తెలుగు వర్ణమాల

---------------------------

  • తెలుగు భాష వర్ణ మాల లో అక్షరాలు 56 . అయితే చాలా మందికి ఇవి తెలియవు. చాలామంది ఉపాధ్యాయులకు కూడా తెలియక పోవడం దురదృష్టకరమనే చెప్పాలి.
  • తెలుగు వారమై వుండీ పరాయి భాషపై వెర్రి వ్యామోహంతో కొందరు ఊగిపోతున్న ఈ రోజులలో ఇపుడిపుడే అంతర్జాలం లో తెలుగు గురించి, తెలుగు ప్రాధాన్యత గురించి కృషి పెరుగుతుండడం హర్షించదగ్గ ఆహ్వానించ దగ్గ పరిణామం.
  • దీనిలో భాగంగా తెలుగు భాషలో యాభై ఆరు అక్షరాలను సరిగా అందించాలనే ఉద్దేశం తో వాటిని ఇక్కడ ఉంచుతున్నాను.
  • 'క్ష' అనేది తెలుగు వర్ణమాలలో లేదు. అది ఒక సంయుక్తాక్షరం మాత్రమే.
  • వీటిని మా తెలుగు ఉపాధ్యాయులు వజ్రాల పరబ్రహ్మం గారు నేర్పారు.
  • తెలుగు భాషకు ఎన్ని అక్షరాలుండాలి? ఏవి అవసరం? ఏవి అనవసరం? అనే చర్చతో సంబంధం లేకుండా తెలుగు భాష  అక్షరమాలగా గుర్తింపు పొందిన 56 అక్షరాలు మాత్రం ఇవే.

- పల్లా కొండల రావు.

*Re-published

Post a Comment

  1. నిజానికి ఐ, ఔ, క: ఖ, ఘ, ఙ ఛ, ఝ, ఞ, ఠ, ఢ, థ, ఫ, భ, శ, ష, హ, క్ష లు తెలుగు రాతలు కావు. అచ్చ తెలుగు పలుకులు సున్నా తో కలిపితే 31 మట్టుకే. వివరాలకు http://telugunudi.blogspot.in చూడండి

    ReplyDelete
  2. @Dr. P. Srinivasa Teja
    డాక్టర్ గారూ ! కామెంట్ కు ధన్యవాదములు. మీరు చెప్పిన విషయం కొత్తది. నాకు తెలిసింది పోస్టులో చెప్పినట్లు మా తెలుగు ఉపాధ్యాయులు చెప్పిందే. నాకు మీరు చెప్పే వరకూ తెలుగు వర్ణమాల 56 అక్షరాలు అని మాత్రమే తెలుసు. ఇప్పుడే మీ బ్లాగు చూశాను. పూర్తిగా పరిశీలించాల్సి ఉంది. తెలుగు కోసం మీ కృషి అభినందనీయం. ఇలాంటి బ్లాగుల కోసం చూస్తున్నాను. మీ బ్లాగును జనవిజయం లో నేను చూసే బ్లాగుల లిస్టు లో చేర్చుకున్నాను. వీలును బట్టి మీ బ్లాగు పరిశీలించాలనుకుంటున్నాను.

    ReplyDelete
  3. క్ష - is not same as 'ksha' , there is a difference.

    ReplyDelete
    Replies
    1. మీరు చెప్పిన రెండూ సంయుక్తాక్షరాలే శ్రావణ్ కుమార్ గారు.

      Delete
  4. ప్రవీణ్ గారు లేదా ఎవరైనా తెలిసిన వారు ఈ 56 తెలుగు అక్షరాలు ఏవి ఎలా నోటిలోని భాగాలతో పలుకుతారో, వాటి పేర్లు ఉదాహరణకు నాసికాక్షరములు, దంత్యములు...ఇలా ఉంటాయి కదా అవి కాస్త వివరంగా విభజించి చెప్తారా?

    ReplyDelete
  5. ముందు అచ్చుల విషయానికి వద్దాం.

    అ & ఆ - కంఠ్యములు (గొంతుతో పలికేవి).
    ఇ & ఈ తాలవ్యములు (కంఠానికీ, పళ్ళ చిగుళ్ళకీ మధ్య ఉన్న భాగాన్ని తాలువు అంటారు. తాలువుతో పలికేవి తాలవ్యములు).
    ఎ, ఏ & ఐ - కంఠ్యతాలవ్యములు (కంఠము & తాలువుతో పలికేవి).
    ఋ & ౠ - మూర్ధన్యములు (నాలుక ముందు భాగాన్ని వెనక్కి వంచి పలికేవి).
    ఌ, ౡ - దంత్యములు (నాలుక ముందు భాగాన్ని దంతాలకి తగిలించు పలికేవి).
    ఉ & ఊ ఓష్ఠ్యములు (పెదవులతో పలికేవి).
    ఒ, ఓ & ఔ - కంఠ్యోష్ఠ్యములు (కంఠము & పెదవులతో పలికేవి).

    ఇప్పుడు స్పర్శములు (plosives) చూద్దాం. తెలుగులో "క" నుంచి "మ" వరకు ఉన్నవి స్పర్శములు (నోటి భాగములతో గట్టి ప్రయత్నం చేసి పలికేవి).

    క, ఖ, గ, ఘ & ఙ - కంఠ్య స్పర్శములు (guttaral plosives).
    చ, ఛ, జ, ఝ & ఞ - తాలవ్య స్పర్శములు (palatal plosives).
    ట, ఠ, డ, ఢ & ణ - మూర్ధన్య స్పర్శములు (retroflex plosives).
    త, థ, ద, ధ & న - దంత్య స్పర్శములు (dental plosives).
    ప, ఫ, బ, భ & మ - ఓష్ఠ్య స్పర్శములు (labial plosives).

    "ఙ, ఞ, ణ, న, మ"లు నాసిక్యములు (ఇవి పలికేటప్పుడు నోటిలో ఏదో ఒక భాగం గాలి ప్రవాహానికి అడ్డు తగిలి ముక్కు నుంచి గాలి బయటకి వస్తుంది).

    స్పర్శములు కానివి అంతస్థములు (approximants). అవి:
    య - తాలవ్య అంతస్థము.
    ర, ఱ & ళ - మూర్ధన్య అంతస్థములు.
    ల - దంత్య అంతస్థము.
    వ - దంత్యఒష్ఠ్య అంతస్థములు (labiodental approximant).

    గాలి ఊదుతూ పలికేవి ఊష్మములు (fricatives). అవి:
    శ - తాలవ్యోష్మము
    ష - మూర్ధన్యోష్మము
    స - దంత్యష్మము
    హ - కంఠ్యోష్మము

    ReplyDelete
    Replies
    1. చాలా శ్రమపడి సాధించారు ప్రవీణ్ గారూ,ఈ లిస్టును నా పోస్టులో వుంచాను.అంత బాగుంది మీ శ్రమ!

      Delete
    2. తెలుగు ఫోనాలజీ గురించి ఎం.ఎల్. సత్యనారాయణ శర్మ గారు వ్రాసిన "తెలుగు వ్యాకరణం" పుస్తకంలో చదివినవి గుర్తున్నాయి, అవి ఇక్కడ వ్రాసాను.

      Delete

  6. మొత్తం మీద అబ్బాయి ప్రవీణు ని సక్రమ మార్గం లో పెట్టేస్తూన్నారు కొండలరావు గారు !!

    అబ్బాయి ప్రవీణు ! సెహభేష్!!

    ప్రవీణా మజాకా !!

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ప్రవీణా మజాకా !! అంతే! అంతే!! జిలేబి గారు.

      Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top