*Re-published
మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
kondalarao.palla@gmail.comమీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
kondalarao.palla@gmail.com
* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ చూశాను. సినిమా తీసిన విధానం బాగుంది. రామ్ గోపాల్ వర్మ అన్ని నిజాలూ చూపెడతాడేమో అనుకున్నవారికి మాత్రం నిరాశ ఎదురవుతుంది. చంద్రబాబు వ్యతిరేకులకు చాలా సంతోషం కలిగిస్తుందీ సినిమా. చంద్రబాబు చచ్చేదాకా ఎన్.టి.ఆర్ వీరి గుండెలలో మిగిలే ఉంటాడు. తెలుగువారి గుండెలలో మాత్రం ఎన్.టి.ఆర్ చరిత్ర నిలచి ఉంటుంది. ఎన్.టి.ఆర్ ‘భ’యోపిక్ విషయంలో బావచాటు బాలయ్య ఫెయిలయ్యాడు. బరితెగింపు వర్మ సక్సెస్ అయ్యాడు. లక్ష్మీపార్వతిని దేవతగా చూపడం మాత్రం వింతగా అనిపించింది. చంద్రబాబును సరిగానే ప్రొజెక్టు చేశాడు వర్మ.
ReplyDeleteనా అభిప్రాయం ఎన్.టి.ఆర్ మంచిపాలకుడు కాదు. ఉదాత్తమైన వ్యక్తీ కాదు. తెలుగు ప్రజల అభిమానం చూరగొన్న నటుడు. ఆయన పార్టీ పెట్టిన సమయమూ, పరిస్థితులూ బాగా కలసి వచ్చాయి.
ReplyDeleteవ్యక్తిగతంగా అవినీతిపరుడు కాకున్ననూ, విపరీత స్వీయమానసిక ధోరణి కలవాడు. అంటే అవసరానికి మించిన స్వాభిమానం ఉన్న వ్యక్తి. ఇటువంటి వారివల్ల సమాజానికి మంచి ఎంతో, చెడూ అంతే జరిగే అవకాశం ఉంది.
లక్ష్మీపార్వతి బుట్టలో పడి ఆయన చేసిన తప్పులు ఉన్నాయి. పాలన మీదా, రాజకీయ వారసత్వంపైనా పార్వతి కన్నేసిందన్నది నా అభిప్రాయం. దీనిని చంద్రబాబు తన మీడియా బలం, బుద్ధిబలంతో తనకు అనుకూలంగా మలచుకోగలిగాడు.
బాబు లేకుంటే తెలుగుదేశం ఇప్పటిదాకా నిలబడదు. ఇప్పుడు ఏ.పీలో ఓడిపోతే ఇకపైన మనగలగదు అనేది నా అంచనా.
విపరీత స్వాభిమానంతో ఎన్.టీ.ఆర్ కుటుంబాన్ని దూరంగా పెట్టాడన్నది నా అభిప్రాయం. దీనిని లక్స్మీపార్వతి తెలివిగా వాడుకోవాలని చూసింది.
ఎన్.టి.ఆర్ కు వారసురాలిగా పార్వతిని జనం చూడలేదు. చూడరు కూడా. అప్పటి ఎన్నికలలో బాబుకి జనం బ్రహ్మరధం పట్టగా పార్వతి పార్టీకి డిపాజిట్లు కూడా రాలలేదు.
ఇపుడు వర్మ ఆర్ధిక ప్రయోజనాల కోసం, ఆయనకున్న అహం ప్రకారం ఆయన చెపుతున్నట్లుగానే కేవలం ఆయన నమ్మిన నిజాన్ని అసలు కథగా కథలు చెపుతున్నారు. బాబు వ్యతిరేకులకు బాగా నచ్చేలా, పార్వతిని దేవతగా బుకాయించేలా సినిమా తీశాడు.
బాలయ్యను ఎన్.టి.ఆర్ పాత్రలో చూడడం కష్టం మరియూ సంపూర్ణంగా ఎన్.టి.ఆర్ స్టోరీని తీసే దమ్ము లేని బావచాటు బాలయ్యను రెండు సినిమాలలోనూ జనం ఆదరించలేకపోయారు.
ఇప్పుడు ఎన్.టి.ఆర్ పై ఒక అభిమానిగా సినిమా తీశానని చెప్పడం వర్మ బుకాయింపు లేదా అతని ఖర్మ మాత్రమే. ఆయనేదో శోధన చేసి కొత్తగా కనిపెట్టింది మాత్రం లేదు.
నమస్తే, ఈరోజున ఒక వ్యాఖ్యలో మీరు "లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ చూశాను. ......లక్ష్మీపార్వతిని దేవతగా చూపడం మాత్రం వింతగా అనిపించింది. " అని అన్నారు.
ReplyDeleteఈ సినిమాకు ఆధారం లక్ష్మీపార్వతి గారు వ్రాసిన పుస్తకం అని వర్మ అంటున్నట్లు చదివాను. అటువంటప్పుడు ఆవిడ తననుతాను సాక్షాత్తూ ముల్లోకమాతలా ప్రొజెక్ట్ చేసుకోవటంలో వింత యేముంటుంది?
ఎవరన్నా మీ బ్లాగులో ప్రస్తావిస్తారో లేదో తెలియదు కాని చంద్రబాబు గారు రామారావు గారిని దింపు గద్ద్దెకెక్కినప్పుడు, అటు రామారావూ ఇటు లక్ష్మీపార్వతీ ఎన్నో మాటలన్నారు.
కాని పార్టియే కాదు, ప్రజలూ చంద్రబాబు చేసినదే సరైన దన్నట్లు తీర్పు ఇచ్చాక ఆయన్ను తప్పుబట్టకూడద. అదే సమయంలో ఇటు లక్ష్మీపార్వతి తనూ తనతో పాటు తను పెట్టిన ప్రజాస్వామ్య తెలుగుదేశం పార్టీ తాలూకు మొత్తం 294/294 స్థానాల్లోనూ డిపోజిట్ పోగొట్టుకొని ప్రపంచ రికార్డు స్థాపించిన విషయం కూడా కలిపి ఆలోచిస్తే ఇంక చంద్రబాబును తప్పుపట్టుకోవటం ఆ గోలను పదేపదే చేయటం కేవలం రాజకీయం తప్ప మరేమీ కాదు.
ఇప్పుడు ఆ అక్ష్మీపార్వతి మాటకు విలువ ఇవ్వటం అప్పట్లో ప్రజలు ఇచ్చిన తీర్పును అవమానించటమే. ఆవిడకు చంద్రబాబు వైరి కాబట్టి నిత్యమూ ఏదో ఒక చోట చేరి అవాకులూ చెవాకులూ మాట్లాడుతుంది - పట్టించుకోవాలా మనం?
ఇంక వర్మకు కావలసింది డబ్బు. ఆయన తెలివైన వాడు. పదిలక్షలు పెట్టి ఒక సినిమా తీసి పదికోట్లు సంపాదించుకోగలడు. అమ్దుకు ఆయనకు అవకాశం ఇలా వచ్చింది వాడుకున్నాడు.
ఈమాత్రానికి జనం ఎందు పట్టించుకోవాలీ? బాలకృష్ణకు నటన ఏమీ రాదు. రామారావుగారబ్బాయి. అంతే. అతన్ని అస్సలు రామారావు పాత్రలో జనం పట్టించుకోరు.
(ఓ మిత్రుడు నాకు పర్సనల్ గా పంపిన అభిప్రాయం ఇక్కడ పోస్టు చేశాను)
"అదే సమయంలో ఇటు లక్ష్మీపార్వతి తనూ తనతో పాటు తను పెట్టిన ప్రజాస్వామ్య తెలుగుదేశం పార్టీ తాలూకు మొత్తం 294/294 స్థానాల్లోనూ డిపోజిట్ పోగొట్టుకొని ప్రపంచ రికార్డు స్థాపించిన విషయం కూడా కలిపి ఆలోచిస్తే"
Delete"ప్రజాస్వామ్య తెలుగుదేశం పార్టీ" పేరుతో 1984లో పార్టీ పెట్టింది నాదెండ్ల భాస్కర రావు.
ఇకపోతే లక్ష్మీ పార్వతి వర్గం 294 సీట్లు ఎప్పుడూ పోటీ చేయలేదు కనుక "294/294 స్థానాల్లోనూ డిపోజిట్ పోగొట్టుకొని" అనడం అవాస్తవం.
294 చేసిందా లేదా చెక్ చేయాలి. ఎన్టీయార్ టిడిపి (ఎల్.పి) పార్టీ తరపున పోటీ చేసింది. ఎన్ని సీట్లు అన్నది చూడాలి. మొత్తం సీట్లు పోటీ చేశారని గుర్తు.
Delete"ప్రజాస్వామ్య తెలుగుదేశం పార్టీ" పేరుతో 1984లో పార్టీ పెట్టింది నాదెండ్ల భాస్కర రావు.
Deleteరేణుక చౌదరి కూడా ఏదో తెలుగుదేశం పెట్టినట్లుంది జై గారు.
NTRTDP(LP)
Deleteపోటీ-గెలుపు-డిపాజిట్ గల్లంతు-ఓట్లు
1996 Loksabha elections: 42 0 36 3249267
1998 Loksabha elections: 5 0 3 384211
1999 assembly elections: 71 0 70 53259
1999 Loksabha elections: 13 0 13 61635
రేణుకా చౌదరి పార్టీ పెట్టారో లేదో నాకు తెలీదు. టీడీపీ నుండి బహిష్కరణ తరువాత కొద్ది రోజులు "గాలివాటం పరీక్షించి" నా వల్ల కాదని అనిపించి కాంగ్రెస్ గూటికి చేరినట్టు అంటారు.
tq for d info jai garu.
Deleteనా అభిప్రాయం చెప్పిన వీడియో .. మీ బ్లాగులో పెట్టినందుకు ధన్యవాదాలు. మరో వైపు నేను కూడా ఈరోజు సినిమా చూశాను. సినిమా చూసిన ప్రేక్షకురాలు ఎన్టీఆర్ వచ్చినపుడు ఎవరు ఈలలు వేయలేదు . చంద్రబాబు పాత్ర కనిపించగానే ఫుల్ ఈలలు వేశారు. ఇంకొక ముఖ్యమైన విషయం .. ఆఖరులో ఎన్టీఆర్ తుది శ్వాస విడిచాక లక్ష్మి పార్వతిని అయన మృత దేహము వద్దకు రాకుండా నెట్టేసినట్టు చూపించాడు.. ఇది ఎలా నిజాన్ని చూపించడం అవుతుంది. యు ట్యూబ్ లో ఎన్టీఆర్ అంతిమ యాత్ర వీడియోలు వున్నాయి. అందులో లక్ష్మి పార్వతి ఎన్టీఆర్ మృత దేహం పక్కనే ఉన్నట్టు స్పష్టంగా చూడొచ్చు. మరి నిజాన్ని చూపించడం అనే మాట వర్మ ఎలా వాడాడు. ఇంకా నిశితంగా అర్ధం చేసుకుంటే సామాన్యుడు కూడా ఎన్టీఆర్, లక్ష్మి ల విషయాన్నీ తెర పై చూసి హాయిగా నవ్వు కున్నారు. లక్ష్మి కనిపించగానే వెయ్యి, వెయ్యి అనే గోల వినిపించింది. సినిమా పూర్తిగా చరిత్రను వక్రీకరించినట్టుంది. ఈ సినిమా లో ఎన్టీఆర్ ను స్తీ లోలుడిగా , తన మనసులో మాట లను ఫిర్యాదుల్లా ఎన్టీఆర్ కు చెప్పడం. ఆలా వద్దు , యిలా వద్దు అంటే మొండిగా ఎన్టీఆర్ వినడని తెలిసి తప్పుదోవ పట్టించినట్టు చూపించారు. అదే తప్పుడు తోవను తెలివిగా చంద్రబాబు వాడుకొని పార్తిని ఇప్పటివరకు నిలిపి ఎన్టీఆర్ ఆశయాలను ఇంకా బతికిస్తున్నట్టే లెక్క .. ఎన్టీఆర్ కొడుకుల్లో ఏ ఒక్కరికి కూడా ఆ సామర్ధ్యం లేదు. ఇది ఆంధ్రాలో విడుదల అయినా బాబుకు పెద్ద ఇబ్బంది ఏమి ఉండక పోయేది. ఇంకో విషయం ఏంటంటే వర్మ కేవలం నలుగురు డ్రామా ఆర్టిస్టులను, నలుగురు మిమిక్రి ఆర్టిస్టులను, ఓ మిద్దె భవనం అద్దెకు తీసుకొని, ఓ వందమంది జూనియర్ ఆర్టిస్టులను , 50 మంది కూలీలను , 5డి కెమెరా , మిక్సింగ్ , ఎడిటింగ్ ఖర్చులతో మొత్తంగా 30 లక్షలకు మించిన ఖర్చు కాకుండా , సినిమా తీశాడు. వివాదాన్ని వాడుకొని కోట్లు గడించాడు. వెర్రి పువ్వులు అయ్యింది ఎవరు. ఇన్ని చర్చలు పెట్టిన మీడియానా , ఆకాశానికి ఎత్తిన వివాదాల .. ఛాయస్ ఈజ్ యువర్స్ .
ReplyDeleteయస్ జనార్ధన్. హరిక్రుష్ణ వచ్చేదాకా ఎన్.టి.ఆర్ మ్రుతదేహం వద్ద బసవతారకం ఫోటో కూడా పెట్టలేదని గుర్తు. చంద్రబాబు లేకుంటే తెలుగుదేశం చచ్చిపోయేదన్నది నిజం. ఎన్.టి.ఆర్ కుటుంబాన్ని మరీ హీనంగా చూపడం దారుణమే. ఎన్.టి.ఆర్ జీవితంలో హరిక్రుష్ణ పాత్ర త్యాగపూరితమైనది. వర్మకు అలాంటివేమీ చూపించే ధైర్యం లేకపోయిందా? మీరన్నట్లు కాసులకు అమ్ముడు పోయాడా?
Deletek + r + u = క్రు
Deletek + R = కృ
లేఖినిలో వస్తున్నది. కానీ నా లాప్ టాప్ లో వేరే సాఫ్ట్ వేర్ ఉంది. అందులో రావడం లేదు చిరంజీవి గారు. నా దగ్గర ఉన్నది Apple key board ను సపోర్టు చేస్తుంది, కానీ చాలా అక్షరాలు తప్పు వస్తున్నాయి. మార్చాలి.
Deleteజనార్ధన్ గారూ నిఖార్సయిన రివ్యూ ఇచ్చారు.
ReplyDeleteకొండలరావు గారూ,
ReplyDeleteమీరేమిటి పనిగట్టుకుని ఆ సినిమా చూడడం ?
టీవీ లో వచ్చేదాకా ఆగలేకపోయరా ?
మీకు భయోపిక్ లు నచ్చవు కదా ?
వర్మ ఎలా తీశాడో చూద్దామనుకున్నానండీ. అందుకే నా అభిప్రాయం చెప్పాను. వర్మకు తెలుసు తనకేం కావాలో. అది అతనికి ల(లా)భించింది. పార్వతి పాత్రని చూస్తంటే మాత్రం వర్మ మీద తొలిసారిగా విపరీతమైన జాలేసింది.
Deleteమరో విషయం అనవసరంగా మళ్ళీ బాబు ఈ సినిమా విషయంలోనూ భయపడుతున్నాడనిపిస్తోంది. జనార్ధన్ చెప్పినట్లు ఈ సినిమా ఆంధ్రలో విడుదలయితే తెలుగుదేశంకు ఫేవర్ అవుతుంది. టి.డి.పి కార్యకర్తలయితే కసిగా పనిచేస్తారు. ఇప్పటికే మా కే.సి.ఆర్ పుణ్యమా అని బాబు గ్రాఫ్ రోజురోజుకూ పెరుగుతోంది. గెలిచినా ఆశ్చర్యం లేదనిపిస్తోంది.
Deleteలక్ష్మీపార్వతి బయోపిక్ అనుకోని చూస్తే పోలా!
Deleteఅలా అసలే అనుకోలేమండీ. బహుశా కుటుంబం, భార్యా భర్తల అనుబంధం, మానవసంబంధాలపై విపరీత మనస్తత్వం ఉన్న వర్మలాంటి వారికి మాత్రమే పార్వతిని అంతగా అంతరాంతరాల లోతులలోకి పోయి ఎక్కడో ఉన్న దేవత ను వెలికితీసే శక్తి ఉంటుంది.
Delete"ఎన్.టి.ఆర్ జీవితంలో హరిక్రుష్ణ పాత్ర త్యాగపూరితమైనది"
ReplyDeleteహరికృష్ణ త్యాగమూర్తి ఏమిటండీ? రామారావు తాను గెలిచిన రెండు సీట్లలో హిందూపురం ఉంచుకొని టెక్కలికి రాజీనామా చేసాక దాని మీద హరికృష్ణ కన్నేసాడు. ఉపఎన్నికలలో ఆ సీటు హనుమంతు అప్పయ్య దొరకు ఇచ్చారన్న కోపంతో చంద్రబాబు కాంపులో చేరాడు. ఆ తరువాత కాలంలో జాస్తి చెలమేశ్వర్ & యార్లగడ్డ లాంటి హరికృష్ణ సమర్థకులకు చంద్రబాబుకు చెడడం మూలాన సొంత కుంపటి పెట్టుకొని 1999 ఎన్నికలలో పరువు పోగొట్టుకున్నాడు.
చైతన్యరథసారథినంటూ బడాయిలు పోయే హరికృష్ణ 1983 ఎన్నికలలో ప్రచారం జోలికే రాలేదని, అప్పట్లో రామారావు డ్రైవరే బండి తోలాడని దగ్గుబాటి పుస్తకంలో ఉంది.
మీకు అలా అనిపించడం సహజమే. మీరు దగ్గుబాటి వ్రాసింది నమ్మి నన్ను కూడా నమ్మమంటున్నారు. దగ్గుబాటి వ్రాస్తే అది జై కు నచ్చితే భగవద్గీత అయిపోవాలని లేదని మీకు తెలియంది కాదు. దగ్గుబాటి కి సరైన గుర్తింపు చంద్రబాబు ఇచ్చి ఉంటే పుస్తకం వ్రాసేవాడా? వ్రాస్తే అలా వ్రాసేవాడా? మీరే ఆలోచించుకోండి. ఖచ్చితంగా ఎన్.టి.ఆర్ కు హరిక్రుష్ణ సేవలు త్యాగపూరితమయినవే అన్నది నా అభిప్రాయం. మీరు కానీ, మరొకరు కానీ ఏకీభవించాలని లేదు. మీ అంచనాలు మీవి. నా అభిప్రాయం నాది.
Delete< ఆ తరువాత కాలంలో జాస్తి చెలమేశ్వర్ & యార్లగడ్డ లాంటి హరికృష్ణ సమర్థకులకు చంద్రబాబుకు చెడడం మూలాన సొంత కుంపటి పెట్టుకొని 1999 ఎన్నికలలో పరువు పోగొట్టుకున్నాడు.>
Deleteఅన్న తెలుగుదేశం ఓ ప్రయత్నం. రాబోయే కాలంలో జూ.ఎన్.టి.ఆర్ ఏం చేస్తాడో. ఎన్నికలలో ఓడిపోతే పరువుపోగొట్టుకున్నట్లా? పార్వతి 294 స్థానాలలో డిపాజిట్లు కోల్పోయి, వై.కా.పాలో చేరితే పరువు నిలుపుకున్నట్లా?
నేను దగ్గుబాటి చెప్పిందే కరెక్ట్ అనలేదండీ. అది కూడా ఒక వెర్షన్, రెంటినీ బేరీజు వేసుకోవాలి.
Deleteహరికృష్ణ టెక్కలి కోసం ప్రయత్నం (ఉ. రామకృష్ణ థియేటర్ బయట గోడరాతలు) చేయడం, టికెట్ దొరక్క భంగపడడం గురించి ఈనాడులో కూడా వచ్చింది.
అప్పట్లో ఇరు పక్షాలు ఒకరిమీద ఒకరు దారుణంగా ఆరోపణలు చేసుకున్నారు: మీడియా రామోజీ & కో అదుపులో ఉండడం మూలాన ఒకే వెర్షన్ హైలైట్ అయింది. ఇన్నేళ్లకు లక్ష్మీపార్వతి వెర్షన్ బయటికి వచ్చింది.
నా అనుమానం ప్రకారం ఈ ఉదంతంలో రామారావు వర్గం మీద బాబు బృందం వేసిన ఆరోపణలు, అలాగే వైసీవెర్సా కూడా (చాలా మటుకు) నిజాలే అయి ఉండవచ్చు.
మీడియా, ముఖ్యంగా రామోజీ కంపెనీ బాబుకు అనుకూలంగా పనిచేసింది. ఇప్పటికీ చేస్తోంది. అతని ఆర్ధిక ప్రయోజనాలు నెరవేరుతాయనుకుంటే రామోజీ బాబుతోనే కాదు, కే.సీ.ఆర్ తోనూ కుమ్మక్కయ్యాడు.
Deleteమీరన్నట్లు పార్వతి ఎపిసోడ్లో అనేక వాదనలున్నాయి. ఇప్పటికీ యూ ట్యూబులలో వస్తూనే ఉన్నాయి.
అయితే నా అంచనా ప్రకారం రామారావు స్వయంక్రుతమే ఎక్కువ. రామారావు-పార్వతి ల ప్రేమ, పెండ్లి, త్యాగాలు వర్మ చెప్పిన తీరులో ఉన్నాయని నేను నమ్మడం లేదు. అది వర్మ కు పట్టిన ఖర్మ తప్ప లోకానికి ఆ జంట నుండి ఆదర్శంగా తీసుకోవలసిన అంశం ఒక్కటి కూడా లేదు. అప్పట్లో ఆంధ్రభూమిలో వీరగంధం విలాపం అని వచ్చింది. అది కాంగ్రెస్ వారు చేయించారు. మరి వీరగంధంకు జరిగిన లేదా జరిపిన అన్యాయాన్ని కూడా వర్మ నిజాయితీగా చూపగలిగితే అసలు కథ ఇంకాస్త రక్తికట్టేది.
"రామారావు-పార్వతి ల ప్రేమ, పెండ్లి, త్యాగాలు వర్మ చెప్పిన తీరులో ఉన్నాయని నేను నమ్మడం లేదు"
Deleteరామారావు-లక్ష్మీ పార్వతి "పెండ్లి"లో ఆత్మీయత, అనురాగం, త్యాగం, ఆదర్శ దాంపత్యం, అన్యోయత వగైరాలు వర్మ చెప్పిన స్థాయిలోనే కాదు, అసలంటూ ఉన్నాయా అన్నది ప్రశ్నార్థకమే.
"వీరగంధం విలాపం"
ఆ సినిమా కూడా తొందరగా రిలీస్ అయితే వరుసగా నాలుగో "భయో"పిక్కు, కామెడీ ప్రియులకు పండుగే పండుగ!
ఎన్.టి.ఆర్. కూతురు లక్ష్మీ పార్వతి మీద సివిల్ కేస్ వేసి ఇల్లు ఖాళీ చెయ్యించినప్పటి నుంచి లక్ష్మీ పార్వతి వీరగంధం గారి కొడుకు ఇంటిలో ఉంటోంది. ఆమె వీరగంధం గారికి విడాకులు ఇవ్వలేదు. ఇందాకే ఒక యూట్యూబ్ వీడియో చూసాను.
Delete‘‘వీరగంధం విలాపం’’ నిర్మాత దొరకడం కష్టం. ఎందుకంటే అంతగా ప్రేక్షకులుండరు కనుక.
Deleteయాత్ర సినిమా విడుదల చేసినప్పుడు దానికి పోటీగా మోహన్ రావిపాటి అనే అసమదీయ భజనపరుడు ఒకాయన "నేనే ముఖ్యమంత్రి" పేరుతో వేరే సినిమా రిలీస్ చేసాడు. ఎన్ని షోలు ఆడిందో లేదో కానీ అను"కుల" మీడియాలో ప్రోమోలు మాత్రం చాలానే వచ్చాయి.
Deleteఇటువంటి వాటి ఉద్దేశ్యం కన్ఫ్యూస్ చేయడమే. ఖర్చులకు "స్పాన్సర్లు" ఉంటారు కనుక సదరు జీతగాడి జేబుకు చిల్లు పడదు.
https://telugu.asianetnews.com/entertainment/nene-mukyamantri-telug-movie-review-pmnfh9
Delete"మిగతా విషయాలకొ స్తే దర్శకుడు మోహన్ రావిపాటి కి ఇది *మొదటి* సినిమా"
https://twitter.com/ravipatimohan
అన్న తెలుగుదేశం ఓ ప్రయత్నం. రాబోయే కాలంలో జూ.ఎన్.టి.ఆర్ ఏం చేస్తాడో. ఎన్నికలలో ఓడిపోతే పరువుపోగొట్టుకున్నట్లా? పార్వతి 294 స్థానాలలో డిపాజిట్లు కోల్పోయి, వై.కా.పాలో చేరితే పరువు నిలుపుకున్నట్లా?
ReplyDelete👌👌👌👌👌
"పార్వతి 294 స్థానాలలో డిపాజిట్లు కోల్పోయి"
DeleteWhich elections?
ఎన్.టి.ఆర్ చనిపోయిన తరువాత మొదటి ఎన్నికలలో
Deleteకే.సి.ఆర్ పుణ్యమా అని బాబు గ్రాఫ్ రోజురోజుకూ పెరుగుతోంది. గెలిచినా ఆశ్చర్యం లేదనిపిస్తోంది.
ReplyDeleteReturn Gift Effect !
ఈ సినిమా నేను చూడలేదు కాబట్టి సినిమా గురించి నేను కామెంట్ వ్రాయలేను. ఎన్.టి.ఆర్. ఒక వ్యభిచారి అనే నిజాన్ని చూపించే ధైర్యం ఏ సినిమావాడికైనా ఉంటుందో, లేదో నాకు డౌటే. వీరగంధం వెంకట సుబ్బారావు ఇప్పుడు బతికి ఉన్నాడో, లేదో నాకు తెలియదు. ఎన్.టి.ఆర్. చనిపోయినప్పటి నుంచి లక్ష్మీ పార్వతి తాను విధవనని చెప్పుకుంటోంది. భర్త బతికుండగానే (విడాకులు ఇవ్వకుండానే) ఎన్.టి.ఆర్.ని పెళ్ళి చేసుకున్న లక్ష్మీ పార్వతి ఎన్.టి.ఆర్. చనిపోయిన తరువాత తాను విధవనని ఎలా చెప్పుకుంటుంది?
ReplyDeleteఈమె విడాకులు అడిగితే ఆయన ఇవ్వలేదనుకుంటా ప్రవీణ్ గారు.
DeleteTo the best of my knowledge, Veeragandham's son Koteswara Prasad received lofty amounts of money from NTR after Lakshmi Parvati's second marriage.
Deleteకోటేశ్వర ప్రసాద్ తల్లి లక్ష్మీ పార్వతి కాదా?
Deleteఎన్.టి.ఆర్. పిల్లికి కూడా బిచ్చం పెట్టేవాడు కాదు అనే టాక్ ఉంది. అతను తన సవతికొడుక్కి డబ్బులు ఎలా పంపించాడు అనేది నాకు ఇప్పుడు కూడా డౌటే.
Deleteసవతి కొడుకు అనొచ్చా?
Deleteవొకాబ్యులరీ సంగతి తరువాత చూద్దాం. ఎన్.టి.ఆర్. నిజంగా కోటేశ్వర ప్రసాద్‌కి డబ్బులు ఇచ్చి ఉండకపోవచ్చు. బసవతారకం పిల్లల్ని రెచ్చగొట్టడానికి చంద్రబాబు ఆ పుకార్ చేసి ఉంటాడు. ఎన్.టి.ఆర్. పిల్లికి కూడా బిచ్చం పెట్టడు అని చెప్పినది మాత్రం సినిమావాళలు. సినిమాల్లో వాడిన కాస్ట్యూంస్‌ని ఆయన ఇంటికి తీసుకెళ్ళిపోయేవాడనీ, తిరిగి ఇచ్చేవాడు కాదనీ ఆ టాక్.
Deleteపార్వతి కొడుకు కోటేశ్వరరావుని ఎన్.టి.ఆర్ ఆర్ధిక సహాయంతో డాక్టరు చదివించారని లక్ష్మీపార్వతే చెప్పినట్లు గుర్తు.
Deleteఅతను ఎన్.టి.ఆర్.కి కొడుకుతో సమానం కాబట్టి అతన్ని ఎన్.టి.ఆర్. డాక్టర్‌ని చెయ్యాలనుకుని ఉండొచ్చు. దాన్ని దానం అనరు.
Deleteకొడుకుతో సమానంగా భావించి చేయలేదు, పార్వతి మత్తులో... పార్వతి పోరుతో చేయించి ఉంటాడు.
Delete1989 ఎన్నికలలో తుక్కుగా ఓడిపోయాక రామారావు ఆస్తి మొత్తం పిల్లలకు పంచేసాడు. సవితి కొడుకును చదివించడానికి డబ్బులు ఎక్కడివి?
Deleteఆ విషయం వెల్లడించిన పార్వతి ని అడగాలి.
Deleteపుకార్లు అనేక రకాలుగా షికార్లు చేస్తాయి. చిన్నప్పుడు నేను విన్నది ఏమిటంటే "లక్ష్మీ పార్వతి వీరగంధం గారికి విడాకులు ఇవ్వకుండానే ఎన్.టి.ఆర్.ని పెళ్ళి చేసుకుంది, ఎన్.టి.ఆర్.ని పెళ్ళి చేసుకున్న తరువాత కూడా ఆమె వీరగంధం గారి ఇంటికి డబ్బులు పంపిస్తుండేది" అని. ఈ పుకారుని నా దగ్గరకి చేర వేసినది కొందరు ఆడవాళ్ళే. ఈ మధ్యనే ఒక వీడియో చూసాను. లక్ష్మీ పార్వతి తన అనుమతి లేకుండానే ఎన్.టి.ఆర్.ని పెళ్ళి చేసుకుందని వీరగంధం గారి వాదన. పుకార్లని వెంటనే నమ్మకపోవడం మంచిది. భర్త బతికే ఉన్న స్త్రీని పెళ్ళి చేసుకుని ఆమె భర్తని పోషించేంత కళా హృదయం ఎన్.టి.ఆర్.కి లేదేమో అనిపిస్తుంది. షూటింగ్‌ల నుంచి కాస్ట్యూమ్‌స్ ఇంటికి తీసుకొచ్చే కక్కుర్తి మనిషి తన భార్య యొక్క మొదటి మొగుణ్ణి పోషిస్తాడంటే నమ్మలేం.
Deleteనాకు తెలిసినంతవరకు ఎన్.టి.ఆర్ తను నటించే సినిమా చివరి షాట్ లో ఉన్న మేకప్ తో సహా ఇంటికి వెళ్ళేవారు. కక్కుర్తి అనడం కంటే డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండేవాడు. ఉండమని ఇతరులకూ చెప్పేవాడు. తాను అనుకున్నదే శాసనం అనుకునే రకం తప్ప పిసినిగొట్టు కాదనుకుంటాను. అల్లూరి సీతరామరాజు తాను తీయను, నువ్వు తీయోద్దని క్రుష్ణకు చెప్పినా వినలేదని 10 ఏండ్లు క్రుష్ణతో మాట్లాడలేదు. ఇలా తను చెప్పిందే వినాలనే అహంభావం ఉన్న వ్యక్తి. కుటుంబం విషయంలోనూ అదే మొండితనం ప్రదర్శించి దూరమయ్యాడు. దీనిని పార్వతి, బాబులు ఇరువురూ తెలివిగా వాడుకున్నారు.
Deleteవీరగంధం ఇంటికి డబ్బులు వెళ్ళాయి అనేది మాత్రం పుకారే అయ్యుంటుంది. లక్ష్మీ పార్వతి వీరగంధం గారి అనుమతి లేకుండానే ఎన్.టి.ఆర్.ని పెళ్ళి చేసుకుందనే పాయింటే ఇక్కడ నమ్మొచ్చు అనుకుంటాను. ఎలాగైనా ఎన్.టి.ఆర్. వీరగంధాన్ని పోషించేత కళా హృదయుడు కాదు.
Delete