ప్రశ్న పంపినవారు : hari.S.babu .
Name: | hari.S.babu |
E-Mail: | DELETED |
Subject: | సాహిత్యం |
Message: |
ప్రశ్న: విశ్వనాథ సత్యనారాయణ సాహిత్యం నిజంగా ప్రగతి నిరోధకంగా చాదస్తంగా వుంటుందా?
పరిచయం:ఈ పేరు వినగానే కొందరికి మహా మంట! కమ్యునిష్తు భావజాలాన్ని ఇష్టపదే వాళ్ళంతా అభివృధ్ధి నిరోధక సాహిత్యంలో కలిపేశారు. కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే కొన్ని విశేషాలు బయట పడతాయి. ఒక నవలలో పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టదం వల్ల జరిగే అనర్ధాల గురించి వివరీస్తే అభూత కల్పనలు అన్నారు, కానీ నర్మదా ఆందోళనలో మేధా పాట్కర్ లాంటి వాళ్ళు చేసిన వాదన లన్నీ దాదాపుగా విశ్వనాధ చెప్పినట్టుగానే వుండతం ఆశ్చర్యంగా వుంటుంది.పోలవరం గురించి ఇప్పుడు అభ్యంతరాలు చెప్తున్న వాళ్ళ వాదనలు కూడా అంతే కదా! ఆయన తెలుగులో చెప్పినప్పుడు పిచ్చిమాతలు అన్నవి ఇప్పుడు ఇంజనీర్లూ పర్యావరన వేత్తలూ ఇంగ్లీషులో చెప్తే గొప్పగా అనిపిస్తున్నది.
సాహిత్య పరంగా కూడా తన కాలానికి కొత్త ప్రయోగాలు చేసారు.ముఖ్యంగా యందమూరి లాంటి వాళ్ళు పేరు తెచ్చుకున్న సీరియల్ పధ్ధతికి ఆద్యుడు ఆయనే.పాషాణ పాక ప్రభువు అనిపించుకున్న ఈయనే కిన్నెరసాని అనే గేయ కావ్యాన్ని అద్భుతంగా రచించారు.పురాణ వైర గ్రంధమాల మరొక విచిత్రమయిన ప్రయోగం!
వ్యైరేకించీనా సమర్ధించినా తెలుగు భాషకి తొలి జ్ఞాన పీఠాన్ని అదీ రామాయణ కావ్యంతో సాధించి పెట్టిన వ్యక్తి గురించి మంచి యెంతో కొంత తెలుసుకోవదం మంచిది కదా!
|
*Re-published
మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
kondalarao.palla@gmail.com
ఒక్క విషయం మనవి చేస్తాను.
ReplyDeleteఒకసారి విశ్వనాథవారికి సన్మానం జరిగింది. శాలువా కప్పారు.
కవిగారు సన్మానంలో కప్పిన శాలువాతోనే బయటకు వచ్చారు. ఈ రోజుల్లో సన్మానగ్రహీతలు తమకు కప్పిన శాలువాను వెంటనే తీసి పక్కన పెడతారు కాని అదంతగా సరైన పని కాదు. సన్నానించినవారు వెనుతిరిగీ తిరగక ముందే వారు కప్పిన శాలువా తీసిపక్కన పడెయ్యటం అ సన్మానం చేసినవారిని చిన్నబుచ్చటమే కదా!
బయట ఎండ మండిపోతోంది. విశ్వనాథవారు ఒక రిక్షాలో ఇంటికి బయలుదేరారు. మధ్యలో రిక్షావాడితో సంభాషణ. దానిగురించి నేను చదివింది ఏమిటోగుర్తులేదు.
కాని విశ్వనాథవారు రిక్షా అబ్బాయికి డబ్బులివ్వటంతో పాటు, తన శాలువానీ బహూకరించి వెళ్ళారు.
ఈ కథనం, విశ్వనాథవారి నిర్యాణం అనంతరం వచ్చిన ఏదో పత్రికలోని వ్యాసంలో చదివాను.
అయన భాషగాని శైలిగాని కొందరికి నచ్చకపోవచ్చును. ఆయన సాంస్కృతికదృక్పధం కొందరికి నచ్చకపోవచ్చును. కాని ఆయన ఒక మేరుపర్వతం.
ఈ సంఘటన చెప్పటం వెనుక నా ఉద్దేశం, విశ్వనాథవారు పాశ్చాత్యభావబానిసత్వాన్ని వ్యతిరేకించారు కాని ఆయన అది అలా చేయటం సాధికారికంగా చేసారు. ఆయన సమాజవికాసానికి వ్యతిరేకి కాదు. కాని మనం వికాసం అనుకుంటున్న దాంట్లో ఉన్న అనేక పొరపాట్లను ఎత్తిచూపారు - అది తప్పు కాదు.
విశ్వనాథ వ్రాసిన "చెలియలికట్ట"పై నేను ఇంతకు ముందు విమర్శలు వ్రాశాను. రత్నావళి, రంగడు ఆత్మహత్య చేసుకుంటున్నట్టు చూపించి, లేచిపోయినవాళ్ళందరికీ అదే శిక్ష అని సందేశం ఇవ్వడం అభివృద్ధి నిరోధకం కాదా?
ReplyDeleteఇంతకి ప్రొగ్రెసివ్ వాదులు అనుకొనే ప్రగతి అంటే ఎమిటి? దానిని అడ్డుపెట్టుకొని 100 సంవత్సరాల నుంచి హిందుల పై మాత్రమే విషం చిమ్మె వారు సమాజం లో తీసుకు వచ్చిన ప్రగతి ఎమిటో, చెప్పగలారా?
Deleteచలం గారు లేకపోతే విశ్వనాథ, అడవి బాపిరాజు, ఉన్నవ లక్ష్మీ నారాయణ లాంటి వాళ్ళ సాహిత్యాన్నే గొప్ప సాహిత్యమనుకునేవాళ్ళం. మైదానంలో రాజేశ్వరి తాను లేచిపోయి వచ్చాను అని ధైర్యంగా చెప్పుకుంటుంది. అమీర్‌తో తాను గడిపినవి గొప్ప క్షణాలు అని ఆమె అనుకుంటుంది. మరి చెలియలికట్టలో అలా కాదు. ముసలి మొగుడు రత్నావళినీ, రంగడినీ బయటకి గెంటేసిన అనతి కాలంలోనే ఆ వదినామరుదుల మధ్య గొడవలు జరుగుతాయి, ఆ కథ చివరలో వాళ్ళిద్దరూ సముద్రంలోకి దూకి ఆత్మహత్య చేసుకుంటారు. ఇక్కడ విశ్వనాథ చెప్పేది ఏమిటంటే "స్త్రీ స్వేచ్ఛ గురించి ఆలోచించడం అంటే చెలియలికట్ట (sea wall)ని దాటడం లాంటిదనీ, అలాంటివి చేసేవాళ్ళని సముద్రుడు మింగేస్తాడని". ఇలాంటి సందేశాలు ఇచ్చే కథల్ని అభివృద్ధి నిరోధక కథలనకపోతే ఏమనాలి?
DeleteThese screenshots include critiques on Cheliyalikatta and Veyipadagalu:
Deletehttps://www.dropbox.com/s/npd24ow0rs92kxx/Screenshot_2014-07-22-22-26-43.png
https://www.dropbox.com/s/56qzjn3kk70fo2a/Screenshot_2014-07-22-22-19-51.png
This comment has been removed by the author.
DeleteThis comment has been removed by the author.
Deleteచెలియలికట్టో విశ్వనాథ, రత్నావళి & రంగడు ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఎందుకు చూపించాడు? అదేమైనా గొప్ప సందేశమా?
Deleteచలం యెలా ముగించాడు.నేను పూర్తిగా చదవలేదు గాబట్టి అడుగుతున్నాను.
Deleteమీరా చెరసాలపాలైన తరువాత కూడా రాజేశ్వరి తాను చేసిన పనికి ఏమాత్రం పశ్చాతాపపడలేదు కదా!
Deleteనాక్కూడా కార్ల్ మార్క్స్ అంటే గౌరవం లేదు. *ఆయన స్త్రీల పునరుత్పత్తి సామర్ధ్యాన్ని పరిగణలోకి తీసుకోలేదు.* ఆయనే కాదు, ప్రస్తుతం మార్క్సిస్టులు కూడా ఆయన అడుగు జాడల్లోనే నడుస్తూ, పునరుత్పత్తిని ఒక విలువగల పనిగా భావించడం లేదు. మార్క్సు ఆనాడు స్త్రీలు గృహాలలో చేసే పనిని విలువ గల పనిగా భావించలేదు. తరువాత ఏంగెల్స్ ఏదో కొద్దిగా దాన్ని కవర్ చేయడానికి ప్రయత్నించాడు కానీ కుదరలేదు. నిజానికి మార్క్సు, వస్తూత్పాదన (Commodity Production) చేయగల శ్రమను తప్ప మరి దేనినీ పరిగణలోకి తీసుకోక పోవడములోనే మార్క్సిజం యొక్క డొల్ల తనం అర్థమవుతోంది.
Deleteప్రస్తుతం, ఇటువంటి తిరోగమన భావాలు గల మార్క్సిస్టు భావజాలాన్ని విశ్వసిస్తున్న వారు, విశ్వనాథ సత్యనారాయణను తప్పు పట్టడం నాకెందుకో గురివింద నీతిని గుర్తుకు తెస్తోంది. నేను మార్క్సును ఇక్కడ ఉదహరించడానికి కారణం, ఎవరూ విమర్శలకు అతీతులు కాదు అని చెప్పడానికి మాత్రమే. దాని కారణంగా ఆయా రంగాలకు వారు చేసిన సేవలు తక్కువ చేసి చూపలేం. నా ఉద్దేశ్యం ప్రకారం మార్క్సు గౌరవానికి అర్హుడైతే, విశ్వనాథ సత్యనారాయన కూడా గౌరవానికి అర్హుడే. నిజానికీ, సాహితీ రంగ పరంగా చూస్తే విశ్వనాథ సత్యనారాయనే గౌరవానికి అర్హుడు.
ప్రజలే చరిత్ర నిర్మాతలన్నాడు మార్క్స్. మీకు మార్క్స్ కంటే బ్లాగులలోని మార్క్సిష్టులమీదే కోపమెక్కువనుకుంటాను. బ్లాగులలో మార్క్సిష్టులమనుకుంటూ తమ ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యానించేదంతా మార్క్స్ చెప్పినట్లు ఎలా అవుతుంది. మీరు మార్క్స్ ని డెఫినెట్ గా విమర్శించవచ్చు. అయితే అది మార్క్స్ చెప్పిన దాని మీద కోపంతో అయితే సమాజానికి మంచిది. మార్క్సిజం తమకే తెలుసునని ఫోజు పెట్టినట్లు వ్యాఖ్యానించేవారిమీద కోపంతో అయితే దొందూ దొందుగానే చూడాల్సి వస్తుంది తప్ప ప్రయోజనమేమీ ఉండదు.
Deleteఅనుత్పాదక శ్రమ ఎలా దోపిడీ అవుతుందో మార్క్సిజంలో క్లియర్‌గానే చెప్పారు. చెప్పలేదని మీరెలా అంటున్నారు? ఒకవేళ మార్క్స్ చెప్పకపోతే తరువాత యాడ్ చేసుకోవాలి. మార్క్స్ అన్ని రకాల శ్రమల గురించి వివరంగానే వ్రాశాడు. మీరన్నట్లు కేవలం ఉత్పాదక శ్రమని గురించి మాత్రమే చెప్పలేదు. అనుత్పాదక శ్రమ అనేది ఎలా దోపిడీకి గురవుతుందో చెప్పారు. వ్యవస్థలో అనదరికీ సమానంగా పని చేసే అవకాశాలు లేనప్పుడు అనుత్పాదక శ్రమలు జీతాలు లేని శ్రమలకు విలువలేకుండా పోతున్నదని మార్క్స్ ఆవేదన వ్యక్తం చేశాడు. మీరేమో దానికి రివర్స్‌గా చెపుతున్నారు శ్రీకాంత్.
విశ్వనాధను అగౌరవపరచాల్సిన అవసరం లేదు. ఆయన అభిప్రాయాలలో అశాస్త్రీయమైనవి ఉంటే విమర్శించడం ఆయనను అవమానించినట్లెలా అవుతుంది? నాకు విశ్వనాధ గురించి గానీ, చలం గురించి గానీ పూర్తిగా తెలీదు గనుక ఎక్కువగా చర్చలలో పాల్గొనలేను.
This comment has been removed by a blog administrator.
Deleteవిశ్వనాధ సత్యనారాయణ సాహిత్యం చాదస్థమా? కాదా? అనేది చర్చించడానికీ మార్క్సిజాన్ని ఈ చర్చలోకి లాగడానికీ లింకు లేదు. విశ్వనాధనైనా మరొకరైనైనా ప్రత్యేకంగా మార్క్సిష్టులే వ్యతిరేకిస్తారు-మిగతా మార్కిష్టులౌ కానివారంతా సమర్ధిస్తారా? అభ్యుదయం కానివాటిని అభ్యుదయవాదులంతా వ్యతిరేకిస్తారు. వ్యక్తి గౌరవానికి, సాహితీ శైలికీ సాహిత్యంలోని భావాన్ని వ్యతిరేకించడానికీ తేడా ఉంటుంది. మీరన్న కామెంటూ భాషా సరిగా లేనందున కామెంటుని తొలగించాల్సి వచ్చింది ప్రవీణ్.
Delete"బోడి గుండికి మోకాలితో అనుసంధానం" అనే సామెత నేను కనిపెట్టినది కాదు కదా. "అరిటాకు - ముల్లు" లాంటి ప్రగతి నిరోధక సామెతలు వాడడానికీ, "బోడి గుండు - మోకాలు" లాంటి స్లాంగ్ వాడడానికీ మధ్య చాలా తేడా ఉంది కదా. ఆంధ్రాలో ఎక్కువ మంది నోట వినిపించే ఒక కొలోక్వీయల్ వాడినందికే మీరు అది బాగాలేదనుకున్నారు.
Deleteబోడిగుండుకీ మోకాలుకీ లింకు పెట్టినట్లు విశ్వనాధపై విమర్శలకూ మార్క్సిజానికి లింకు పెట్టకూడదనడంలో తప్పు లేదు. ఆ సామెత వాడడం తప్పనలేదు. మీ వ్యాఖ్యలో వ్యక్తిగతంగా కించపరచడం కనిపించినందున మాత్రమే డిలీట్ చేశాను ప్రవీణ్ గారు.
Deleteతిట్టుకుంటో కొట్టుకుంటో యేడ్చుకుంటో యెందుకు కాపరం చెయ్యడం అని చెప్పి లేచిపోవడాన్ని రాజేశ్వరికి పరిష్కారంగా చూపించిన చలం అక్కడా అదే తిట్టుకుంటో కొట్టుకుంటో యేడుస్తో గడిపే జీవితాన్నే చూపించాడు కదా!నేను పిలవగానే ఆడవాళ్ళంతా లేచిపోయి వస్తే బాగుంటుందనే పురుషాధిక్యతకి సంబంధించిన ఫాంటసీకే లైంగిక తిరుగుబాటు రంగు పులిమాడు చలం.వాగుల వెంటా చెట్ల వెంటా తిరుగుతో యెక్కడ బడితే అక్కడ యెదాపెడా ముద్దులు పెట్టుకుంటూ ప్రకృతి అందాల మధ్యన గోడలూ హద్దులూ లేని మిల్స్ అండ్ బూన్స్ తరహా శృంగారాన్ని చూపించి వెర్రెక్కించటమే తప్ప నైతిక విలువలూ స్రీ పురుష సమానత్వానికి స్మబంధించిన గంభీరమయిన విషయాల పట్ల అతనికి శ్రధ్ధ లేదు.
Deleteమైదానంలో మాత్రం రాజేస్వరికి యేమి గొప్ప మేలు జరిగింది,అక్కడా కష్టాలే.వొంటరిగా కొందల్లో కోనల్లో వాళ్ళు గడిపిన భాగాలు నేను చదివాను.చదవటానికి రొమాంట్క్ గా వుంది గానీ వాస్తవ జీవితంలో అలా యెవరయినా బతకగలరా?రెందూ కల్పనలే కదా?కృష్ణశాస్త్రి వూర్వసి గురించి ఒక రకంగా వూహిస్తే చలం రాజేస్వరిని మరో రకంగా వూహించాడు. రాజేస్వరి కూడా మగవాడి తోడులో పురుషాధీనంగానే బతికింది కదా?తను తిడితే చిన్నబుచ్చుకోవటం లాంటివి అక్కడా వున్నాయి కదా!
ReplyDeleteచెలియలికట్టలో ముసలి మొగుడు ఆ వదినామరుదులని బయటకి గెంటేశాడు కానీ వాళ్ళు లేచిపోలేదు. వాళ్ళిద్దరూ చేసినది తప్పు కాదు. అయినా వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నట్టు విశ్వనాథ ఎందుకు వ్రాసినట్టు?
ReplyDeleteహరిబాబు గారు తన ముందుమాటలో ప్రశ్నలో విశ్వనాధ గురించి రెండు విషయాలు చెప్పారు: ప్రయోగాలు మరియు అవార్డు ద్వారా తెలుగు సాహిత్యానికి కేంద్రస్థాయి గుర్తింపు.
ReplyDeleteఈ రెండు కూడా వారి కలం విన్యాసాలకు సంబందించినవి కానీ ఆలోచనా సరళికి కాదు. అరివీర భయంకర విప్లవవాదులు కూడా ప్రయోగాలు చేసి ఉండవచ్చు (ఉ. సాహిర్ లుధ్యాన్వీ). చాందసం ఏకోశానా లేని వారికి అవార్డులు రావొచ్చు.
ఇకపోతే ఒక కవి తన రచనలలో ప్రోత్సాహించే భావజాలం గురించి విరుద్ధభావాలు కలవారు విమర్శించడం తప్పు లేదు. కవి నమ్మిన సిద్దాంతానికి తాము వ్యతిరేకం కాబట్టి ఆయన రచనలో సాహిత్య విలువలను కించపరచడం మాత్రం సరి కాదు.
Disclosure of possible conflict of interest: విశ్వనాధ సత్యనారాయణ గారు తాతాజీ (మా తాత గారు) సహోద్యోగిగా ఉన్నారు, మంచి మిత్రులు.
స్త్రీల గురించి నీచమైన అభిప్రాయం ఉన్న కవిని మహహాకవి అనుకోవడాన్ని నేను ఏ రకంగా హర్షించలేను. ఆయన చెలియలికట్ట లాంటి కథలు వ్రాయకపోయి ఉన్నా ఆయన గురించి ఒక పాజితివ్ అభిప్రాయం నాకు ఉండేదేమో!
Deleteలేచిపోవడాన్ని రొమాంటిసైజ్ చేసిన చలం ప్రగతి శీలి అనీ లేచిపోవడాన్ని విమర్శించిన విశ్వనాధ ప్రగతి నిరోధకుడనీ సింపుల్ గా తేల్చెయ్యదం కష్టం.స్త్రీల హక్కుల కోసం పోరాడుతూ కోర్టుల చుట్టూ తిరిగే మహిళా సంఘాల్లోని కొందరు ఈ మధ్య విడాకుల్ని సరలతరం చెయ్యాలనే ప్రతిపాదన వచ్చినప్పుడు వ్యతిరేకించారు,"ఇప్పుడున్న పెళ్ళి, విడాకుల గురించిన విషయాల్లోనే గందరగోళం వుంది, తొందరపడి ఇలాంటివాట్ని కూడా చేరిస్తే ఆడవాళ్ళకే ప్రమాదం" అని.
Deleteపుస్తకాల్లో వెలిబుచ్చిన అభిప్రాయలకే నెగటివ్ అభిప్రాయం వచ్చేస్తే ఆడదాన్ని తనకన్నా తక్కువ స్థాయి లో భోగ్యవస్తువుగా పరిగణించి దబ్బిచ్చి స్త్రీ సుఖాన్ని కొనుక్కున్న శ్రీ శ్రీ గురించి యెలాంటి అభిప్రాయం యేర్పరచుకోవాలి మరి?
@jai
Deleteహరిబాబు గారు తన ముందుమాటలో ప్రశ్నలో విశ్వనాధ గురించి రెండు విషయాలు చెప్పారు: ప్రయోగాలు మరియు అవార్డు ద్వారా తెలుగు సాహిత్యానికి కేంద్రస్థాయి గుర్తింపు.
>>
నేను దాన్ని చర్చకు సంబంధించిన ప్రధాన ప్రస్తావన గా పెట్టలేదు. ఆయనకి వున్న పేరు ప్రఖ్యాతులకు సంబంధించిన వివరం, అంతే!మనం చర్చించాల్సింది రచనల లోనూ నిజ జీవితం లోనూ సమాజాన్ని ప్రభావితం చెయ్యగలిగే అంశాల్ గురించే.
లేచిపోకపోయినా భర్త గెంటెయ్యడం వల్ల మరిదితో సహజీవనం చేసిన రత్నావళి ఆత్మహత్య చేసుకుంటున్నట్టు విశ్వనాథ ఎందుకు చూపించాడు? శ్రీశ్రీ విషయానికి వస్తే, ఆయన్ని రంగనాయకమ్మ గారు తీవ్రంగా విమర్శించారు. విశ్వనాథ బహిరంగంగానే ప్రగతి నిరోధక భావాలు ప్రదర్శించాడు. అతన్ని విప్లవకారులందరూ విమర్శిస్తారు. విప్లవ కవినని చెప్పుకున్న శ్రీశ్రీలో అంతర్గతంగా ప్రగతి నిరోధక భావాలు ఉన్నా అతన్ని విమర్శించాల్సిందే.
Deleteనిజమే, వేయి పదగలు నవలలో హీరో ధర్మారావు తండ్రి వర్ణాశ్రమ ధర్మాలకి నిలువెత్తు రూపమని వర్ణించాడు, యెలాగంటే పై నాలుగు కులాల స్త్రీలనీ భార్యలుగా చేసుకుని పంచమ జాతి స్త్రీని వుంచుకున్నాడట!
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteQurduScript:
ReplyDeleteJuly 23, 2014 at 12:44 PM
బాగుంది, ఇన్నాళ్ళకి మనిద్దరికీ కత్తు కలిసింది!లబ్ద ప్రతిష్టులు యెంత గొప్పవాళ్లయినా చెత్త భావాల్ని ప్రచారం చేస్తే ఖచ్చితంగా వ్యతిరేకించాల్సిందే.అప్పుడే కొంచెం పేరు రాగానే గొప్పకి పోయి తెలిసిందీ తెలియనిదీ కలిపేసి చెత్త మాట్లాడటం తగ్గుతుంది.
కానీ లేచిపోవడం అనేదాన్ని సమర్ధించటం విమర్శించటం అనేది అభివృధ్ధికి, ప్రగతి లాంటివాటికి సంబంధించిన విషయాలు కావు కాబట్టి గట్టిగా ఆయన్ని తిరోగమన వాది అనెయ్యలేం.అసలు యేది నిక్కచ్చిగా మనల్ని ముందుకు తీసుకెళ్తుంది అనేది తెలిస్తే దాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నాడా లేదా అనేదాన్ని బట్టి నిర్ధారించటం బాగుంటుంది, యేమంటారు?.స్త్రీ స్వేచ్చ చుట్టూ కూడా చాలా అయోమయం పేరుకుని వుంది.వివాహ వ్యవస్థ యెలా వుండాలి అనేదాని చుట్టూ తిరిగే గందరగోళంలో ఒక్కొక్కరూ ఒక పక్షం అవలంబిస్తారు. వాటి గురించి సరయిన దృక్కోనాన్ని యేర్పరచుకోకపోతే ఇంకో వెయ్యేళ్ళ తర్వాత కూడా ఈ రెండు వాదాలూ ఇలాగే వుంటాయి.దానికి సంబంధించి ఒక ప్రశ్న తయారు చేస్తున్నాను, అక్కడ చర్చించుదాం,శుభం!