ఇది 'నా' కథ శీర్షిక అని 'మీరు' అనుకోవచ్చు. నాగరిక సమాజంలో 'మనం' కన్నా 'నేను' అనే స్వభావం పెరిగి 'మనం అనాగరికులు' గా మారాము.  అందుకే ఈ రచన 'నా' కోసమే. 

రాజులు పోయారు. రాజ్యాలు పోయాయి. అన్నది అబద్దం కేవలం రూపం మాత్రమే మారింది. ఇంకా నిక్కచ్చిగా చెప్పాలి అంటే వంశ పారంపర్యం తగ్గి స్నేహ పారంపర్యం పెరిగింది. ఇది రాజుల కాలంలో జరిగినదే ఇప్పుడూ జరుగుతున్నదే ఎప్పటికీ జరిగేదే. 

మరి ఎవరు మారాలి అన్నదే ప్రశ్న? అయితే, సమాధానం 'నేను'. 

నేను వ్రాసిన రచన నేనే చదవను. ఎందుకంటే గర్వం ఒక అడుగు, అభిప్రాయ భేదం ఇంకో అడుగు. ఇదే నన్ను నిరంతరం తప్పుడు దారిలో తీసుకు వెళుతుంది. మరి నేను మారనా? అంటే మారను. ఎందుకంటే నేను చేసేది నాకే ఒప్పు కనుక. 

మరి నన్ను ఎలా మార్చాలి?

ఒక్క క్షణం ఇవ్వండి !

ఒక్క క్షణం ఆలోచించాలి. ఆలోచించ నివ్వాలి. నేను వేసే అడుగు నలుగురికి ఉపయోగ పడుతుందా? అసలు నేను వేసే అడుగు ఎంత శాతం మందికి మేలు చేస్తుంది? అని. ఆ ఒక్క క్షణం ఆలోచించే సమయం నాకు ఇవ్వట్లేదు.ఒక్క క్షణం ఇవ్వండి !

జీవితం చిత్రం అనుకోకూడదు. చిత్రం జీవితం కాకూడదు. 

పెద్దలు చెప్పిన మాటలు చద్దన్నం మూటలు వాటిని తినాల్సిన సమయంలో తినాలి కానీ తినకూడని సమయంలో తిని అనారోగ్యం పాలయ్యి తప్పు పెద్దలది అని అనడం తప్పు అని 'నేను' అర్ధం చేసుకోవాలి. 

పెద్దలు మనకు తెలిపిన కొన్ని మంచి విషయాలు :-

1. ఒక పని చేసే ముందు 10 అంకెలు లెక్క పెట్టు అన్నారు. 'నేను' దాన్ని ఎవరికైనా సాయం చెయ్యాల్సిన సమయంలో లెక్క పెడుతున్నాను. నాకు తెలియక కాదు, వివేకం కోల్పోయి. అది పది మందికీ ఉపయోగ పడేదో లేదో 'నేను' చూసుకోవాలి. 

2. కుండలో అన్నం వండుకోండి అని అన్నారు - కానీ నాకు సీరియల్ చూసే సమయం పోతుంది అని ప్రెషర్ కుకర్ వైపు మొగ్గు చూపాను 'నేను'. 

3. ఒకప్పుడు ఆడవాళ్ళు ఇంటి పనులు చేసే వారు మగ వాళ్ళు బయట పనులు చేసే వారు. కానీ 'నేను' అది తప్పు అని ఎప్పుడూ వాదిస్తూనే ఉన్నాను. ఆడ వాళ్ళ పనులు మగ వాళ్ళు చేసేలా చూసాను. కానీ జరిగింది ఇంకొకటి - స్త్రీ కి Blood లో Hemoglobin శాతం తక్కువ. అది పెరగాలి అంటే ఆమె ఎక్కువ తిని ఎక్కువ పని చెయ్యాలి దాంతో Blood పెరుగుతుంది నెలసరి సమయంలో వచ్చే రోగాలు తగ్గుతాయి. 

4.ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి, కానీ 'నేను' అన్ని పనుల నుంచీ తప్పించుకుని నేను gym కు వెళ్ళి అవసరమైన వాడి నుంచీ లాక్కుంటున్నాను. అర్ధం కాలేదు కదా? నిజానికి మన పూర్వీకులు ఉదయం నుంచీ సాయంత్రం వరకూ ఏదో ఒక పని చేసుకునే వాళ్ళు ఉదాహరణకు పూజలు చేసే వాళ్ళు వారే వెళ్ళి పూలు కోసుకుని వచ్చే వారు. ఎవరి గోదాములో వారే బియ్యం కానీ వడ్లు కానీ సరి చేసుకునే వారు (ఈ పని చేసే వాళ్ళను వెక్కిరించే ఒక నానుడి కూడా ఉంది కాముటి కాముటి ఏమి చేస్తున్నావు అంటే ఒలగ బోసి ఎత్తుకుంటున్నాను). కానీ ఈ పనులన్నీ యంత్రాలకు అప్పజెప్పి బద్ధకం పెంచుకుని తరువాత వైద్యుడికి విధిగా రుసుము చెల్లించి వాడి సలహా తీసుకుని బద్ధకం తగ్గించు కుంటున్నాను  'నేను' . 

5. సంస్కారం మనసు నుండీ రావాలి కానీ నేర్చుకుని కాదు - కానీ 'నేను' సంస్కారం నేర్చుకున్నాను అర్ధం కాలేదా? దాన్నే వ్యక్తి పూజ అంటారు. దీని వల్ల 'నేను' చెడుకు పట్టం కడుతున్నాను. 

ఇవి కొన్ని మాత్రమే ప్రతీ ఒక్క కథలో మంచీ ఉంటుంది. చెడు ఉంటుంది. కానీ 'నేను' 'నా' స్నేహితులు ద్వేషించే వాడు వ్రాసిన(నటించిన) కథను(లేదా చిత్రం) ను ద్వేషిస్తాను. కానీ అదే కథను 'నా' స్నేహితులు ప్రేమించే వారు వ్రాస్తే మాత్రం రక్త సింధూరం ధరింపజేస్తాను. విజయీభవ! అంటాను. ఎందుకంటే 'నేను' మనసుతో ఆలోచించడం మానేసి చాలా కాలం అయ్యింది. 

ఈనాటి 'నేను' 'నా' బంధువుకు సాయం చెయ్యాలి అంటే సంకోచిస్తున్నాను. ఎందుకంటే 'నా' స్నేహితుడితో ఒక రాత్రి party కోల్పోతున్నాను కాబట్టి. లేదా 'నా' ప్రేయసికి కావాల్సిన వస్తువు కొనలేక పోతానేమో అనే భయం కూడా కావొచ్చు. 

మరి ఇక్కడ 'నేను' అంటే ఎవరు? అనే కదా 'మీ'అనుమానం. చదివే 'వాడే' కావొచ్చు, వ్రాసిన 'వాడు' కావొచ్చు, తనని తాను అద్దంలో పోగుడుకునే 'వాడు' కావొచ్చు. 

ఇది కథ అనుకుంటే 'నా' ఇష్టం, కాదు అక్షర సత్యం అనుకుంటే 'నా' ఇష్టం. కానీ ఇది నిజం!
--------------------------------------------------
*Republished

మీరూ జనవిజయం శీర్షిక కు రచనలు పంపవచ్చు. మెయిల్ ఐ.డి : kondalarao.palla@gmail.com

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top