Name: | Marxist Leninist |
E-Mail: | deleted |
Subject: | గ్లోబలైజేషన్ వల్ల ధరలు తగ్గుతాయనే వాదనని మీరు నమ్ముతారా? |
Message: | గ్లోబలైజేషన్ వల్ల కంపెనీల మధ్య పోటీ పెరిగి ధరలు తగ్గుతాయని చాలా మంది వాదిస్తున్నారు. కానీ ప్రముఖ పెట్టుబడిదారీ ఆర్థికవేత్త లయొనెల్ రాబిన్స్ వ్రాసిన scarcity definition చదివినవాళ్ళు ఎవరూ వీళ్ళ వాదన నమ్మరు. సుందరమైన సముద్ర తీరంలో ఒక ఇల్లు కొనుక్కోవాలని అందరికీ ఉంటుంది. ప్రపంచంలో ఉన్న జనాభా అంతటినీ సముద్ర తీరానికి తరలించడం సాధ్యమా, కాదా అనేది తరువాతి సంగతి. సముద్ర తీరంలో ఇళ్ళు కొనుక్కునేవాళ్ళ సంఖ్య పెరిగితే స్థిరాస్తి వ్యాపారులు ఆ ఇళ్ళ ధరలు పెంచేస్తారు. రాబిన్స్ చెప్పిన scarcity definition సరైనదేనని ఇక్కడే అనుమానం వస్తుంది. పోటీ వల్ల ధరలు తగ్గుతాయనేది కొంత వరకు నిజమే. ఊరిలో ఒకడే మాంసం వ్యాపారి ఉన్నప్పుడు అతను ఎంత ధర చెపితే జనం ఆ ధరకే మాంసం కొంటారు. కానీ నలుగురైదుగురు మాంసం వ్యాపారులు ఉన్నప్పుడు ఆ వ్యాపారులు తమ కస్టమర్లు ఎటూ పోకుండా ఉండేందుకు మాంసం ధరలు తగ్గించి అమ్ముతారు. ఈ సందర్భంలో వ్యాపారులు ధరలు తీసుకునేవాళ్ళు మాత్రమే అవుతారు కానీ ధరల నిర్ణేతలు అవ్వరు. మాంసం వ్యాపారంలో తమకి వస్తున్న ధరలు గిట్టుబాటు అవ్వకపోతే వాళ్ళు ఆ వ్యాపారం మానేసి పాల వ్యాపారమో, పెరుగు వ్యాపారమో చూసుకుంటారు. అంతే కానీ customer satisfaction పేరుతో నష్ట వ్యాపారాన్ని కొనసాగించరు. కూరగాయలూ, పాలూ లాంటి perishable goods (తొందరగా కుళ్ళిపోయే స్వభావం ఉన్నవి) తక్కువ ధరకే అమ్ముతారు. ఎందుకంటే అవి అమ్ముడు అవ్వకపోతే వాటిని పెట్టుబడిదారుడు నిలువ ఉంచుకోలేడు. అప్పుడు వాటిని పందులకి మేపుకోవాల్సి వస్తుంది. వాటిని పందులకి మేపడానికి కంటే తక్కువ ధరకి అమ్మడానికే పెట్టుబడిదారుడు మొగ్గుచూపుతాడు. కానీ ipad లాంటి వస్తువుల విషయం అలా కాదు. నువ్వు ఒక ipad చూసి, దాని ధర ఎక్కువ అని నువ్వు దాన్ని కొనకపోతే, వ్యాపారి ఆ ipadని ఇంకొకడికి అమ్ముకుంటాడు. అది అతని దగ్గర ఎక్కువ కాలం నిలువ ఉంటుంది కాబట్టి దానికి 50 వేలు ధర పెట్టినా అది ఎప్పుడో ఒకప్పుడు అమ్ముడుపోతుంది. ఈ విషయాలు ఆంధ్రా యూనివర్సిటీలోని ఎకనామిక్స్ పుస్తకాలలో వ్రాసి ఉన్నాయి. వైజాగ్ పబ్లిక్ లైబ్రరీలోని ఎకనామిక్స్ పుస్తకాలలో కూడా ఈ విషయాలు వ్రాసి ఉన్నాయి. ఇంజినీరింగ్ విద్యార్థులలో చాలా మందికి ఎకనామిక్స్ తెలియదు కనుక \"గ్లోబలైజేషన్ వల్ల ధరలు తగ్గుతాయి\" లాంటి తప్పుడు ప్రచారాలని నమ్మేస్తుంటారు. |
*Re-published
మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
janavijayam@gmail.com
ReplyDeleteప్రశ్న: గ్లోబలైజేషన్ వల్ల ధరలు తగ్గుతాయనే వాదనని మీరు నమ్ముతారా?
జవాబు: ధరలు తగ్గుతాయా లేదా అన్నది తెలీదు కాని మార్కెట్టు లో ప్రతి డానికి 'డిస్కౌంట్లు' మొదలెట్టేసే రండి ! అంటే అర్థం చేసుకోవాలె మరి !
జిలేబి
ఎవరో ఎదో రాసిన డేఫినేశన్లు నేను చదవలేదు కాని ధరలు తగ్గుతాయో లేదో అర్థం చేసుకోవటానికి ప్రస్తుత సమాజాన్ని పరిశీలిస్తే సరిపోతుంది, మీ వాదన తప్పని అర్థం అవుతుంది.
ReplyDeleteసముద్ర తీరంలో ఇల్లు అనే దానిక్ లిమిటెడ్ సప్లయ్ ఉంది, నా దగ్గర డబ్బు ఉన్నంత మాత్రాన అనంతంగా సముద్ర తీరంలో ఇల్లులను సప్లయ్ చెయ్యలేను. ఈ ఉదాహరణ తో మీరు ఆపిల్, ఆరెంజు లను పోలుస్తున్నారు. గ్లోబలైజేషన్ లో సముద్ర తీరం లో ఇల్లులను సప్లై చెయ్యటానికి అవకాశం లేదు, అవకాశం లేని దానిని గ్లోబలైజేషన్ కు ఎలా ముడిపెడతారు?
ఐపాడ్ ఎక్కువ కాలం నిలువ ఉండొచ్చు, కాని కాలంతో పాటు దాని విలువ తగ్గి అంతిమంగా వ్యాపారే నష్టపోతాడు, అందుకే కాలంతో పాటు ధర తగ్గుతుంది, ఈ రోజు 50 వేలకు ఎవరు కొనట్లేదని దాని ధర తగ్గించకపోతే, రేపు ఇంకో కొత్తది మార్కెట్లోకి వచ్చి అప్పుడు నేను ఐపాడ్ ను 20 వేలకు అమ్మినా కొనే వాడు లేక పోవచ్చు.
మాసం, కూరగాయలు, పాలు అంటూ ఏవేవో ఉదాహరణలు ఇచ్చి వాటికి సంబంధం లేని ఇంజనీరింగ్ విద్యార్థులకు ఎకనామిక్స్ తెలియదు, గ్లోబలైజేషన్ వలన ధరలు తగ్గవు అంటూ సంభందం లేకుండా మాట్లాడుతున్నారు. ఆ రెంటికి ఉన్న లింకు ఏంటో అర్థం కావటం లేదు.
వ్యాఖ్యాతలు గమనించారో లేదో. ఆయన ప్రశ్న మొదటి వ్యాఖ్యలోనే పూర్తయిపోయింది. మిగతాదంతా ప్రశ్నని సమర్ధించుకోవడం (దాన్ని సమాధానం అనుకుంటే అది మీ తప్పుకాదు). :)
ReplyDeleteఈ టపా ప్రశ్నకు వచ్చే సమాధానాలపై ప్రశ్న వేసిన వారికి(ప్రవీణ్ గారు)ఆసక్తి లేకపోతె అసలు ఆ ప్రశ్న వెయ్యటమే అనవసరం. మిగితా వారి సమయం పూర్తిగా వృదా.
ReplyDeleteసమయం తీసుకోని కామెంటులు రాసిన వారు ఆ ప్రశ్న గురించి ఏవైనా ప్రశ్నలు అడిగితె వాటికి సమాధాన చెప్పే తీరిక లేకపోతె ఎలా? ప్రశ్న వేసి నెలలు గడిచిపోతే వేరు, ఇది కొద్ది రోజుల క్రితం వేసినదే కదా?
ఈ టపా పాతదే గ్రీన్‌స్టార్ గారు. గతంలో ప్రశ్నలను అవసరమనిపించినవి రీ పబ్లిష్ చేస్తున్న వాటిలో ఇదొకటి. పాత కామెంట్లన్నీ డిలీట్ అయ్యాయి. ప్రవీణ్ గారు ఇప్పుడు పంపిన ప్రశ్నకాదిది. గమనించగలరని విజ్ఞప్తి.
Deleteఅవునా కొండల రావు గారు, అయితే ప్రవీణ్ గారిని పై నా కామెంటు పట్టించుకోవద్దని మనవి.
Deleteమీరు ఏదైనా పోస్టు మళ్ళి వేస్తుంటే 're-post' అని హెడ్డింగ్ లోనే మరక్కడో అయినా రాస్తే ఎలా ఉంటుంది అంటారు కొండల రావు గారు?
Deleteఎలా ఉంటుంది కాదండీ అలా ఉండాలి :). మీ సూచనను పాటిస్తాను.
Deletethank you.
Delete