ప్రశ్నించడం తెలుసుకోవడానికి అయినపుడు, ప్రశ్నించేవారు తెలిసినవారి వద్దనుండి ఆ సమాచారం రాబట్టవలసి ఉంటుంది. ప్రశ్నించడం సమాచారం తెలుసుకోవడం కోసం, హక్కులకోసం లేదా తప్పును ప్రశ్నించాలనుకోవడం.... ఇలా ప్రశ్న దేనికోసమన్నదానిని బట్టి ప్రశ్నించేవారి ప్రవర్తన ఆధారపడి ఉంటుందని భావిస్తున్నాను. అయితే ఫలితం రాబట్టడం ముఖ్యమనుకున్నపుడు ప్రశ్నించేవారు ఏ సమయంలో ఏ పద్దతులు పాటించాలి? మీ అభిప్రాయాలు పంచుకోవాలని విజ్ఞప్తి.
- పల్లా కొండల రావు.
*Re-published
మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
kondalarao.palla@gmail.com
భగవద్గీత 4-34
ReplyDeleteతద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ।
ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్త్వదర్శినః ।।
ఒక ఆధ్యాత్మిక గురువుని చేరి పరమ సత్యమును నేర్చుకొనుము. వినయంతో ఆయనను ప్రశ్నలు అడుగుతూ మరియు ఆయనకు సేవ చేయుము. అటువంటి మహాత్ముడైన జ్ఞాని నీకు జ్ఞానోపదేశం చేయగలడు ఎందుకంటే అతను స్వయంగా యథార్థమును దర్శించినవాడు.
భగవద్గీత లోని పై శ్లోకం మీకు సమాధానం దొరుకుతుంది.
ఘంటసాల గారి భగవద్గీత చిన్నపుడు రోజూ వినేవాడిని. నాకర్ధమయినది, నాకు తెలిసినట్లుగా అన్వయించుకుంటూ పనిచేసేవాడిని. అయితే జ్ఞానం పెంచుకోవడానికి మీరు సూచించినది ఒక మార్గం గా తీసుకోవచ్చు.
Deleteప్రశ్న-సమాధాన ప్రక్రియకు హెగెల్ డైలెక్టిక్ (thesis, anti-thesis, synthesis) ఒక మంచి నమూనా. ఉపనిషత్తులు & సోక్రటీస్ కూడా దాదాపు ఇదే తరహా (అనుకుంటా).
ReplyDeleteచర్చకు ముందటే ఇద్దరమూ ప్రమాణంగా స్వీకరించిన విషయాల స్పష్టతకు రావాలి. ఒక వైపు వారు తమ వాదన (thesis) వినిపిస్తే అవతలి వారు ఇరువురు అంగీకరించిన ఫండమెంటల్ సూత్రాల ఆధారంగా దానికి ప్రతివాదం (anti-thesis) చెప్తారు. కొన్ని దశల అనంతరం పరస్పర సహమతి లేదా సమాధానం (synthesis) దొరుకుతుంది. ఈ ప్రక్రియకు మిత్ర-వైరుధ్యం (friendly contradiction) మూలస్థంభం.
ఉ. ఇద్దరూ ఒప్పుకున్న సత్యం "ఒకే ఒక దేవుడు". వాదం: "శివుడే నిజమయిన దైవం". ప్రతివాదం: "కాదు విష్ణువు". కాసేపు వాదన తరువాత తేలిన అంగీకారం: "శివకేశవులు ఇద్దరూ ఒక్కటే"
QMS (ఉ. ISO 9001) పద్దతులలో why-why method ప్రాచుర్యం ఎక్కువ. వీటిలో ప్రశ్న-జవాబు-ఇంకొంచం లోతు (drill down) లేదా సంబంధిత ప్రశ్న/అనుమానం పరంపర. తత్తిమ్మా పైని చెప్పినట్లే.
ఉ. మీ ఉత్పత్తి నాణ్యత కలిగివుందా? అవును. ఎలా చెప్పగలరు. ఫలానా నాణ్యతా ప్రమాణం వాడాము. అది మీ పరిశ్రమకు సంబందించిందేనా? .... అంతిమంగా తేలే ఫలితం: Quality verified OK.
ఆడిట్లలో రెండు రకాల పద్ధతులు. హారిజాంటల్ అనగా ఒకే ఉత్పత్తి జాబును వివిధ శాఖలలో ట్రాక్ చేయడం. వెర్టికల్ అంటే ఒకే శాఖలో వివిధ జాబులను పరీక్షించడం. రెండిట్లో పైన ఉటంకించిన why-why architecture వాడవచ్చును.
PS: ఇందులో పేర్కొన్నవన్నీ కేవలం ఉదాహరణలు మాత్రమే, ప్రక్రియ తెలియచేయడం కొరకు అత్యంత "సులువీకరణ" చేసాను. శివ-కేశవుల నడుమ నేను దూరలేదు!
మీరు చెప్పిన హెగెల్ గతితర్కం, తర్కం కు ఉపయోగిస్తుంది. ఒక విషయాన్ని తేల్చడానికి, మరింత మెరుగుపర్చడానికి నిరంతరం జరిగే ప్రక్రియ. ఇక్కడ ఏ ప్రశ్నకైనా నిరంతర ప్రాసెస్ సత్యం (సాపేక్షిక ఫలితం) ఆధారంగా తర్కం ఉంటుంది (ఇప్పటికి తెలిసిన సత్యం ఆధారంగా). ఇది అందరికీ అమోదయోగ్యం కావాలి. కానీ నమ్మకాలు ఉంటుంటాయి. అంతిమంగా జరిగేది మాత్రం గతితర్కమే.
Deleteప్రశ్నోపనిషత్తు గురించి, సోక్రటీసు గురించి కొద్దిగా విన్నాను. తెలియదు. మీకు తెలిసింది వివరించగలరు.
నేనడిగింది వివిధ సందర్భాలలో 'ప్రశ్న' ఎలా ఉంటుంది? ఉండాలి? అని.
ఉదా// సూర్యుడు ఉదయం ఎర్రగా, పెద్దగా ఉండి మద్యాహ్నం తెల్లగా మారి తిరిగి సాయంత్రం ఎర్రగా మారడాన్ని గమనించిన పిల్లవాడు ఆ విషయాన్ని తల్లినో, స్నేహితుడినో, గురువునో అడిగే సందర్భాలు ఉంటాయనుకుందాం. ఇక్కడ ఎదుటివారి జ్నానం స్థాయిని బట్టి పిల్లవాడికి సమాధానం అందుతుంది.
అదే పిల్లవాడు జంతువుల బహిరంగ సంయోగం గురించి అడగాల్సి వస్తే..... ఎవరిని, ఎలా అడగాలి అన్నది వాడికి తెలియడానికి అవకాశం లేని స్థితి అనుకుందాం. ఆ స్థితిలో వాడు తల్లినే అడిగాడనుకుందాం. ఇక్కడ సంస్కృతిని బట్టి, లౌక్యం ను బట్టి సమాధానం వస్తుంది. లేదా తాత్కాలికంగా ప్రశ్ననే చంపడానికి భయపెట్టే అవకాశం కూడా ఉంటుంది.
అలాగే దైవదత్త అంశాలను ప్రశ్నించడం పాపమో, నేరమో, ఘోరమో, పొగరుగానో భావించే వ్యక్తులూ, శక్తులూ, సందర్భాలూ ఉంటుంటాయి.
ఎక్కడ బడితే అక్కడ, ఎవరిని బడితే అది ప్రశ్నించకూడదనే సంస్కారమూ సందర్భాన్ని బట్టి అవసరమే. ఇలా అనేక విషయాలు, వయసు, సందర్భం బట్టి ప్రశ్న ఉంటుంది. ఉండాలి కూడా.
ప్రశ్ననే చంపడం మాత్రం ఖచ్చితంగా తప్పు. అసలు చంపడం అసాధ్యం కూడా. ప్రశ్నించేవారిని చంపగలరేమో గానీ..... ప్రశ్నను చంపలేరు.
ఇలా అనేక అంశాలు ఇమిడి ఉన్న ఈ విషయాన్ని క్లారిటీ గా తేల్చిన పద్ధతి ఉన్నదా? ఉంటే ఏది?
కొండల రావు గారూ,
Deleteఆలోచనలను ప్రేరేపించే దిశగా ఉన్న మీ స్పందన అమోఘం. ప్రజ బ్లాగు ద్వారా అందరినీ
తమ మెదడుకు పదును పెట్టే తరహాలో కుతూహలం రేకెత్తించిన మీరు మళ్ళీ అదే స్థాయి ఫారంకు రావడం చాలా సంతోషం. Hats off to you sir.
నాకు తెలిసిన మేరకు ప్రశ్నల ద్వారా రెండు రకాల లాభాలు. మొదటిది తమకు తెలిసిన సంగతులు పంచుకోవడం ద్వారా విస్తృత ప్రాచుర్యం. రెండవది (ఇంకా ముఖ్యమేమో?) ప్రశ్నకు సమాధానం చెప్పే క్రమంలో చెప్పేవారికే స్పష్టత పెరగడం.
విశ్వం అనంతం, నాకు తెలిసింది కొంతే అన్న వినమ్రత కలిగిన ప్రతి గురువు ప్రశ్నలను ఒప్పుకోవడమే కాక ప్రోత్సహిస్తాడు. విద్య/సంవాదం అనేది గురుశిష్యులు ఇరువురికి లాభించే ప్రక్రియ తప్ప ఏకపక్ష ప్రవాహం కానేరదు.
అట్లా కాకుండా "కండ్లు పోతాయి వెధవా", "పిల్లకుంకవి నువ్వు నన్నే ఎదిరిస్తావా" వగైరాలతో ప్రశ్నను కట్టడి చేస్తే పిల్లవాడికి నష్టం లేదు, ఇంకో గురువు/ఆధారాలు/పుస్తకాలు వెతుక్కుంటాడు. సోవియట్ రష్యాలో సమాచార వ్యవస్తి కేజీబీ కబంధ హస్తాలలో ఉన్నప్పుడు జనం వార్తల కంటే ఎక్కువ పుకార్లనే నమ్మేవారు.
"గతమెంతో ఘనకీర్తి" అనడం మీద గురజాడ చెప్పిన "మంచి గతమున కొంచెమేనోయ్" అన్న మాటమీదే నాకు నమ్మకం ఎక్కువ. మనిషి ఆశావాది. నిన్నటికంటే రేపు మెరుగు ఉంటుందన్నది ప్రకృతి నియమమయితే నేను మా తాత కంటే నయం కావాలి కదా. అట్లా కాదు, అప్పుడెప్పుడో రాతి యుగం మనుషులు రాసిందే సర్వకాల సర్వావస్థలలో శ్రేష్టం అన్న వాదన నిరాశావాద అశాస్త్రీయమే అవుతుంది.
సోక్రటీస్ & ఉపనిషత్తు పద్దతుల గురించి నాకు పెద్దగా తెలీదు. ఈ లింకు చూడండి కొంత ఉపయోగిస్తుందేమో (ఇది నేను సిఫార్సు లేదా ధ్రువీకరణ చేస్తున్నట్టు కాదు):
https://kanishka-sinha.livejournal.com/128835.html
< విశ్వం అనంతం, నాకు తెలిసింది కొంతే అన్న వినమ్రత కలిగిన ప్రతి గురువు ప్రశ్నలను ఒప్పుకోవడమే కాక ప్రోత్సహిస్తాడు. విద్య/సంవాదం అనేది గురుశిష్యులు ఇరువురికి లాభించే ప్రక్రియ తప్ప ఏకపక్ష ప్రవాహం కానేరదు >
Delete100% true.
< సోవియట్ రష్యాలో సమాచార వ్యవస్తి కేజీబీ కబంధ హస్తాలలో ఉన్నప్పుడు జనం వార్తల కంటే ఎక్కువ పుకార్లనే నమ్మేవారు. >
yes.
< "గతమెంతో ఘనకీర్తి" అనడం మీద గురజాడ చెప్పిన "మంచి గతమున కొంచెమేనోయ్" అన్న మాటమీదే నాకు నమ్మకం ఎక్కువ. మనిషి ఆశావాది. నిన్నటికంటే రేపు మెరుగు ఉంటుందన్నది ప్రకృతి నియమమయితే నేను మా తాత కంటే నయం కావాలి కదా. అట్లా కాదు, అప్పుడెప్పుడో రాతి యుగం మనుషులు రాసిందే సర్వకాల సర్వావస్థలలో శ్రేష్టం అన్న వాదన నిరాశావాద అశాస్త్రీయమే అవుతుంది. >
exactly.
Thank you.
అరవై దాటిన వృధ్ధులు
ReplyDeleteత్వర పడి యిలు వెడలవద్దు , దారొకటే , యీ
కరొనా నశించు వరకున్
చెరలో బతుకుటయె మేలు , స్వీయ నియతిలోన్ .
yes sir.
Delete