Home
»
వీడియోలు
»
సినిమా
» నరేష్.... కృష్ణ గారితో మాట్లాడాలని ఉన్నది నంబర్ ఇస్తావా......ఫోన్ కాల్ లో బాల సుబ్రహ్మణ్యం
Post a Comment
sevidamkrdezign
218168578325095
* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
Subscribe to:
Post Comments (Atom)
అధ్యయనం
అలవాట్లు
అవినీతి
ఆధ్యాత్మికం
ఆరోగ్యం
ఆర్ధికం
ఇంగ్లీష్ నేర్చుకుందాం
ఇంటర్వ్యూలు
ఉగ్రవాదం
ఎన్నికలు
కత్తెరింపులు
కాంగ్రెస్
కార్యక్రమాలు
కుటుంబం
కులం
కృషి విద్యాలయం
కొబ్బరి నీరు
చట్టం
చరిత్ర
జనరల్ సైన్సు
జనవిజయం
జమాఖర్చుల వివరాలు
జర్నలిజం
జీనియస్
జ్ఞాపకాలు
తెలుగు-వెలుగు
నమ్మకాలు-నిజాలు
నవ్వుతూ బ్రతకాలిరా
నా బ్లాగు అనుభవాలు
నాకు నచ్చిన పాట
నిద్ర
నీతి లేనివాడు జాతికెంతో కీడు
న్యాయం
పరిపాలన
పర్యావరణం
పల్లా కొండల రావు
పల్లెప్రపంచం
పిల్లల పెంపకం
ప్రకృతి జీవన విధానం
ప్రజ
ప్రజా రవాణా
ప్రముఖులు
బయాలజీ
బ్లాగు ప్రపంచం
భారతీయం
భారతీయ సంస్కృతి
భావ ప్రకటన
భాష
మతం
మనం మారగలం
మహిళ
మానవ వనరులు
మానవ సంబంధాలు
మానవ హక్కులు
మార్కెటింగ్
మార్క్సిజం
మీడియా
మీరేమంటారు?
మెదడుకు మేత
మై వాయిస్
రాజకీయం
రాజ్యాంగం
రిజర్వేషన్లు
వస్త్రధారణ
వార్త-వ్యాఖ్య
వికాసం
విజ్ఞానం
విటమిన్ సి
విద్య
వినదగునెవ్వరుచెప్పిన
వినోదం
విప్లవం
వీడియోలు
వేదాలు
వ్యక్తిగతం
వ్యవసాయం
సమాజం
సంస్కృతి
సాంప్రదాయం
సాహిత్యం
సినిమా
ఏమనుకోకండి గానీ నాకెందుకో ఈ విడియో విచిత్రంగా ఉందనిపిస్తోంది, కొండలరావు గారు.
ReplyDeleteబాలు గారి లాంటి ప్రముఖుడు, సీనియర్ వ్యక్తి వద్ద అదే రంగంలోని ఇతర ప్రముఖుల, సీనియర్ల ఫోన్ నెంబర్లు లేకపోవడం ఏమిటి ? ఆ నెంబర్ కోసం అవతలి వ్యక్తి యొక్క కుటుంబ సభ్యుడిని అడగటమేమిటి? ఆశ్చర్యంగా ఉందే. బాలు గారు పోయిన సందర్భంగా ఏదో సెన్సేషనల్ కథ చెప్పాలని చెప్పినట్లుంది.
విశిష్ట కళాకారుడు బాలు గారి ఆత్మకు సద్గతి ప్రాప్తిరస్తు🙏.
it is tv5 video sir. meeru vyaktaparachina anumaaname o comment koodaa unnadi. chuddam nijamemito.
Deletenenu inta kritam hero krishna ku balu pata padanunnaaraa? ani oka tapaa unchaanu. aayana padatarani anukunnaanu. krishna family movie lo. but unfortunately now Balu is no more.
This is the link:
http://blog.palleprapancham.in/2020/09/blog-post_2.html
ఓ, అయితే నాకొచ్చిన అనుమానమే మరి కొంత మందికి కూడా వచ్చిందన్నమాట? సహజం.
Deleteపైన మీరిచ్చిన లింకులోని మీ టపాలోని విడియో చూశాను, కొండలరావు గారు. దాంట్లో చివర్లో బాలు గారు అన్నది ... మళ్ళీ కృష్ణ గారు సినిమా తీస్తే ఆయనకు పాటలు పాడేది నేనే ... అని.
ఇంకా ఈ వయసులో కృష్ణ గారు తనే హీరోగా - అందులోనూ తన పాత్రకు పాటలున్న - సినిమా నిర్మిస్తారని నేను అనుకోను. సరే, ఒకవేళ సినిమా తీసినా కూడా మీరన్నట్లు పాటలు పాడటానికి బాలు గారు లేరు.
ఇంక వచ్చెయ్ అని బాలు గారు అంటే అమిత ఇష్టమున్న ఏ ప్రముఖులు పైనుండి పిలిచారో గానీ బాలు గారు తొందర పడి వెళ్ళి పోయినట్లున్నారు 🙏.
అవునండీ.. మహేష్ బాబు ఘట్టమనేని ఫేమిలీ మెంబర్స్ తో అక్కినేని వారి మనం లాంటి సినిమా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. బాలు తన యూట్యూబ్ చానల్ (ఈమధ్యనే) లో కూడా అదే ఉద్దేశంతో అని ఉంటారు. ఇది జరుగుతుందా? అని నాకు అనిపించి ఆ టపా ఉంచాను. ఈ రోజు ఈ వీడియో చూశాక దానిని కూడా పోస్ట్ చేశాను. కృష్ణ కూ బాలు కు మొదట్లో మంచి అనుబంధం ఉండేది. మధ్యలో కొంత చెడినా తరువాత కలసి పని చేశారు.
Deleteవిన్నకోటవారికి,
Deleteమా అధ్యక్షుడు కనుక నరేష్ ఫోన్ నంబర్ అందరికీ తెలుస్తుంది. కృష్ణగారి నంబర్ అందరికీ తెలియచేయరు. ఎవరి ఇబ్బందులు వారికి ఉంటాయి కదండీ. ఫోన్ నంబర్ ఉంది కదా అని అందరూ ఏవేవో విజ్ఞప్తులతో వస్తే కష్టం అని ఇవ్వరు.
అందరికీ నెంబరు ఇవ్వరు అని మీరు చెప్పేది సామాన్య ప్రజానీకం గురించి. బాలు ఆషామాషీ వ్యక్తి కాదు గదా. తనే స్వయంగా ఒక ప్రముఖుడు. పైగా కృష్ణ గారితో చాలా అనుబంధం ఉన్న వ్యక్తి. కృష్ణ గారికి అన్ని సినిమాల్లోనూ (మధ్యలో ఓ రెండేళ్ళు మినహాయించి) పాటలు తనే పాడిన గాయకుడు బాలు. ఇవన్నీ చూస్తే కృష్ణ గారి ఫోన్ నెంబర్ తన దగ్గర లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది. నాకు తోస్తున్నది ఒకటే .... బాలు తన ఫోన్ మార్చి ఉండుండాలి. నెంబర్లన్నీ పాత ఫోన్ లో ఉండుండాలి.
Deleteఇది వాట్సాప్ వాయిస్ మెసేజ్ అన్నమాట. ధన్యవాదములు నీహారిక గారు.
Deleteకృష్ణ నంబర్ అందరికీ ఇవ్వడం లేదు. ఆయన వెన్ను పూస ఆరోగ్యం దెబ్బ తిన్న దగ్గరనుండి మహేష్ ఈ జాగ్రత్త తీసుకున్నట్లు సమాచారం.
సామాన్యుల ఫోన్ నంబర్లు అందరికీ తెలుస్తాయి లేదా తెలియపరుస్తారు.సెలబ్రిటీలు అలా కాదు. వారికి మేనేజర్లు ఉంటారు. వారు అందరికీ నంబర్లు ఇవ్వరు. సినిమావాళ్ళకి ఇంకా ఎక్కువ రాజకీయాలు ఉంటాయి. ఎవరికి వాళ్ళు బిజీ కనుక నంబర్ దొరకడం కష్టం. బాలూ గారు నంబర్ అడిగే విధానంలోనే అది తెలుస్తోంది.ఎంత ఎదిగినా ఆయన ఒదిగే ఉండేవారు.
Deleteనీహారిక గారూ, నీహారిక గారు
Deleteచర్చను పొడిగించడం నా ఉద్దేశం కాదు గానీండి మీరు బాలు గారిని సామాన్యుల్తో లెక్కగడితే ఎలాగండి ?
బాలు గారు కూడా సెలెబ్రిటీయే కదా, ఎనీ డౌట్? కాకపోయినట్లయితే బాలు మరణం గురించి జరిగిన కవరేజ్ ఎందుకు జరుగుతుంది?
కృష్ణ నెంబరు కోసమో, చిరంజీవి నెంబరు కోసమో వాళ్ళ పిల్లల్నో మేనేజర్లనో వాకబు చెయ్యవలసిన అవసరం మరో సెలెబ్రిటీ అయిన బాలు గారి కేమిటండి?
సరే, ఇదంతా కాదు గానీ నాకు తోస్తున్నది ఒకటే .... ఆనాటి హీరోలు దాదాపు రిటైరయ్యారు (చిరంజీవి లాంటి వారు ఇంకా ఏదో పాకులాడుతున్నారనుకోండి, అది వేరే సంగతి). టచ్ లో ఉండడం తగ్గి ఉండచ్చు కాబట్టి క్రమేపీ వాళ్ళ ఫోన్ నెంబర్లు బాలు గారి దగ్గర ఇప్పుడు మిస్ అయ్యుండవచ్చు. మరొకటి అవతలివారు తమ ఫోన్ నెంబర్లు మార్చి ఉండవచ్చు.
ఇంక వదిలేద్దాం.
సర్లెండి వదిలేద్దాం.జిలేబీ గారి ఫోన్ నంబర్ చెప్పండి. ఓసారి మాట్లాడాలని ఉంది.
Delete:) :)
Delete“జిలేబి” గారు బ్లాగులోక సెలెబ్రిటీ. నేనా సామాన్యుడిని. ఇక వారి ఫోన్ నెంబర్ నాకెలా తెలుస్తుందండీ నీహారిక గారు, మీ చమత్కారం కాకపోతే ? 😟
Deleteవిజయ నిర్మల గారు 27 జూన్ 2019 న చనిపోయారు. 31 మేనెల 2020 న కృష్ణగారి పుట్టిన రోజు సందర్భంగా బాలు గారు వాట్స్ ఆప్ లో వాయిస్ మెసేజ్ పెట్టారు. దానిని ఇపుడు సర్క్యులేట్ చేస్తున్నారు.కృష్ణగారు అంటే బాలు గారికి ప్రత్యేక అభిమానం ఉంది అని చెప్పారు.కృష్ణాగారికి బాలు గారు అంటే అభిమానం ఉందో లేదో తెలియదు. ఎపుడూ చెప్పలేదు.
ReplyDeleteకృష్ణ జనరల్ గానే అందరినీ ప్రోత్సహిస్తారు. అందరు హీరోలు ఘంటసాల గారే పాడాలి అని పట్టుబట్టేవారు. ఆ తరువాత రామకృష్ణను ఎంకరేజ్ చేసారు. అది తెలిసిన హీరో కృష్ణ బాలును ప్రోత్సహించారు. తన సినిమాలలో బాలు చేతనే అన్ని పాటలు పాడించి బాలు ను ఎంకరేజ్ చేశారు. తరువాత అందరూ బాలు చేతనే పాడించారు. బాలు ఇబ్బందులలో ఉన్న సమయంలో కృష్ణ అతనిని ప్రోత్సహించారు. ఆ కృతజ్ఞత బాలు కు ఉన్నది. మధ్యలో ఓ నిర్మాత మాటల వల్ల వీరిద్దరికి చెడింది. కృష్ణ రాజ్ సీతారాం అనే నూతన గాయకుడిని తెచ్చుకున్నారు. ఆ సమయంలో ఇండస్ట్రీ నలిగిపోతున్నందున రాజ్-కోటి, వేటూరి చొరవతో బాలు కృష్ణ ఆఫీసుకు వెళ్ళి మాట్లాడారు. అప్పటినుండి వీరిద్దరూ మళ్లీ కలసి పని చేశారు. బాలు గొంతు లేక కృష్ణ సినిమాలు కొన్ని ఆడాల్సినంత రేంజ్ లో ఆడలేదన్నది నిజం. కృష్ణ అందరితో ఉన్నట్లే బాలుతోనూ మంచిగానే ఉండేవారు. ఒకానొక సమయంలో కృష్ణ గారికి బాలు గారే పాడాలి అన్న అభిమానం కృష్ణ అభిమానులాలో ఉండేది. మంచి మిత్రులు సినిమాలో కూడా మొదట కృష్ణకు బాలు, శోభన్ బాబుకు ఘంటసాల అనుకున్నారు. కానీ తరువాత మార్చారు. ఎందుకో తెలియదు.
Delete