- పల్లా కొండల రావు.
*Re-published

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

kondalarao.palla@gmail.com
 

Post a Comment

  1. Replies
    1. జనం లో చర్చ అంటారా దీనిని శ్యామలరావు గారు. మీ అభిప్రాయం గతంలోనూ చెప్పారు. మీ అభిప్రాయం తప్పని నేను గతంలో చెప్పినదానికే కట్టుబడి ఉన్నానని విజ్ఞప్తి చేస్తున్నాను. చర్చ లేకుండా విజ్ఞానం కొందరికే చెందాలనుకోవడం తప్పు. చర్చిస్తే విజ్ఞానం తప్పై పోదు. చర్చలలో విజ్ఞానం తెలిసినవారు బాధ్యతగా పాల్గొని, సామాన్య భాషలో సాధారణ ఉపమానాలతో తెలియజేయగలిగితే సమాజానికి మంచిదే. సమాజానికి మంచి జరగడం మంచిది కాదా? జ్ఞానం తెలుసునన్న ఆధిపత్య ధోరణితో చర్చను తక్కువ చేసి చూడడం ఎట్టి పరిస్తితులలోనూ సమర్ధనీయం కాదు.

      Delete
    2. ఆదిపత్యదోరణి అన్నది వ్యక్తిగా మిమ్ములను కాదు. అది ఒక ధోరణి గా ఉండడాన్ని.

      Delete
    3. < సమస్తవిషయాలు సాధారణోపమానాలతోనూ పరభాషారహితంగానూ సరిగా వెలిబుచ్చటమూ అవగాహన చేసుకోవటమూ కష్టమే >

      అలా అని ప్రయత్నం ఆగదు. కష్టమే అన్నది నిజమే అసాధ్యం కాదు అన్నది నిజమే. * సాధనమున పనులు సమకూరు ధరలోన * అన్నది మీకు తెలియంది కాదు. ప్రతీది పరిస్తితులు , కాలము , ప్రదేశము లపై ఆధారపడి ఉంటాయి. జ్ఞాన సముపార్జనలోనూ వివిధ వ్యక్తుల మధ్య తారతం భేదాలు జన్యు మరియు ప్రయత్నాలపై ఆధారపడి ఉంటాయి.

      Delete
  2. జంతువులకే మనుషులకన్నా ఎక్కువ విచక్షణ ఉంటుంది. మనం మాట్లాడతాం అవి మాట్లాడవు. అంతే తేడా. మనకన్నా జంతువులే ఎక్కువ తెలివి కలవి. శబ్దం, వాసన బట్టి వ్యక్తులను గుర్తించడం శునకాలు బాగా చేయగలవు కనుకనే పోలీసులు జాగిలాలను ఉపయోగిస్తారు. ఆవు, ఎద్దు మనుషులకు ఎంత ఉపయోగమో చెప్పనవసరం లేదు. ధ్యానం చేయమని స్వామీజీ లు చెపుతుంటారు. మనం కూడా మాట్లాడడం తగ్గించి గమనించడం మొదలుపెడితే భవిష్యత్తుని ఊహించగలం. ఏదైనా ప్రమాదం జరగబోతున్నదని జంతువులే ముందుగా పసిగట్టి అప్రమత్తతగా ఉంటాయి.

    ReplyDelete
    Replies
    1. < మనం కూడా మాట్లాడడం తగ్గించి గమనించడం మొదలుపెడితే భవిష్యత్తుని ఊహించగలం >

      పరిస్తితులను బట్టి, పరిసరాలను బట్టి, వాటిని ఎదుర్కునే చైతన్యం బట్టి జ్ఞానాన్ని ఉపయోగించే శక్తిని ఉపయోగించుకోగలం. ధ్యానం కొందరికి అందుకు ఉపయోగపడితే పడవచ్చు.

      ఒక్కో జంతువుకు ఒక్కో ప్రత్యేక లక్షణ౦ జన్మతః ఉంటుంది. అవి మారవు. కానీ మనిషి అలా కాదు.

      Delete
    2. @ శ్యామలరావు గారు,
      < జంతులక్షణాలు మారవన్నది సరికాదు. >
      ఏ జంతువూ లక్షనాలు మారాయి? ఒక్క ఉదాహరణ చెప్పగలరా? అనాదిగా ప్రతి జంతువూ తన సహజ ( జన్మతః వచ్చిన ) లక్షనాలతొనే లక్షనాలతొనే జిఇవిస్తుంది. మనిషి నిరంతరం తను మారుతూ పరిసరాలను మారుస్తూ పరికరాలను తయారు చేస్తూ ఉన్నాడు.

      Delete
    3. < సవాలక్ష ఉదాహరణలున్నాయి. >

      పరిణామక్రమంలో కొత్త జీవులు పుట్టడం అనేది, జంతు లక్షనాలు మారడంగా చూడకూడదు. కొత్త జీవి ఏర్పడడంగా చూడాలి. వానరుడి నుండి నరుడు వచ్చింది అలాగే. కానీ వానరుడు నరుడు ఒకటి కావు.

      అలాగే కొత్త జీవులు ఎన్ని ఏర్పడినా వాటి లక్షణాలు జన్మతః వచ్చినవి మారడం లేదు.

      పిచ్చుక ఏ ఇంజనీరింగ్ కు అందని టెక్నాలజీతో గూడు కట్టుకుంటుంది. సాలీడు అంతే. గద్ద చాలా దూరం నుండి సూక్ష్మన్ని చూడగలదు. అవి వాటి సహజాతాలుగా ఉంటున్నాయి. ఈ లక్షణాలు మనిషికి ఉన్న వాటి కంటే బలమైనవీ, ప్రత్యేకమైనవీ అయి కూడా ఉంటున్నాయి.

      ఆయా లక్షణాలను, వివిధ పదార్ధ ధర్మాలను ఆధారం చేసుకుని మనిషి కొత్త పరికరాలను తయారు చేసుకుని వాడగలడు. ఇది ఇంకా అభివృద్ధి అవుతుంది. కానీ జంతువులూ అలా ఎన్నటికీ చేయలేవు. పోనీ ఇప్పటిదాకా చేయడం లేదు. ప్రత్యక్ష, పరోక్ష జ్ఞానాలను మనిషి మాత్రమే పొందుతున్నాడు. అందుకు భాష అభివృద్ధి చెందడం, మెదడులొ కెంద్ర నాడీ మండలం వృద్ధి చెందడం అనేవి కీలకం. దీనికి సంబంధించిన వైజ్ఞానిక పరిశోధనలు నిరంతరం అప్డేట్ అవుతున్న మాట నిజం. మన తెలుగులో వచ్చేవి నేను వీలైనంతమేరకు ఫాలో అవుతూనే ఉంటానండీ. ఇంగ్లీషులొ వచ్చె మేగజైనులలో అయినా మనిషిలా జంతువులో సహజ లక్షణాలు మారడం ఉన్నది అన్నది ఇంతవరకూ నిరూపితం కాలేదన్నది నాకున్న జ్ఞానసమాచారం.

      మనిషి జంతువులను మచ్చిక చేసుకోగలడు. ఏనుగును గడ్డిపోచతో కట్టేయగలదు. ప్రకృతి శక్తులను వాడుకోగలడు. ప్రకృతి రహస్యాలను చేదించగలదు. ఇది మనిషికి ప్రకృతి ఇచ్చిన వరం. అది మెదడు అభివ్ర్ద్ధి చెందడం అనే గుణం ద్వారా జరుగుతోంది. ఈ విచక్షణ లేకుంటే జంతువుల బలాల క్రింద మనిషి శక్తి బలాదూర్. మనిషిలో మెదడు నిరంతరం అభివృద్ధి చెందడం, చైతన్యం పెరగడమే జంతువులనుండి వేరుచేసే అంశం.

      Delete
    4. < మీకు తెలిసినంత శాస్త్రవిజ్ఞానం కాని తార్కికశక్తి కాని శాస్త్రజ్ఞులకు లేదని ఒప్పుకోవటమే ఈ చర్చను ముగించే విధానం అని బోధపడింది. >

      ఫలయనవాదం, ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ వంటి వాటివల్ల చర్చలలో ప్రయోజనం కలుగదు. ఈ రెండింటికీ నేను విలువ ఇవ్వను. బాధపడడంను అధిగమించాను. ధన్యవాదములు.

      Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top