• ‘సింపథీ’వదిలిసిద్ధాంతాల’ రూపకల్పన చేయడం సబబా?
  • వ్యక్తిగత దాడులు, హత్యలు సమస్యలను పరిష్కరిస్తాయా?
  • రెవెన్యూలో మాత్రమే అవినీతి ఉన్నదా?
  • మూలాలపై పోరాడాల్సిన బాధ్యతను విస్మరిస్తే ఎవరికి నష్టం?

మనింట్లోతిరుగుతున్న ఆడబిడ్డలా ఉంది. ఇద్దరు పసికూనలు. పండంటి కాపురం. అందులో కార్చిచ్చు. అమానుషంగాఆమెను హత్య చేసిన వాణ్ణినిలువునా పాతరేయాలని, పెట్రోల్ పోసి అదే విధంగాతగలేయాలని ఆవేశం తన్నుకురావాలి. మనిషైపుట్టినవాడికి, మానవత్వం ఉన్నవాడికి ఎవడికైనా ఇలాగే అనిపిస్తుంది. కానీ…..తహశీల్ధార్విజయారెడ్డి పై పెట్రోల్ దాడి చేసినపుడు సమాజంలో అధికశాతం మంది తటస్థంగా స్పందిస్తున్నారు. ఎంతో భవిష్యత్తు ఉండి, ఉన్నత శిఖరాలుఅధిరోహించే అవకాశం ఉండి, ఒక నోబుల్ ప్రొఫెషన్ అయిన టీచర్ ఉద్యోగంనుంచి వచ్చిన మహిళ పై అమానుషంగాదాడి జరిగితే, చూడ్డానికి కూడా సాహసించలేని కిరాతకమైనహత్య జరిగితే దాన్ని ఒక ముందడుగుకు మైలురాయిగాభాష్యం చెప్పే స్థాయికి మానవ వ్యక్తిత్వం పునరుద్దరించబడిందిఅంటే పురోగమనం దశకు చేరుతోంది? ఒక్కకోతికి గాయమైతే వంద కోతులు కాపలాకాసే ఘటనలు చూస్తూ ఎంతో ఎదిగినసంఘ జీవితంలో ఉన్న మనం ఒకమహిళను నిలువునా పెట్రోల్ పోసి నిప్పంటిస్తే ముక్తకంఠంతోఖండిరచాల్సింది పోయి ఇంతగా అనుమానిస్తూ ఆలోచించాల్సినఅవరసరమా?! భిన్న కోణాల్లో వ్యక్తీకరించాల్సినసమయమా?! అనే ప్రశ్నకు సమాధానమే వ్యాసం.

                గుర్తుందా…. 2008లో వరంగల్లో ఇద్దరు ఆమ్మాయిలపైయాసిడ్ దాడి చేసిన ముగ్గురినిఎన్కౌంటర్ చేసిన సంఘటన. స్వప్నిక, ప్రణీత అనే ఇద్దరు ఇంజనీరింగ్ అమ్మాయిలపై శ్రీనివాస్‌, అతని ఇద్దరుస్నేహితులు యాసిడ్ దాడి చేశారు. కేవలంప్రేమ వ్యవహారమే కారణం కాదు… అక్కడతనను మోసం చేసింది అనేకోణం కూడా ఉంది. స్వప్నికతండ్రి ఊరికి దూరంగా ఉంటాడు. స్వప్నిక, శ్రీనివాస్ ప్రేమ వ్యవహారం తల్లికితెలుసు. అది చాలా దూరంవెళ్లింది. క్రమంలో శ్రీనివాస్ తనను తాను నిలువుదోపిడి చేసుకున్నాడు. స్వప్నిక వేరే వారితో చనువుగాఉంటుంది, దీనికి ప్రణీత సహకరిస్తుంది. అనుమాన విష బీజం నాటుకుంది. తన ఆస్థి అనుకున్నది అదివేరే వారికి దక్కుతుంది అని భయపడ్డాడు. భరించలేకపోయాడు. స్నేహితుల సాయంతో మనది కాకుంటే మసికావాలనే సూత్రంతో అమ్మాయి పై యాసిడ్ కుమ్మరించాడు. ఆవేశంతో, అనాలోచనతో, క్షణికావేశంతో చేసిన పని. అందులోస్వప్నిక 50 శాతం పైగా గాయాలైమృత్యువుతో పోరాడి తనువు చాలించింది. ప్రణీతజీవశ్చవంలా బతికి బయటపడింది. సంఘటన యావత్ తెలుగు రాష్ట్రాన్ని కుదిపేసింది. నిందితులను నిలువునా పాతరేయాలని డిమాండ్ వచ్చింది. మహిళా సంఘాలు, విద్యార్ధిసంఘాలు రోడ్డెక్కాయి. టీవీల్లో చర్చలు, పత్రికల్లో ప్రధాన శీర్షికలు. ఫలితంగానే ఎస్పీ సజ్జనార్ 25ఏళ్లలోపు ఉన్న ముగ్గురినిమామునూర్ అడవుల్లో ఎన్కౌంటర్ చేసి చంపారు. తప్పించుకునివెళ్తుంటే కాల్చి చంపామని ప్రకటించారు. వరంగల్లోఅదాలత్ ఎక్కడుంది ? జైలు ఎక్కడుంది ? పోలీస్ జీపు మామునూర్ ఎందుకువెళ్లింది ? చేతికి భేడీలు వేసి ఉన్న విచారణఖైదీలు, పోలీసులను తప్పించుకొని పారిపోవడం సాధ్యమేనా ? అని ఒక్క మానవ హక్కుల సంఘం నోరు మెదపలేదు. కారణం ప్రజలలో అప్పటి డిమాండ్ అలాంటిది. అంతకు మించి సత్వరన్యాయం, ఫాస్ట్ట్రాక్ లేదనుకున్నారు. కథ ముగిసినా కన్నీరుమిగిలినా విచారించకుండానే, విచారం లేకుండాఇరు కుటుంబాల్లో విషాద న్యాయం మిగిలింది.

తాజాగాఫిబ్రవరిలో వరంగల్లోరవళి అనే అమ్మాయి పైఅవినాశ్ అనే విద్యార్ధి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తనతోచనువుగా ఉన్న ఫోటోలు రిలీజ్ అయ్యాయి. తనను ప్రేమించి వాడుకొనిమరొకరితో చనువుగా ఉంటుందనే కోపంతో ఘాతుకానికి ఒడికట్టాడు. ఇప్పుడు అంత పెద్ద ఆందోళనులేవు, ఎన్కౌంటర్లులేవు, రెండు రోజుల్లో సమసిపోయింది.

ఇదేసమయంలోతిన్నావా సృజనా అంటూ ఒకఆడియో రిలీజ్ అయిందిఅందులో ఒక కుర్రాడు అమ్మాయినిపచ్చి బూతులు తిట్టే ఆడియో అది. కుటుంబాల్లోఆడపిల్లలు ఎక్కడ వింటారో అనిభయపడేంత వికృతంగా ఒక మగ పిల్లాడులైంగిక విశృంఖలతను ఉచ్చరిస్తూ మాట్లాడిన మాటలు విపరీతంగా పాపులర్ అయ్యాయి. ‘నాకొద్దు.. నాకొద్దూ.’ అంటూ టీవీ షోల్లో, డీజేల్లో చోటు సంపాదించాయి. ఆఖరుకుగణేష్ మండపాల్లో  భజనల్లోకూడా అంత నీచమైన మాటలుచోటు చేసుకున్నాయి. ఎటు వెళ్తున్నాం మనం..! మన సంస్కృతి?!

                పై మూడు సంఘటనలకుఎం.ఆర్.ఓ విజయారెడ్డి పై పెట్రోల్ పోసి చంపడానికి సంబంధం ఏంటి? అని అనుకోవచ్చు. కానీ ఏకసూత్రత ఉంది. ధనం, మానం, ప్రాణం, పదవీ, ఆభరణం వీటికోసమేయుద్ధాలు జరిగాయి. ప్రాణాలు పోయాయి. ‘‘మన సొంతం అనుకున్నదిపరులపాలు అవుతుంది అనుకుంటే తట్టుకోలేరు’’. తనను తాను చంపుకోడానికైనా, ఎదుటివారిని చంపడానికైనా వెనకాడరు. పిరికివాడు, పోరాడలేని వాడు, ఆశలు కోల్పోయినవాడు, నిరాశతో తనను తాను అంతంచేసుకుంటాడు. కాస్త గుండె ధైర్యంఉన్నవాడు సామ,ధాన, భేద, దండోపాయాలను ఆచరిస్తాడు.

                ప్రేమ వ్యవహారంలో జరిగినదాడికి జనాలు ఒక సూత్రీకరణచేస్తారు. పిల్లలను అదుపులో పెట్టాలి. వారి పై కన్నేసి ఉంచాలి. చెడు తిరుగుళ్లకు దూరంగాఉంచితే ఇలాంటివి జరగవు అని చర్చించివదిలేస్తారు. కానీ సూర్యోదయం తరువాతహార్మోన్లు వాటి పని అవిచేస్తాయి. ఇక్కడ విజయారెడ్డి హత్యజరిగిన మరుక్షణం భిన్న కోణాల్లో చర్చజరుగుతోంది. అందులో ప్రధానమైన విషయం తాను బదిలీకిదరఖాస్తు పెట్టుకోవడం. సాధారణమ్గా అంత మెయిన్ సెంటర్, పొటెన్షియల్ సెంటర్కుఉద్యోగం కావాలని వేయించుకుంటారు. ఎవరూ ఆ సెంటర్ నుండి వెళ్లాలని కోరుకోరు. అలాంటిది విజయారెడ్డికి ఎన్ని రాజకీయ వత్తిళ్లు, ఎన్ని చేయకూడని పనులు తన చేతితోచేయాల్సి వస్తుందనే ఇబ్బందితో బదిలీకి పెట్టుకొని ఉంటుంది?

విజయారెడ్డిహత్యోదంతంతో సింపతీ కంటే సిద్ధాంతాలే ఎక్కువయ్యాయి. ఇంకో నల్గురిని ఇలాగే పెట్రోల్ పోసి తగలబెడితే ఎమ్మార్వోలకు భయం ఉంటుందని ఒకరంటే, అలా తగలబెడతారో ఏమో అని భయపడ్డఎమ్మార్వో ఒకరు ఆంధ్రాలో ఏకంగాడోరుకు తాడు బిగించుకొని డ్యూటీచేస్తోంది. అయ్యో పాపం….! అనిసానుభూతి చూపని పరాకాష్ట దశకుచేరుకుంది రెవిన్యూ వ్యవస్థ. విజయారెడ్డి హత్యకు నిరసనగా కూర్చున్న ఓ వీ.అర్.ఓని తమవద్ద తీసుకున్న లంచం తిరిగి ఇవ్వమని ఓ మహిళ కోరుతుంటే నోరు మెదపలేక అక్కడున్న రెవెన్యూ సిబ్బంది లేచి పోవాల్సిన దుస్థితి. ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అయింది. వీఆర్స్థాయి నుంచి ఆర్డీవో స్థాయివరకు, సిబ్బందిలో ఎవరికి అవకాశం ఉన్న మేరకు వారుదోచుకోడానికి అలవాటు పడ్డారు. స్థిరాస్థి వ్యాపారులు తమకు పని తొందరగా కావాలనితృణమో, ఫణమో చేతిలో పెట్టిచేసే అలవాటు సంప్రదాయంగా మారి పేద రైతుదగ్గర కూడా చేయిచాపే స్థితికిదిగజారారు ఉద్యోగులు. దీనికి తార్కాణమే రోజు రోజుకూ ఏసీబీకిదొరుకుతున్న వీఆర్ఓలు, సర్వేయర్లు. ఒక కానిస్టేబుల్ అవినీతికిప్పాడ్డాడంటే అతనికి నాలుగు కాసులువస్తాయి. నిందితుడికి కొంత ఊరట ఉండొచ్చు. ఇంకా ఇతర వ్యవస్థల్లో జరిగేఅవినీతి వల్ల వ్యవస్థాగత నష్టాలు ఉన్నప్పటికీ ఒక కుటుంబాన్ని రోడ్డునపడేసే అవినీతి మాత్రం కేవం రెవిన్యూ శాఖదే. కూర సురేశ్ తాను తల్లిలా నమ్ముకున్నభూమి గద్దల్లాంటి పెద్దమనుషులు ఎగరేసుకుపోతున్నారనేది వాస్తవం. దీంట్లో పెద్ద చేతులు ఉండటం, రెవిన్యూ యంత్రాంగాన్ని కట్టుకొని రికార్డు మార్చి కోర్టు గుమ్మం తొక్కిస్తున్నారు. కోర్టు కేవలం రికార్డు చూసిమాత్రమే తీర్పు నిస్తుంది. రికార్డు ట్యాపరయ్యాయనేవిషయాన్ని నిరూపించగలిగే సత్తా సామాన్యుడికి ఉండదనేదే రెవెన్యూ గద్దల తలంపు. కోర్టులోతీర్పు రావాలంటే రెవిన్యూ యంత్రాంగం ఇచ్చే రిపోర్టే కీలకం. అందుకే ఎమ్మార్వోను కాళ్లా వేళ్లా పడి బతిమాలాడు. సాధ్యంకాదు అన్న మాట అతనిలోదండోపాయాన్ని లేపింది. అందుకే తనను తాను అంతంచేసుకున్నా ఫర్వాలేదు, అనే క్రమంలోనే ఎమ్మార్వోపై అమానుష దాడి. దాడితర్వాత ఎమ్మార్వో కుటుంబం కంటే ఎక్కువ ఆమెఇల్లు మాత్రమే వైరలయ్యింది.

                ఇది కేవలం ప్రభుత్వ విధానాలుచేసిన హత్యగా సూత్రీకరిస్తున్నవారూ ఉన్నారు. విషయాన్ని కూడా పూర్తిగా కొట్టేయలేం. కానీ ప్రభుత్వం భూ ప్రక్షాళణ పెట్టినఉద్దేశ్యమే వివాదాలను దూరం చేయాలని, కానీతెరవెనుక రాజకీయాలు ప్రజలకు తెలియదు. ప్రభుత్వ విధానాల్లో అధికారులకు వెలు వంకర పెట్టే అవకాశాన్ని చేతిలో పెట్టింది. అందుకే ప్రతి మండలంలో అధికారులు వేలు వంకర పెట్టివెన్న కోసం పాకులాడుతున్నారు. అదేవెన్న పెట్రోలుగా మారి మంటలు రేపిఆహుతి చేస్తుందన్న నిజాన్ని తెలుసుకునే లోపు జరగాల్సిన నష్టంజరిగిపోయింది. అవినీతి ప్రజామోదంగా మారింది. గుడ్ విల్ ఇవ్వడం పేషనయ్యింది. అది కాస్తా నియమంగా మారింది. బిచ్చగాడి బొచ్చెను సైతం వదలని పతాక స్థాయికిచేరింది. ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యేఎన్నికు కావచ్చు, సర్పంచి ఎన్నికలు కావచ్చు, ఆఖరుకు వంద రూపాయలు సంపాదించలేని వార్డు మెంబరుఎన్నికకు ఓటేయాలన్నా చేయిచాచే సంప్రదాయాన్ని ఒంట బట్టించుకున్న తరంమనది. ఈ స్థితిలో అవినీతిని ఎలా ప్రశ్నిస్తావు? యధారాజా..తదా ప్రజా… అంటారు పెద్దలు. రాజే తనను ఎన్నుకోవడానికిడబ్బు కుమ్మరిస్తుంటే ఏరుకోడానికి ఎగబడే జనం పారదర్శకతఎలా కోరుకుంటారు. నియోజక వర్గంలోఎమ్మెల్యే అభ్యర్దికి అవకాశం లేక డబ్బు పంచకుంటేతన ప్రచార కార్యాలయానికి వచ్చి ప్రజలు ధర్నాచేసిన ఘటన, ప్రజల్లో అవినీతి స్థాయిలో పాతుకు పోయిందో తెలపడానికి నిదర్శనం. ముందు నీవు పరివర్తనచెందు. తర్వాతే ఎదుటివారిలో మార్పు కోరుకో అన్న ఆర్యోక్తిని మరచి. పక్కింట్లో భగత్సింగ్ పుట్టాలిమనింట్లో టాటా బిర్లాలు పుట్టాలిఅనుకునే అనువంశిక లక్షణాలు మనలో ఉన్నంతకాలం, విజయారెడ్డిలుఅగ్నికి ఆహుతి అవుతారు. అన్నదాతలుపురుగు మందుతో పునీతం అవుతారు. మనం మట్టి మనుషులం. ఒట్టి మనుషులం.

          కేవలం రెవెన్యూ అధికారులలో మాత్రమే అవినీతి ఉన్నట్లు పాలకులు భ్రమలు కల్పిస్తున్నారు. ఎక్కువ అవినీతికి రెవెన్యూలో అవకాశం ఉన్నదన్న మాట నిజం. దీనిని సంస్కరించాల్సిందే. అంతకంటే ముందు అవినీతికి మూలాలను సంస్కరించాలి. నాయకులు డబ్బుతో ఓట్లు కొనుక్కోవడం…. ఆనక పెట్టుబడికి పదింతల లాభాన్ని ఆర్జించడానికి వ్యవస్థలను వాడుకోవడం… ఈ దుస్తితిని ప్రజలు వేడుకలా చూడడం, అవినీతిలో తామూ భాగస్వామ్యం కావడం అనే దుస్తితి మారాలి. మార్చాలి. ప్రజాపోరాటాలు సమైక్యంగా జరగాలి. మేథావులు ప్రజలను చైతన్యపరచాలి. సంఘటిత పోరాటమే మార్గమని దారి చూపాలి. వ్యక్తిగత దాడులు, హత్యలతో అవినీతి ఆగుతుందనుకోవడం సినిమాలలో మాత్రమే సాధ్యం. అది ఆచరణీయమూ, అనుసరణీయమూ కాదు.
- Palla Kondala Rao

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top