ప్రజాస్వామ్యంలో ఎన్నికలు కీలకం. ఓటరు చైతన్యవంతుడైతే మంచి నేతలు చట్టసభలలోకి ప్రవేశించే వీలుంటుంది. పాలకులుగా సామాజిక శ్రేయస్సు కోరేవారిని ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ మనదేశంలోనూ, చాలాచోట్ల ఎన్నికలలో ఓటర్లపై వివిధ అంశాలు ప్రభావితం చూపుతున్నాయి. కులం, మతం, ప్రాంతం, అవినీతి, డబ్బు, బంధుప్రీతి, గెలుపు గుర్రం, సిద్ధాంతాలు, నైతిక విలువలు.... ఇలా నెగెటివ్ మరియు పాజిటివ్ అంశాలు ప్రభావితం చూపుతున్నాయి. ఎప్పటికపుడు ఎన్నికల సంస్కరణలకోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొంత ఫలితం ఉంటున్నా రావలసిన మార్పే ఎక్కువ అనేది అందరూ అంగీకరించే అంశం. ఈ అంశంపై నిరంతరం వివిధ స్థాయిలలో డిబేట్ జరపడం అవసరం. ఈ కోణంలో మీ అభిప్రాయం కోసం ఇక్కడ ఈ ప్రశ్న ఉంచడమైనది. మన దేశంలో ప్రస్తుతం ఓటరును ప్రభావితం చేస్తున్న అంశాలేమిటి? చేయాల్సిన అంశాలేమిటి?
- పల్లా కొండలరావు
*Re-published
మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
janavijayam@gmail.com
మన దేశంలో ప్రస్తుతం ఓటరును ప్రభావితం చేస్తున్న అంశాలేమిటి?
ReplyDeleteఉచిత పధకాలు.
చేయాల్సిన అంశాలేమిటి?
ఉచిత పధకాలు రద్దు చేయడం.
అన్ని ఉచితాలు అనుచితాలు కాదేమో నీహారిక గారు.
Delete>>చేయాల్సిన అంశాలేమిటి?
Deleteపథకాలు సక్రమంగా అమలయ్యేలా చూడడం
విద్య మరియు వైద్యం మాత్రమే అందరికీ ఉచితంగా ఇవ్వాలి. మేము నెలకి ఫలానా మొత్తం చెల్లిస్తేనే మాకు ఆరోగ్య పరీక్షలు ఉచితంగా చేస్తారు.ఇన్సూరెన్స్ లాంటివి ప్రతి ఒక్కరికీ అవసరం. దళితులకి మాత్రమే రోగాలు వస్తాయా ? అంబానీకి రోగమే రాదా ? ఆరోగ్యశ్రీ అంబానీకి కూడా ఉచితంగా ఇవ్వాలి.. అవి ఉచితాలు కాదు ప్రాధమిక హక్కులు.
Delete1) విద్య, వైద్యం పూర్తిగా ప్రభుత్వనిర్వహణలో అందరికీ సమానంగా, ఉచితంగా అందించాలి.
Delete2) దేశం మొత్తం గ్రామం యూనిట్ గా ప్రభుత్వ పథకాల అమలు, ఆడిట్ ఉండాలి.
3) నిరంతరం ఎన్నికల సంస్కరణలు, సమీక్ష జరగాలి. ఏ పాలనపైనైనా రెండేండ్ల కోసారి ప్రజల తీర్పు కోరాలి. అంటే రెండేండ్ల కోసారి ఎన్నికలు (స్థానిక, ప్రాంతీయ, సార్వత్రిక ... అన్ని) నిర్వహించాలి.
4) మినిమం ఉపాధి కల్పించేలా హామీ ఉండాలి. ప్రభుత్వ రంగ సంస్థల నిర్వహణ పెరగాలి.
5) ఉద్యోగాల నిర్వహణ, ప్రొడక్టు మార్కెటింగ్ పూర్తిగా ప్రభుత్వమే నిర్వహించాలి.
6) మంచి మానవసంబంధాల పెంపుదల, ప్రక్రుతి పర్యావరణం నాశనం కాని విధంగా పరిశ్రమల ఏర్పాటు ఉండాలి.
7) ప్రక్రుతి వ్యవసాయం మాత్రమే ఉండడం, మార్కెట్ , ధర సౌకర్యాల కల్పన ప్రభుత్వాలే కలిగించడం. ఏ పంట ఎంత పండించాలనే విధంగా డిమాండ్ ఆధారంగా పంటలు మార్చి వేసేలా రైతులు ఉండేలా వ్యవసాయశాఖ నియంత్రణ ఉండాలి.
8) కుల ప్రస్థావన లేని ఆరోగ్యకరమైన, మానవీయ కోణంలో రిజర్వేషన్ ఉండాలి.
9) ప్రాంతీయ పార్టీలను రద్దు చేయాలి. దీని స్ధానంలో ఇండిపెండెంట్ గా పోటీచేసే అవకాశం ఉండాలి.
10) ప్రక్రుతి జీవన విధానం ను ప్రోత్సహించేలా విద్యారంగంలో సిలబస్ ఉండాలి.
ఈ అంశాలు ఓటరుని ప్రభావితం చేసేలా ఉండాలన్నది నా అభిప్రాయం.
తెలంగాణ ఎన్నికల సమయంలో లగడపాటితో ఫేక్ సర్వే చేయించి పరువు పోగొట్టుకున్న పచ్చ బాచీ తాజాగా ఇంకో ఫేక్ సర్వే విడుదల చేసింది. సీబీఎన్ చంద్రజ్యోతి ఊదరగొడుతున్న సమాచారం ఇది:
ReplyDeletehttps://www.andhrajyothy.com/artical?SID=754283
లోక్‌నీతి-సీఎ్‌సడీఎస్ అనే స్వతంత్ర సంస్థ సదరు సర్వే చేసినట్టు వేమూరి చెప్తున్నాడు. ఆ సంస్థ వారు మాత్రం తాము ఎటువంటి సర్వే చేయలేదని ప్రకటించారు.
"Lokniti-CSDS has NOT done any survey in the State of Andhra Pradesh. What is being shared on social media is FAKE and complete rubbish!"
https://twitter.com/lokniticsds?lang=en
https://twitter.com/LoknitiCSDS/status/1112577889877323781
ఇంతటి బరివాత దిగజారుడు ఎల్లో మీడియాకే చెల్లింది.
పచ్చ మీడియా తాజా సర్కస్ ఫీటు. "కొర్పొరేటు చాణక్య" అనే సంస్థ ఎదో సర్వే చేసిందని & అందుట్లో బాబు గెలుస్తాడని నిన్నంతా దండోరా వేసారు. గోనుగుంట్ల అనిల్ అనబడే సదరు సర్వేయరు తాము జనాభాలో 2% ప్రజలను సర్వే చేసామని డబ్బా కొట్టుకున్నాడు.
Deleteఇతగాడు గతంలో ఎప్పుడూ సర్వే చేసిన పాపాన పోలేదు. వింతేమిటంటే ఈ ఘనకార్యం చేసినట్టు చెప్తున్న అనిల్ అనబడే పచ్చ చెంచా తన డొక్కు కంపెనీకి పేరు మోసిన టుడేస్ చాణక్య సంస్థకు పోలిన పేరు పెట్టుకొని మరీ బారి తెగించాడు. షరా మామూలుగా తమకు ఈ నిర్వాకంతో సంబంధం లేదని వారూ ప్రకటించాల్సి వచ్చింది.
https://twitter.com/TodaysChanakya/status/1114915801990148096
"This is not our survey. We have not done it. Please retweet to make people in Andhra aware about this"
ఇక్కడ టాపిక్ ఏమిటి ? మీరు వ్రాస్తున్నదేమిటి ? ఆంధ్రాని,మీడియాని తిట్టడానికి మీరు వ్రాస్తున్నది దిగజారుడు భాష కాదా ? మీరు వ్రాస్తే సహేతుకమని గులాబ్ గ్యాంగ్ ధ్రువీకరించారా ?
ReplyDelete*ఆంధ్ర* ఓటర్లను ప్రభావితం చేయడానికి, *ఆంధ్ర* ప్రతిపక్ష నాయకుడిని ఓడించాలని *ఆంధ్ర* పాలకపక్షం చేస్తున్న ఎత్తుగడ గురించి రాయడం టాపిక్ మార్చడమా?
Deleteనీహారిక గారూ, జై గారు చెప్పేవి కూడా ప్రస్తుతం ఓటర్లను ప్రభావితం చేస్తున్న .... ఇంకా చెప్పాలంటే సామాన్యుల మెదడులను విషపూరితం చేస్తున్న లేదా సరిగా ఆలోచించకుండా చేస్తున్న అంశాలే. ఇక గులాబీ గ్యాంగ్ అంటారా? అది పచ్చగ్యాంగ్ నుండి పక్కకు జరిగినదే. కొత్తదేమీ కాదుగా. వారు చేసేది మరీ బరితెగింపు రాజకీయం. బాబు కి భయం ఉంది కాబట్టి ఎల్లో మీడియాని సంత్రుప్తి పరచి పచ్చి అబద్దాలు ప్రచారం చేయిస్తాడు. గులాబీ గ్యాంగ్ ది ఓపెన్ దబాయింపు. బరితెగింపు రాజకీయం. ఈ రెండింటిలో బాబు ద్వారా జరిగే విషప్రచారమే ప్రజాస్వామ్యానికి ఎక్కువ ప్రమాదకరం.
Deleteకొండలరావుగారూ,
ReplyDeleteమీరు ఆంధ్రా ఓటర్లను ప్రభావితం చేసే అంశాలగురించి వ్రాయమన్నారా ?
శీర్షికలోనే "ఓటరును ప్రభావితం చేస్తున్న అంశాలేమిటి?" అని ఉంది కదండీ. మీడియా మేనేజెమెంటు అందులో భాగమే.
Deleteఆంధ్రా ఓటర్లు ఓటర్లే కదా? వారిని ప్రభావితం చేసే అంశాలు, చేస్తున్న వెధవల భాగోతం బయటపడితేనే కదా ప్రజాస్వామ్యం పురోగమించేది. సమగ్రతతో, సంయమనంతో విమర్శలను స్వీకరించండి. జై గారు గులాబీ గ్యాంగ్ ని విమర్శించకపోతే ఆ పని మీరు చేయండి. ఆయన ఎవరిని విమర్శించాలన్న స్వేచ్ఛ ఆయనకు ఉందన్నది నా అభిప్రాయం.
Delete< మీడియా మేనేజెమెంటు అందులో భాగమే. >
Deleteసోషల్ మీడియా రాకపోతే కొడుకులు ఇంకా దిగజారేవారు. సాక్షి, నమస్తే తెలంగాణ వంటివి లేకుంటే ఎల్లో మీడియా పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. సాక్షి, నమస్తే తెలంగాణలను నేనే సమర్ధించడం లేదు. మీడియాలో పోటీ లేకుంటే రామోజీ చాలా విషయాలను శాసించాలనకుంటాడు. మీడియాలో ఈ పోటీ మరింత రోతకు దిగజారి తిరిగి బాగుపడేందుకు ఉపయోగిస్తుందన్నది నా నమ్మకం. అంచనా.