మరో చక్కని గీతంతో నాకు నచ్చిన పాట శీర్షికన వచ్చేశాను. నేను ఏ కొంచెం ఆనందంగా వున్నా, ఈ పాటను బాగా చూడటానికి ఇష్టపడతాను. అందులోనూ సావిత్రమ్మ అభినయం, చుట్టూవున్న ప్రకృతి, కవుల ఊహలకు రూపమిచ్చినట్లుంటుంది. ఇక సాహిత్యమంటారా? ఆరోజుల్లో కవుల భావుకత ఆనాటి పరిస్తితులకు తగ్గట్టుగా ఉండేది. నేటి సాహిత్యం సంగతి చెప్పేదేమి ఉంది. వింటూనేవున్నాం, చూస్తూనే వున్నాం.
ఇక పాట విషయానికివస్తే 1964 లో వచ్చిన శ్రీ శంభు ఫిలింస్ వారి "పూజా ఫలం" చిత్రం లోని హాయి ఐన గీతం. సావిత్రి నటన అమోఘమని మరో మారు రుజువైన చిత్రం.
సుందర సురనందన వనమల్లి జాబిల్లి
అందేనా ఈ చేతుల కందేనా,
చంద మామ ఈ కనులకు విందేనా,
అందేనా ఈ చేతుల కందేనా.
ఆ మడుగున కనిపించి నా మనసున నివసించి
అంతలోనె ఆకాశపు అంచుల విహరించె
చందమామ ఈ కనులకు విందెనా
తలపుదాటనీక మనసు తలుపు వేయగలను గానీ
నింగిపైకి ఆశలనే నిచ్చెనేయ గలను గానీ
కొలనులోని కోర్కేలనె అలలపైన ఊగే కలువ పేద బ్రతుకులోన
వలపు తేనే నింపేనా
చందమామ ఈ కనులకు విందేనా
అందేనా ఈ చేతులకందేనా.
సంగీతం సమకూర్చిన యస్.రాజేశ్వరావుగారి సంగీతానికి ధీటు వేరు కలదా అనిపించక మానదు. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కలానికి తిరుగుందా?.నేడువిన్నా ఇలానే స్పురిస్తుంది. పదికాలాలపాటు మదిలో నిలిచిపోయే ఇంత చక్కని గీతన్ని మీరూ అస్వాదిస్తారని ఆశిస్తూ....
- మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి.
*** *** ***
మీరూ మీకు నచ్చిన పాట గురించి వ్రాయాలనుకుంటే ఇక్కడ నొక్కండి.
*** *** ***
*Republished
Thank you Rajyalakshmi garu.
ReplyDelete