మనుషులందరూ ఒకే స్వభావం కలిగి ఉండరు. జ్ఞానం, బుద్ధి , స్వభావం విషయం లో పుట్టుకతో ఏర్పడే దానికి, పెరిగే పరిస్తితులలో ఏర్పడే దానికి తేడా, సంబంధం ఏమిటి?



'మనం మారగలం' అనే సబ్జెక్ట్ కోసం నాకున్న ఆలోచనకు మెరుగైన సలహాలు, సూచనలు, సమాచారం పొందడం ఈ టపా ఉద్దేశం.
- పల్లా కొండల రావు,
26-11-2019.
*Re-published

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

kondalarao.palla@gmail.com

Post a Comment

  1. ఇలాంటి విషయాలు చాగంటి, గరికపాటి ని అడిగితే నిరవధిగా విశదీకరిస్తారు.

    ReplyDelete
    Replies
    1. వారు చెప్పేవి సంపూర్ణం కావు. ఒక మత సాంప్రదాయాలను లేదా వాటిలోని మంచిని మాత్రమే వివరించగలరు. అంతకు మించిన శాస్త్రీయ అవగాహనతో విషయపరిజ్ఞానం కలిగిన వాదనలు లేదా వాస్తవాలు కావాలి.

      Delete
    2. జ్ఞాన సముపార్జన జీవితాంతం సాగవలసిన కార్యం. మహనీయుల ప్రవచనములు వినడం, గొప్ప వారి రచనలు చదవడం, శ్రావణ, మన న , నిధిధ్యాసన ద్వారా కృషి చేయాలి.
      చాగంటి, గరికపాటి, సామవేదం, యల్లం రాజు, ఈ మహా పండితులు శాస్ర్తియ కాదని ఎందుకు అనుకుంటున్నారు. అసలు వారు చెప్పేది జీవన వేదం . లౌకిక శాస్త్రాలు, హేతువాదులు వితండ వాదాలు, ఎప్పటికీ మనిషికి ఆత్మ జ్ఞానం ఇవ్వలేవు.

      Delete
    3. < జ్ఞాన సముపార్జన జీవితాంతం సాగవలసిన కార్యం. మహనీయుల ప్రవచనములు వినడం, గొప్ప వారి రచనలు చదవడం, శ్రావణ, మన న , నిధిధ్యాసన ద్వారా కృషి చేయాలి. >

      ఏకీభస్తున్నాను.

      < చాగంటి, గరికపాటి, సామవేదం, యల్లం రాజు, ఈ మహా పండితులు శాస్ర్తియ కాదని ఎందుకు అనుకుంటున్నారు. అసలు వారు చెప్పేది జీవన వేదం .>

      వారు చెప్పేవాటిలో పనికి వచ్చేవి ఆచరిద్దాం. వారు చెప్పేది మాత్రమే జీవన వేదం కాదు.

      < లౌకిక శాస్త్రాలు, హేతువాదులు వితండ వాదాలు, ఎప్పటికీ మనిషికి ఆత్మ జ్ఞానం ఇవ్వలేవు. >

      వితండ వాదాలు డేంజర్. లౌకిక శాస్త్రాలు, హేతువాదుల వాదనలకు సమాధానం చెప్పలేకపోయినా అదీ ఆత్మ జ్ఞానం పెంపొదించడానికి ఉపయోగించనిదే అవుతుంది. లౌకిక శాస్త్రాలు, హేతువాదుల పేరుతో జరిగే అశాస్త్రీయ వాదనలను వ్యతిరేకించవచ్చు. లేదా వారి వాదనలలో పనికి వచ్చేవి, ఆచరణకు ఉపయోగపడేవి అనుసరించవచ్చు.

      Delete
  2. వచ్చిపడే వాటికన్నా కష్టపడి సంపాదించుకున్నవే నిలుస్తాయి. డబ్బైనా బుద్ధైనా జ్ఞానమైనా. పరిస్థితులనూ సమాజాన్ని అంగీకరించి తదనుగుణంగా తమను సరిదిద్దుకుంటూ నగిషీలు చెక్కుకునేవారు, అది విస్మరించి జన్మతః సంక్రమించినదానితో సరిపెట్టుకునేవారికంటే అధికులు. ఈ నాడు అన్నిరంగాల్లోనూ అద్భుత ప్రతిభ కనబరుస్తున్న జ్ఞానులు, నాయకులు, ప్రభావశీలురు అంతా ఇలా రూపాంతరం చెందినవారే.

    ReplyDelete
    Replies
    1. < డబ్బైనా బుద్ధైనా జ్ఞానమైనా. పరిస్థితులనూ సమాజాన్ని అంగీకరించి తదనుగుణంగా తమను సరిదిద్దుకుంటూ నగిషీలు చెక్కుకునేవారు, అది విస్మరించి జన్మతః సంక్రమించినదానితో సరిపెట్టుకునేవారికంటే అధికులు. ఈ నాడు అన్నిరంగాల్లోనూ అద్భుత ప్రతిభ కనబరుస్తున్న జ్ఞానులు, నాయకులు, ప్రభావశీలురు అంతా ఇలా రూపాంతరం చెందినవారే. >

      బాగా చెప్పారు సూర్య గారు.

      Delete
    2. ఆ Surya వేరు ఈ సూర్య వేరు అని గమనించాల్సిందిగా మనవి.

      Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top