నా చిన్ననాటి జ్ఞాపకం.
మీలో చాలామందికీ ఇది తెలుసనుకుంటాను.
ఏంప్రో గ్లూకోజ్ బిస్కట్స్ కలర్ ఇమేజ్ ఉంటే పంపగలరు.
- పల్లా కొండలరావు,
16-04-2020.



ఏంప్రో గ్లూకోజ్ బిస్కట్స్ కలర్ ఇమేజ్ పంపించిన విన్నకోట నరసింహారావు గారికి, నీహారిక గారికి ధన్యవాదములు. కొన్ని చిన్నప్పటి జ్ఞాపకాలు తలచుకుంటుంటే అదో ఆనందం. మైండ్ రిఫ్రెష్ కు సాధనం. అందరికీ ఇలాంటి అనేక జ్ఞాపకాలు రీఫ్రెష్ లేదా రీచార్జ్ కావడానికి ఉపయోగపడతాయని భావిస్తున్నాను.


- పల్లా కొండలరావు,
17-04-2020.



Post a Comment

  1. ఏంప్రో గ్లూకోజ్ బిస్కట్స్ కలర్ ఇమేజ్ ని పంపించిన విన్నకోట నరసింహారావు గారికి ఆలస్యంగా ధన్యవాదములు. ముందుగా పంపితిరి మీరు, మునుముందుగా నేను గాంచితి నీహారిక గారి మెయిల్ ను. ఇది నా తప్పు కాదు, జీ మెయిల్ వారిదని విన్నపము.

    ReplyDelete
  2. ఫరవాలేదు లెండి కొండలరావు గారు. నీహారిక గారు కూడా మన మిత్రులే కదా.

    అసలు శ్రీకృష్ణుడంతటివాడే ముందొచ్చిన సుయోధనుడిని గమనించకుండా తర్వాత వచ్చిన అర్జునుడిని పలకరించాడు. ఒక్కోసారి అలా జరుగుతుంటుంది 😁😁.

    ReplyDelete
    Replies
    1. :) నేను కృష్ణుడను కాను, సైన్యమూ లేదు గనుక, ఇరువరకూ ఉచిత రీతిన సమానం ధన్యవాదములు తెలిపితిని.

      Delete
  3. ఇదియంతయుఁ గనులారగాంచుచు సుక్షత్రియ వంశ సంజాతుఁడగు సుయోధన సార్వభౌముడు సహించి యుండుటయా?
    యతో ధర్మః తతో కృష్ణ !
    యతో కృష్ణ తతో జయః !

    ReplyDelete
    Replies
    1. ఏమిది! ఇపుడు ఇచటకు సుయోధన కుమారుడేతెంచునా ఏమి? వచ్చి ఊరకనే ఉండునా ఏమి? ఏమి జరుగునో యని మది సంకోచించుచున్నది. హే కృష్ణా! ముకుందా! మరారీ! పాహిమామ్. పాహిమామ్.

      Delete
  4. ఏమేమీ సుయోధనసార్వభౌమునకే బిస్కత్తులు వేయుచున్నారా? ఎంత ధైర్య మెంత సాహస మెంత తెగింపు?

    ReplyDelete
    Replies
    1. హే కృష్ణా పాహిమాం అంటే రాములోరొచ్చారేమి!

      Delete
    2. సుయోధనులవారు యానాం కూపీ లాగుచున్నారు, ఆనక వచ్చి బిస్కత్తులు ఆరగింతురు.

      Delete
    3. నేనివ్వగలిగినది ధన్యవాదాలు మాత్రమే. మీకిద్దరికీ సమానంగా ఇచ్చాను కదా, ఇంతే సంగతులు అని కొండలరావు గారు ఖచ్చితంగా చెప్పేశారు కదా. ఇంకా అక్కడే వున్నా గిట్టుబాటు అయ్యేదేమీ లేదని బయలుదేరి వచ్చేశాను, హస్తినాపురానికి సగం దూరంలో వున్నాను 😁😁.

      అయినా ఉన్న షుగర్ చాలకనా ఇంకా గ్లూకోజ్ బిస్కెట్లు కూడా తినడానికి?

      Delete
    4. అందుకే ధన్యవాదాలు మాత్రమే పంచాను విన్నకోట సర్. ఈ రోజులలో పిల్లలతో సహా షుగర్ వ్యాధి కామన్ అవుతోంది కాబట్టి ఎవరికీ బిస్కట్లు, స్వీట్లు ఇవ్వకూడదు కనుకనే.
      :):)

      Delete
    5. //సుయోధనులవారు యానాం కూపీ లాగుచున్నారు, ఆనక వచ్చి బిస్కత్తులు ఆరగింతురు.//

      హాహా నిహారికగారు.. కొన్ని కూపిలు లాగితే టోపీలతో పాటు తలకాయలు కూడా లేచిపొతాయండోయ్....

      Delete
    6. ఎవరు రాజు? ఎవరు రారాజు??

      Delete


  5. బిస్, కత్తుల నూరిరే శ్యామలీయం‌ వారు :)


    నారదులవారేతించిరి :)


    జిలేబి

    ReplyDelete
  6. నరసింహరావు వర్యులు
    కరమరుదగు సౌమ్యులుగద ! కానీ , యిది యే
    మి రగడయొ ? సుయోధనులుగ
    పొరి పొరి విపరీత రీతి పోల్చుట తగునా ?

    ReplyDelete
  7. అసలు శ్రీకృష్ణుడంతటివాడే ముందొచ్చిన సుయోధనుడిని గమనించకుండా తర్వాత వచ్చిన అర్జునుడిని పలకరించాడు. ఒక్కోసారి అలా జరుగుతుంటుంది 😁😁.

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top