----------------------------------------------
అంశం : దేవుడు
ప్రశ్నిస్తున్నవారు : పల్లా కొండల రావు.
-----------------------------------------------
ఈ విశ్వాన్ని నడిపించే శక్తి పై మనిషి ఏర్పరచుకున్న నమ్మకం దైవం. దేవుడున్నాడని కొందరు, లేడని కొందరు భావిస్తారు. అంతవరకూ ఎవరిష్టం వారిది. కానీ దేవుడి పేరుతో వాదనలు జరుపుతుంటారు. దేవుడి గురించి మైకుల హోరుతో ప్రచారాలు చేస్తుంటారు. అన్ని మతాల దేవుళ్లకూ ఇది వర్తిస్తుంది. దేవుడిని నమ్మొద్దని దేవుడు లేడని ప్రచారం చేసేవారూ ఉన్నారు. 

దేవుడి గురించి వాదోపవాదాలు అవసరమా? 
ఈ వాదనల వలన ఎవరికి ఏమిటి ప్రయోజనం? 
మీరేమంటారు?

*Re-published

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

janavijayam@gmail.com

Post a Comment

  1. ఇతరులకు ఇబ్బంది లేకుండా తమ నమ్మకాల ప్రకారం నడుచుకుంటే ఎలాంటి సమస్యా వుండదు. కాని దేవుడు ఉన్నాడంటూ పబ్లిగ్గా ప్రచారాలు చేసే వారు మాత్రం ఆ విషయం నిరూపించ వలసిన అవసరం వుంది. అటువంటి నిరూపణ ఏదీ లేకుండా ఉన్నాడన్న విషయం తమకు తెలుసన్నట్టుగా ప్రచారం చేయడం సరికాదు.

    నాకు తెలిసి దేవుడు లేడన్న ప్రచారం జరగడం లేదు. దేవుడు ఉన్నట్టుగా చేసే ప్రచారాలు నిరూపణ లేకుండా నమ్మొద్దు అని మాత్రమే వారు ప్రజలకు చెపుతారు.

    ReplyDelete
    Replies
    1. ఖమ్మంలో చాలా కాలం క్రితం హేతువాదులు కొందరు నిప్పులపై నడుస్తూ దేవుడూ లేడూ అంటూ ఊగిపోతూ ప్రచారం చేయడం చూశాను శ్రీకాంత్ చారి గారు.

      Delete
    2. దేవుడు లేడని చెప్పడానికి నిప్పులమీద నడిచే అవసరం ఏముంది? బహుశా నిప్పుల మీద నడుస్తూ అది దేవుని మహిమ అని చెప్తూ ప్రచారం చేసే వారి వాదన నమ్మొద్దని చెప్పడం అయ్యుంటుంది.

      Delete
    3. నిప్పులమీద నడవడానికి ఏ మహిమా అవసరం లేదని చెప్పడం తప్పు కాదు. అవసరం కూడా. దానికి దేవుడూ లేడూ అంటూ ఊగిపోతూ చెప్పడమే బాగోలేదని నా అభిప్రాయం. అందుకే అలా చెప్పాను. హేతువాదులంతా అలాగే ఉంటారని కూడా నా ఉద్దేశం కాదు. నేను చెప్పినది నేను చూసినది మాత్రమేనండీ.

      Delete
    4. అక్కడక్కడా జరిగే చిన్న చిన్న సంఘటనలు పట్టించుకోనక్కరలేదనుకుంటాను. ప్రతీరోజూ, TVలలో, పేపర్లలో, బహిరంగ సభలు పెట్టీ, వాహనాలపై లౌడ్ స్పీకర్లు పెట్టీ మత ప్రచారకులు చేస్తున్న ప్రచారాలతో పోల్చే విధంగా హేతువాదుల ప్రచారం ఉండదని మీరు ఒప్పుకుంటారనుకుంటాను.

      Delete
    5. మీ అభిప్రాయం కరెక్టేనని 100% ఒప్పుకుంటానండీ.

      Delete
  2. దేవుడున్నాడా లేడా అనే చర్చ చాలాక్లిష్టమయినది. కానీ మనం ఊకదంపుడుగా వింటున్న దేవుడు లేనేలేడు సరిగదా --- అసలైన దైవ భావనకు దూరం చేసేవిగా ఉం టాయి. దీనుల్ని, శ్రమజీవుల్ని దోచుకోడానికి అనుకూలించే పాలక పక్షమయిన ప్రస్తుత మతాల్ని, దేవుళ్ళ గురించి చర్చ జరగాలి. వాటి నుండి బయటపడాలి. జిడ్డు కృష్ణమూర్తి పుస్తకాలు అందరికీ దొరుకుతాయి. తప్పక చదవాలి. అలాగే భగత్ సింగ్ వ్రాసుకున్న 'Am I an atheist' చదివితీరాలి. తెలుగు అనువాదం నాదగ్గర ఉంది. త్వరలో నా బ్లాగులో పెడతాను.
    gksraja.blogspot.in

    ReplyDelete
  3. బైబిల్ పాత నిబంధనలలోని కొన్ని కథల ప్రకారం దేవుడు నిరాకారి, కొన్ని కథల ప్రకారం దేవుడు మనిషి రూపంలో ఉంటాడు. మనుషులే లేని రోజుల్లో మనిషి రూపంలో దేవుడు ఎలా ఉండేవాడు? అందుకే మతవాదులు డార్విన్ సృష్టివాదాన్ని అంగీకరించరు.

    ReplyDelete
    Replies
    1. It is difficult to edit comments on mobile.

      బైబిల్ పాత నిబంధనలలోని కొన్ని కథల ప్రకారం దేవుడు నిరాకారి, కొన్ని కథల ప్రకారం దేవుడు మనిషి రూపంలో ఉంటాడు. మనుషులే లేని రోజుల్లో మనిషి రూపంలో దేవుడు ఎలా ఉండేవాడు? అందుకే మతవాదులు "డార్విన్ పరిణామవాదాన్ని" అంగీకరించరు.

      Delete
    2. డార్విన్ ‘మానవ పరిణామ క్రమ సిద్ధాంతాన్ని’ అంగీకరించనివారిలో మతప్రమేయం లేనివారూ ఉన్నారు.

      Delete
    3. ఒక సందేహం మాత్రం చాలా ఉచితమైనదే. మనుషులే లేని రోజుల్లో మనిషి రూపంలో దేవుడు ఎలా ఉండేవాడు?

      Delete
    4. 1870లో ఇండియా జన సంఖ్య కేవలం 20 కోట్లు ఉండిందంటే దాని అర్థం మనుషులే లేని కాలం కూడా ఒకప్పుడు ఉండిందనే కదా.

      Delete
    5. నా అభిప్రాయం అయితే దేవుడు/దేవత లకు రూపం కల్పించింది మనిషే. అది మనుషులు లేదా జంతువులు లేదా సగం మనుషులు-సగం జంతువులు లేదా మరే భౌతిక రూపమైనా సరే మనిషి తనకు తెలిసిన పదార్ధాలుతో మాత్రమే దేవునికి రూపం అంటగట్టాడు. దీనికి దైవత్వభావనకు పోల్చడం సరైనది కాదు. ఆధ్యాత్మికత అనేది మతంతో సంబంధం లేకుండా లేదా మతప్రమేయం లేకుండా కూడా ఉంటుంది. మళ్ళీ ఇందులో ఆస్థిక-నాస్థిక వాదాలు రెండు ఉన్నాయి. ప్రక్రుతిని దైవంగా భావించడం లేదా ఏదో విశ్వశక్తి క్రమపద్ధతిలో ప్రక్రుతిని నడిపిస్తుందని నమ్మకాలు ..... ఇలా అనేక రకాలుగా మనుషుల తాత్విక ధోరణి కొనసాగుతోంది.

      Delete
  4. < 1870లో ఇండియా జన సంఖ్య కేవలం 20 కోట్లు ఉండిందంటే దాని అర్థం మనుషులే లేని కాలం కూడా ఒకప్పుడు ఉండిందనే కదా. >
    నాకు స్పష్టంగా తెలియదు. మొదటి మనుషులు ఎక్కడి వారు? ఇప్పటి మనిషి మరెలాంటి రూపాంతరం చెందుతాడు? ఇవన్నీ ఊహాజనితంగా చెప్పడం మంచిది కాదని నా అభిప్రాయం. ఈ విషయాలలో నాకు చాలా పరిమితి కలిగిన నాలెజ్ మాత్రమే ఉంది.

    ReplyDelete
    Replies
    1. ప్రకృతిలో పదార్థం-పదార్థం కలిస్తేనే పరిణామం ఏర్పడుతుంది. అంతే తప్ప ప్రకృతిని ఏదో శక్తి నడిపించడం జరగదు. చిన్నప్పుడు నేను ఆత్మల్ని కూడా నమ్మేవాణ్ణి. ఆత్మలు నిజంగా ఉంటే కసాయివాణ్ణి ఎన్ని మేకలు, పొట్టేళ్ళ ఆత్మలు పగబట్టాలి అనే సందేహం చిన్నప్పుడు నాకు రాలేదు. పిల్లలకి ఇలాంటి సందేహాలు వస్తాయి కానీ "అలాంటి ప్రశ్నలు అడిగితే నువ్వు బాగుపడవు" అని తల్లితండ్రులు వాళ్ళని తిడతారు. మనిషికి సంశయం కలగడం తప్పు కాదనే నేను అంటాను. జనాభా పెరిగితే ఆత్మలు కూడా పెరుగుతాయా లేదా గతంలో చనిపోయినవాళ్ళ ఆత్మలే కడుపుల్లోని కొత్త పిండాల్లో చేరుతాయా అనే సందేహం కూడా నాకు పెద్దైన తరువాతే వచ్చింది.

      Delete
    2. < మనిషికి సంశయం కలగడం తప్పు కాదనే నేను అంటాను. > 100% కరెక్టు. వీటికి సమాధానం తెలిస్తే చెప్పాలి. లేదంటే తెలియదు, తెలుసుకోవాల్సి ఉందనే అర్ధం వచ్చేలా జవాబు చెప్పాలి. కానీ, పిల్లలు అలాంటి ప్రశ్నలు వేసినపుడు మభ్యపెట్టడం వల్ల, లేదా తప్పుదోవ పట్టించడం వల్ల భావజాలం ఏర్పడడంలోనూ, మనిషి చైతన్యం పొందడంలోనూ విపరీత ప్రభావం చూపుతుంది.

      పదార్ధ ధర్మాలే ప్రక్రుతి ధర్మాలు అనడం సరైనదనే నేను సమర్ధిస్తాను. అయితే ఆ పదార్ధాలకు క్రమబద్ధమైన ధర్మాలు ఏర్పడడం, ప్రతిదీ పరస్పర ఆధారితంగా ఉండడం అనే అద్భుత ప్రక్రియ వెనుక ఉన్న ధర్మాలను అవగాహన చేసుకోవడంలో వివిధ ధోరణులు ఉండడం సహజం. ఈ ధోరణులకు శాస్త్రీయ ఆలోచనా ధోరణి మాత్రమే క్రమానుగతంగా అనుభవాలు, సాక్ష్యాలు ఆధారంగా సరైన మార్గాన్ని చూపగలదు. ఊహలు అబద్ధం కావడానికి లేదా నిజం కావడానికి చాయిస్ అది నిర్ధారించేవరకూ ఉంటూనే ఉంటుంది.

      Delete
  5. మత గ్రంథాలు వ్రాసినవాళ్ళెవరికీ భూమి గుండ్రంగా ఉంటుందని తెలియదు. బైబిల్‌లోని ఒక కథలో సాతాను ఏసు ప్రభువుని ఒక ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళి అతనికి ప్రపంచమంతా చూపిస్తాడు. తనకి లొంగిపోతే ఈ ప్రపంచమంతా నీకే ఇచ్చేస్తానని సాతాను ఏసు ప్రభువుకి ఆశ చూపిస్తాడు. భూమి గుండ్రంగా ఉన్నప్పుడు ఇజ్రాయెల్‌లో ఎంత ఎత్తు నుంచి చూసినా అమెరికా కనిపించదు కదా. భూమి గుండ్రంగా ఉందని బైబిల్ రచయితలకి తెలియదని ఇక్కడే అర్థమైపోతుంది. హిందు పురాణాల్లో అయితే ఒక రాక్షసుడు భూమిని చాపలాగ చుట్టిన కథ కూడా ఉంది. అజ్ఞానం ప్రబలంగా ఉన్న రోజుల్లో పుట్టిన దేవుడు అనే కాన్సెప్ట్‌ని ఇప్పుడు కూడా నమ్మడం అవసరమా?

    ReplyDelete
    Replies
    1. మతగ్రంధాలన్నీ మనుషులు వ్రాసినవే. అందులో మంచి-చెడూ రెండూ ఉంటాయి. చెడుని వదిలేసి మంచిని తీసుకోవాలి. మతానికి అతీతంగా ఆలోచించే దైవత్వం గురించి అదే మరోరకంగా చెప్పాలంటే మానవత్వం గురించి ఆలోచించాల్సిందే. మనిషి స్వభావంలో మంచి-చెడు అనేవి ఏర్పడడానికి కారణాలు ఏమిటనేది సంపూర్ణంగా అన్వేషించాల్సిందే. ఒకే పరిస్థితులలో ఉన్న మనుషులందరికీ ఒకే రకం ఆలోచనలు రావు కదా? బుద్ధి-జ్ఞానం వేరు వేరు. బుద్ధి ఎలా ఏర్పడుతుందనేది కీలకమైన అంశం.

      Delete
    2. కట్టు కథలతో మంచిని పెంచగలమనుకుంటే యండమూరి స్టైల్‌లో కాష్మోరా కథలు వ్రాసి కూడా ఆ పని చెయ్యొచ్చు.

      Delete
    3. కాష్మోరా కట్టుకథలు వీరేంధ్రనాధ్ వ్రాయడం మానాడు. కట్టుకథలకీ, తెలియనిదానిపై నమ్మకాలు, ఊహలు ఏర్పరచుకోవడానకీ చాలా తేడా ఉంది.

      Delete
    4. దెయ్యాల మీద నమ్మకం కూడా దేవుడిలాగే ఊహ నుంచి వచ్చిందే. కొన్ని దేశాల్లోని గుహల్లో రాళ్ళపై చెక్కిన దెయ్యాల బొమ్మలు కూడా ఉన్నాయి. దేవుణ్ణి నమ్ముతూ దెయ్యాలని నమ్మొద్దని చెపితే మూఢనమ్మకాలు పోవు.

      Delete
    5. దేవుడిని మనిషి స్రుష్టించాడు. మానవస్వభావంలో దైవత్వం, రాక్షసత్వం గురించి తెలుసుకోవడం వాటిని ఎలా ఉపయోగించాలి? అనేది తెలుసుకోవడం నాకు కావలసిన అంశం ప్రవీణ్ గారు. దానికి సంబంధించిన లేదా ఉపయోగపడే అంశాలేమన్నా ఉంటే తెలియజేయండి. మిగతా ఉదాహరణలు ఎవరైనా, ఎన్నైనా చెప్పవచ్చు. ఎవరి వాదనలు వారు చేయవచ్చు. చేస్తుంటారు కూడా.....

      Delete
    6. హిందువుల్లో 99% మంది ఏకాదశి నాడు చనిపోతే స్వర్గానికి వెళ్తామని నమ్ముతారు. ఎవడైనా స్వర్గానికి వెళ్ళడానికి ఏకాదశి నాడు తిరుమల కొండ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటే అతను మూఢ నమ్మకాల వల్ల చనిపోయాడంటారు. ఇక్కడ స్వర్గం అనేది మూఢ నమ్మకం కాదంటారు కానీ స్వర్గానికి వెళ్ళడానికి ఆత్మహత్య చేసుకోవాలనే యోచనని మాత్రం మూఢ నమ్మకం అని ఎలా అనేస్తారు?

      Delete
    7. దేవుడు అనేది ఒక నమ్మకం. నమ్మకం లేకపోతే దేవుడు లేడు. స్వర్గం అనేది కూడా నమ్మకమే. ఒక విషయాన్ని పాజిటివ్ గా నమ్మితే శుభఫలితాలు ఇస్తుంది. నెగటివ్ గా నమ్మితే అశుభ ఫలితాలు ఇస్తుంది. స్వర్గం ఉందని నమ్మడం వేరు. స్వర్గం కోసం ఆశపడడం వేరు. ఆశ మూఢ నమ్మకం.

      Delete
  6. < హిందువుల్లో 99% మంది ఏకాదశి నాడు చనిపోతే స్వర్గానికి వెళ్తామని నమ్ముతారు. > హిందువులలో నాస్తికులు కూడా ఉన్నారు. విగ్రహారాధనను వ్యతిరేకించేవారూ ఉన్నారు. హిందూమతం కాదు, ధర్మం అనేవారూ ఉన్నారు. అలాంటపుడు 99% మందిని ఎలా ఒకే గాటన కడతారు? హిందువులకు ఫలానా మతగ్రంధం, ఫలానా మతపరమైన సిద్ధాంతం, మత ప్రవక్త అంటూ లేరనుకుంటున్నాను.

    ReplyDelete
  7. దేవుడూ లేదు గాడిద గుడ్డూ లేదు. కొందరు సోమరిపోతు నాయాళ్ళు (priest class) జనాల్ని తమచెప్పు చేతల్లో ఉంచుకోడానికి చేసిన వెధవపనిది.


    "హిందువులకు ఫలానా మతగ్రంధం, ఫలానా మతపరమైన సిద్ధాంతం, మత ప్రవక్త అంటూ లేరనుకుంటున్నాను."

    ఇదిమాత్రం నిజం హిందూమతమంత గందరగోళమ్మతం మరొకటిలేదు. దాంతరువాతే మిగతావన్నీ!

    ReplyDelete
  8. హిందు మత గ్రంథాలు వేర్వేరు వ్యక్తులువ్రాసినవి. మహా భారతంలోనే ఒకదానికొకటి విరుద్ధమైన కథలు ఉన్నాయి. మాద్రి భర్త చనిపోయిన తరువాత సతీ సహగమనం చేస్తుంది, ఉలూపి భర్త చనిపోయిన తరువాత అర్జునుడితో సంభోగించి బిడ్డని కటుంది. నిజ జీవితంలో సతీ సహగమనాన్ని సమర్థించేవాళ్ళు తమ కుటుంబానికి చెందిన స్త్రీ భర్త చనిపోయిన తరువాత వేరే మగాడితో కడుపు తెచ్చుకుంటే ఆమెని చంపేస్తారు. బైబిల్ కూడా హిందు పురాణాల్లాగే వేర్వేరు వ్యక్తులు వ్రాసినది. బైబిల్ నుంచి తొలిగించబడిన బర్నబాస్ సువార్తలో ఏసు ప్రభువు దేవుడు కాదు, అతను ఒక ప్రవక్త మాత్రమే అని వ్రాసి ఉంది. కురాన్‌లో కూడా ఏసు ప్రభువు ఒక ప్రవక్త మాత్రమే అని వ్రాసి ఉంది కనుక కొంత మంది ముస్లింలు బర్నబాస్ సువార్తకి పబ్లిసిటీ ఇస్తున్నారు.

    ReplyDelete
    Replies
    1. గుడ్ కామెంట్ ప్రవీణ్ గారు. మతాన్ని సమర్ధించాలనుకునేవారు లేదా జీవనవిధానంగా చూసేవారు (దాదాపుగా సామాన్యులు) అందులోని మంచిని పాటించడానికి ప్రయత్నిస్తారు. అదే బ్రతుకుదెరువుగా లేదా మతాన్ని విమర్శించడాన్ని తట్టుకోలేని పుణ్యాత్ములు (వారికి వారు అనుకుంటారు) మాత్రం దానిని కాపాడడానికి విశ్వప్రయత్నం చేస్తారు, కుదరకపోతే వాదనలనుండి పారిపోవడం లేదా అలిగిపోవడం లేదా ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేయడానికి ప్రయత్నిస్తారు.మరీ ముదిరితే ఉన్మాదులుగా మారతారు.మతంలో మంచిని, చెడుని విచక్షణతో చూసే వారు తప్పులను సంస్కరించడానికి క్రుషి చేసి సంస్కర్తలుగా మిగులుతారు. మతవిద్వషం, మత సామరస్యం లకు కూడా ఇవే కారణాలుగా ఉంటాయనుకుంటున్నాను. ఇక ప్రత్యామ్నయం చూసేవారిలో అన్యమతం వెతకడమో, కొత్త మతం స్రుష్టించడమో చేయడానికి ప్రయత్నిస్తారు. మీరన్నట్లు హిందూ మతంలో ధర్మాలుగా లేదా నీతులుగా చెప్పబడేవి వివిధ వ్యక్తులు వ్రాసినవే. అందులో కాలానుగుణంగా మార్పులు జరిగి తీరతాయి. యథాతథంగా అమలు జరపాలనుకునే మూర్ఖులుతో వచ్చే ఇబ్బంది మతాన్ని జీవనవిధానంలో నిచ్చెనగా వాడుకునే సామాన్యులతో ఉండదు. ఆచరణలో మంచి ప్రత్యామ్నయం చూపగలిగినపుడు సంస్క్రతిలో లేదా జీవనవిధానంలో తప్పక మార్పు ఉంటుంది. అయితే ఇది అనేక సంఘర్షణలతో మిళితమై పురోగతి సాధిస్తుంది. అంత వరకు ఏ మతంలోనైన మంచి చెడులను ఎంచి చూసుకుంటూ వాటిని నమ్మే, నమ్మని మనుషులందరితో అనుకూల అంశాలలో కలసి పనిచేయడమే చేయగలం.

      Delete
    2. Biblical apocrypha పురాతన చర్చ్‌లలో నేల కింద, గుహల్లోనూ దొరికిన తోలు ముక్కల మీద వ్రాతల ఆధారంగా కనుగొనబడినది. అలాంటిది హిందు మతంలో కూడా ఉండొచ్చు.

      Delete
  9. # ప్రవీణ్ గారు

    // " ఉలూపి భర్త చనిపోయిన తరువాత అర్జునుడితో సంభోగించి బిడ్డను కంటుంది " // అన్నారు పైన మీరు. ఈ వివరం మహాభారతంలో ఎక్కడుందో రిఫరెన్స్ ఇవ్వగలరా? ఉలూపి (ఉలూచి) - అర్జునుల కలయిక ఉదంతం ఆదిపర్వంలో వస్తుంది. దాంట్లో ఉలూపి అర్జునుడిని కలవడానికి ముందే ఆమెకు భర్త ఉన్నట్లు గాని, సదరు భర్త చనిపోయినట్లు గాని ఎక్కడా ప్రస్తావించలేదే కవిత్రయం.

    ReplyDelete
  10. Ulupi was a widow before she contacted Arjuna. Read English translations.

    ReplyDelete
    Replies
    1. ప్రవీణ్ గారు విన్నకోట నరసింహా రావు గారికి సరైన ఆధారం చూపించాల్సిన బాధ్యత మీదే. లేదా మీ వ్యాఖ్య తప్పైనా అయి ఉండాలి.

      Delete
  11. # ప్రవీణ్ గారు
    తన పోస్టుకి సంబంధంలేని కామెంట్లు అనుకుని కొండలరావు గారు విసుక్కోవచ్చు. అయినప్పటికీ మీరు లేవదీసిన అంశం సంగతి పూర్తిగా తెలుసుకోవాలి కదా.
    ——————————
    తెలుగు వారికి మహాభారతం అంటే కవిత్రయ గ్రంథం ప్రామాణికం. నేను దాన్ని గురించి చెబితే అది వదిలేసి ఆంగ్లానువాదాలు చదవమంటున్నారా?

    సరే, మీరన్నారు కదా యని ఆంగ్లానువాదం కోసం వెతికితే ఈ క్రింది సమాచారం దొరికింది. వ్యాసమహాభారతానికి 19వ శతాబ్దంలోనే చేసిన తొలి ఆంగ్లానువాదంట. దీంట్లో ఉలూపి అర్జునుడితో అన్న మాటలు ఈ క్రింది పేరాలో ఉన్నాయి. “I am still unmarried” అని ఉలూపి అన్న మాటలు చూడండి.

    పోనీ ఇంకా సందేహం ఉంటే మీరు చదివిన ఆ ఆంగ్లానువాదం రిఫరెన్స్ ఏదో ఇవ్వరాదా?
    ——————————-
    Mahabharata Translation by Ganguly

    The Mahabharata
    of Krishna-Dwaipayana Vyasa

    translated by Kisari Mohan Ganguli

    [published between 1883 and 1896]
    ——————————
    Mahabharata Adi Parva - Translation by KM Ganguly
    « Previous Page Next Page »

    Section CCXV
    (Arjuna-vanavasa Parva)

    “Hearing these words of Arjuna, Ulupi answered, 'There is a Naga of the name of Kauravya, born in the line of Airavata. I am, O prince, the daughter of that Kauravya, and my name is Ulupi. O tiger among men, beholding thee descend into the stream to perform thy ablutions, I was deprived of reason by the god of desire. O sinless one, I am still unmarried. Afflicted as I am by the god of desire on account of thee, O thou of Kuru's race, gratify me today by giving thyself up to me.'
    —————————

    https://www.mahabharataonline.com/translation/mahabharata_01217.php

    ReplyDelete
  12. https://rumachak.wordpress.com/2016/01/21/arjun-and-ulupi-an-inconvenient-truth/

    ReplyDelete
  13. పైన మీరిచ్చిన లింక్ చూశాను. దాంట్లో రుమ చక్రవర్తి అనే మహిళ తన వర్డ్-ప్రెస్ బ్లాగ్ లో ఉలూపి-అర్జునుడి ఉదంతం గురించి ఉలూపి విధవ అంటూ వ్రాసిన పోస్ట్ ఉంది. తన పోస్ట్ కు ఆధారంగా ప్రామాణిక గ్రంథం ఏమన్నా ఉంటే దాని రిఫరెన్స్ ఆమె ఇవ్వలేదు.

    ఉలూపి తను అవివాహితను అని స్వయంగా తనే చెప్పినట్లు నేనిచ్చిన ఆంగ్లానువాదం తాలూకు లింక్ లోనే చాలా స్పష్టంగా ఉంది మరి.

    సరే, ఎలాగూ ఉలూపి వివాహిత అని గాని, విధవ అని గాని కవిత్రయంలో ఎక్కడా అననే లేదు.

    కాబట్టి ఇక నా వైపు నుండి ఈ చర్చకు ఇక్కడితో స్వస్తి.

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top