలంగాణా చచ్చినా రాదనుకుని తెలంగాణాకి అనుకూలంగా లేఖ వ్రాసిన చం.బా.నా. మరో ఐదేళ్ళ వరకు నవ ఆంధ్ర ప్రదేశ్‌కి ముఖ్య మంత్రిగానే ఉంటాడు.
Delete< ఇప్పుడు పవన్ గారికి 10 వచ్చినా ఆశ్చర్యమేనని నా అంచనా. >
Delete10 వస్తే కర్నాటకం అవుతుందేమోనన్న ఆశలున్నాయి అక్కడా....
< మరో ఐదేళ్ళ వరకు నవ ఆంధ్ర ప్రదేశ్‌కి ముఖ్య మంత్రిగానే ఉంటాడు. >
Deleteజగన్ సెల్ఫ్ గోల్ చేసుకోకుంటే అంత తేలిక కాదు.
"10 వస్తే కర్నాటకం అవుతుందేమోనన్న ఆశలున్నాయి అక్కడా"
Deleteఆశలకు అంతెక్కడండీ. తెలంగాణాలో రవ్వంత రెడ్డి సీఎం & చుండ్రు సుహాసిని డెప్యూటీ సీఎం అని వారి పార్టీ ఆశ పడింది ఏమైంది? చివరికి ఏమున్నదక్కో అని పాడుకుంటూ ముల్లె సర్దుకున్నారు.
ఆశ ‘అంతే’.. నంటారా? రవ్వంతరెడ్డి.... బానే ఉందిగానీ... చుండ్రు సుహాసిని కోన్ ?
Deleteరాజమండ్రి మాజీ ఎంపీ చుండ్రు శ్రీహరి కోడలు!
Deleteఆవిడ ముప్పై వేల ఓట్లతో గెలుస్తుందని జోరుగా బెట్టింగ్ జరిగిందట మీరు వినలేదా.
లేదండీ.
Deleteప్రజలు నిజాయితీపరులకు ఓట్లు వేస్తున్నారా?
ReplyDeleteప్రజలు నిజయితీపరులెవరా అని ఆలోచించి తమకు ఎవరు ఎక్కువ మేలు చేస్తే వారికి ఓటువేస్తారు.
ఓటు వేసేటప్పుడు ప్రజలను ప్రభావితం చేస్తున్న అంశాలేమిటి?
స్థానికంగా అభ్యర్ధి పలుకుబడి, నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి.
వీటిలో మార్పు తెచ్చేదెలా?
ప్రజలెపుడూ మారుతూనే ఉంటారు. ప్రజాభిప్రాయం తగ్గట్లు రాజకీయ నాయకులూ మారుతుంటారు. ఉచిత విద్యుత్ ఇస్తానంటే వై ఎస్ ఆర్ గారిని గెలిపించారు. ఇపుడు అన్నీ ఉచితంగా పబ్లిక్ గా ప్రజాధనాన్ని "రైతుబంధు"వులుగా ఇస్తున్నారు. ఉచితంగా ఏదీ రాదని ప్రజలు తెలుసుకున్న రోజున ప్రజలే మారతారు.
What is the meaning of
?
Deleteచప్పట్లు.
Deleteచప్పట్లకి
అనో (చ)అనో రాయాలికదా!
Deleteతెలీదు. మీరు వ్రాసింది నా లాప్టాప్లో కాపీ ఆవిరులు కప్పుతున్న కప్పు గా కనిపిస్తున్నది సూర్య గారు.
Deleteఓటును యథేచ్చగా అమ్ముకోవడం , కొనుక్కోవడం అనే దోష భూయిష్ట మైన ఎన్నికల ప్రక్రియ కాలదోషం పట్టింది . ఓటర్లను ప్రలోభ పెట్టి గెలుపొందే అవకాశంలేని ఎన్నికల విథానం వస్తేగాని నిజాయితీ పరుల ఎంపికగానీ , ప్రజాస్వామ్య నిర్వచనం కానీ సఫలంకావు . అసలు ఆథార్ కు ఓటును అనుసంథానం చెయ్యడానికే రాజకీయ పార్టీలు ఒప్పుకోవు .
ReplyDeleteఎన్నికల సంస్కరణలు జరగాలన్నది ఎంత నిజమో.... ప్రస్తుత తీర్పులనూ ప్రజాభిప్రాయంగా పరిగణనలోకి తీసుకుని పాఠాలుగా నేర్చుకోవాలన్నదీ అంతే నిజం సర్.
Deleteడబ్బు & మద్యం పంపిణీ వలన ఎన్నికల ప్రక్రియ భ్రష్టు పట్టిందన్న వాదన వాస్తవమే. కాకపోతే ఏ పార్టీ కూడా మడి కట్టుకోలేదు. అందరూ పోటీ పడి ఓట్లు కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నా ఓటర్ మాత్రం ఒకరికే ఓటు వేస్తాడు.
Delete"Democracy is the worst form of government, except for all the others" అన్నారు. ఎంత కలుషభూయిష్టమయినా ఈ వ్యవస్థనే బాగు పరచాలి కానీ వేరే ప్రత్యామ్నాయం లేదు.
<"Democracy is the worst form of government, except for all the others" అన్నారు. ఎంత కలుషభూయిష్టమయినా ఈ వ్యవస్థనే బాగు పరచాలి కానీ వేరే ప్రత్యామ్నాయం లేదు.>
Deleteఆలోచించాల్సిన అంశం ఇది. బాగుచేయగలమా? ఎలా? అన్నది కీలక సందేహం.
ఓట్లు కొనుగోలు చేసి గెలుపొందిన ఈ నేరగాళ్ళే చట్టసభలలో
ReplyDeleteచట్టాలు చేసేది . ఓట్లు అమ్ముకున్న నేరగాళ్ళకు తగిన శాస్తిగా ఆ చట్టాలు రిటన్ గిఫ్ట్ లు . మరి ప్రజాధనం అనేక రకాలుగా దోపిడీకి గురవుతూనే ఉంటుంది , ఆపే వ్యవస్థ ఓటు అమ్ముకున్న అప్పుడే పట్టు కోల్పోయింది .
డబ్బు తీసుకున్నా.... ఓటు వేసేవారికే వేస్తున్నారు. ఎవరు డబ్బులిచ్చినా తీసుకుంటున్నారు. ఇపుడిపుడే ఓడాక అభ్యర్ధులు తిరిగి డబ్బులు అడుక్కుంటున్నట్లు వార్తలు వినపడుతున్నాయి.
Deleteపింకుహీరో...👌👌👌
ReplyDeleteవ్యక్తుల కన్నా పార్టీల ప్రభావమే శానా ఎక్కువ
ReplyDeleteమీ సమస్యలు మీకు తెలీదు నాకే తెలుసు" అన్న ధోరణి "నిజాయితీ" కాదు.
ప్రచారం అక్కరలేదు ఫలితం దక్కితే అదే నోటిమాట ప్రచారం అవుతుంది
కోడంగల్ అలగా వెధవల కంటే తనకే "మేధోతనం" ఎక్కువ కనుక వేమూరి ఈ నిజాన్ని ఒప్పుకోలేకపోతున్నాడు.
ఎంత కలుషభూయిష్టమయినా ఈ వ్యవస్థనే బాగు పరచాలి కానీ వేరే ప్రత్యామ్నాయం లేదు.
Conclude the discussion.