- 500, వెయ్యి నోట్ల రద్దే శరణ్యం!
- అవినీతి నిరోధానికి అదే మార్గం: చంద్రబాబు
- 'కేబీఆర్ పార్క్ వాకర్స్' సత్కారం సందర్భంగా వ్యాఖ్య
హైదరాబాద్, మే 18 : దేశంలో అవినీతి, నల్లధనం వ్యాప్తి తగ్గాలంటే రూ. 500, రూ. వెయ్యి నోట్ల రద్దే శరణ్యమని, వీటి వల్లే నల్ల ధనం దాచేందుకు అక్రమార్కులకు సులువవుతోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. ఈ దిశగా పోరాటం చేసేందుకు ఆర్థిక రంగ నిపుణులతో మాట్లాడబోతున్నాం అని చెప్పా రు. కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ వాకర్స్ అసోసియేషన్‌కు చెందిన సీనియర్ సిటిజన్లు శనివారం ఉదయం బాబును సత్కరించారు. ఏడు నెల ల సుదీర్ఘ యాత్ర చేసినందుకు ఆయనను అభినందించారు. అనంతరం బాబు మాట్లాడారు. చాలా మంది ఆరోగ్యం బాగుపడాలని నాడుస్తారని, తాను మాత్రం రాష్ట్ర బాగుకు పాదయాత్ర చేశానని చెప్పారు. కాలి వేలి నొప్పికి తోడు కాలు మెలిక పడడంతో యాత్ర ముగించానే కానీ.. లేదంటే మరో 3వేల కిలోమీటర్లు నడిచేందుకు నిర్ణయం తీసుకున్నాననీ అన్నారు. అవినీతి తీవ్రవాదం కంటే ప్రమాదకరమైందనీ , గుర్రపు డెక్కలా అన్ని రంగాలను అల్లుకు పోతోందని, చివరికి క్రికెట్‌ను కూడా వదల్లేదని.. ఇది దేశం పరువు తీసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతి లేకుంటే అభివృద్ధిలో భారత్ చైనాను అధిగమించి ఉండేదని అన్నారు. సీనియర్ సిటిజన్లను సీపీఐ నేత బర్దన్‌ను ఆదర్శంగా తీసుకొని సమాజ హితానికి కాస్త సమయాన్నైనా వెచ్చించాలని కోరారు. 87 ఏళ్ల బర్దన్.. ఎప్పుడూ ప్రజల మధ ఉండడం వల్లే తన మనసు ప్రశాంతంగా ఉంటుందని చెబుతారని, ఆయన 1997లో ఉన్నట్టుగానే నేడు కూడా ఉత్సాహంగా ఉన్నారని చెప్పారు. సీఎంగా ఉన్నప్పటి కంటే 20 8 రోజుల ప్రజల నడుమ గడపడమే ఎక్కువ ఆనందాన్నిచ్చిందన్నారు.
చంద్రబాబు చెప్పిన ఈ సూక్తి ముక్తావలి 'శివాజీ' సినిమాలో శంకర్ కూడా చెపుతాడు. 500,1000 నోట్లు రద్దు చేస్తే అవినీతి సమస్య సమసిపోతుందా?
- పల్లా కొండల రావు.
-----------------------------
*Re-published
మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
janavijayam@gmail.com
ఖచ్చితంగా చెప్పలేము కానీ కొంత వరకూ దొంగ నోత్ల బెడద తప్పుతుంది
ReplyDeleteమూలాలు వదిలేసి ఇలాంటి పై పై కబురులు చెప్పడం జనాన్ని మభ్యపెట్టడానికే. బహుశా ఈ సలహా లోకేష్ ఇచ్చాడని చెపుతాడేమో బాబు.
Deleteకొండలరావుగారు,
ReplyDeleteపైన బాబు గారుచెప్పినదొక్కటే కారణం కాదు. దాని (500,1000 నోట్లు రద్దు చేయమని అడగటానికి) ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. అసలికి ఇది బాబు గారి నినాదం కాదు,బాబా రాందేవ్ ది, ఆయనను సమర్ధించే స్వదేశీజాగరణ్ మంచ్ వాళ్ల నినాదం. ఈ మధ్య బాబు గారు రైట్ వింగ్ పార్టిల నినాదాలు, వారి విజయాలను తన ఖాతాలో వేసుకోవటం మొదలుపెట్టారు. అందులో ఒకటి ఎన్నికల ఓటింగ్ యంత్రం (EVM లోపాల పై,అక్రమ ఓటింగ్ పైన) విషయం పైన జనతా పార్టి సుబ్రమణ్య స్వామి హోరాహోరి పోరాటం చేసి కోర్ట్ లో గెలిస్తే, బాబుగారు తాను ఏలెక్షన్ కమిషన్ కి ఎన్నికలలో జరిగే అక్రమాలపై ఇచ్చిన మేమోరాండవలన పని జరిగిపోయినట్లు మాట్లాడేసారు. తెలుగుపత్రికలలో ఆయన స్టేట్మేంట్ ప్రముఖం గా ప్రచూరించాయి. తెలుగు మీడీయా వాళ్ల విశ్వసనీయత సంగతి అందరికి తెలిసినదే కనుక ఆ వార్తలకి ప్రాముఖ్యత ఉండదు.
ఇక రాందేవ్ చదివింది 7వ తరగతి అయినా, యోగా క్లాసులలో ఎకనామిక్స్ మాట్లడానికి కారణం ఆయనకు సలహాలిచ్చే ఆర్ధిక శాస్త్ర వేత్తలు. వాళ్లు సామాన్య ప్రజలద్వారా ఈ డిమాండ్ రావాలని, అప్పుడే ప్రభుత్వం ప్రతిస్పందిస్తుందని రాందెవ్ బాబాని ఎడ్యుకేట్ చేశారు. వాళ్ల దృష్టిలో భారతదేశంలో సంగం పైన జనాభా రోజువారి జీతం వంద రుపాయలు కూడాలేదు. మన ప్రభుత్వం చేలామణి చేసే నోట్లలో 500,1000 ఎక్కువగా ఉన్నాయి. పది, వంద,యాభై రుపాయల నోట్ల సంఖ్య చాలా తక్కువగా ఉన్నాది. దీనివలన మార్కేట్ లో గ్రామీణ ప్రాంతాల కూలి వారికి, వారి పని కనుగుణంగా డబ్బులివ్వటానికి తగిన సంఖ్యలో నోట్లు లేవు. ఈసాకుతో పనిచేయించుకొన్న వారు వారికి ఏ రోజుకారోజు పనికి తగ్గ కూలి ఇవ్వకుండా ఎగవేయటం జరుగుతున్నాది. ముఖ్యంగా ఉత్తరభారతదేశంలోని వెనుకబడిన రాష్ట్రాలలో ఇటువంటివి సంఘటనలు సర్వసాధారణం.
బాబు పలుకుల వెనుక మీరు చెప్పిన కారణాలు పరిశీలించాల్సినవే.బాబు మారలేదనడానికి ఇదో ఉదాహరణగా చెప్పవచ్చు.

రద్దుచేయ్యవలసింది కరెన్సీ నోట్లని కాదు కుళ్ళు రాజకీయ వేత్తలని. నోట్లని రద్దు చేస్తే మరో మార్గంలో తమ అవినీతిని చేసుకొంటారు. మని లాండరింగ్ భూతాన్ని ఇప్పటికే చూస్తున్నాము కదా. ఇది కేవలం పై పైన పూత పూసే మందే కానీ, అసలు రోగాన్ని తొలగించేది కాదు. అసలు రోగం రాజకీయ వ్యవస్థలోనే ఉన్నది. దానిని ప్రక్షాళన చెయ్యకుండా ఎదో తెలియనట్లుగా మాట్లాడితే సమాజానికి ఉపయోగం లేకపోగా అనవసర కష్టాన్ని తెచ్చిపెట్టిన వారు అవుతారు. ఈ రోజున 500 రూపాయల నోటు జేబులో లేనివారు ఎవరైనా ఉన్నారా?? కాబట్టి మంచి క్లిష్టమైన ఎలక్షన్ రిఫార్మ్స్ చేసి, రాజకీయ ప్రక్షాళన చేస్తే 90 శాతం అవినీతిని అరికట్టవచ్చును.
ReplyDeleteవ్యవస్థలో మార్పు, అవినీతి మూలాలలో మార్పు రానంతవరకు అవినీతి సమస్య ఉంటుంది. అయితే క్రోనీ కేపిటలిజం పెరిగి ఇంత విచ్చలవిడిగా అవినీతి పెరగడానికి కారణం ముమ్మాటికీ నూతన ఆర్ధిక విధానాలే. ప్రపంచీకరణను బాబు అనుసరించినవాడే. ఆ విధానాలపట్ల సంకలెగరేసి సతికలపడ్డవాడే. వ్యవసాయం దండగ - ఏ ఇజమూ లేదిక టూరిజమే అంటూ కళ్లు నెత్తికెక్కినవాడే. ఇప్పుడేమో ఈ పనికిమాలిన సినిమా చిట్కాలు ఊదరగొడుతున్నాడు.
Delete