Post a Comment

  1. క్రిస్టియన్స్ హిందూ ఆలయాలకు వెళ్ళరు, ప్రసాదం స్వీకరించరు. టీటీడీ వాళ్ళు పిలిచారు ముఖ్యమంత్రిగా మర్యాదగా వెళ్ళారు. డిక్లరేషన్ అవసరం లేదు. చర్చ్ కి,దర్గాకి వెళ్ళాలంటే డిక్లరేషన్ తీసుకుంటేనే వెళ్ళాలి అని రూల్ ఉంటే హిందూ మతానికి కూడా ఆ రూల్ ఉండాలి. మోడీ భార్య గురించి కొడాలి నాని చేసిన వ్యాఖ్యకి సమాధానం ఒక బ్లాగ్ లో ఇచ్చారు.
    http://durgeswara.blogspot.com/2020/09/blog-post_25.html?m=1

    ReplyDelete
    Replies
    1. హరిసేవ బ్లాగులో మీరిచ్చిన లింక్ టపా చూశాను. సమాధానం బాగుంది.

      Delete
  2. అటువంటి మంత్రి గురించి అసలు చర్చించడం ఏమిటండీ ?
    —————-
    // “ క్రిస్టియన్స్ హిందూ ఆలయాలకు వెళ్ళరు, “ // అవును, అ విషయంలో వాళ్ళు మహా మొండిగా ఉంటారు. ఒకసారి నేను మైసూరు వెడితే అక్కడ నన్ను రిసీవ్ చేసుకుని ఆ ఆదివారం నాడు నిన్ను ఊరంతా తిప్పినతను ఒక పెద్ద గుడి దగ్గర తన బండి ఆపాడు. లోపలికి వెళ్ళి చూసిరా, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను అన్నాడు. అప్పుడు నాకు వెలిగింది అతని క్రిస్టియన్ అని. లోపల శిల్పకళ వగైరా అయినా చూడవచ్చుగా, రారాదా అన్నాను. ఉహు, రానులే అన్నాడు.

    అదే మనం అనుకోండి. ప్రముఖ చర్చలకు చూడడానికి వెడతాం, ఆ కట్టడాల రీతిని మెచ్చుకుంటాం, లోపల ఆ stained glass కిటికీలు వాటి మీద ఉండే అద్భుతమైన చిత్రాలు చూసి అబ్బుర పడతాం, ఫొటోలు తీసుకుంటాం (తీసుకోనిస్తే). ఒక్కోసారి అక్కడ మనం కూడా కొవ్వొత్తి వెలిగిస్తాం. అలాగే ప్రసిద్ధి గాంచిన ముస్లిం మసీదులకు / దర్గాలకు కూడా (ఉదాహరణకు అజ్మీర్ దర్గా, గుల్బర్గా ఖాజా బందె నవాజ్ KBN దర్గా). అక్కడ మనం ప్రార్థనలు, పూజలు చెయ్యక పోయినా ఆ కట్టడాలను చూసి ఆనందిస్తాం. అదీ తేడా.
    ———————-
    // “ టీటీడీ వాళ్ళు పిలిచారు ముఖ్యమంత్రిగా మర్యాదగా వెళ్ళారు” // టీటీడి వారు ప్రత్యేకంగా పిలిచేదేముంది? రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళి పట్టువస్త్రాలు సమర్పించడం ఏనాటి నుండో వస్తున్న ఆనవాయితీ. నా సందేహం ఏమిటంటే (గతంలో కూడా ఏదో బ్లాగులో అడిగాను) ముఖ్యమంత్రి హైందవేతరుడు అయిన పక్షంలో ఏమిటి మార్గం? ఉప ముఖ్యమంత్కినో, దేవాదాయ శాఖా మంత్రినో, తన తరువాతి సీనియర్ మంత్రినో, పంపించి పని కానిస్తే సమ్మతమేనా? /లేదా/ నేనే వస్తాను, నాకు ఆ గుడి మీద నమ్మకం ఉంది అని ఆ ముఖ్యమంత్రి అంటే ... తప్పక రండి, అదే మాట ఓ డిక్లరేషన్ కాగితం ముక్క. మీద సంతకం పడెయ్యండి, అది మా గుడి రూలు ... అంటే తప్పేముంది? దానికింత రాద్ధాంతం ఎందుకు?
    ————————
    // “ చర్చ్ కి,దర్గాకి వెళ్ళాలంటే డిక్లరేషన్ తీసుకుంటేనే వెళ్ళాలి అని రూల్ ఉంటే హిందూ మతానికి కూడా ఆ రూల్ ఉండాలి” //
    ఓహో, అలా ఉంటే అది సెక్యులర్ అవుతుందేమో కదండీ?
    ఏం, ఇతరులకు లేకపోతే హిందూ మతానికి ఆ రూల్ ఉండకూడదాండీ? ఇతరుల రూల్స్ హిందూ మతానికి కొలబద్దా? బాగుందండీ మన విశాల దృక్పథం 😒.
    ————————
    పైన మీరిచ్చిన లింక్ లో అయోధ్య భూమిపూజలో మోడీ పాత్ర గురించి దుర్గేశ్వర్ గారు ఇచ్చిన వివరణ సబబుగా ఉంది. దాన్ని గురించి మాట్లాడుతున్న మంత్రులు ఆ వివరణ చదవాలి. చదివినా ఏమీ మార్పు ఉండదనుకోండి .... అంతా రాజకీయమయం కదా.

    ReplyDelete
    Replies
    1. అవును, మరో మంత్రిని ఎందుకు పంపించకూడదు? లేకపోతే గవర్నర్ వెళ్ళవచ్చు కదా.

      Delete
    2. Good suggestion బోనగిరి గారు. కానీ వచ్చే ప్రతి గవర్నరూ పాత గవర్నర్ లాంటి వారు అయ్యుండాలిగా 🙂😁.

      Delete
    3. క్రిస్టియన్లు గుళ్లకు వెళ్ళరా? ఎవరండీ అన్న మిడిమిడి పండితులు.

      ఏసుదాస్ గురువాయూరప్ప గుడిలో పాటలు పాడాడు. రాజశేఖర్ రెడ్డి ఎన్ని గుళ్లకు వెళ్ళలేదు? అంతెందుకు ఇదే జగన్ పోయినేడాది బ్రహ్మోత్సవాలు కాక ఇంకెన్ని సార్లు తిరుమల దర్శనం చేసుకోలేదు? మూసీ వరదలకు శాంతి చేసేందుకు ఆలా హజరత్ మహబూబ్ పాషా జంజం వేసుకొని నెత్తిన బోనం ఎత్తినప్పుడు ఏ నియమాలు అడ్డు వచ్చినాయి? భద్రాద్రి రామన్నకు దశాబ్దాలు కుతుబ్షాహీ & అస్ఫజాహీలు పట్టుబట్టలు పెట్టిన సందర్భం.

      తురకామెను వెంకన్న (పచ్చ కామెర్ల పార్టీ వాళ్ళు పెట్టిన తోక ప్రస్తుతానికి వద్దులే) మెట్టినింటికి తోలుకెళ్ళిన్నాడు పెండ్లామును డిక్లరేషన్ అడిగినాడా? పోనీ జగన్ బదులు ఉపముఖ్యమంత్రి అంజాద్ భాషాను పంపిస్తే తెగులు తమ్ముళ్లు ఊకొనేటోళ్ళా?

      ఏ చర్చి, మసీదు, దర్గా, గురుద్వారాలో డిక్లరేషన్ అక్కరో చెప్తే విని తరిస్తాము.

      Delete
    4. >>>క్రిస్టియన్లు గుళ్లకు వెళ్ళరా? ఎవరండీ అన్న మిడిమిడి పండితులు.>>>
      చర్చ జరిగేటపుడు మీరు హద్దులు మీరితే మళ్ళీ తిట్టవలసి వస్తుంది. క్రిష్టియన్లు గుళ్ళకి వెళ్ళరు అన్నది నేనే. మా తోటికోడలు మొన్ననే క్రిష్టియానిటీ లో చేరింది. మేము ప్రసాదం ఇంటికి పంపిస్తే తీసుకోలేదు. వాళ్ళు ప్రసాదాలు తినకూడదని రూల్ ఉంది అన్నది.

      నాని అడిగింది కూడా డిక్లరేషన్ ఉంటే అందరికీ వర్తింప చేయమనే.చర్చ జరగాలి అని అన్నాడు. డిక్లరేషన్ పై గట్టిగా అడగవలసింది హిందువులు. ఎవరిని అడగాలి? ఎవరు నిర్ణయం తీసుకోవాలి ? టీటీడి మాత్రం కాదు.హిందువుల మనోభావాలు టీటీడీ మాత్రమే పట్టించుకోవాలా ?

      Delete
    5. అసలు డిక్లరేషన్ అంటూ పట్టుబడితే తాజ్ మహల్ చూడడానికి పర్యాటకులు వస్తారా ? అయోధ్యకి వస్తారా ?

      Delete
    6. >>>ముఖ్యమంత్రి హైందవేతరుడు అయిన పక్షంలో ఏమిటి మార్గం? ఉప ముఖ్యమంత్కినో, దేవాదాయ శాఖా మంత్రినో, తన తరువాతి సీనియర్ మంత్రినో, పంపించి పని కానిస్తే సమ్మతమేనా?>>>

      నానీ అడిగింది కూడా అదే కదండీ.అయోధ్య భూమి పూజ మోడీ ఒంటరిగా ఎందుకు చేయాలి అనే కదా ? ఆయన అడిగాక వీళ్ళు చెప్పారు కానీ అశోక్ సింఘాల్ దంపతులు చేసారని ఎవరికి తెలుసు ?

      ఒక సంవత్సరం భద్రాద్రి రాముడికి పట్టు వస్త్రాలు kcr మనవడి చేత పంపారు. ముఖ్యమంత్రి ఎవరిని పంపుతారో ఆయన ఇష్టం.

      Delete
    7. ఎవరిని పంపించినా ఆ మతస్థుడినే పంపించడం అభిలషణీయం.

      Delete
    8. యేసుదాసు గారు గురువాయూరు గుడిలో పాటలు పాడారా? గుడి “లో” పాడారని ఎప్పుడూ వినలేదే! ఎన్నో సంవత్సరాల నుండీ ఎన్నిసార్లు అభ్యర్ధించినా కూడా ఆ గుడి అధికారులు యేసుదాసు గారికి ఆలయప్రవేశం కల్పించడం లేదే? ఆ గుడి బయటే కూర్చుని పాడేసి వెళ్ళిపోతుంటారని నేను విన్నది.

      https://english.mathrubhumi.com/mobile/books/books-news/yesudas-should-not-be-denied-entry-into-guruvayur-temple-anymore-k-kunjiraman-mla-1.4462222

      Delete
    9. @నీహారిక:

      క్రైస్తవులు గుడికి వెళ్ళరా అని అడిగింది మిమ్మల్ని అనుకొని భుజం తడుముకుంటే ఎట్లనండీ?

      Anecdotal evidence=> sweeping generalization? Kind of scary!

      నాకు గుర్తెరిగి బుడ్డోడు తాత ఎంబడి పోయినట్టున్నాడు.

      @విన్నకోట నరసింహా రావు:

      ఏసుదాసు గురువాయూరు సంగతి తెలుసుకొని సరిదిద్దుకుంటారా, శబరిమల అయితే ఖచ్చితంగా వెళ్ళాడు. ఇకపోతే చర్చ "కిరస్తానీలు గుండ్లకు పోరు" కానీ "నంబూదిరీలు మ్లేచ్చులను రానియ్యరు" కాదు కదా.

      Delete
    10. యేసుదాసు గురువాయూరు “గుడిలో” పాటలు పాడారు అన్న ప్రస్తావన తీసుకొచ్చింది మీరు గానీ నేను కాదు.గుడి బయటే కానీ “గుడిలో” ఎప్పుడూ పాడలేదు అని నాకున్న సమాచారం ప్రకారం చెప్పాను. కాబట్టి సరిదిద్దుకునే పని అయితే అది మీరు చేసుకోవాలేమో ఆలోచించుకోండి. కాదంటారా నేను సరిదిద్దుకోవలసిన అవసరం ఉందని మీరు అనుకుంటే తగిన ఆధారాలు చూపించండి, అంతే కానీ వెటకారాలొద్దు.

      యేసుదాసు గారు శబరిమల అయ్యప్ప గుడికీ వెళ్ళాడు, తిరువనంతపురం పద్మనాభ స్వామి గుడికీ వెళ్ళాడు దానికేముంది. అది ఆయా దేవాలయాల పాలసీ. కానీ మీరు చర్చలో లేవనెత్తింది గురువాయూరు గుడి గురించి మాత్రమే. ఇప్పుడొచ్చి చర్చ దాన్ని గురించి కాదు అంటూ దాటవేసే ప్రయత్నం వృధా ప్రయత్నం.

      Delete
    11. >>>నాకు గుర్తెరిగి బుడ్డోడు తాత ఎంబడి పోయినట్టున్నాడు.>>

      ఆండాళ్లు నీకేమైనా అర్ధం అయిందా ?
      ఆయనేమీ వ్రాస్తున్నాడో ఆయనకయినా అర్థమైతే చెప్పు.

      Delete
    12. @విన్నకోట నరసింహా రావు:

      గురువు గారూ మన్నించండి. "ఏసుదాసు గురువాయూరు సంగతి తెలుసుకొని సరిదిద్దుకుం*టా*" అనబోయి షరామామూలుగా టైపో (more correctly, transliteration tool problem) పడేసా.

      కులం/మతం/లింగం వగైరాల ఆధారంగా ప్రవేశ అనుమతి ఇవ్వడం మానడం ఆయా సంస్థల పాలిసీ కావొచ్చును. చర్చాంశం అది కాదు: ఫలానా చోటికి వెళ్ళొద్దని కిరస్తాన పాలిసీ ఉందా అన్నదే ఇక్కడి ప్రశ్న.

      గురువాయూరు ఒక్కటే కాదు, నేను తిరుమల సహా ఇతర ఉదాహరణలు కూడా ఇచ్చాను.

      Delete
    13. // “ గురువు గారూ మన్నించండి.” //
      That’s alright, ఫరవాలేదు, జై గారు.
      ఏసుదాసు గారు vs గురువాయూరు గుడి అంశం గురించి మీరు అధిక వివరాలు / latest information ఏమన్నా
      సేకరించగలిగితే నాకు కూడా తెలియజెయ్యండి, థాంక్స్.

      Delete
    14. ఇంగిలీషులో కొన్నే లింకులు కనిపిస్తున్నాయి. నాకేమో మళయాళం రాదు!

      ట్రావంకోర్ సంస్థానం దురాచారాలు ఇంకా చెల్లుబాటులో ఉండడం దురదృష్టం.

      Delete
    15. ఇదంతా కన్వర్టెడ్ బ్యాచ్చీ ఓవర్‌యాక్షనండీ.. నాకు తెలిసిన క్రిష్టియన్ ఒకడున్నాడు. వాల్లింట్లో ఎవ్వరూ ప్రసాదాలు తీసుకోరు కానీ .. తిరుమల లడ్డూ అంటే వాడికి భలే ఇష్టం.

      బేసిగ్గా ఇలా ఓవర్ యాక్షన్లు చేసే బ్యాచ్చులు ఉంటాయి కాని, పట్టించుకోనోళ్ళు కూడా బాగానే ఉన్నారు.

      Delete
  3. అసలు అధికారిక హోదాల్లో ఉన్నవారు దేవాలయాలు, చర్చిలూ, దర్గాలూ ఎందుకు తిరగాలి? అక్కడ ఎవడెవడివో కాళ్ళు ఎందుకు పట్టుకోవాలి? సాగిలపడాలి? అధికారంలో ఉన్నవాళ్ళు ఆస్తికత్వాన్ని ఎందుకు సమర్ధించాలి?


    ఒక అమెరికా అధ్యక్షుడు పోపును సందర్శించినప్పుడు ఆయనేమీ పోపుకాళ్ళమీద పడిపోడు. ఎందుకు ఈండియాలో నాయకులందరూ కాషాయంగాళ్ళకు నమస్కారాలు చెస్తారు? ఇంకేదో గుళ్ళో చొక్కాతీసి వెళ్ళాలనో, నగ్నంగా వెళ్ళాలనో ఉందనుకోండి, అపుడుకూడా మన నాయకులు దన్ని పాటించాల్సిందేనా? అసలు జగన్ గుడికి వెళ్ళడమే తప్పు. ఇలాంటి ఆచారాలు నేను పాటించను "దొబ్బెయ్" చెప్పుండాల్సింది వెంకన్నకు.

    ReplyDelete
    Replies
    1. దొబ్బెయ్ అనేంత దమ్ముంటుందా? ఓటు బ్యాంకు కు ఇబ్బంది కాదు.

      Delete
    2. //ఒక అమెరికా అధ్యక్షుడు పోపును సందర్శించినప్పుడు ఆయనేమీ పోపుకాళ్ళమీద పడిపోడు. ఎందుకు ఈండియాలో నాయకులందరూ కాషాయంగాళ్ళకు నమస్కారాలు చెస్తారు // మీ కామెంట్ కి రిప్లై కాదు , కానీ ఈ లైన్ కి మాత్రం నాకు తెలిసింది చెప్తాను . యూరోప్ లేక అమెరికా నాగరికతలలో (క్రిస్టియన్, వగైరా ), కాళ్ళకి దండం పెట్టె సంస్కృతీ లేదు అందుకే పొప్ కాళ్ళకి ఎవరు దండం పెట్టరు .

      Delete
    3. //ఇలాంటి ఆచారాలు నేను పాటించను "దొబ్బెయ్" చెప్పుండాల్సింది వెంకన్నకు.//
      వెంకన్న అని ఎవరిని అంటున్నారు Sriగారూ ...
      మీ నోటిదురుసు ఆ ఏడుకొండలవాడి మీద చూపిస్తున్నారా ఏమిటి?

      Delete
  4. కాళిదాసు మేఘసందేశం రాస్తే జాషువా గబ్బిలం రాసాడు, ఎవరి గొడవ వాళ్ళది.

    తలొంచి పుస్తెలు కట్టించుకున్న నాంచారమ్మ నికానామా ఏ భాషలో ఉందో?

    కెన్నెడీ (బైడెన్ ఇంకొన్ని నెలలు ఆగాలి పాపం) తప్ప విడిచి వాషింగ్టన్ నుండి ట్రంప్ వరకూ ఎవరూ కాథలిక్కులు కాదు. పోపు ముందు సాష్టాంగ దండప్రమాణం చేస్తే మార్టిన్ లూథర్ (కింగ్ కాదు, అదీ గబ్బిలం కథే) ఆత్మ శాంతించేనా?

    ReplyDelete
  5. స్వామి దర్శనం చేసుకోవడానికి ఏ మతస్తులయినా డిక్లరేషన్ కంటే మానసికంగా గౌరవం నమ్మకం భక్తి ఉంటే చాలు అనిపిస్తుంది. ఈ నిబంధనలు స్వామి పెట్టినవి కావు. మనం కల్పించు కున్నవే.

    సాధారణ దర్శనం లో ఎందరో భక్తితో నమ్మకంతో వస్తుంటారు. వారిలో ఎవరి దగ్గర డిక్లరేషన్ తీసుకుంటారు.

    కేరళ లోని ఆలయాలలో మగవారు చొక్కా లేకుండా వెళ్ళాలి. నాకు ఆ నిబంధన అవసరం లేదు అనిపిస్తుంది.

    స్నానం చేసి శుచిగా ఉతికిన బట్టలు ధరించి ఆలయం లోకి వెళితే అభ్యంతరం ఉండకూడదు.

    శారీరిక మానసిక శుభ్రత పవిత్రత తో ఏ ప్రార్థనా స్థలం లోకి అయినా వెళ్ళవచ్చు. నమ్మకం లేకపోతే బయటే ఆగిపోవచ్చు.



    ReplyDelete
  6. This comment has been removed by the author.

    ReplyDelete
  7. Even Chandrababu wears skull cap and eats haleem in iftar parties during the month of Ramadan. I don't find anything odd in case of Jagan entering Tirumala temple.

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top