ఏది నిజం?!
ఏది నిజం?! నిజమేదో అదే నిజం. ఏదైతే ఉన్నదో అదే నిజం. ఉన్నది మాత్రమే నిజం.
అయితే, ఉన్నదీ అని ఎలా తెలుస్తుంది? ఒకసారి నిరూపించబడింది - ఎప్పుడైనా నిరూపణకు అదే పద్దతిలో సాధ్యమయ్యేది నిజం. దీన్నే మనం శాస్త్రీయత అంటాం.
అయితే, కంటికి కనిపించేవి మాత్రమే నిజాలు అనుకోకూడదు. మనకు కనిపించకుండా ఉన్నవి ఎన్నో ఉన్నాయి. అవి కూడా నిజాలే.
గతంలో మనకు కనిపించకుండా ఉండి, తరువాత కనిపెట్టబడిన వాటిని బట్టి మాత్రమే ఇంకా మనకు తెలియని నిజాలు ఉన్నాయి అని చెప్పగలుగుతున్నాం.
అంతే తప్ప,
మన విశ్వాసాల ఆధారంగా, మన నమ్మకాల ఆధారంగా నిజాలను గుర్తించకూడదు. మన విశ్వాసాలు, నమ్మకాలు ఒక వేళ భవిష్యత్తులో పైన చెప్పిన పద్దతిలో నిరూపణకు ఋజువైతే అప్పుడవి నిజాలుగా మారుతాయి.
ప్రతి విశ్వాసమూ, నమ్మకమూ నిజాలు కావచ్చు, కాకపోవచ్చు. నిజాలుగా నిరూపితం కానంతవరకు విశ్వాసాలూ, నమ్మకాలూ వ్యక్తిగతాలు మాత్రమే.
వీటి ఆధారంగా కొన్ని భావాలు ఏర్పరచుకుని వాదించే ధోరణిని స్వీయమానసిక ధోరణి అంటారు. ఇది సరైనది కాదు.
విశ్వాసం కలిగి ఉండటం వేరు, నాకున్న విశ్వాసమే నిజమని వాదించడం వేరు. మొదటి దానిని గౌరవించవచ్చు, రెండవది ప్రమాదకరమైనది.
నేను నమ్ముతున్నాను కాబట్టి , నేను అన్నాను కాబట్టి అదే నిజమని నేను చెపితే మాత్రమే అది నిజం కాదు.
నిజం నిరూపణకు సిద్ధం కావాలి. ముఖ్యంగా అది ఉన్నట్లు కనీసం నీకైనా ఋజువు కావాలి.
నీకు ఋజువులతో నిరూపితమై, తిరుగులేని సత్యంగా తోచిన నిజాన్ని లక్షలమంది అజ్ఞానంతో వ్యతిరేకించినా ఝంకాల్సిన అవసరంలేదు.
ఏనాటికైనా అందరూ సత్యాన్ని మాత్రమే అనుసరించాల్సి ఉంటుంది. అది సత్యం. సత్యం గెలుస్తుందన్నమాట నిజం, కానీ గెలిచేదంతా సత్యం కాదు. సత్యమేవ జయతే !
- Palla Kondala Rao,
07-07-2012.
సత్యం పై మీ విలువైన అభిప్రాయం తెలియజేయండి.
*Re-published
మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
kondalarao.palla@gmail.com
కంటికి కనిపించేవన్నీ నిజాలు కాదు..... కంటివెనక దాగివున్నవి కూడా నిజాలవ్వచ్చు..!!
ReplyDeleteమంచిపోస్ట్ అండీ...!!చాలా బాగుంది
thank you seeta gaaru.
Deleteనీకు ఋజువులతో నిరూపితమై, తిరుగులేని సత్యంగా తోచిన నిజాన్ని లక్షలమంది అజ్ఞానంతో వ్యతిరేకించినా ఝంకాల్సిన అవసరంలేదు.
ReplyDeleteఅవునండీ !! బాగా చెప్పారు. మంచి పోస్ట్. Thank you very much!!
Thank You Vanaja gaaru.
Delete