Name: | Marxist-Leninist |
E-Mail: | deleted |
Subject: | పన్ను విధానం ఎలా ఉండాలి? |
Message: | పన్ను వసూలు చెయ్యడం అనేది ఒక సాంకేతిక విషయం అనే నిజాన్ని కొందరు అంగీకరించలేకపోతున్నారు. మౌర్యుల కాలంలో ప్రజల నుంచి భూమి పన్ను వసూలు చేసేవాళ్ళు. రైతు తన భూమిలో పండిన పంటలో ఐదో భాగం పన్నుగా కట్టేవాడు. Goods Sales Tax అనేది అప్పట్లో లేదు. సంతలో మార్చుకున్న వస్తువులకి పన్ను వర్తించదు. పెట్టుబడిదారీ ప్రభుత్వం రోద్‌లూ, రైలు మార్గాలూ వెయ్యాలన్నా, పోలీస్ స్తేషన్‌లూ, కోర్త్‌లూ నడపాలన్నా, అందుకు ఆదాయం అవసరం కాబట్టి పెట్టుబడిదారీ ప్రభుత్వం కూడా పన్నులు వసూలు చేస్తుంది. సబ్సిదీలు ఇచ్చి, అందుకు ఖర్చయిన డబ్బు తిరిగి రాబట్టుకోవడానికి ప్రజల నుంచి అతిరిక్త పన్నులు వసూలు చెయ్యడం అనేది పాలక వర్గం యొక్క అంతర్గత విధానం మాత్రమే. పాలక వర్గం అస్తిత్వంలో ఉండడానికి ఇది తప్పనిసరి కాదు. మనిషి అస్తిత్వానికీ, పన్నుల విధానానికీ సంబంధం లేదు. పన్నులు ఎక్కువ కట్టే ధనవంతునికీ, పన్నులు తక్కువ కట్టే సాధారణ వ్యక్తికీ వేరువేరు హక్కులు అమలు చెయ్యలేము. ఈ లింక్‌లో నేను వ్రాసిన వ్యాఖ్యలు చదవండి, మీకు విషయం అర్థమవుతుంది: http://teluguvartalu.com/2014/ |
*Re-published
మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
janavijayam@gmail.com
రీ షెడ్యూలింగ్ అంటే బహుశా వాయిదా వెయ్యటం మాత్రమే అయ్యుంటుంది కదా? పూర్తిగా రద్దు చెయ్యటం అసాధ్యమని ఆ వాగ్దానం చేసిన వాళ్ళిద్దరికీ ముందే తెలిసి వుండొచ్చు! పట్టా పగలు జనాల చెవుల్లో పూలు పెడుతున్నారు.
ReplyDeleteబాంకులు ఇచ్చిన రుణాలను ప్రభుత్వం మాఫీ/రద్దు చేయలేదు కాబట్టి "రుణమాఫీ" సాంకేతికంగా అసాధ్యం. ప్రభుత్వం అప్పు తీరుస్తుందని వారి ఉద్దేశ్యం.
Deleteరీషెడ్యూలింగ్ వల్ల తాత్కాలికంగా లబ్ది తప్ప పెద్ద లాభం లేదు. అప్పు అలానే ఉంటుంది. వడ్డీ భారం పెరుగుతుంది.
ప్రజలకు సంబంధించి నంత వరకూ సాంకేతిక కారణాలు ఏవి ఎలా ఉన్నా, వాళ్ళ నెత్తి మీదనుండి రుణాల బరువు తొలగటం అన్నదే రుణాల మాఫీ. బాంకులు ఇచ్చిన రుణాలను ప్రభుత్వం మాఫీ/రద్దు చేయలేదు కాబట్టి అ రుణాలను బ్యాంకులకు ప్రభుత్వమే చెల్లించి రద్దు చేయవచ్చును. దానికేమి?
Deleteప్రభుత్వం బ్యాంక్‌లకి డబ్బులు కట్టాలంటే కేవలం ఆంధ్రాలోనే 40 వేల కోట్లు అప్పు ప్రపంచ బ్యాంక్ నుంచి తేవాలి. అప్పుడు రాష్ట్ర సగటు ఋణ భారం తలకి 8,000 అవుతుంది. దాని అర్థం పన్నుల రూపంలో ప్రతి మనిషి నుంచి అదనంగా 8,000 లాగాలని.
Deleteకె.సి.ఆర్. ఋణ మాఫీ గురించి స్పష్టంగా ఏమీ చెప్పలేదు కాబట్టి తెలంగాణా ప్రజల మీద ప్రపంచ బ్యాంక్ పోటు పడదు అనే అనుకుంటాను. ఉచిత విద్యుత్‌కి ప్రపంచ బ్యాంక్ అప్పు ఇవ్వదని గతంలో ప్రచారం చేసిన చంద్రబాబు ఋణ మాఫీకి మాత్రం ప్రపంచ బ్యాంక్ అప్పు దొరుకుతుందని ఎలా అనుకుంటున్నాడు?
శ్యామలీయం గారూ, ఒకరకంగా నేను మీరు ఒకటే మాట అంటున్నాము. ప్రభుత్వాలు రైతుల రుణాలను కొద్దోగొప్పో స్వీకరించి అంతమేరకు చెల్లించగలవు. చెల్లిస్తారా లేదా అన్నది వేచి చూద్దాం. (అలా చెల్లించడం సరికాదనే ఆర్ధిక నిపుణుల వాదనలు వేరే చర్చ).
Deletehttp://content.janavijayam.in/2014/07/blog-post.html
Deleteచంద్రబాబు మొదటినుంచీ ఆర్బీఐ వ్యతిరేకించినా తను సొంతంగా నిధులు సమకూర్చుకుని బాంకులకి ప్రభుత్వమే చెల్లించేటట్లుగా చేస్తా నంటున్నాడు.యెంతవరకూ అది పూర్తి చెయ్యగలడో చూడాలి!మొత్తం పాతిక కోట్లు అవస్రమనీ ఇప్పటికి ఓ పది కోట్లవరకూ నికరంగా లెక్క వుందనీ తెలుస్తున్నది.పారిశ్రామిక వర్గాల వారికి అంత వుదారంగా నష్టాలకు గురయినా కూడా ప్రోత్సాహ మిచ్చే వాళ్ళు రైతుల దగ్గిర కొచ్చేసరికి యెక్కద లేని వ్యంగ్యాలూ దరిద్రుల కింద లెక్కగట్తి మాట్లాడ్దం చూస్తుంతే ఆశ్చర్యం వేస్తుంది?
Deleteచంద్రబాబు మొదటినుంచీ ఆర్బీఐ వ్యతిరేకించినా తను సొంతంగా నిధులు సమకూర్చుకుని బాంకులకి ప్రభుత్వమే చెల్లించేటట్లుగా చేస్తా నంటున్నాడు.యెంతవరకూ అది పూర్తి చెయ్యగలడో చూడాలి!మొత్తం పాతిక కోట్లు అవసరమనీ ఇప్పటికి ఓ పది కోట్లవరకూ నికరంగా లెక్క వుందనీ తెలుస్తున్నది.పారిశ్రామిక వర్గాల వారికి అంత వుదారంగా నష్టాలకు గురయినా కూడా ప్రోత్సాహ మిచ్చే వాళ్ళు రైతుల దగ్గిర కొచ్చేసరికి యెక్కడ లేని వ్యంగ్యాలూ దరిద్రుల కింద లెక్కగట్ట్ మాట్లాడ్దం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది?
ReplyDelete