Post a Comment
sevidamkrdezign
218168578325095
* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
Subscribe to:
Post Comments (Atom)
అధ్యయనం
అలవాట్లు
అవినీతి
ఆధ్యాత్మికం
ఆరోగ్యం
ఆర్ధికం
ఇంగ్లీష్ నేర్చుకుందాం
ఇంటర్వ్యూలు
ఉగ్రవాదం
ఎన్నికలు
కత్తెరింపులు
కాంగ్రెస్
కార్యక్రమాలు
కుటుంబం
కులం
కృషి విద్యాలయం
కొబ్బరి నీరు
చట్టం
చరిత్ర
జనరల్ సైన్సు
జనవిజయం
జమాఖర్చుల వివరాలు
జర్నలిజం
జీనియస్
జ్ఞాపకాలు
తెలుగు-వెలుగు
నమ్మకాలు-నిజాలు
నవ్వుతూ బ్రతకాలిరా
నా బ్లాగు అనుభవాలు
నాకు నచ్చిన పాట
నిద్ర
నీతి లేనివాడు జాతికెంతో కీడు
న్యాయం
పరిపాలన
పర్యావరణం
పల్లా కొండల రావు
పల్లెప్రపంచం
పిల్లల పెంపకం
ప్రకృతి జీవన విధానం
ప్రజ
ప్రజా రవాణా
ప్రముఖులు
బయాలజీ
బ్లాగు ప్రపంచం
భారతీయం
భారతీయ సంస్కృతి
భావ ప్రకటన
భాష
మతం
మనం మారగలం
మహిళ
మానవ వనరులు
మానవ సంబంధాలు
మానవ హక్కులు
మార్కెటింగ్
మార్క్సిజం
మీడియా
మీరేమంటారు?
మెదడుకు మేత
మై వాయిస్
రాజకీయం
రాజ్యాంగం
రిజర్వేషన్లు
వస్త్రధారణ
వార్త-వ్యాఖ్య
వికాసం
విజ్ఞానం
విటమిన్ సి
విద్య
వినదగునెవ్వరుచెప్పిన
వినోదం
విప్లవం
వీడియోలు
వేదాలు
వ్యక్తిగతం
వ్యవసాయం
సమాజం
సంస్కృతి
సాంప్రదాయం
సాహిత్యం
సినిమా
ఇది అసంగతమైన ప్రశ్న.
ReplyDeleteఅసలు సైన్స్ అంటే విజ్ఞానశాస్త్రం అంటున్నాంకదా?
ఆ విజ్ఞానం దేనికి సంబంధించినదీ?
ప్రకృతికి సంబంధించినదే కదా!
అందుచేత సైన్స్ ప్రకృతిని శాసించటం అన్న ప్రశ్నే లేదు కదా.
ప్రకృతిని అర్థం చేస్తుకుందుకు మనిషి చేసే ప్రయత్నానికే మనం సైన్స్ అని పేరుపెట్టుకున్నాము.
ప్రకృతి దేనినీ శాసించదు. అన్నీ దానిలో భాగమే కాబట్టి.
అంతే.
correct. రెంటితో సంబంధం ఉన్న మనిషి ఒక దాన్లో రెండోదాన్ని అన్వయించుకొని ముందుకి పోతున్నాడు . అందరూ ఒకే అన్వయం చయ్యనపుడు ఒకటి ఇంకో దాన్ని శాసిస్తుంది అని నిరూపించడం అసాధ్యం
Deleteప్రజ గారు,
ReplyDeleteమీరు ఉంచిన శీర్షిక పేరు కొంచెం సరి చేయగలరు. మీరు ఉంచిన దానిలో రెండు వాక్యములకు ఒకటే అర్థం వస్తుంది.
-గురు
Guruprasad B గారు, తప్పును సూచించినందుకు ధన్యవాదములు. ప్రశ్నను సరిచేశాను.
Deleteయేది ప్రకృతి?యేది సైన్సు?
ReplyDeleteసైన్సు అని ఇంగ్లీషులో అంటున్న మాటకు అర్ధం జ్ఞానం! ప్రకృతిని గురించి పూర్తిగా తెలుసుకున్నాకనే గదా మనం ప్రకృతిని శాసించగలిగేది?ప్రకృతిని తెలుసుకోవడానికి పనికొచ్చే జ్ఞానం ప్రకృతిని యెలా శాసించ గలదు?ఇప్పటి వరకూ మనిషి తెలుసుకున్న భూమి పుట్టుక మొదలు అనే పాయింటు నుంచి పోలిక కోసం ఆ కాలమంతా ఒక రోజుతో పోలిస్తే మనిషి ఆఖరి గంటలోనే వచ్చాడు!ఈ కొంచెం సమయంలో మనకు తెలిసింది చాలా తక్కువ.ఈ మిడిమిడి జ్ఞానంతో మనం ప్రకృతిని శాసించడం అసాధ్యం!కాబట్టి బుధ్ధిగా మనం అర్ధం చేసుకున్నంత వరకూ యెలా బ్రతికితే ఈ ప్రకృతిలో క్షేమకరంగా వొదిగిపోగలం అనేది మాత్రం తెలుసుకుని అలా - అంటే ప్రకృతిసిధ్ధంగా బ్రతకటం వొక్కటే మనకు శ్రీరామరక్ష?!
సైన్స్ అంటే శాస్త్రనియమాలు. ప్రకృతిని శాస్త్రనియమాలు శాసిస్తున్నాయి కాబట్టే ప్రకృతి ఈ విధంగా ప్రవర్తిస్తుంది. ప్రకృతి ఈ విధంగా ప్రవర్తిస్తుంది కాబట్టే ఆ ప్రవర్తన నుండి మనిషి శాస్త్రనియమాలను కనుగొన గలుగుతున్నాడు.
ReplyDeleteఇక శాస్త్రనియమాలు అనేవి ఉంటాయి, వాటిని శాసించడం కుదరదు. కేవలం నేర్చుకోవడమే కుదురుతుంది.
ఏకం సత్ విప్రాః బహుధా వదన్తి. మీ వ్యక్తీకరణకూ తొలుత నేను ఇచ్చిన వ్యక్తీకరణ బేధం కనబడుతోంది కాబట్టి కొంచెం వివరణ ఇద్దామని వ్రాస్తున్నాను. పొరపాట్ చేస్తున్నానను కున్నా, నా అభిప్రాయాలు అశాస్త్రీయం అనుకున్నా మన్నించగలరు.
Deleteప్రకృతిని ఏ నియమాలూ శాసించటం లేదు. కాని ప్రకృతిప్రవర్తనలో మనిషి తన గమనిక మేరకు కొన్ని కొన్ని సూత్రీకరణలూ సిధ్ధాంతాలూ ఏర్పరచుకొని వాటి ఆధారంగా ప్రకృతిని గురించిన తన అవగాహనను విస్తృతం చేసుకుందుకు ప్రయత్నిస్తున్నాడు.
అశ్చర్యం ఏమీలేదు, తరచుగా మనిషి తాను ఏర్పరుచుకున్న శాస్త్రీయం అనుకున్న అవగాహనలకు సవరణలను చేసుకుంటునే ఉన్నాడు నిరంతరాయంగా. ఇంతవరకూ మనకు ప్రకృతివర్తనం పట్ల అవగాహన స్వలాపతిస్వల్పం అన్న ప్రాథమిక సత్యాన్ని ఎప్పుడో గ్రహించాడు కూడా, ప్రకృతిలో ఇది నియమం అన్నప్పుడు ప్రక్కనే మనకు తెలిసినంతవరకూ అన్న జోడింపూ తప్పకుండా ఉంటుంది. ఒక్కోసారి ప్రాథమికమైన అవగాహనలూ మారిపోతున్న సందర్భాలూ అరుదు మాత్రం కాదు.
ప్రకృతిని నియమాలు శాసిస్తున్నాయి అన్నప్పుడు ఆ నియమాలు ప్రకృతికన్న ముందునుండి ఎలా ఉంటున్నాయి అన్న ప్రశ్న వస్తుంది, అది పధ్ధతి కాదు కదా. మన అవగాహనకు తెచ్చుకునేవి ప్రకృతియొక్క ప్రకటనల్లో నియతంగా కనిపించే విషయాలు మాత్రమే. ఇంకా బాగా వ్యాఖ్యానించవచ్చును కాని ఇది చాలని అనుకుంటున్నాను. సైన్స్ అంటే నియమాలు కావు అవగాహన మాత్రమే. అందులో భాగమే నియమాలు,
>>> అశ్చర్యం ఏమీలేదు, తరచుగా మనిషి తాను ఏర్పరుచుకున్న శాస్త్రీయం అనుకున్న అవగాహనలకు సవరణలను చేసుకుంటునే ఉన్నాడు
Deleteశాస్త్రీయం అనుకున్నవన్నీ శాస్త్రీయం కావాలని లేదు. అవి మరింత అవగాహన పెంచుకోవడం వల్ల చేసుకునే సవరణలే. ముందు ఏర్పరచుకున్న అభిప్రాయాలు మారడానికి కారణం అప్పటికి ఉన్న పరిజ్ఞానం తక్కువ కావడం, సరైన ఉపకరణాలు లేక పోవడం కారణమై ఉంటాయి. అంతే కాని సదరు అభిప్రాయం అప్పటికి కరెక్టే, కాని తరువాత మారిందని కాదు. కేవలం ముందున్న తప్పుడు అభిప్రాయాన్ని మాత్రమే మార్చుకోవడం జరుగుతుంది.
>>> ఇంతవరకూ మనకు ప్రకృతివర్తనం పట్ల అవగాహన స్వలాపతిస్వల్పం అన్న ప్రాథమిక సత్యాన్ని ఎప్పుడో గ్రహించాడు కూడా.
అంటే ప్రక్రుతి గురించి అవగాహన చేసుకోవలసింది ఉందనే కదా? ఆ అవగాహన చేసుకోవలసిన జ్ఞాన భాండాగారమే సైన్సు.
>>> ప్రకృతిని నియమాలు శాసిస్తున్నాయి అన్నప్పుడు ఆ నియమాలు ప్రకృతికన్న ముందునుండి ఎలా ఉంటున్నాయి అన్న ప్రశ్న వస్తుంది
నియమాలు భౌతిక వస్తువులు కావు, ఉండడానికి. ఉదాహరణకు కారు ఇంజను తయారు చెయ్యక ముందే "ఆటో సైకిలు" అనే నియమం ఉన్నది. దాని ఆధారంగా ఇంజను తయారు చేశాం. అంతే ఇంజను తయారు చేశాం కాబట్టి "ఆటో సైకిలు" పుట్టలేదు.
>>> మన అవగాహనకు తెచ్చుకునేవి ప్రకృతియొక్క ప్రకటనల్లో నియతంగా కనిపించే విషయాలు మాత్రమే.
మొదట అన్నీ అనియతంగానే కనిపిస్తాయి. జ్ఞానం పెరుగుతున్న కొద్దీ ఒక్కొక్క విషయంలో నియతి కనిపించడం మొదలు పెడుతుంది. ఒకప్పుడు తుఫాన్ అంతే భూతమని భయపడే వారు. ఇప్పుడు ఏ నిముషంలో ఎక్కడ రాగలదో చెప్పగలుగు తున్నారు.
>>> సైన్స్ అంటే నియమాలు కావు అవగాహన మాత్రమే. అందులో భాగమే నియమాలు
Deleteసైన్స్ అంటే శాస్త్రవేత్తలు క్రోడీకరించబడిన నియమాలు, అలాగే భవిష్యత్తులో క్రోదీకరించబోయే నియమాలు కూడా. అలాగే శాస్త్రవేత్తలు క్రోడీకరించనంత మాత్రాన సదరు నియమాలు ఉండకుండా పోవు.
//సైన్స్ అంటే నియమాలు కావు అవగాహన మాత్రమే.//
ReplyDeleteఇక్కడే ప్రశ్న ఎదురయ్యేది. నియమాలు ఉన్నాయిగనక అవగాహన అవుతుందా? అవగాహన అవటం వల్ల నియమాలు ఏర్పడుతున్నాయా? ఇది ఒక తాత్వికాంశం. ఇందులో ఎవరు దేన్ని ముందుకు తెస్తారో దాన్ని బట్టే వారి తాత్వికాంశం అవుతుంది. మళ్ళీ అవగాహన ముందా? నియమాలు ముందా? అదే ఇంకోలాగా చైతన్యం ముందా? పదార్దం ముందా? పదార్ధం ఉంది గనుక చైతన్యం వస్తుందా? చైతన్యం ఉంది గనక పధార్ధం ఏర్పడుతుందా?
ప్రకృతి నియమాలను ఉల్లంఘించి ఏ శాస్త్రమూ మనలేదు. శాస్త్రీయ విజ్ఞానం వల్ల మనిషి పెంచుకున్న సాంకేతిక పరిజ్ఞానం, తద్వారా జరుగుతున్న వ్యవస్థల విచ్ఛిన్నం ఒక పరిమితి దాటితే ప్రకృతిలో సహజంగా సర్దుబాటు చర్యలు చోటు చేసుకుంటాయి. వాటిని తట్టుకునే శక్తి మనిషికి లేదు. ఉన్నట్టు కనిపించినా అది తాత్కాలికమైన భ్రమ మాత్రమే.
ReplyDeleteమీరు ఒక ట్రే లో ఒక గోళీని విసిరారు.అది ఆ ట్రే హద్దుల్లోనే కదులుతూ ఒక నిముషానికి ఆగిపోయింది.మొదటి అర నిముషం వరకూ దాని కదలికని మీరు గమనించారు.కొన్ని లెక్కలు వేసి నిముషం తర్వాత అది యెక్కడ ఆగుతుందో ఖచ్చితంగా లెక్కగట్టవచ్చు!ఇందులో మాయా మోసం గారడీ యేమీ వుండవు.కాకపోతే లెక్కగట్టటానికి యే యే అంశాలు అవసరమో మీకు తెలియాలి.లెక్కల్లో మీరు అఖండ ప్రజ్ఞావంతులై వుండాలి.దూరమూ కాలమూ వేగమూ రాపిడి వంటి వాటికి సంబంధించిన అంశాల్లో ప్రెసిషన్ వుండాలి, అంతే!
ReplyDeleteఇంకొక గోళీ వేశామనుకోండి, అప్పుడు లెక్కలోకి ఈ రెండూ ఒకదాన్ని ఒకటి గుద్దుకున్నప్పుడు వాటి వేగాల్లో వచ్చే మార్పులు కూడా చేరుతాయి.అప్పుడు కూడా ఈ రెండు గోళీలూ నిముషం తర్వాత యెక్కడ ఆగుతాయో ఖచ్చితంగానే లెక్క కట్టవచ్చు.కానీ గోళీల సంఖ్య పెరిగే కొద్దీ లెక్క సంక్లిష్ట మవుతుంది.లెక్క తప్పటం మొదలవుతుంది.మన చుట్టూ వున్న ఈ విశ్వం కూడా అలాగే వుంది.కొన్ని కోటాను కోట్ల జీవులూ నిర్జీవులూ కలిసి పోయి సృష్టించే ఒక మహామేధోజాలం ఆవరించి వున్నది మన చుట్టూ.మనం ఒక పధ్ధతిలో వున్నదాన్ని మాత్రమే అర్ధం చేసుకోగలము కాబట్టి మన చుట్టూ వున్న ప్రకృతిలో పరిశీలనలు చేసి మన వెసులుబాటు కోసం ఈ కనిపించే ప్రకృతి ఆ కొన్ని నియమాల్ని పాటిస్తున్నదని అనుకుంటున్నాం.కానీ కాలం గడిచాక కొత్త పాయింటు చేరినప్పుడల్లా పాత లెక్కలు తప్పవుతున్నాయి!
ఫ్లాబ్బినోసీ సీక్వెన్సు అనేది ఆ కనుక్కున్న మేధావి పేరుతో చలామణి అవుతున్నది.చుట్టూ చూసి పరిశీలిస్తే మొక్కలలో ఆకులూ, కొమ్మలూ,పువ్వులూ పుట్టుకు రావడంలో ఈ సీక్వెన్సు కనబడుతున్నది!ఫ్లాబ్బినోసీ ఆ నియమం కనుక్కున్నాక మొక్కలు దాన్ని ఫాలో అవుతున్నాయా?లేదే,అవి అంతకు ముందు నుంచీ తమ అంతర్గత మయిన వెసులుబాటు కోసం ఆ గణిత సూత్రాన్ని ఫాలో అవుతున్నాయి!ఫ్లాబ్బినోసీ అనే వ్యక్తి కేవలం ఆ లయని పరిశీలన ద్వారా కనుక్కున్నాడు,అంతేనా?!
చైనీయులు స్త్రీ వయస్సుకీ స్త్రీ గర్భం దాల్చిన నెలని బట్టి పుట్టబోయే బిడ్డ లింగనిర్ధారణకి సంబంధించి ఒక టేబుల్ తయారు చేశారు!అది చాలామటుకు నిజమేనని తెలుస్తున్నది.మా విషయంలో నిజమయింది.తెలిసిన వాళ్ళలో ఒక డాక్టరు గారు వాళ్ళమ్మాయి విషయంలోనూ చూశాడు,అదీ నిజమే అయింది.దీన్ని బట్టి యేమి తెలుస్తున్నది?!ప్రకృతి అనేది ఒకే కాలంలో రెగ్యులర్లీ ఇర్రెగులర్ లేదా ఇర్రెగ్యులర్లీ రెగ్యులర్ అనే విధంగా నడుస్తున్నది.మనం వేసిన లెక్క సరయిన రిజల్టు ఇస్తుందా లేదా నేది మనం గణనకి తీసుకున్న విషయాల ఖచ్చితత్వం మీద ఆధార పడి వుంటుంది.
ఇంత వరకూ దూరానికి అతి చిన్న యూనిట్ యేది అనేదాంట్లోనే ఖచ్చితత్వం కుదరడం లేదు.మిల్లీమీటరు అనేది అణువుల స్థాయికి వెళ్తే అతి పెద్ద దూరం అవుతుంది.కాలాన్ని కొలిచే యూనిట్ ఇదివరకు సెకను చాలా చిన్న యూనిట్.ఇప్పుడు నానో సెకన్లలో కొలిచినా లెక్కలు తప్పు వస్తున్నాయి?ఇంకా ప్రెసిషన్ అవసరం అనే లెక్కలు చాలా వున్నాయి.
నేను సైన్సు స్టూడెంటుని కాబట్టి ఈ శాస్త్ర విజ్ఞానంలో శాశ్వత సత్యం అంటూ యేదీ నిర్ధారణగా యే శాస్త్రవేత్తా చెప్పలేదనేది నాకు తెలుసు!ప్రతి సిధ్ధాంతానికీ ఆ సిధ్ధాంతం పనికొచ్చే సందర్భాలూ, ఆ సిధ్ధాంతం వాదకూడని సందర్భాలూ వున్నాయి, వుంటాయి? శ్యామలీయం మాస్టారు చెప్పినట్టు ప్రస్తుతానికి అని చెప్పుకోవలసిందే!
//శ్యామలీయం మాస్టారు చెప్పినట్టు ప్రస్తుతానికి అని చెప్పుకోవలసిందే!//
Deleteనేను వారు చెప్పింది తప్పు అనో లేక రైట్ అనో మార్కులు వేయ లేదు. వారికంటే నేను బాగా తెలిసిన వాడినై ఉండక పోవచ్చు కూడా. నియమాలు ఉండడం వల్ల మనం అవగాహాన చేసు కొంటున్నామా లేక మనకు అవగాహాన అవటం వల్ల నియమాలు ఏర్పడుతున్నాయా? అన్నది నాప్రశ్న. వీటిలో దేన్ని ముందుకు తెస్తామో దాన్ననుసరించి మన దృక్పదం ఉంటుందన్నది నా అభి ప్రాయం. ఇది పాండిత్యానికి సంబందించిన విషయం కాదు. తాత్వికతకు సంబదించిన విషయం, సైన్స్ కు సంబందించిన విషయం. మనకు- అంటే మానవునికి- తెలిసింది పరిమితమే అయివుండొచ్చు. అది మన అవగాహాన చేసుకొనే వేగాన్ని బట్టి కూడా ఉండవచ్చు. ప్రకృతి లేక విశ్వం కొన్ని, లేక ఎన్నో నియమాలతో నడుస్తుంది అని ఒప్పుకొంటే( అవి మనకు ఇవాల పరిమితంగానే అర్దమై ఉండ వచ్చు) భవిష్యుత్తులో మరింత స్పష్టంగా, మరింత పరి పూర్ణంగా( అవి కూడా వెంటనే జరుగుతాయి అని అర్ధం కాదు, భవిష్యుత్తు అంటే కొన్ని తరాల కైన అని అర్ధం) నృచుకో గలం, అవగాహాన చేసుకో గలం అన్నదే నా అభి ప్రాయం. మనం అవగాహాన వల్లే నియమాలు ఏర్పడుతున్నాయి అంటే అది ఎప్పుడు జరగని పని అన్నదే నా అవగాహాన.
This comment has been removed by the author.
DeleteHari Babu Suraneni గారు : సిగరెట్ తాగితే లంగ్ క్యాన్సర్ రాదనడానికీ, రోజుకో full bottle తాగడంవల్ల సిర్రోసిస్ రాదనడానికీ నేను నా బంధువులవే ఇద్దరిని ఉదాహరణగా చూపించగలను. మీరు చెబుతున్న చైనీస్ క్యాలెండర్ ఉదాహరణా (మరియూ నేనూ చెబుతున్న ఉదాహరణలను) anecdotal evidences అంటారు. మీరిచ్చినది statistical evidence అనుకున్నా, మీ sample size ఎంతో తెలిసాకనే ఏమైనా మనం మాట్లాడుకోగలం. నేను ఒకానొకరోజున పదిసార్లు ఒక నాణేన్ని ఎగరేస్తే, పదిసార్లూ బొమ్మ పడింది. ఇప్పుడు నేను ఈ విషయంలో సూత్రీకరణ ఒక చెయ్యవచ్చా?
Deleteసైన్సెస్‌లో absolute truth లేదన్న ఒక అభిప్రాయానికి ఎలా రాగలిగారో తెలుసుకోవాలని నాకు చాలా ఆసక్తిగా ఉంది. ముఖ్యంగా hard sciences విషయంలో. ఒక quantum theoryనిగానీ, theory of relativityనిగానీ మీరు ఏవిధంగా సత్యదూరమని అనగలిగారో నాకు తెలుసుకోవాలని ఉంది. దయచేసి తెలియజేయగలరు. (సైకాలజీ, ఎకానమిక్సూ, మార్క్సిజమూ, crap like religious science లాంటి గురించికాదు నేను మాట్లాడుతున్నది).
శ్రీనాథ్‍గారు మంచి విషయం ప్రస్తావించారు.
Deleteఅంతదాకా ఎందుకండీ, ధోనీ టాస్ ఓడిపోవటమే ఎక్కువసార్లు, టాస్ గెలవటం తక్కువసార్లు అంటారు.
ఒక కెప్టెన్ తన కెరీర్ మొత్తంలో అతిహెచ్చుశాతం టాస్‍లు ఓడినా అందులో విశేషం ఏమీ లేదు. ఎందుకంటే ఓ మూడువందల మాఛ్‍లకు గాను అతడు టాస్‍లో ఎంతశాతం గెలిచినా ఓడినా అది చిన్న శాంపిల్ మాత్రమే అవుతుంది. మరీ పెద్ద శాంపిల్ తీసుకున్నప్పుడు సగటు 50% దగ్గరకు వస్తుంది. అనేక వేల సార్లు టాస్ వేస్తే అటూ-ఇటూ సంభావ్యత సమానమే అవుతుంది.
అందుకే ప్రయోగాలతో సూత్రీకరణలు చేసే వారు చిన్న చిన్న శాంపిల్స్ ఆధారంతో తొందరపడి ఏ నిర్ణయాలనూ చేయరు.
ఇక్కడ చాలామంది ప్రకృతి గురించి మాట్లాడేవాళ్ళల్లో ప్రకృతిని ప్రకృతిగా మాత్రమే చూసేవాళ్ళేంతమంది? ప్రకృతి లో రకరకాల దేవుళ్ళని చూసేవాళ్ళే సైన్స్ కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. దీనికి ముఖ్య కారణం, సైన్స్ జనాల మూర్ఖత్వాన్ని పోగొడుతుంది. దురద్రుష్తవశాత్తూ ఇది సమాజంలో కొన్ని కులాల వారికి నచ్చదు. ముఖ్యంగా మతగురువుల స్థానంలో ఉండేవారికి(అది ఏ మతమైనా కావచ్చు). సైన్స్ రాకెట్ తయారు చెయ్యడం చాలామంది ఇంటువంటి వాల్లు వ్యతిరేకించారు. ఎందుకంటే రాకెట్తో చందమామమీదకి వెల్తే, చంద్రుడు దేవుడు కాదు అని ప్రూవ్ అవుతుంది. సూర్యుడు రధాలమీదెక్కి తిరగడని తెలిసిపోతుంది. హరిబాబు లాంటి కుహానా మేధావులు మా వేదాలో అవి గోలాలే అని ముందే చెప్పార అని గోల చెయ్యవచ్చుగాక. మరి సామాన్యుడు ఎందుకు వాళ్ళని దేవుల్లని పూజిస్తున్నారు, కొన్ని కులాల వాళ్ళు వాళ్ళతో ఎందుకలా పూజ చేపిస్తున్నారు, అంటే జనాల్ని అబద్దాలతో మోసం చేసి వాళ్ళ కళ్ళు ఎందుకు కప్పుతునారు.. అన్న ప్రశ్నలు ఒస్తాయి. ఇప్పుడు మీరంతా ప్రకృతిని గొప్పగా చూస్తున్నారో, దాన్లో దేవత్లనిగొప్పగా చూస్తున్నారో తెలుసుకోని చర్చించండి
ReplyDelete>>ఇప్పుడు మీరంతా ప్రకృతిని గొప్పగా చూస్తున్నారో, దాన్లో దేవత్లనిగొప్పగా చూస్తున్నారో తెలుసుకోని చర్చించండి
DeleteGood question
సైన్స్ పుట్టింది ప్రకృతిని అర్థం చేసుకోవడానికి. అందుకే సైన్స్ ప్రకృతిని శాసించటం అనే ప్రశ్న యే లేదు.
ReplyDeletes
Delete