(from facebook)
-----------------------------
- పల్లా కొండలరావు
*Re-published

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

janavijayam@gmail.com

Post a Comment

  1. నేను గమనించినంత వరకు కుక్క కేవలం ఆహారం కోసం దాని యజమాని కాలు దగ్గర పడి ఉంటుంది. అదేమీ అత్యంత నీతివంతమైన జంతువు కాదు.

    ReplyDelete
    Replies
    1. ఒకటి రెండు రోజుల క్రిందటనే పత్రికల్లో, పొరుగున ఉన్న ఆయనను అలర్ట్ చేసి ప్రాణాపాయ స్థితిలో ఉన్న యజమానిని రక్షించన కుక్క సంగతి వార్తగా వచ్చింది. మరొక సారి ఆలోచించండి.

      Delete
    2. దానికి బిస్కట్‌లు, కనీసం మన లెఫ్టోవర్ ఫూడ్ పెట్టకపోతే అది మన ఇంటి దగ్గర కూడా ఉండదు.

      Delete
    3. మనిషి సహజంగా మంచివాడు. కానీ మనుషులంతా మంచివారు కాదు. కుక్క సహజంగా విశ్వాసం కల జంతువు. కుక్కలన్నీ విశ్వాసమే చూపవు.

      Delete
    4. కొండలరావు గారు, అత్యంత నీతివంతుడు, అత్యంత నిజాయితీపరుడు ఎక్కడా ఉండరు. మీకు మార్క్సిజం తెలిస్తే ఈ విషయం సులభంగానే అర్థమవుతుంది. కేపిటల్ గ్రంథంలోని ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్‌చేంజ్ పాఠం చదవండి. "ఇద్దరు మనుషుల మధ్య ఉండేది వస్తు మార్పిడి సంబంధమే. కానీ వాళ్ళు ఎలా ప్రవర్తించాలంటే, ఇద్దరి పరస్పర అంగీకారం లేకుండా ఒకరి వస్తువు మీద ఇంకొకరు చెయ్యి వెయ్యకూడదు. ఇక్కడ న్యాయవ్యవస్థ ఎంత వరకు అభివృద్ధి చెందింది అనే దానితో సంబంధం లేదు".

      Delete
    5. ప్రవీణ్ గారు,

      'ఇజం’ కన్నా ‘నిజం’ ఎపుడూ గొప్పది. ఆ నిజం ఎపుడూ సాపేక్షమే. ఇది సత్యం. సత్యాన్ని కనుగొనగలమే తప్ప సృష్టించలేము.

      నాకు తెలిసిన మార్క్సిజం ప్రకారం ‘కుక్కకు విశ్వాసం ఉండదు’ అని ఎక్కడా చెప్పలేదు.

      ఇక వస్తుమార్పిడి గురించి.... మనుషులలో తల్లి బిడ్డకు పాలిస్తే.... అది ఎలా చూడాలని మార్క్సిజం చెప్పిందో.... అదే ఒక జంతువు తన పిల్లకు పాలిస్తే .... దానిని ఎలా చూడాలో... మార్క్సిజం చెప్పిందో నాకో అవగాహన ఉంది. మనుషుల మధ్య ఉండే అనుబంధాలు, మనుషులు ఏర్పరచుకునే మమతానుబంధాలు, వావి వరుసలు.... ఇదే విషయంలో జంతువులకుండే సంబంధాలు లేదా లక్షణాలు వేరుగా ఉంటాయి. ఇక్కడే మనిషికీ... జంతువుకీ బుద్ధి-జ్ఞానం కు సంబంధించిన అంశాలలో తేడాను గుర్తించాలి.

      ఒక్క కుక్కే కాదు. చాలా జంతువులు తన యజమాని లేదా ఆత్మీయులు మరణీంచినపుడు ప్రత్యేక అనుబంధాన్ని వివిధ రకాలుగా ప్రకటించడాన్ని చూస్తున్నామనేది నిజం. ఇది సత్యం. దీనికి కారణం ఏమిటనేది భవిష్యత్తులో మరిన్ని పరిశోధనల తదుపరి సరిగ్గా అంచనా వేయగలం.

      మరో విషయం మార్క్సిజాన్ని ప్రతీదానికి అన్వయించడం మంచిదే కానీ మనకు అర్ధమయిందే మార్క్సిజం అనుకోవడం మార్క్స్ ని సరిగా అర్ధం చేసుకోలేనివారు చేసే పని. అది మార్క్స్ వ్యతిరేకులలోనూ..... మేము మాత్రమే మార్క్సిష్టులమనుకునేవారిలోనూ నేను గమనించిన లోపం.

      అనేకమంది తత్వవేత్తల, విజ్ఞానుల భుజాలమీద నిలబడి ప్రపంచాన్ని చూశాను, నేను చెప్పినదానిలో మంచిని స్వీకరించండని మార్క్స్ చాలా వినయంగా ప్రకటించారు తప్ప మార్క్సిజమే పరిపూర్ణం - శాసనం అని తానుగా మార్క్స్ ఎపుడు పిడివాదం చేయలేదు.

      మనిషి లేదా జంతువు భౌతిక పరిస్తితులు, అవసరం మేరకు ప్రవర్తించేదానికీ.... సహజంగా సహజాతాలకు ఉండే తేడాను మాత్రమే ఇక్కడ తీసుకుంటే సరిపోతుంది. మార్క్సిజం తెలిసినా తెలియకున్నా పెద్ద విజ్ఞానులు కాకున్నా ఈ విషయం చాలా తేలికగానే అర్ధమయ్యే విషయం.

      బుద్ధి-జ్ఞానం కు సంబంధించి మానవ స్వభావం అనే సబ్జెక్టు లో మరిన్ని పరిశోధనలు రావాలి. వాటిని కూడా కలిపి మార్క్సిజానికి అన్వయింపజేస్తేనే మార్క్సిజం పురోగమిస్తుంది.

      నా దృష్టిలో మార్క్సిజంతో సహా ఏ ఇజమైనా పరిపూర్ణం కాదు. ప్రకృతిలో సైన్స్ ఒక భాగం తప్ప.... సైన్స్ ప్రకారం ప్రకృతి నడవదు.

      Delete
    6. ఇక్కడ న్యాయవ్యవస్థ (పోలీస్ స్టేషన్‌లు & కోర్టులు) యొక్క అభివృద్ధితో సంబంధం లేదు అని మార్క్స్ చెప్పాడంటే దాని అర్థం నీతికి సమాజమే పునాది కానీ న్యాయవ్యవస్థ లాంటి టెక్నికల్ అంశాలు పునాది కాదని మార్క్స్‌కి తెలుసనే కదా. కుక్క జీవితానికీ, మనిషి జీవితానికీ చాలా తేడా ఉంది. వజ్రాన్ని సానబెట్టడం లాంటి ఐడియాలు మనుషులకే వస్తాయి కానీ కుక్కలకి రావు కదా. కుక్క దృష్టిలో వజ్రానికీ, క్వార్జైట్ రాయికీ మధ్య చెప్పుకోదగ్గ తేడా ఉండదు. "కోరికలు ఎక్కువగా మెదడు నుంచే పుడతాయి. అవి కడుపు నుంచే పుట్టాలని రూల్ లేదు" అని మార్క్స్ అన్నది మనిషిని ఉద్దేశించే కానీ జంతువుల్ని ఉద్దేశించి కాదు.

      Delete
    7. ప్రవీణ్ గారు ఈ టపాకు సంబంధించి ఇంత కన్నా విశ్లేషణలు అవసరం లేదని భావిస్తున్నాను.

      Delete
    8. ఒకడు తన తల్లితండ్రుల్ని వృద్ధాశ్రమంలో వదిలేసాడంటే దానికి కారణం అతను చిన్నప్పుడు భరించిన హోమ్ కార్పొరల్ పనిష్మెంట్ కూడా కావచ్చు. గాడిదని ఎంత కొట్టినా అది మన బరువు మోస్తుంది, దున్నపోతుని ఎంత కొట్టినా అది దుక్కి చేస్తుంది. మీరు పాలేరుని ఈ రోజు కొడితే అతను రేపు పనికి వస్తాడో, రాడో చూడండి. పాలేరు సాధారణంగా చదువురానివాడయ్యి ఉంటాడు. అతనికి మార్క్సిజం తెలియదు. అయితే జంతువు జీవితానికీ, మనిషి జీవితానికీ తేడా ఉందని మాత్రం అతనికి తెలుస్తుంది. కుక్క, గాడిద, దున్నపోతు ఉదాహరణలు అతన్ని ఏమాత్రం ప్రభావితం చెయ్యవు.

      Delete
    9. మీరు చెప్పిన దానిలో క్రింది వాక్యం మినహా మిగతా అంశంతో ఏకీభవిస్తాను.

      < కుక్క, గాడిద, దున్నపోతు ఉదాహరణలు అతన్ని ఏమాత్రం ప్రభావితం చెయ్యవు. >

      ప్రక్రుతిలోని ప్రతి అంశమూ మనిషిని ప్రభావితం చేస్తుంది.

      Delete
    10. ఒకడు తన తల్లితండ్రుల్ని వృద్ధాశ్రమంలో వదిలేసాడంటే దానికి కారణం అతను చిన్నప్పుడు భరించిన హోమ్ కార్పొరల్ పనిష్మెంట్ కూడా కావచ్చు.

      ఖచ్చితంగా..... అంతెందుకు? వ్రుద్దాప్యంలో మంచిగా చూసే కొడుకు, కోడళ్ళను సైతం తమ శాడిజంతో ఇబ్బందులు పెట్టే తల్లిదండ్రులూ ఉంటారు. ఉన్నారు కూడా. దేనికైనా జనరలైజ్ చేసి చెపుతున్నామంటే మినహాయింపులు లేవని కాదు ప్రవీణ్ గారు.

      Delete
    11. పాము తనని పెంచినవాణ్ణి కూడా కరుస్తుంది. మరి పాముని చూసి ద్రోహిగా మారమంటారా? అందుకే జంతువుల బిహేవియర్‌ని ఉదాహరణగా తీసుకోవద్దనేది.

      Delete
    12. వాడికి సహాయం చేయడమంటే పాముకు పాలు పోసినట్టే ..... అంటారు కదా? ఒక్కో జంతువు యొక్క సహజ లక్షణాన్ని బట్టి తప్పక ఉదాహరణలు మనుషులు తీసుకున్నారు. తీసుకుంటారు. తీసుకుంటే తప్పేమీ లేదు. అదే ఉదాహరణగా తీసుకోవలనే నియమమూ ఉండదు. ప్రక్రతిలో ప్రతిదీ మనిషి ఆలోచనలపై ప్రభావం చూపుతుంది. ప్రక్రతి పరిస్థితి ఒకేలా ఉన్నా ప్రతి మనిషిపైనా ఒకే రకం ఆలోచన క్రియేట్ చేయాలని లేదు కదా?

      Delete
    13. గాడిద మోసే బరువుని చూసి బానిసత్వం నేర్చుకోమన్నా అది నేర్చుకునేవాడు ఎవడూ ఉండడు. ఏ జంతువుకి దాని ప్రత్యేక లక్షణం ఉన్నా దాని ప్రభావం మానవ జీవితంపై ఉండదు.

      Delete
    14. మానవ జీవితంపై ప్రక్రతిలో ప్రతిదీ ప్రభావం చూపుతుంది.

      Delete
    15. మనిషి జీవితంపై గంజాయి మొక్కల ప్రభావం కూడా ఉంటుంది. కాకపోతే అది విష ప్రభావం. గంజాయి విషం అని తెలియక దాని పొగ పీల్చేవాళ్ళు ఉంటారు కానీ గాడిద జీవితం చూసి దానిలాగ బరువులు మోస్తూ బతకాలని ఎవరూ అనుకోరు. అవసరమైతే ఒక గాడిదని పెంచుకుని దాని చేతే పనులు చెయ్యించుకుంటారు. ఆంధ్రాలో పోలీస్ కానిస్టేబుల్ జీతం నెలకి ఇరవై వేలు, రోజుకి సగటున తొమ్మిది గంటలు పని. గాడిద రోజుకి 12 గంటలు బరువులు మొయ్యడం ఒక పోలీస్ కానిస్టేబుల్‌కి కనిపించిందనుకుందాం. అప్పుడు అతను కూడా రోజుకి 12 గంటలు పని చెయ్యడానికి ఒప్పుకుంటాడా?

      Delete
    16. < అవసరమైతే ఒక గాడిదని పెంచుకుని దాని చేతే పనులు చెయ్యించుకుంటారు. >

      ఇదే నేను చెప్పేదానికి అర్ధం.

      Delete
    17. ఎన్ని తరాలయినా గాడిదలు బరువులు మోస్తూనే ఉంటాయి. తరాలు మారినా కొలది మనిషి ప్రక్రుతిని, ప్రక్రుతి ధర్మాలను జ్ఞానం తో ఉపయోగించుకుని కొత్తవి స్రుష్టిస్తూ తన పనికాలాన్ని తగ్గించుకుంటాడు.

      Delete
  2. తన దృష్టిలో నీచమైన మనిషిని ' కుక్కా ' అని దూషించడం కద్దు . ఎందుకని .....మరి ?

    ReplyDelete
    Replies
    1. అది మనిషిలోని అహంకారానికి చిహ్నం.....

      Delete
  3. మనిషి నీతి మానవ అనుభవాల ఆధారంగానే ఏర్పడుతుంది. కుక్క చెప్పుని కొరికినా, బిస్కట్‌ని కొరికినా దాని కోరికలు ఎక్కువగా కడుపు నుంచే పుడతాయి. మనిషికి రకరకాల కోరికలు ఉంటాయి. అవి ఎక్కువగా బయటి కారణాల వల్లే పుడతాయి తప్ప కడుపు నుంచే పుట్టాలని రూల్ లేదు.

    ReplyDelete
    Replies
    1. జంతువులకూ కోరికలు మెదడు నుండే పుడతాయి. అవి పరిమితంగా మాత్రమే.... (సహజాతంగా) ఉంటాయి. కుక్కలకు విశ్వాసం అనేది సహజ లక్షణమే.

      Delete
  4. "'ఇజం’ కన్నా ‘నిజం’ ఎపుడూ గొప్పది"

    "సత్యాన్ని కనుగొనగలమే తప్ప సృష్టించలేము"

    కొండలరావు గారూ, అక్షర లక్షలు చేసే లోతయిన వాక్యాలు రాసారు. Hatsoff for these great statements!

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top